ఆ 5 రాష్ట్రాల్లోనే కోరోనా అధికంగా వుంది..కేంద్రం
Ens Balu
2
New Delhi
2020-09-10 20:36:52
దేశంలో గడిచిన 24 గంటల్లో 95,735 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 60% ఆరు తీవ్ర ప్రభావిత రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం. అందులో మహారాష్ట్రలో 23,000 పైగా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 10,000 కు పైగా కేసులు గుర్తించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా చికిత్స పొందుతున్న మొత్తం బాధితుల సంఖ్య 9,19,018 కి చేరిందన్న కేంద్రం చికిత్సలో ఉన్న వారిలో 74% పైగా కేసులు తీవ్రంగా ప్రభావమున్న 9 రాష్ట్రాలకు చెందినవేనని పేర్కొంది. అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 49% కేసులు చికిత్సలో ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర 2,50,000 మందితో మొదటి స్థానంలో ఉండగా కర్నాటకలోను, ఆంధ్రప్రదేశ్ లోను ఒక్కో రాష్టంలో 97,000 కు పైగా చికిత్స పొందుతూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 1,172 మరణాలు నమోదు కాగా, నిన్న ఒక్క మహారాష్ట్ర నుంచే 380 మరణాలు నమోదయ్యాయి. 128 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా 78 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. మొత్తం మరణాలలో 69% కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావటం కూదా గమనార్హం. అవి మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్.