సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు..
Ens Balu
11
Tirumala
2021-10-12 12:18:08
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం బదులుగా శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు. ఈ వాహనసేవలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌మబాబు, ఒఎస్డీ పాల శేషాద్రి పాల్గొన్నారు.