అల్లూరి తిరిగిన ప్రాంతానికి రావడం నా అదృష్టం..
Ens Balu
8
Krishnadevipeta
2021-08-08 09:14:28
మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు తిరుగాడిన ప్రాంతానికి రావడం, అయన సమాదులను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.ఆదివారం కేంద్ర మంత్రి పర్యటన లో భాగంగా గొలుగొండ మండలం కృష్ణ దేవి పేటను సందర్శించారు. అల్లూరి సీతారా మరాజు,అనుచరులు గాం గంటం దొర,గాం మల్లుదొర , సమాదులను సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆనంతరం అల్లూరి స్మారక పార్క్ లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులతో కొద్ది సేపు మంత్రి ముచ్చటించారు. నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? బ్రిటిష్ వాళ్ళని పారద్రోలడానికి 100 సంవత్సరాల క్రితం ఇక్కడ "రంప పితూరి "జరిగింది. ఈ ఉద్యమ నాయకుడిగా అల్లూరి వ్యవహరించారు.అదే విధంగా మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్స రాలు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా భారత స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొన్న విశిష్ట ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో" ఆజాదీకా అమృత్ ఉత్సవ్ " కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ప్రతీ ఒక్కరినీ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,ఎమ్ పీలు బీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్ ఎల్ సి పి వి యన్ మాధవ్, ఎం ఎల్ ఏ పెట్ల ఉమా శంకర్ గణేశ్, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, ఏ ఎస్ పీ మణికంఠ, డీ సి సి బీ ఛైర్పర్సన్ సీ హెచ్ అనిత, అర్ డీ వో అనిత, అధిక సంఖ్య లో స్థానిక ప్రజలు హాజరయ్యారు.