తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 18 నుం 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 17న అంకురార్పణ సందర్భంగా సహస్రదీపాలంకార సేవను రద్ధు చేసింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి.. తిరుమల తిరుపతి దేవస్థానాకి సహకరించాలని ఒక ప్రకనలో కోరింది..