ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం సందర్శన..
Ens Balu
5
Tirupati
2021-08-17 14:01:36
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. వేద విజ్ఞాన పీఠానికి చేరుకున్న స్పీకర్ కు ఇక్కడి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరంలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు శాలువ, శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో స్పీకర్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.