నెగిటివ్ వచ్చినా ఆర్ టి-పిసి ఆర్ పరీక్షలు చేయాల్సిందే..


Ens Balu
3
New Delhi
2020-09-10 19:46:29

కోవిడ్ లక్షణాలుండి రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారికి  కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆర్ టి - పిసి ఆర్ పరీక్షలు చేయటం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రి త్వశా ఖ పేర్కొంది. భారత వైద్య పరిశోధనామండలి ( ఐసిఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. రెండు నిర్దిష్ట విభాగా లకు చెందిన వ్యక్తులను ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు జరిపి తీరాల్సిందేనన్న మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసింది.. ఈవిధంగా 1. జ్వరం, దగ్గు, ఊపిరి పీల్చటంలో ఇబ్బంది లాంటి సమస్యలున్న వారి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నెగటివ్ చూపించినప్పుడు... 2. ఎలాంటి లక్షణాలూ లేకపోయినా రాపిడ్ యాంటెజెన్ పరీక్షల్లో నెగటివ్ చూపించినా రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు మొదలైన కేసుల్లోనూ... ఆర్ టి-పిసి ఆర్ చేయాల్సి వుంటుంది... ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్ ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ లేఖలు రాశాయి. లక్షణాలు కనబడుతున్నా, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన కేసులన్నిటికీ తప్పనిసరిగా ఆర్ టి- పిసిఆర్ పరీక్షలు చేయించాలని ఆ లేఖలో కోరాయి.  ఇలాంటి కేసులు పరీక్షలకు నోచుకోకుండా అలాగే ఉండిపోతే వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. అలా మళ్లీ కచ్చితమైన పరీక్షలు జరపటం ద్వారా పొరపాట్లను తొలిదశలోనే గుర్తించి ఆస్పత్రికి తరలించటమో, ఐసొలేషన్ లో ఉంచటమో సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. కేవలం విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే రాపిడ్ యాంటిజెన్ టెస్టులు తప్ప పూర్తి స్థాయ్తి నిర్థారణకు పనికిరావన్న సంగతి గుర్తించాలని ఆ ఉమ్మడి లేఖలో పేర్కొన్నాయి. ఆర్ టి - పిసిఆర్ ను మాత్రమే అత్యంత ప్రామాణికంగా భావించాలని సూచించాయి.