ఆగస్టు 20న ఆలయంలో వరలక్ష్మీ వ్రతం..
Ens Balu
12
Tirumala
2021-08-19 16:35:15
సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 20న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆగస్టు 20న ఉదయం అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విక్రయించింది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపుతారని దేవస్థాన అధికారులు తెలియజేస్తున్నారు.