అక్టోబరులో ఎస్వీబీసీ కన్నడ ప్రసారాాలు..
Ens Balu
4
Bengaluru
2021-09-02 12:10:58
తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి గురువారం బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్ ప్రాంతంలో గల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈఓకు టిటిడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈఓ అక్కడి టిటిడి కల్యాణమండపాన్ని, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రానున్న అక్టోబర్ నెలలో ఎస్వీబీసీ కన్నడ ఛానెల్ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. ఛానల్ ప్రారంభం సందర్భంగా పురందరదాస కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్‌కు సూచించారు.