శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా..


Ens Balu
4
Tirupati
2021-08-16 14:35:17

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సోమవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద  స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కు కున్న అనంతరం శ్రీ ఓంబిర్లా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి స్పీకర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు,  అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశం క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నానని స్పీకర్ చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎంపి లు  వి.విజయసాయిరెడ్డి,  పివి మిథున్ రెడ్డి,  ఎం. గురుమూర్తి , డిప్యూటీ ఈవో  కస్తూరి బాయి పాల్గొన్నారు.