కరోనా పాజిటివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ది 2వ స్థానం..
Ens Balu
4
New Delhi
2020-09-10 12:58:04
భారత దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 95,735 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.ఈ కేసుల్లో 60% ఆరు తీవ్ర ప్రభావి త రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హమన్న కేంద్రం అందులో మహారాష్ట్రలో 23,000 పైగా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 10,000 కు పైగా కేసులను గుర్తించినట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న మొత్తం బాధితుల సంఖ్య ఈ రోజుకు 9,19,018 కి చేరిందని పేర్కొంది. చికిత్సలో ఉన్న వారిలో 74% పైగా కేసులు తీవ్రంగా ప్రభావమున్న 9 రాష్ట్రాలకు చెందినవిగా ఉన్నాయని, అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 49% కేసులు చికిత్సలో ఉన్నాయని తెలియజేసింది. ఈ జాబితాలో మహారాష్ట్ర 2,50,000 మందితో మొదటి స్థానంలో ఉండగా, కర్నాటకలోను, ఆంధ్రప్రదేశ్ లోను ఒక్కో రాష్టంలో 97,000 కు పైగా చికిత్స పొందుతూ రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 1,172 మరణాలు నమోదు కాగా, నిన్న ఒక్క మహారాష్ట్ర నుంచే 380 మరణాలు నమోదయ్యాయి. 128 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా 78 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. మొత్తం మరణాలలో 69% కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావటం కూదా గమనార్హం. అవి మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాయని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది...