శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్..


Ens Balu
3
Tirumala
2021-08-17 14:03:38

లోక్ సభ స్పీకర్  ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ కు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్పీకర్  ఓం బిర్లా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఓ కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్  బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు  విజయసాయిరెడ్డి,  మిధున్ రెడ్డి,  గురుమూర్తి, భరత్, కలెక్టర్  హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డెప్యూటీ ఈఓ  రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.