భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 50 లక్షల మైలురాయి దాటింది. సోమవారం ఆ సంఖ్య 50,16,520 కి చేరింది. ప్రతి రోజూ ఇలా పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో భారత్ లో కోలుకుంటున్న తీరు అదే పనిగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 74,893 మంది కోలుకున్నారు. కొద్దిరోజులుగా దేశమంతటా కోలుకుంటున్నవారి సంఖ్య సగటున రోజుకు 90 వేలకు పైగా ఉంటోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా ఐదు రెట్లు ఎక్కువగా నమోదైంది. కోలుకుంటున్నవారి సంక్యలో పెరుగుదల గత నెల రోజులలో దాదాపు వందశాతం పెరగటం కూదా గమనార్హం. జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం 82.58% గా నమోదైంది. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది. కొత్తగా కోలుకుంటున్న కేసులలో 73% పది రాష్ట్రాలనుంచే ఉండటం కూడా గమనార్హం. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు. వీటిలో 13,000 మంది కోలుకున్నట్టు నమోదైన మహారాష్ట్ర ఈ జాబితాలో ముందుంది. 2020 జూన్ లో కోలుకున్నవారి సంఖ్య లక్ష ఉండగా అది చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 11 రోజులలోనే ఈ సంఖ్యకు 10 లక్షలు జోడించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వలన, మౌలిక సదుపాయాలు పెంచటం, ప్రామాణిక చికిత్సావిధానాలు అమలు చేయటం, వైద్య, పారామెడికల్ సిబ్బంది అంకితభావంతో అందించిన సేవలు ఒక సంపూర్ణ విధానం రూపంలో అమలుకావటం వలన ఈ ఫలితాలు సాధించటం సాధ్యమైంది. కోలుకున్న వారిలో మొత్తం 78% కేవలం పది రాష్ట్రాలనుంచే నమోదయ్యాయి. కోలుకున్నవారి సంఖ్య లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ తరువాత రెండు స్థానాల్లో నిలిచాయి.
దేశంలో రవాణా కోసం స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా, సీఎన్‌జీ ఇంజిన్లలో హెచ్-సీఎన్‌జీ (18 శాతం హైడ్రోజన్ మిశ్రమం) వినియోగాన్ని అనుమతిస్తూ కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా కోసం స్వచ్ఛమైన ఇంధనాలుగా అనేక ప్రత్యామ్నాయ ఇంధనాలను మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వాహనాల కోసం, హైడ్రోజన్ సమృద్ధిగా ఉన్న సంపీడన సహజ వాయువు (హెచ్-సీఎన్‌జీ) లక్షణాలను (ఐఎస్ 17314:2019) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కూడా రూపొందించింది. సీఎన్‌జీతో పోలిస్తే, హెచ్-సీఎన్‌జీ ద్వారా వెలువడే ఉద్గారాలను పరిశీలించడానికి కొన్ని సీఎన్‌జీ ఇంజన్లను పరీక్షించారు. హెచ్-సీఎన్‌జీని రవాణా వాహనాల ఇంధనంగా చేరుస్తూ, మోటారు వాహనాల చట్టం-1989కి సవరణలు చేస్తూ, జీఎస్‌ఆర్ 585 (ఇ) ద్వారా ఈనెల 25వ తేదీన మంత్రిత్వ శాఖ ప్రకటన ఇచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదాను జులై 22న ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీనిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు రాలేదు. దీంతో హెచ్-సీఎన్జీకి కేంద్రం పచ్చజెండా ఊపింది.
దేశంలో కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా కోవిడ్ నుంచి బైటపడుతున్న కేసుల సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,043 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీళ్లలో 76% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అందులో మహారాష్ట్ర 23,000 కు పైగా కేసులతో ముందు వరుసలో ఉండగా 9,000 పైబడ్ద ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 88,600 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అందులోనూ 20,000 కు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర ముందుండగా, 8,000 కు పైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోను, 7,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలోను నిలిచాయి. గడిచిన 24 గంటలలో 1124 మరణాలు నమోదయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 84% కోవిడ్ మరణాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 430 (38%) మరణాలు సంభవించగా, కర్నాటకలో 86 మరణాలు, తమిళనాడులో 85 మరణాలు నమోదై ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరణించినట్లు దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ ఆసుపత్రి ఆదివారం ప్రకటించింది. ఈ ఉదయం 6.55 గంటలకు తుది శ్వాస విడిచారని వెల్లడించింది. ఆయన సెప్సిస్‌తో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారు. మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ కూడా తలెత్తింది. దీనికి సంబంధించి చికిత్స అందిస్తుండగా..తలకు తగిన తీవ్రమైన పాత గాయం కారణంగా ఈ ఉదయం గుండెపోటు వచ్చినట్లు ఆసుపత్రి వెలువరించింది. జశ్వంత్ సింగ్‌ను బతికించడానికి నిపుణుల బృందం తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. కాగా.. ఆయనకు చేసిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "దేశానికి జశ్వంత్ జీ ఎంతో చిత్తశుద్ధితో, శ్రద్ధతో సేవలందించారు. మొదట ఒక సైనికుడిగా దేశానికి సేవలందించిన జశ్వంత్ సింగ్, తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. అటల్ బిహారీ వాజ్.పేయి హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై ఆయన ఎంతో బలమైన ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం" అని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
దేశంలో కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా కోవిడ్ నుంచి బైటపడుతున్న కేసుల సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,043 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీళ్లలో 76% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అందులో మహారాష్ట్ర 23,000 కు పైగా కేసులతో ముందు వరుసలో ఉండగా 9,000 పైబడ్ద ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 88,600 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అందులోనూ 20,000 కు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర ముందుండగా, 8,000 కు పైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోను, 7,000 కు పైగా కేసులతో కర్నాటక మూడో స్థానంలోను నిలిచాయి. గడిచిన 24 గంటలలో 1124 మరణాలు నమోదయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 84% కోవిడ్ మరణాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 430 (38%) మరణాలు సంభవించగా, కర్నాటకలో 86 మరణాలు, తమిళనాడులో 85 మరణాలు నమోదై ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి..
రైల్వేలో పార్శిల్ సర్వీస్ లో ముందస్తు బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాఠి తెలియజేశారు. విశాఖలో ఆయన రైల్ భవన్ లో ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఎల్ఎల్ఆర్, విపి రైల్వే పార్శిల్ స్థలం కోసం 120 రోజులు ముందుగా బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. అయితే కేవలం పదిశాతం మాత్రమే నామమాత్రపు రుసుము చెల్లించి ఈ సదుపాయం పొందవచ్చునన్నారు. ఏరోజైతే సరుకు తీసు పంపిస్తారో దానికి 72 గంటల ముందు మిగతా 90శాతం మొత్తం చెల్లించి సరుకు రవాణా చేసుకోవచ్చునని చెప్పారు. అదేవిధంగా బుకింగ్ రద్దు చేసుకున్నా అందులో 50శాతం వెనక్కి రైల్వే చెల్లిస్తుందని పేర్కొన్నారు. కార్గో మూవర్స్ సౌలభ్యం కోసం మరో పార్శిల్ వ్యాన్ 01019/01020 సిఎస్టి ముంబై-భువనేశ్వర్-సిఎస్టి ముంబై కోనార్క్ ప్రత్యేక రైలుకు జతచేసినట్టు వివరించారు. ఈ పార్శిల్ స్పేస్ కోసం ఏమైనా సందేహాలుంటే 08978080962 కు కాల్ చేయవచ్చునని తెలియజేశారు. వ్యాపారస్తులు, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అటు డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ కూడా కోరారన్నారు.