ప్రధాని డిప్యూటీ సెక్రెటరీగా ఆమ్రపాలి..
Ens Balu
1
New Delhi
2020-09-13 21:44:02
ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిప్యూటీ సెక్రటరీగా తెలంగాణ కేడర్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి నియమితులయ్యారు. విశాఖలో పుట్టి, చెన్నై ఐఐటి నుంచి పట్టభద్రురాలైన ఆమ్రపాలి ఆ తరువాత ఐఐఎం బెంగుళూరు లో ఎంబీఏ పూర్తిచేసారు. 2010లో సివిల్స్ రాసి ఆలిండియా 39వ ర్యాంక్ ను సాధించి, తెలంగాణ కేడర్ ఎంపికయ్యారు. అనంతరం 2013 లో వికారాబాద్ సబ్-కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆతరువాత కేంద్ర హోం శాఖామంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రెటరీ గా బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలి, ప్రధాని డిప్యూటీ సెక్రెటరీ గా పదోన్నతి పొందారు. ఎంతో మంచి అధికారిగా, ముక్కుసూటి అధికారిణి గా తెలంగాణ ప్రభుత్వంతోపాటు, కేంద్రంలో ఆమ్రపాలికి మంచి పేరుంది. ఈ ట్రాక్ రికార్డుతోనే ఆమె ప్రధాన మంత్రి డిప్యూటీ సెక్రటరీగా పొందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినంతకాలం అవినీతి పరులకు ఆమె సింహస్వప్నంగా వ్యవహరించారు. ఎందరో యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు.