ప్రజలకి ఉచిత టీకా కేంద్రమే ఇస్తుంది..
Ens Balu
6
Visakhapatnam
2021-08-08 07:14:20
దేశంలోని ప్రజలందరికీ కేంద్రప్రభుత్వమే ఉచితంగా కరోనా టీకా ఇస్తుందని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖ చినవాల్తేరులో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు కేంద్రం అన్ని రకాలుగా పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. ప్రదాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఇప్పటికే అనుకున్నంత కంటే ఎక్కువ మంది ప్రజలకు ఉచితంగా టీకా అందజేసామని మరికొన్ని మాసాలలో అందరికీ ఉచితంగా టీకాలను అందజేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు టీకా ఏవిదంగా సరపరా చేస్తున్నామనే విషయాలను మంత్రికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ , ఎంపీ నరసింహారావు, రాష్టృ ఆర్దిక శాఖ మంత్రిబుగ్గన.రాంజేంద్రనాథ్ , తదితరులు పాల్గొన్నారు.