తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ డయల్ యువర్ కార్యక్రమం ఆగస్టు7 శనివారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డితో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261 భక్తులు అధికారులకు సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయవచ్చు. దానికి అనుగుణంగా అధికారులు కూడా సమాధానాలు ఇవ్వనున్నారు.