1 ENS Live Breaking News

అనకాపల్లి డీఎస్పీకి వెరైటీ పనిష్మెంట్..జస్ట్ బదిలీ

పోలీసోడు ఖాకీ దుస్తుల్లో ఉండి ఎలాంటి తప్పులు చేసినా అది రైటే..చట్టం వారి చుట్టం.. కాదూ కూడదని మీడియా ఆ తప్పుని ఆధారాలతో బయటపెడితే మాత్రం వారికి బదిలీ లాంటి చిన్న పనిష్మెంట్ వేసి చేతులు దులుపు కుంటారనడానికి అనకాపల్లి డిఎస్పీ సునీల్ ఉదంతమే ఒక ప్రత్యేక ఉదాహరణ. గంజాయి రవాణాలో పట్టుబడ్డ వాహ నాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడమే కాకుండా..ఆ కారు గంజాయి కేసులో కారని తెలియకుండా ఉండేందుకు మరో కేసులో పట్టుబడ్డ కారు నెంబరు ప్లేటు తగి లించి వాడేసుకున్న డిఎస్పీకి పోలీసుశాఖ చాలాచిన్న పనిష్మెంట్ మాత్రమే ఇచ్చింది. అదే ప్లేస్ లో మరో సాధారణ వ్యక్తులు ఇలాంటి తప్పులుచేస్తే..ఐపీసీ, సీఆర్పీసీ సెక్ష న్నీ కలిపి కేసుకట్టి ఊచలు లెక్కించి కోర్టుమెట్లు ఎక్కించి ఉండేవారు. కానీ పాపం పోలీసుశాఖలో డిఎస్పీకదా.. ఏపనిష్మెంట్ ఇవ్వకపోతే బాగోదని జస్ట్ బదిలీ చేసి మమ అనిపించేశారు. ఈ లెక్కన పోలీసుశాఖలో పెద్ద అధికారి తప్పుచేసినా కేసులుగానీ, శిక్షలుగానీ ఉండవనిచెప్పకనే చెప్పారు.

Anakapalle

2023-02-18 05:34:41

వాటర్ ప్లాంట్లలో విజిలెన్స్ తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై విజిలెన్స్ శాఖ జరిపిన తనిఖిలలో భాగంగా  శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా ,  అమలు అధికారి ఏ. సురేష్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజయనగరం జిల్లాలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్, రవివలస విలేజ్, గంట్యాడ మండలం మరియు శుభకరి ఆక్వా ఇండస్ట్రీ స్  కేఎల్ పురం, విజయనగరం  వద్ద ఉన్న ప్లాంట్లను విజిలెన్స్ అధికారులు  సి. హెచ్.  సత్యన్నారాయణ, డిఇ గారు, బి.సింహాచలం ఇనస్పెక్టర్, అప్పన్నహెచ్ & శేషగిరి కానిస్టేబుల్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు  డి కె కావ్య రెడ్డి తో పాటు తనిఖీ చేయడమైనది. నిబంధనలు పాటించని కారణంగా సంభందిత యాజమాన్యం పై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఈ దాడుల్లో విజిలెన్సు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-17 14:17:35

గంజాయి కారుతో అనకాపల్లి డిఎస్పీ ‘ఢీ’ ఆపై షికారు

పోలీసోడు ఏం చేసినా అది రైటే.. చట్టాలు మన చేతిలో ఉన్నప్పుడు.. ప్రశ్నించే జిల్లా అధికారులు ఎవరూ లేనపుడు.. చట్టవిరుద్దంగా చేసే పనులకు అడ్డులేనపుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. ఇదంతా మన అనకాపల్లి డిఎస్పీ సునీల్ యరైటీగా ఉంటదని  చేసిన ఘనకార్యం కోసమే.. ఇక వివరాల్లోకి వెళితే.. గత ఏడాది జూలై నెలలో కసింకోట మండలం ఏఎస్ పేట జాతీయ రహదారి వద్ద స్కార్పియో వాహనంలో గంజాయి తరలిస్తూ నిందితులు వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. పోలీసులు స్కార్పియో వాహనంలోని 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్ కి చెందిన సింగ్ అనే వ్యక్తి జిమాడుగుల ప్రాంతంలో ఉంటూ గంజా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సింగ్​ను గత ఏడాది నవంబర్​లో అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఇతను వచ్చిన షిఫ్ట్ వాహనాన్ని పోలీస్ స్టేషన్​లో ఉంచారు.

అలా ఉంచేస్తే ఏమొస్తిందిలే అనుకొని దానిని తన సొంత పనులకు వాడటం మొదలు పెట్టాడు డిఎస్పీ.. ఆ కారుకు స్మగ్లింగ్ చేస్తూ పట్టిబడిన మరో వాహన నెంబర్ ను తగిలించుకుని మరీ రోడ్లపై తిరుగుతూ. ఇష్టరీతిని వ్యవహరిస్తూ.. రోడ్డుపైనే వెళ్ళే వాహానాన్ని ఢీ కొట్టాడు. సదరు భాదిత వాహనదారుడు ఆ వాహనాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అప్పుడే ఆ దొరగారి దొంగతనం, ఆపై తేడాతనం బయపడింది. చట్టాన్ని..న్యాయాన్ని తమ బుజాలపై మోసేస్తున్నట్టు కలరిచ్చే పోలీసోడు తప్పు చస్తే ఊరుకుంటారా.. విషయాన్ని క్షణాల్లో రాష్ట్రవ్యాప్తం చేసేశారు. గంజాయి కేసులో పట్టుబడ్డ కారుని వినియోగించడం ఒక తప్పు అయితే దానికి వేరే నెంబరు ప్లేటు మార్చి వినియోగించడం మరో పెద్ద తప్పు. చట్టాలు మన చేతిలో ఉన్నప్పుడు.. ప్రశ్నించేవారు ఎవరు అని అనుకున్న అనకాపల్లి డిఎస్పీ వ్యవహారం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయ్యింది.. చట్టవిరుద్దంగా చేసే పనులకు వాడిన కారులోనే.. షికారు చేసి..తేడా పోలీసోడంటే ఎలా ఉంటాడో లైవ్ లో చూపించాడు. గత్యంతరం లేని జిల్లా పోలీసులు విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు.

 

anakapalli

2023-02-12 06:46:51

10లీటర్ల నాటుసారాతో ఇద్దరు వ్యక్తులు అరెస్టు

ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి, బొవురువాక గ్రామాల్లో  నిర్వహించిన  దాడుల్లో 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సిఐ పి.అశోక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తుల నుంచి ఐదేసి లీటర్ల చొప్పున నాటుసారా అమ్మకాలు చేస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్టు చెప్పారు. కాళ్లబుచ్చిరాజు, జల్మూరి దుర్గాభవానీ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి వద్ద నుంచి సారాప్యాకెట్ ను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్టు తెలియజేశారు.

ప్రత్తిపాడు

2023-02-09 13:40:45

200లీటర్ల బెల్లం పులు ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

ప్రత్తిపాడు సెబ్ సర్కిల్ పరిధిలోని శృంగధార వద్ద నాటుసారా సామాగ్రి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సిఐ పి.అశోక్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన శంఖవరంలో మీడియాతో మాట్లాడారు. శృంగధార నుంచి శంఖవరానికి  బజాజ్ ఆటోలో తరలిస్తున్న 150కేజిల్ల నల్లబెల్లం పొడి, 3కేజిల అమ్మోనియా,  200 లీటర్ల బెల్లం పులుపును రూట్ వాచ్ దాడుల్లో పట్టుకున్నట్టు చెప్పారు. బెల్లం పులుపుని ధ్వంసంచేసినట్టు తెలియజేశారు. పెదమల్లాపురానికి చెందిన కంచె హరిబాబు, మేకల చిన్నబ్బాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి, వాహనాన్ని సీజ్ చేసిట్టు పేర్కొన్నారు. ఎవరైనా నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో  స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2023-02-09 13:06:59

ఇక అలాంటి నకిలీ స్టిక్లర్లు అతికిస్తే దబిడి దిబిడే

కాకినాడ జిల్లాలో ఎస్పీ రవీంధ్రనాద్ బాబు ఆదేశాల మేరకు నకిలీ ప్రెస్, పోలీస్, రెవిన్యూ, మిలట్రీ తదితర శాఖలకు చెందిన నకిలీ స్టిక్కరింగ్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్టు డిఎస్పీ ఎం.వెంకటేశ్వర్రావు తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 15 నకిలీ స్టిక్కర్ వాహనాలు పట్టుబడ్డాయని తెలియజేశారు. ఆ వాహనాలను సీజ్ చేసి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని వివరించారు. ఇకపై అధికారిక సిబ్బంది, అధికారిక జర్నలిస్టులు తప్పా మరెవరైనా నకిలీ స్టిక్కర్లు వాహనాలపై అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Kakinada

2023-02-08 16:47:26

ఆయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తామంటూ ఫోన్

ఉత్తరప్రదేశ్ లోని అయోద్య రామమందిరానికి పేల్చేస్తానంటూ ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాగరాజ్ కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఈ బెదిరింపు కాల్ రావడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని రామమందిరం చాలా పెద్ద దేవాలయంగా గుర్తింపు పొందుతున్న వేళ అగంతకులు రాములోరి దేవాలయాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది.

Ayodhya

2023-02-03 05:53:23

వివాహితను వేధించి కటకటాలపాలైన వీఆర్వో

ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వివాహితు వేధిస్తున్నందుకు పాయకరావుపేట మండలం నామవరం విఆర్వో భాస్కరనాయుడుని పోలీసులు అరెస్టు చేశారు. తన దరఖాస్తును పట్టించుకోకుండా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీఆర్వోపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన డిఎస్పీ ప్రవీణ్ కుమార్ దర్యాప్తులో వాస్తవాలు బయటపడటంతో వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు వారి పరిమితికి లోబడి పనిచేయాలి తప్పా, లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.

Payakaraopeta

2023-01-31 14:08:35

కోనసీమ జిల్లాలో 6.315 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్

డాక్టర్ అంభేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈతకోట గ్రామంలో వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ పై దాడిచేసిన  రీజనల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు 6.315 మెట్రిక్ టన్నుల  ఎరువులను సీజ్ చేసినట్టు ఇనెస్పెక్టర్ సత్యకిషోర్ తెలియజేశారు.  క్రిభ్కో యూరియా గరిష్ట అమ్మకపు ధర రూ 266.50  వుండగా రూ 300/- లకు అమ్మకాలు చేస్తున్నట్టుగా కూడా గుర్తించామన్నారు.  సీజ్ చేసిన ఎరువల మొత్తం రూ 69,015/- ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.ఈ దాడుల్లో తహశీల్దార్ విజయ్ కుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Ravulapalem

2023-01-27 10:08:51

తిరుమల లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ

తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి రూ.2 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. టిటిడి విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజి ద్వారా అనుమానితుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రూ.2 లక్షలను తన వద్దే ఉంచుకొని గడియ పెట్టడం మరిచిపోయి కౌంటరులోనే నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumala

2023-01-24 11:19:42

గురుకుల పాఠశాల విద్యార్ధినికి అత్యవసర ప్రసవం

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని గురుకులపాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చడం..దానిని అత్యవసరంగా కాన్పు చేసి తీసిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ 
అయ్యింది. దీనితో రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలను ప్రభుత్వం అలెర్ట్ చేసింది. సంక్రాంతి సెలవులకు సొంతూరుకి వెళ్లిన సదరు విద్యార్ధిని తిరిగి ఈనెల 
13న తిరిగొచ్చింది. హఠాత్తుగా కడుపులో నొప్పిగి ఉందని విద్యార్ధిని ప్రిన్సిపల్ కి తెలియజేయడంతో ఆ విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు. పల్స్ చాలా తక్కువగా 
ఉండటంతో అనుమానం వచ్చిన వైద్యలు పూర్తిస్థాయి పరీక్షలు చేయగా విద్యార్ధిని కడుపులో శిశువు ఉన్నట్టు గుర్తించారు. దీనితో ఈ విషయం కాస్త రాష్ట్రంలో హాట్ 
టాపిక్ అయ్యింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని గురుకుల 
పాఠశాలలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గురుకులాల్లో మహిళా ప్రిన్సిపాల్స్ ఉన్నచోట వారి భర్తలు, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరైనా ఉంటున్నారా అనే 
కోణంలో ఆరాతీస్తున్నట్టు సమాచారం అందుతుంది..

Vayalpadu

2023-01-23 07:19:58

డిజిపి అఫిషియల్ ట్విట్టర్ హ్యాకింగ్..కేసునమోదు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ డిజిపి అఫిషియల్ ట్విట్టర్ అక్కంట్ ను హ్యాక్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసినట్టు డిఐజి పిహెచ్డీ రామక్రిష్ణ తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 2019 నుంచి వాడుకలోలేకుండా ఉన్న డిజిపి ట్విట్టర్ అకౌంట్ ను కొందరు దుండగులు కావాలనే హ్యాక్ చేసి వాటి ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. తప్పుడు ఫోటోలు పెట్టేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tadepalli

2023-01-22 14:55:18

పేకాట స్థావరాలపై దాడి రూ.56.24 వేలు స్వాధీనం

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం, దార్లపూడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారు.  ఎస్సై పి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు.  వారి నుండి బెట్టింగులకు వినియోగించిన రూ.56,240/- ల నగదు,11 మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించనున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక పనులు చేపడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

ఎస్.రాయవరం

2023-01-10 12:59:34

ఆన్ లైన్ షాపింగ్ లో నకిలీ వెబ్ సైట్లతో జరభద్రం

సంక్రాంతి పండుగ ఆఫర్స్ అంటూ నకిలీ ఈకామర్స్ వెబ్ సైట్స్ చేసే మోసపూరిత ప్రకటనలకు ఏఒక్కరూమోస పోకుండా జాగ్రత్తపడాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న సమయంలో ఖచ్చితంగ సదరు వెబ్ సై ట్ ను అసలైనదా, నకిలీదా గుర్తించాలన్నారు. నకిలీదని అనిపిస్తే వెంటనే 1930 నెంబకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఏ ఒక్కరూ వారి యొక్క ఓటిపీ, పిన్ నెంబర్లు ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. ఏ ప్రభుత్వ సంస్థ వినియోగదా రులను ఈ వివరాలు అడగదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైనా నమ్మించేటట్టు మాట్లాడినా కూడా బ్యాంకు, ఓటీపీ, ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లు చెప్పకూడదన్నారు.

Kakinada

2023-01-10 08:55:23

రైల్వే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

రైల్వే ఆస్తులు, ప్రయాణీకులు, ప్రయాణ ప్రాంగణాలు, వాటికి సంబంధించిన భద్రత బాధ్యతను చూస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ వారిలో భద్రత భావాన్ని పెంచడానికి నెల రోజుల పాటు దేశవ్యాప్త తనిఖీలను ఆర్‌పీఎఫ్‌ నిర్వహించింది. ఈ తనిఖీల సమయంలో, మహిళల కోసం రిజర్వ్ చేసిన బోగీల్లో ప్రయాణించిన/ప్రవేశించిన 5100 మందికి పైగా అరెస్టు చేశారు. దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసిన బోగీలను ఆక్రమించిన/ప్రవేశించిన 6300 మందికి పైగా అరెస్టు చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై వరుసగా రూ.6.71 లక్షలు, రూ.8.68 లక్షలు జరిమానా విధించారు. రైళ్లలో, ముఖ్యంగా కొంతమంది హిజ్రాల వల్ల ఇబ్బంది, ప్రయాణీకుల పట్ల వారి దురుసు ప్రవర్తనకు సంబంధించి తరచూ చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.

 ఈ తనిఖీల సమయంలో, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న 1200 మందికి పైగా హిజ్రాలను అరెస్ట్‌ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.వారి నుంచి రూ.1.28 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని సాధారణ బోగీల్లో సీట్లను అనధికారికంగా ఆక్రమిస్తున్న వారిని గుర్తించి 36 మందిపై కేసులు పెట్టారు.భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ఈ తరహా తనిఖీలు కొనసాగించాలని ఆర్‌పీఎఫ్‌ క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించనట్టు కేంద్ర రైల్వేశాఖ పేర్కొంది.

Delhi

2023-01-06 16:12:00