ఇక ఉపేక్షించేది లేదు.. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్


Ens Balu
2
Ambala
2020-09-10 19:49:19

‘రఫేల్‌ భారత వైమానిక దళంలోకి చేరడంతో ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని వక్ర దృష్టితో చూసే ధైర్యం చేసేవారికి ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాం. ప్రస్తు త సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఘటన’... ‘ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతల సమయంలో ఐఏఎఫ్‌ చూపించిన సమయస్ఫూర్తిని, నిబద్ధతని ఈ సం దర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. సరిహద్దులో మోహరించిన వాయుసేన దళాలను చూస్తే.. వారు ఏలాంటి పరిస్థితిని ఎదుర్కొగలరని.. భవిష్యత్తులో యుద్ధం సంభ విస్తే.. ఐఏఎఫ్‌ కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని’...రాజ్ నాధ్ సింగ్ ప్రత్యర్ధి దేశాలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. గురువారం అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆలోచనను రేకెత్తించాయి. అంతేకాక  కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రఫేల్‌ రాకను గేమ్‌ చేంజర్‌గా వర్ణించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ సందర్భంగా భారత్ ‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్‌ యుద్ధ విమానాల కోసం భారత్‌ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్‌ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్‌ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం మరింత బలోపేతమైంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫోరెన్స్‌ పార్లీ, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.