ప్రభుత్వానికి రూ.500 కోట్ల జిఎస్టీ జాక్ పాట్ జాంపండు..


Ens Balu
7
New Delhi
2021-08-24 15:28:08

జిఎస్టీ వలన ఏమొస్తుంది..ఏమొస్తుంది అనుకున్నారు అంతా..ఈ జిఎస్టీ వలన పెద్ద తలకాలను వదిలి..చిన్న తలకాలయలను టార్గెట్ చేస్తే  కోట్ల రూపాయల ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేవారు ఆ జోలికేపోలేక పోతున్నారు.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదు..ఇపుడు అదే జరిగింది జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన వారందరికీ.. ఉచితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినా.. ఇపుడు దానిని కేన్సిల్ చేయడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉపయోగించుకున్న నాన్చుడు దోరణి ఇపుడు వారికి కోట్ల రూపాయలను అప్పనంగా తెచ్చిపెడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్కో రాష్ట్ర వాటా కింద సుమారు రూ.500 కోట్లకు పైనే ఆదాయం వస్తుందట. ఇంత ఆదాయాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. కోట్ల రూపాయాలు సంక్షేమ పథకాలు ఇస్తూనే.. వాటికి నిధులు సమకూర్చుకోవడానికి జిఎస్టీలోని లొసుగులను ఉపయోగించుకొని మరీ అపరాద రుసుము పేరుతో కోట్ల రూపాయాల ఆదాయం సమర్చుకోవాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై  జనం ఒంటికాలపై లేస్తున్నారు. వాస్తవంగా వ్యాపారాలు చేసేవారిని టార్గెట్ చేస్తే ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే అధికంగానే వస్తుంది.. వారు ఎలాగూ కొన్ని చోట్ల ఫేక్  రిటర్న్స్ మాత్రమే  వేస్తారు.. లిఖిత పూర్వకంగా వారిని ఏమీ చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం కరోనాలో వ్యాపారాలు చేయని వారిని నిబంధనలు వినియోగించి టార్గెట్ చేస్తే గళ్లాపెట్టి గలగలలాడుతుందని భావించి ఇపుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి కేన్సిల్ చేసుకున్నారందరికీ షోకాజ్ నోటీసులు పంపింది. దాని సారాంశం ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి ఆరు నెలల లోపు వరుసగా అంటే ప్రతీ మూడు నెలల కొకసారి రిటర్న్స్ వేయకపోతే ఆ లైసెన్స్ కేన్సిల్ అవుతుంది. అలా కొన్నింటిని చేశారు కూడా.. 

అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ తో కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ కోట్ల రూపాయల ఆదాయాని ఆర్టించాలని పక్కా ప్లాన్ వేసి కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత తమ ప్రతాపాన్ని చూపించింది.  కనీసం ఆ రిటర్న్స్ కూడా వేయని చిన్న చిన్న సంస్థల జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నవారిని టార్గెట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కాసుల వర్షం తుపానులా కురుస్తుంది. అదీ కూడా జిఎస్టీలోని లొసుగులను వినియోగించి ఈ టార్గెట్లు ఒక్కో సర్కిల్ కి ఇచ్చి మరీ చేపట్టడం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు ఆ రిజిస్ట్రేషన్ ను కేన్సిల్ చేయడానికి రూ. 10వేలు ఫైన్లు వేస్తున్నాయి. అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి, నాటి నుంచి నేటి వరకూ రిటర్న్స్ దాఖలు చేయని వారందరూ ఖచ్చితంగా ఫైనల్ రిటర్న్స్ జిఎస్టీఆర్-10 వేయలేదని, మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్లు పనిచేయలేదని తెలియజేస్తూ.. రాష్ట్రంలోని అన్ని కమర్షియల్ టేక్స్ కార్యాలయాల నుంచి చిన్నా చితకా సంస్థలకు నోటీసులు జారీచేశారు. వాస్తవానికి ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు..ఆన్ లైన్ ద్వారానే కేన్సిల్ కూడా జరగాలి. అలా కేన్సిల్ కోసం లెటర్ పెట్టిన సందర్భంలో జిఎస్టీ నెంబరు కేన్సిల్ అయి ప్రభుత్వం ఇపుడు చెబుతున్నట్టుగా జిఎస్టీఆర్-10 విషయం సంస్థలకు తెలియజేయాలి. కానీ ప్రభుత్వం ఆ పనిచేయలేదు. 

సిస్టమ్ మెజేస్ కింద కొందరికి పంపి  కొందరికి పంపడం మానేసింది. రెండేళ్ల పాటు ఊరుకొని ఇపుడు మీరు జిఎస్టీ కేన్సిల్ కి ఫైనల్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు కనుక అపరాద రుసుముతో రూ.10వేలు కట్టాలని నోటీసులు పంపింది. ఇపుడు నోటీసులు అందుకుంటున్నవారంతా లబో దిబో మంటున్నారు. చచ్చినట్టు నోటీసులందకున్న వారంతా కమర్షియల్ టేక్స్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఆన్ లైన్ కేన్సిలేషన్ పెట్టినపుడు ఆన్ లైన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ యాక్టివ్ అని మాత్రమే నిన్నటి వరకూ చూపించి ఇపుడు నోటీసులు ఇచ్చి ఫైన్లు కట్టమని చెప్పడమేంటని ప్రశ్నించినా..తామేమీ చేయలేమని.. ఖచ్చితంగా జిఎస్టీఆర్-10 కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. మరికొందరు గట్టిగా నిబంధనలపై ప్రశ్నిస్తే అలాంటి సంస్థల బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎనిమిది సర్కిళ్లలో మొదలైంది..చూడాలి జిఎస్టీ పేరుతో చేస్తున్న నిలువు దోపిడీ ఏ విధంగా సాగుతుందో..ప్రభుత్వం చేసిన తప్పుని, ఎస్టీ అధికారులు నాన్చిన వ్యవహారాన్ని పక్కన పెట్టి..కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏడురోజుల్లో జిఎస్టీఆర్ ఫైల్ చేయకపోతే చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేయడం వెనుక చూస్తే..పెద్ద ఎత్తునే ఈ జిఎస్టీకి నిలువుదోపిడీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్టర్ స్కెచ్ వేసినట్టు కనిపిస్తుంది.. చూడాలి ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వివరణ ఇస్తుందో..!