ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది..శుక్రవారం నుంచే ఆహారం కూడా తీసుకుంటున్నారు. ఇంకా వెంటిలేటర్ మీదనే ఉండి చికిత్స తీసకుంటున్నారని చెప్పారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సి ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయన్నారు. ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని వివరించారు. ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. . ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్‌కేర్‌లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ ఇస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ వచ్చిన దగ్గర చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అభిమానుల కోసం చరణ్ ప్రతీ వారానికి ఒకసారి తన తండ్రి బాగోగులను వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
భారత్‌లో కరోనా ఉద్రుతి భయంకరంగా కొనసాగుతూ తన ఆదిపత్యాన్ని నిరూపించుకుంటోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 54,00,620 చేరింది. ఇదే సమయంలో కరోనా వైరస్ నుంచి రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1,133 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,044కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య10,10,824గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇప్పటిదాకా 6.37 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.10శాతం ఉండగా.. కరోనా రికవరీ రేటు 79.28గా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో మరణాల రేటు 1.61 శాతంగా నమోదవుతుంది. అయితే మరణాల రేటుని తగ్గించడానికి అన్ని వైద్య పద్దతులను పాటిస్తున్నారు వైద్యులు.
రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించడంతోపాటు దళారీ వ్యవస్థ నిర్మూళన జరుగుతుందని అన్నారు. ఆదివారం రాజ్యసభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్న ఆయన మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందన్నారు. బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం ప్రశ్నించిన ఆయన రైతు ప్రయోజనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతు భరోసా పేరుతో ఏపి ప్రభుత్వం 49 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 ఇస్తోందని వివరించారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని, పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు తదితర అన్ని అంశాల్లో సహాయకారిగా ఉంటూ రైతులను అభివ్రుద్ధి పధంలో ముందుకు తీసుకెళుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి అధికంగా సమయంలోనూ దేశంలోని ప్రతీ ప్రాంతానికి అవసరమైన వస్తువులు వాల్తేరు రైల్వే డివిజన్ నిరంతరాయంగా సరఫరా చేసిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకె.త్రిపాఠి వెల్లడించారు. విశాఖలో శనివారం రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, టైమ్ టేబుల్ పార్సిల్ రైళ్ల ద్వారా 502 ట్రిప్పుల్లో 5829 టన్నుల సరుకులను రవాణా చేసిందన్నారు. అంతేకాకుండా దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను ప్రోత్సహిం చడానికి, రైల్వేని పరిశ్రమల వాణిజ్యానికి దగ్గరగా తీసుకురావడం కోసం వాల్తేరు డివిజన్ బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్ (బిడియు) ను ఏర్పాటు చేసిందని వివరించారు. దీని ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించినట్టు ఆయన వివరించారు. లోడింగ్, అన్ లోడింగ్ అంశాల్లో కూడా మంచి వాతావరణాన్ని కల్పించినట్టు ఆయన వివరించారు. బిడియు ద్వారా రక్షణతో కూడిన వేగవంతమైన కార్గో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని, దీనిని వ్యాపార, వాణిజ్య సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపాఠి కోరారు.
దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 87,472 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గత కొద్ది రోజులుగా చాలా ఎక్కువగా ఉన్నట్టు నమోదవుతూ వస్తోంది. గత 11 రోజులలో ప్రతిరోజూ 70,000 కు ఒపైగా కరోనా బాధితులు కోలుకుంటున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం ఈ రోజు 78.86% కు పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 41,12,551 కు చేరిం ది. ప్రస్తుతం 30,94,797 మంది ఇంకా చికిత్సలో ఉండగా వారికి 4.04 రెట్లమంది కోలుకొని బైటపడ్దారు. చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు అత్యధికంగా ఉన్న మొదటి ఐదురాష్టాల్లోనే కోలుకుంటున్నవారు కూడా అత్యధికంగా ఉన్నారు. చికిత్స పొందుతూ ఉన్న బాధితులలో 59.8% మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యారు. ఇవే ఐదు రాష్ట్రాలలో కోలుకున్నవారిశాతం కూడా అధికంగా 59.3% గా నమోదు కావటం గమనార్హం. కొత్తగా కోలుకుంటున్నట్టు నమోదవుతున్న వారిలో 90% మంది 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు.
ఇప్పుడు తాజాగా కోలుకున్నవారిలో మహారాష్ట్ర (19,522) మొత్తం కొత్త కేసుల్లో 22.31% కాగా ఆంధ్రప్రదేశ్ (12.24%), కర్నాటక (8.3%), తమిళనాడు (6.31%) చత్తీస్ గఢ్ (6.0%) కలిపి 32.8% కొత్తగా కోలుకున్న కేసులు నమోదు చేశాయి. ఇవన్నీ కలిపి చూస్తే 55.1% మంది కొత్తగా కోలుకున్నవారు ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు.
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాదులోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం కెసిఆర్ అప్రమత్తం చేశారు. అన్ని సహాయక చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో కేష్ విత్ డ్రా చేసుకోవడానికి కొత్త నిబంధన ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎం లలో ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది. తద్వారా ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఎంటర్ చేయాల్సి వుంటుంది. ఈ రోజు నుంచి అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయడం కోసం మొబైల్ ఫోన్ తీసుకెళ్లాల్సి వుంటుంది. డెబిట్ కార్డుకు లింక్ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి నగదు తీసుకువడానికి అవకాశం వుండదు. నిన్నటి వరకూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి సమయాల్లో ఏటిఎం మోసాలకు తావివ్వకుడాదనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఎస్బీఐ. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేసింది ఎస్బీఐ దీంతో ఖాతాదారులకు పూర్తి రక్షణ కల్పించినట్టైంది.
పార్లమెంటు సమావేశాలు సందర్భంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ మేరకు గురువారం పార్లమెంటు వద్ద ఎంపీలంతా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అమరావతి క్యాపిటల్ ల్యాండ్ స్కాం ,ఫైబర్ నెట్ స్కాం ,అంతర్వేది ఆలయ సంఘటన తదితరాలపై తక్షణ సీబీఐ ఎంక్వ యిరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కాముల్లో నిజా నిజాలు తెలియాలంటే సీబిఐ విచారణ ఒక్కటే మార్గమని రాజ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావించనున్నట్టు చెప్పారు. అధికారపార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులంతా ఒకేసారి ఈ విధంగా ప్లకార్డులు పట్టుకొని దేశరాజ ధానిలో నిరసన తెలియజేయడం చర్చనీయాంశం అవుతోంది. టిడిపి చేసిన మోసాలు, స్కాంలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే సీఐబి విచారణ ఒక్కటే మార్గ మని ఎంపీలంతా ముక్తకంఠంతో నినదించారు. కేంద్రం ప్రభుత్వం తక్షణమే ఎంపీల డిమాండ్ లపై విచారణ చేపడితే వాస్తవాలు తేలడంతోపాటు, అసలు సూత్రదా రులంతా బయటకి వస్తారని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించిదని, ఆ మేరకు రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు వివరించారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటిదని, దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులన్నింటినీ కేంద్రమే సమకూర్చవలసి ఉంటుందని విజయసాయి రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 2021 నాటికల్లా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందనన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల కోసం నిరీక్షించకుండా ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఖర్చు చేస్తూ వస్తోంని సభకు వివరించారు. ఆ విధంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 3,805 కోట్ల రూపాయల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జల శక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు.
హిందీభాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అలాగని ఏ భాషనూ ఎవరిపైనా రుద్దాల్సిన అవసరం లేదని, ఏ భాషనైనా వ్యతిరేకించడం సరికాదని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘వివిధ భాషలు, వివిధ ఆచారాలున్నా భారతదేశమంతా ఒక్కటే. మనమంతా ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టత’ ఈ సాంస్కృతిక గొప్పదనాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సోమవారం హిందీ దివస్ సందర్భంగా మధుబన్ విద్యాసంబంధిత ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాల సమావేశంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఎవరి మాతృభాషను వారు నేర్చుకుంటూనే మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత పరాయి భాషలను నేర్చుకోవడంలో తప్పులేదన్నారు. ఎన్ని ఎక్కువ భాషలొస్తే అంత ప్రగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. హిందీ మాతృభాషగా ఉన్నవారు దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలను నేర్చుకోవాలి. హిందీయేతర రాష్ట్రాలవారు హిందీని నేర్చుకోవాలి. ఇతర భాషలోని పదాలను, సామెతలను నేర్చుకుంటుంటే.. ఆ భాష మాట్లాడే వారితో ప్రేమానురాగాలు పెంచుకోవడంతోపాటు సత్సంబంధాలు ఏర్పడతాయి. దేశ సమైక్యత సుదృఢం అవుతుంది’ అని ఉపరాష్ట్రపతి సూచించారు. కరోనా సమయంలో తాను ఫోన్లో పలకరించిన వారికి, తనతో మాట్లాడిన వారికి.. తమది కాని మరో భారతీయ భాషను నేర్చుకోవాలని సూచించానన్నారు. ముఖ్యంగా పిల్లలు హిందీ, ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాలని చెప్పానన్నారు.
కోవిడ్ నుంచి కోలుకుంటున్న భారత్ యాత్ర ఈ రోజు మరొక మైలురాయి దాటింది. వైరస్ కోలుకుంటున్నవారి శాతం 78.00% చేరింది. రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. గడిచిన 24 గంటలలో 77,512 మంది కోవిడ్ నుంచి విముక్తి పొందారని తెలిపిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 37,80,107 కు చేరిందని పేర్కొంది. ఇలా కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్న వారికీ మధ్య తేడా పెరుగుతూ వస్తోంది. ఈ రోజు అది దాదాపు 28 లక్షలకు (27,93,509) చేరింది. దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 9,86,598 కాగా, వీరిలో 60% మందికి పైగా కేవలం మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఈ ఐదురాష్ట్రాల్లో కోలుకుంటున్నవారిలో కూడా 60% ఈ రాష్ట్రాలకు చెందినవారే ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటలలో కొత్తగా 92,071 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా... అందులో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 22,000 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 9,800 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికొస్తే గడిచిన 24 గంటలలో 1,136 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన ఈ మరణాలలో దాదాపు 53% మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అవి: మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిన్నటి మరణాలలో 36% పైగా మహారాష్ట్ర (416 ) నుంచే కావటం గమనార్హం.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్-ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయని.. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం లక్షా 51 వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై లోక్‌సభలో వచ్చిన ప్రశ్నకు మంత్రి సమాధాన మిచ్చారు. అత్యధికంగా... 22 వేల 485 కోట్ల రూపాయలను మహారాష్ట్రకు చెల్లించనున్నారు. 13 వేల 763 కోట్ల రూపాయలను కర్ణాటకకు ముట్టజెప్ప నున్నారు. కేంద్రం నుంచి పరిహారం తీసుకునే రాష్ట్రాల జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పెండింగ్‌లో ఉన్న పరిహారం, భవిష్యత్ చర్యల గురించి ఆగస్టు 27న జరిగిన 41వ జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించామన్న ఠాకూర్.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ రుణాలు తీసుకోవడం, జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి రాష్ట్రాలకు 2ఎంపికలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 2 లక్షల 35 వేల కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో 2020-21 సంవత్సరానికి కేంద్రానికి మొత్తం నికర జీఎస్టీ లక్ష్యాన్ని 6 లక్షల 90 వేల 500 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రశ్నకు... కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. అదే విధంగా.. గత మూడేళ్లుగా చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయని లోక్‌సభకు తెలియజేశారు అనురాగ్ ఠాకూర్. 2019-20లో 163.77 మిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐ రూపంలో అందినట్టు పేర్కొన్నారు. 2017-18లో ఆ సంఖ్య 350.22 మిలియన్లని, ఆ తర్వాతి ఏడాదిలో 229మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ నమోదైందని స్పష్టం చేశారు. 2020లో భారత్ నుంచి 20.63మిలియన్ డాలర్లు విదేశాలకు వెళ్లినట్టు అనురాగ్ వెల్లడించారు. గతేడాది ఆ సంఖ్య 27.57 మిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.
బిహార్ లో పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన కు చెందిన ఏడు ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకు స్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. వీటిలో నాలుగు ప్రాజెక్టులు నీటి సరఫరాకు సంబంధించినవి, రెండు ప్రాజెక్టులు మురుగునీటి శుద్ధి, ఒక ప్రాజెక్టు నదీ ము ఖం అభివృద్ధికి సంబంధించినవి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం 541 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల అమలు బాధ్యత ను బిహార్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ విభాగానికి చెందిన బియుఐడిసిఒ చేపట్టింది. పట్నా పురపాలిక సంస్థ పరిధి లోని బెవుర్ లోను, కరమలీచక్ లోను నమామి గంగె పథకం లో భాగం గా నిర్మాణం జరిగిన మురుగునీటి శుద్ధి ప్లాంటు, సీవాన్ పురపాలక మండలి, ఛప్రా నగరపాలక సంస్థ లలో ఎఎంఆర్ యుటి (అమృత్) మిషన్ లో భాగం గా నిర్మించిన నీటి సరఫరా పథకాలు, ప్రధాన మంత్రి ముంగేర్ నీటి సరఫరా పథకం, జమాల్‌పుర్ పురపాలిక మండలి లో జమాల్‌పుర్ నీటి సరఫరా పథకం, నమామి గంగే లో భాగం గా నిర్మాణం లో ఉన్న ముజఫర్‌పుర్ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ స్కీమ్ లకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు లో భాగం గా ముజఫర్‌పుర్ లో.. పూర్వీ అఖాడా ఘాట్, సీధీ ఘాట్, చంద్‌వారా ఘాట్ అనే మూడు ఘాట్ లను అభివృద్ధి చేయనున్నారు. టాయిలెట్లు, ఇన్‌ఫర్మేషన్ కియోస్క్, దుస్తులు మార్చుకునే గదులు, పాథ్‌వే, వాచ్ టవర్ మొదలైన కనీస సదుపాయాల ను కూడా రివర్ ఫ్రంట్ పరిసరాల లో ఏర్పాటు చేస్తారు. ఈ ఘాట్ లు అన్నింటిలోను చక్కని సైన్ బోర్డులు, భద్రత వ్యవస్థ, తగినంత విద్యుత్ దీపాల ను కూడా ఏర్పాటు చేస్తారు. రివర్ ఫ్రంట్ లో చేపట్టే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పర్యాటకుల ను ఆకర్షించి, రాబోయే కాలం లో దీనిని ఒక చక్కటి పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దనున్నాయి. ఈ కార్యక్రమం లో బిహార్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొంటారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఉత్తరంగా అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 2-3 రోజుల్లో పశ్చిమ వాయ్యవ దిశగా కదులుతూ తెలం గాణ మీదుగా మధ్యభారతంవైపు పయనించే అవకాశాలున్నాయని న్యూఢిల్లీలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. అల్పపీడన ప్రభావంత సెప్టెంబరు 17 వరకూ వుంటుందని పేర్కొంది. ఇప్పటికే రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా వుండనుందో కూడా వాతావరణ కేంద్రం ముందస్తుగా ప్రాంతీయ వాతావరణ కేంద్రాలకు వర్తమానం పంపినట్టు కూడా దేశ రాజధాని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్ప పీడనం ప్రభావం కారణంగా గత 24 గంటల్లో తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతం నుంచి అక్కడక్కడా భారీగా, అతిభారీగా వర్షాలు కురిశాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 08:30 గంటలవరకూ నమోదైన ప్రధాన వర్షపాతం (10 సెంటీమీటర్లు అంతకన్నా అధికంగా) వివరాలు: తణుకు-18; తిరువూరు-16; అమలాపురం-14; చింతలపూడి-10 సెం.మీ. మేర వర్షపాతాలు నమోదు అయ్యాయి.