ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం..
Ens Balu
7
Tirumala
2021-08-12 15:31:20
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్ట్ కు హైదరాబాద్ కు చెందిన హైకోర్టు న్యాయవాి సి.శ్రీనివాస రెడ్డి రూ 10 , 01, 116 విరాళం అందించారు. గురువారం సాయంత్రం తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు ఆయన డిడి ని అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, స్వామివారి సేవలో ఎందరో తరిస్తున్నారని తనకు ఇపుడు అవకాశం వచ్చిందన్నారు. తనవంతుగా చేసిన ఈ సహాయంతో కొందరికైనా స్వామివారి క్రుపతో ప్రాణాలు నిలబడాలని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంతో టిటిడి అధికారులు పాల్గొన్నారు.