శానిటైజర్ వద్దు..సబ్బులే ముద్దు..!


Ens Balu
2
New delhi
2020-09-13 12:25:21

కరోనా వైరస్ భారత దేశంలో వ్యాపించిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ శానిటైజర్లు విపరీతంగా వాడేవారు. ఈ శానిటైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ అధికంగా వుండటంతో కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా అధికంగానే జరిగేవి. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ శానిటైజర్ వాడకపోయినా నిత్యం సబ్బుతో చేతులు కడుక్కుంటే చాలనే సూచన చేయడం, ఆపై కరోనా వైరస్ పట్ల ప్రజల్లో భయం పోవడంతో క్రమేపీ శానిటైజర్ల వాడకం తగ్గుతూ వస్తుంది. కరోనానను ద్రుష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు విపరీతంగా శానిటైజర్ల వ్యాపారం చేసిన వారంతా ఇపుడు స్టాటు వదిలించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఎవరో సంపన్న కుటుంబాలు, వైద్యులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి కొందరు సిబ్బంది, అధికారులు తప్పా మరెవరూ శానిటైజర్లను వినియోగించడం లేదు. మూడు నెలల క్రితం 100శాతం వినియోగించిన వారంతా ఆ వాడకాన్ని 60శాతం తగ్గించేశారు. దీంతో శానిటైజర్ వినియోగించేవారంతా సబ్బులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గ్లిజరిన్, వేప, నిమ్మ, పెట్రోలియం జెల్లీ లాంటి కాంబినేషన్ సోపులు వినియోగిస్తున్నారు. చాలా మంది ఇంటి దగ్గర కూడా అధికంగా సబ్బునే వినియోగిస్తున్నారు. కానీ సానిజైర్ వాడటం ద్వారా మాత్రమే ముట్టుకోవడం ద్వారా వచ్చే కరోనా వైరస్ ను నియంత్రించడానికి వీలు పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.