ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశంతోపాటు ప్రపంచ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉండాలని, విశ్వమానవ కల్యాణం కోసం ఆశీస్సులు అందించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిపై తనకు అపారమైన నమ్మకం ఉందని, ప్రస్తుతం ఉన్న సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని స్వామివారు ఇస్తారని చెప్పారు. భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఉభయసభల్లోని సభ్యులు తమ పాత్రను సక్రమంగా పాటించేలా స్వామివారు కరుణ చూపాలని కోరారు.