కపిలేశ్వరస్వామికి స్పీకర్ శ్రీ ఓం బిర్లా పూజలు..
Ens Balu
7
Tirupati
2021-08-17 14:13:29
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి జెఈఓ సదా భార్గవి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి దర్శనానంతరం నవగ్రహాలు, శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, జెఈఓ సదా భార్గవి కలిసి కండువా, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, విఎస్వో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.