1 ENS Live Breaking News

ఫోక్సో కేసులో ఒకరికి నాలుగేళ్ల జైలుశిక్ష..

అనంతపురంజిల్లా ధర్మవరం పట్టణంలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసులో అదే పట్టణానికి చెందిన బాబా ఫకృద్ధీన్ కు 4 సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ అనంతపురం ఫస్ట్ ఏ.డి.జె కోర్టు జడ్జి రమేష్ తీర్పు వెలువరించారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసు స్టేషన్లో 13-05-20 తేదీన క్రైమ్ నంబర్: 269/2020 U/s. 376, R/w 511, 354-B, IPC and Sec. 7 R/w 8 of POCSO Act. 2012 కేసు నమోదయ్యింది.  నిందితుడిని అరెస్టు చేశారు. ధర్మవరం పట్టణ సి.ఐ ఎం.కరుణాకర్ దర్యాప్తు చేపట్టి ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన జడ్జి నిందితుడికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ నిన్న తీర్పు వెలువరించారు. పక్కాగా దరాప్తు చేసిన సి.ఐ ఎం.కరుణాకర్ ను మరియు ప్రాసిక్యూషన్ తరుపున వాదించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ గౌడు, కోర్టు కానిస్టేబుల్ రాజేష్ లను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.

Dharmavaram

2020-12-25 16:10:37

విజయనగరంలో సింగం పోలీస్ సీన్ రిపీట్..

సూర్య  అనుష్క  జంటగా నటించిన సింగం-1 సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో క్లైమాక్స్ లో హోంమినిస్టర్ గారి అమ్మాయిని విలన్ గ్యాంగ్ ట్రైన్ లో కిడ్నప్ చేస్తారు. ఆ విషయం తెలుసుకుని పోలీసు అయిన హీరో, చాలా చాకచక్యంగా వ్యవహరించి, అమ్మాయిని కిడ్నపర్ల చెర నుండి సురక్షితంగా కాపాడతాడు.  అదేసీన్ విజయనగరంలో కూడా రిపీట్ అయ్యింది. విజయనగరం రూరల్ పోలీసులు చాలా చాకచక్యంగా, విజయనగరంలో దొంగతనం చేసి ట్రైన్లో పారిపోతున్న ఒక కిలాడి దొంగని పట్టుకున్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రం, దుర్గ్ జిల్లా కి చెందిన తస్విర్ సింగ్ కు ఒక లారీ ఉంది. గంగవరం పోర్ట్ నుండి ఛత్తీస్గఢ్ లో గల రైగఢ్ కు బొగ్గును తీసుకొని రావటానికి, తస్విర్ సింగ్ తన లారీని దీపక్ సాహు అనే వ్యక్తికి ఇచ్చి పంపాడు. గంగవరం పోర్టులో బొగ్గు లోడ్ చేసుకున్న దీపక్ సాహుకి మదిలో దుర్బుద్ధి కలిగి, విజయనగరం జిల్లా లో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చెల్లూరు రింగురోడ్డు వద్ద లారీని ఆపి, లారీ కి వేసిన 04 కొత్త టైర్స్ (విలువ సుమారు ఒక లక్ష) ఊడదీసి మరియు డీజిల్ ట్యాంక్ నుండి సుమారు ₹ 10,000/- విలువ గల డీజిల్ ను తీసేసి, లారీని అక్కడే పెట్టి, దొంగిలించిన సొత్తుని సొమ్ము కింద మార్చుకొని దర్జాగా చేసిన దొంగతనం ఎవరికి తెలియదు అనుకోని విజయనగరం రైల్వేస్టేషన్ కి వెళ్లి విశాఖ-కోర్బ ట్రైన్ ఎక్కి ఇంటికి బయదేరాడు. కానీ పధకం పారలేదు. డ్రైవర్ సాహు ఫోన్ ఆఫ్ చెయ్యడంతో లారీ ఓనర్ కి అనుమానం వచ్చి, లారీ కి బిగించిన GPS ద్వారా లారీ ఎక్కడ ఉందొ కనుక్కొని, విజయనగరం రూరల్ పోలీసులకు తస్విర్ సింగ్ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. వెంటనే స్పందించిన విజయనగరం రూరల్ SIs  నారాయణ మరియు లక్మి ప్రసన్న టీమ్స్ గా ఏర్పడి, ముద్దాయి చత్తీస్గఢ్ వాస్తవ్యుడు కాబట్టి, ఆ సమయములో విజయనగరం నుండి చత్తీస్గఢ్ కు ట్రైన్ ఉండడంతో అనుమానం కలిగి విజయనగరం రైల్వేస్టేషన్ కు వెళ్లి విచారించగా, ముద్దాయి విశాఖ-కోర్బ ట్రైన్ ఎక్కడాని రూడీ చేసుకొని, ట్రైన్ లో TT డ్యూటీ లో ఎవరున్నారో కనుకొన్ని ఆయనకు ముద్దాయి ఫోటో వాట్సాప్ చేసి, ముద్దాయి ట్రైన్లో ప్రయనిస్తున్నాడని నిర్ధారించుకొని, తరువాత స్టేషన్ బొబ్బిలికి విజయనగరం రూరల్ 2nd SI  ప్రసన్న వెళ్ళాడు. ఇంతలో ముద్దాయి తప్పించుకోవటానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని, RPF SI , బొబ్బిలి SI కు సమాచారం ఇచ్చారు. ట్రైన్ బొబ్బిలికి చేరగానే, అక్కడ సిద్ధంగా ఉన్న బొబ్బిలి SI ముద్దాయిని పట్టుకొని విజయనగరం రూరల్ 2nd SI ప్రసన్నకి అప్పజెప్పారు. కేసు నమోదు చేసి విజయనగరం రూరల్ పోలీసులు, దొంగిలించిన నాలుగు టైర్స్ మరియు డీజిల్ ను రికవరీ చేసి ముద్దాయిని అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో దొంగను వెంబడించి  పట్టుకున్న విజయనగరం రూరల్ పోలీసుల సామర్ధ్యాన్ని, ధైర్యసాహసలని, సమయస్ఫూర్తిని  పనితీరుని డిజిపి డి. గౌతమ్ సవాంగ్ అభినందించారు..

Vizianagaram

2020-12-24 21:24:56

రూ.32లక్షల విలువైన మద్యం స్వాధీనం..

గూంటూరు పోలీసులు ఆదివారం రూ.32 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 19 మందిని అరెస్టు చేయడంతోపాటు, లారీ, జేసిబీలను కూడా సీజ్ చేశారు. ఈ విషయమై గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మీడియాతో మాట్లాడుతూ, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోకి వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి అక్రమ మద్యాన్ని తరలిస్తున్న గ్యాంగ్ ను పట్టుకొని, వారి దగ్గర నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. పట్టుకున్న మద్యంలో 16,128 బాటిళ్లు కాగా, రూ.35 విలువైన లారీని కూడా సీజ్ చేసినట్టు చెప్పారు. చట్టవ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. అరెస్టు అయినవారిలో గుండ్లపాడు, ఉప్పలపాడు చెందిన వారు 12 మంది కాగా, ఇద్దరు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారున్నారన్నారు. భారీ మొత్తంలో అక్రమ మద్యాన్ని పట్టుకున్న ఎస్ఈబీ పోలీసులను ఎస్పీ అభినందించడంతోపాటు వారికి రివార్డులను అందజేశారు. పట్టుకున్న మద్యాన్ని సీజ్ చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అధికారి ఆరీఫ్ హఫీజ్, ఎక్సైజ్ అదనపు ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈబి సిఐ వీరేంద్రబాబు, ఎక్సైజు సిఐ కొండా రెడ్డి ఉన్నారు.

గుంటూరు

2020-11-29 17:14:34

ఆ వెర్రచేష్టల నియంత్రణకే ఈ సినిమా..

దర్శకులు అభిమానులను తన సినిమాల ద్వారా అలరించాలి..కానీ వెర్రిచేష్టలు వేసి, తెలుగు సినీ ప్రేమికులను విసిగిస్తే..సినిమా తిరగబడుతుందనడానికి ప్రత్యక్షఉదాహరణగా నిలుస్తుంది రామ్ గోపాల్ వర్మ చిత్రం. ఏంటి వినడానికి కాస్త వింతగా వుందా..అలా అనుకుంటే రీల్ బాక్సులో కాలుపెట్టినట్టే..ఆ నూతన సినిమా కధ వింటే మీరే ఓహో అంటారు.. ఒక దర్శకుడి వింత పోకడలకు, వెర్రి చేష్టలకు విసిగిపోయి.. వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని తెరకెక్కించానని పేర్కొన్నారు రచయిత-దర్శకనిర్మాత ప్రభు. ఈ చిత్రం మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్, టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తుండగా..తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. దర్శకనిర్మాత ప్రభు, కథానాయకుడు షకలక శంకర్, ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించిన జబర్దస్త్ అభి, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్, ఛాయాగ్రాహకుడు బాబులతో పాటు ప్రముఖ పాత్రికేయులు వినాయకరావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు. జర్నలిస్ట్ గా పలు సంచనాలు సృష్టించిన ప్రభు 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రంతో దర్శకుడుగానూ సంచలనాలకు శ్రీకారం చుట్టాలని వినాయకరావు, సురేష్ కొండేటి ఆకాక్షించారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో "రాంగ్ గోపాల్ వర్మ" ఒకటని శంకర్ అన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుకు, సంగీత దర్శకుడు షకీల్, ఛాయాగ్రాహకుడు బాబు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పిన ప్రభు.. ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు.

Hyderabad

2020-10-12 16:01:56