1 ENS Live Breaking News

మావోయిస్టుల ఆచూకీ కోసం డ్రోన్లు..

దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తున్నాయి. మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడానికి డ్రోన్లు ఉపయోగించి, అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. ఈ మేరకు ఏబోబితో పాటు, చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాల్లోనూ కూంబింగ్ చేపడుతుంది. రెండు రోజుల క్రితం సుక్మాజిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వాగుదాటుతున్నట్టుగా డిపార్ట్ మెంట్ డ్రోన్ కెమెరాలు ఫోటోలు తీశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా వ్యాప్తంగా వున్న అటవీ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు.అటవీ ప్రాంతంలోని ఉపయోగించే డ్రోన్లు జిపిఎస్ సహాయంలో తీసిన వీడియోలు, ఫోటోలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పంపుతాయని తెలుస్తోంది. గతంలోనే ఈ తహార గగణ తల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కీలక ప్రాంతాల్లోనే వీటిని వినియోగించేది. ఇపుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీటిని వినియోగించి మావోయిస్టుల జాడను కనుగొనే కార్యక్రమం చేపట్టింది. వీటిని గాల్లోనే ధ్వంసం చేయాలని మావోయిస్టులు చూసినప్పటికీ, వాటికి చిక్కకుండా అత్యంత ఎత్తైన ప్రదేశంలో వీటిని ఆపరేట్ చేస్తూ, కంటికి కనపడని విధంగా వీటిని వినియోగిస్తున్నారని తెలుస్తుంది. ఈ డిపార్ట్ మెంటల్ డ్రోన్ల వలన ఫలితాలు బాగానే వస్తున్నట్టు పోలీసు వర్గాలు వీటిని వినియోగించి తీసిన ఫోటోలు, వీడియోలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

sukma

2020-09-14 13:40:37

ప్రధాని డిప్యూటీ సెక్రెటరీగా ఆమ్రపాలి..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ  డిప్యూటీ సెక్రటరీగా తెలంగాణ కేడర్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి నియమితులయ్యారు. విశాఖలో పుట్టి, చెన్నై ఐఐటి నుంచి పట్టభద్రురాలైన ఆమ్రపాలి ఆ తరువాత ఐఐఎం బెంగుళూరు లో ఎంబీఏ పూర్తిచేసారు. 2010లో సివిల్స్ రాసి ఆలిండియా 39వ ర్యాంక్ ను సాధించి, తెలంగాణ కేడర్ ఎంపికయ్యారు. అనంతరం 2013 లో వికారాబాద్ సబ్-కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆతరువాత కేంద్ర హోం శాఖామంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రెటరీ గా బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలి, ప్రధాని డిప్యూటీ సెక్రెటరీ గా పదోన్నతి పొందారు. ఎంతో మంచి అధికారిగా, ముక్కుసూటి అధికారిణి గా తెలంగాణ ప్రభుత్వంతోపాటు, కేంద్రంలో ఆమ్రపాలికి మంచి పేరుంది. ఈ ట్రాక్ రికార్డుతోనే ఆమె ప్రధాన మంత్రి డిప్యూటీ సెక్రటరీగా పొందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినంతకాలం అవినీతి పరులకు ఆమె సింహస్వప్నంగా వ్యవహరించారు. ఎందరో యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

New Delhi

2020-09-13 21:44:02

ఆ మోడల్ ఫోనులో 7000ఎంహెచ్ బ్యాటరీ..!

రోజుకో కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్లు కొత్త కొత్త ఫీఛర్లతో భారత్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నవేళ.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ లో దూకుడును మరింతగా పెం చుతోంది. తాజాగా గెలాక్సీ ఎం సిరీస్ లో భారీ  బ్యాటరీ  సామర్ధ్యంతో  మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏకంగా 7000 ఎంఏహెచ్  బ్యాటరీతో శాంసంగ్  గెలాక్సీ ఎం51ను భారతీయ మార్కెట్లో దించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్లు తెలుసుకుంటే... 6.7అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే,  ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్ , ఆడ్రాయిడ్ 10, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3  ప్రొటెక్షన్, 6/ 8జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్, 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉండగా, 64+12+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరాతో పాటు  32 మెగాపిక్సెల్ లెన్స్‌తో సెల్ఫీ కెమెరా కలిగివుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ వుంది. ఇక ధరులు పరిశీలిస్తే.. 6 జీబీ ర్యామ్ వేరియంట్‌  ధర  రూ.24,999 , 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ రూ. 26,999 , సెప్టెంబర్ 18 న మధ్యాహ్నం 12 గంటల నుండి (మధ్యాహ్నం) అమెజాన్, శాంసంగ్.కామ్ , ఇతర రిటైల్ దుకాణాలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్ 18-20 మధ్య అమెజాన్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 2,000 తగ్గింపు ఆఫర్ చేయనుండటం విశేషం. 

Mumbai

2020-09-13 12:27:04

శానిటైజర్ వద్దు..సబ్బులే ముద్దు..!

కరోనా వైరస్ భారత దేశంలో వ్యాపించిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ శానిటైజర్లు విపరీతంగా వాడేవారు. ఈ శానిటైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ అధికంగా వుండటంతో కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా అధికంగానే జరిగేవి. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ శానిటైజర్ వాడకపోయినా నిత్యం సబ్బుతో చేతులు కడుక్కుంటే చాలనే సూచన చేయడం, ఆపై కరోనా వైరస్ పట్ల ప్రజల్లో భయం పోవడంతో క్రమేపీ శానిటైజర్ల వాడకం తగ్గుతూ వస్తుంది. కరోనానను ద్రుష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు విపరీతంగా శానిటైజర్ల వ్యాపారం చేసిన వారంతా ఇపుడు స్టాటు వదిలించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఎవరో సంపన్న కుటుంబాలు, వైద్యులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి కొందరు సిబ్బంది, అధికారులు తప్పా మరెవరూ శానిటైజర్లను వినియోగించడం లేదు. మూడు నెలల క్రితం 100శాతం వినియోగించిన వారంతా ఆ వాడకాన్ని 60శాతం తగ్గించేశారు. దీంతో శానిటైజర్ వినియోగించేవారంతా సబ్బులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గ్లిజరిన్, వేప, నిమ్మ, పెట్రోలియం జెల్లీ లాంటి కాంబినేషన్ సోపులు వినియోగిస్తున్నారు. చాలా మంది ఇంటి దగ్గర కూడా అధికంగా సబ్బునే వినియోగిస్తున్నారు. కానీ సానిజైర్ వాడటం ద్వారా మాత్రమే ముట్టుకోవడం ద్వారా వచ్చే కరోనా వైరస్ ను నియంత్రించడానికి వీలు పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

New delhi

2020-09-13 12:25:21

ఆ 5 రాష్ట్రాల్లోనే కోరోనా అధికంగా వుంది..కేంద్రం

దేశంలో గడిచిన 24 గంటల్లో 95,735  కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 60% ఆరు తీవ్ర ప్రభావిత రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం.  అందులో మహారాష్ట్రలో 23,000 పైగా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో  10,000 కు పైగా కేసులు గుర్తించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా చికిత్స పొందుతున్న మొత్తం బాధితుల సంఖ్య  9,19,018 కి చేరిందన్న కేంద్రం చికిత్సలో ఉన్న వారిలో 74% పైగా కేసులు తీవ్రంగా ప్రభావమున్న 9 రాష్ట్రాలకు చెందినవేనని పేర్కొంది. అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 49% కేసులు చికిత్సలో ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర 2,50,000 మందితో మొదటి స్థానంలో ఉండగా కర్నాటకలోను, ఆంధ్రప్రదేశ్ లోను ఒక్కో రాష్టంలో 97,000 కు పైగా చికిత్స పొందుతూ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 1,172  మరణాలు నమోదు కాగా, నిన్న ఒక్క మహారాష్ట్ర నుంచే 380 మరణాలు నమోదయ్యాయి. 128 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా 78 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.  మొత్తం మరణాలలో 69%  కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావటం కూదా గమనార్హం. అవి మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్.

New Delhi

2020-09-10 20:36:52

ఇక ఉపేక్షించేది లేదు.. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్

‘రఫేల్‌ భారత వైమానిక దళంలోకి చేరడంతో ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని వక్ర దృష్టితో చూసే ధైర్యం చేసేవారికి ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాం. ప్రస్తు త సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఘటన’... ‘ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతల సమయంలో ఐఏఎఫ్‌ చూపించిన సమయస్ఫూర్తిని, నిబద్ధతని ఈ సం దర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. సరిహద్దులో మోహరించిన వాయుసేన దళాలను చూస్తే.. వారు ఏలాంటి పరిస్థితిని ఎదుర్కొగలరని.. భవిష్యత్తులో యుద్ధం సంభ విస్తే.. ఐఏఎఫ్‌ కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని’...రాజ్ నాధ్ సింగ్ ప్రత్యర్ధి దేశాలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. గురువారం అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆలోచనను రేకెత్తించాయి. అంతేకాక  కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రఫేల్‌ రాకను గేమ్‌ చేంజర్‌గా వర్ణించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ సందర్భంగా భారత్ ‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్‌ యుద్ధ విమానాల కోసం భారత్‌ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్‌ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్‌ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం మరింత బలోపేతమైంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫోరెన్స్‌ పార్లీ, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Ambala

2020-09-10 19:49:19

నెగిటివ్ వచ్చినా ఆర్ టి-పిసి ఆర్ పరీక్షలు చేయాల్సిందే..

కోవిడ్ లక్షణాలుండి రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారికి  కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆర్ టి - పిసి ఆర్ పరీక్షలు చేయటం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రి త్వశా ఖ పేర్కొంది. భారత వైద్య పరిశోధనామండలి ( ఐసిఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. రెండు నిర్దిష్ట విభాగా లకు చెందిన వ్యక్తులను ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు జరిపి తీరాల్సిందేనన్న మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసింది.. ఈవిధంగా 1. జ్వరం, దగ్గు, ఊపిరి పీల్చటంలో ఇబ్బంది లాంటి సమస్యలున్న వారి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నెగటివ్ చూపించినప్పుడు... 2. ఎలాంటి లక్షణాలూ లేకపోయినా రాపిడ్ యాంటెజెన్ పరీక్షల్లో నెగటివ్ చూపించినా రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు మొదలైన కేసుల్లోనూ... ఆర్ టి-పిసి ఆర్ చేయాల్సి వుంటుంది... ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఐసిఎంఆర్ ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ లేఖలు రాశాయి. లక్షణాలు కనబడుతున్నా, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన కేసులన్నిటికీ తప్పనిసరిగా ఆర్ టి- పిసిఆర్ పరీక్షలు చేయించాలని ఆ లేఖలో కోరాయి.  ఇలాంటి కేసులు పరీక్షలకు నోచుకోకుండా అలాగే ఉండిపోతే వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. అలా మళ్లీ కచ్చితమైన పరీక్షలు జరపటం ద్వారా పొరపాట్లను తొలిదశలోనే గుర్తించి ఆస్పత్రికి తరలించటమో, ఐసొలేషన్ లో ఉంచటమో సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. కేవలం విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే రాపిడ్ యాంటిజెన్ టెస్టులు తప్ప పూర్తి స్థాయ్తి నిర్థారణకు పనికిరావన్న సంగతి గుర్తించాలని ఆ ఉమ్మడి లేఖలో పేర్కొన్నాయి. ఆర్ టి - పిసిఆర్ ను మాత్రమే అత్యంత ప్రామాణికంగా భావించాలని సూచించాయి.

New Delhi

2020-09-10 19:46:29

కరోనా పాజిటివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ది 2వ స్థానం..

భారత దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 95,735  కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.ఈ కేసుల్లో 60% ఆరు తీవ్ర ప్రభావి త రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హమన్న కేంద్రం  అందులో మహారాష్ట్రలో 23,000 పైగా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో  10,000 కు పైగా కేసులను గుర్తించినట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న మొత్తం బాధితుల సంఖ్య ఈ రోజుకు 9,19,018 కి చేరిందని పేర్కొంది.  చికిత్సలో ఉన్న వారిలో 74% పైగా కేసులు తీవ్రంగా ప్రభావమున్న 9 రాష్ట్రాలకు చెందినవిగా ఉన్నాయని, అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 49% కేసులు చికిత్సలో ఉన్నాయని తెలియజేసింది. ఈ జాబితాలో మహారాష్ట్ర 2,50,000 మందితో మొదటి స్థానంలో ఉండగా, కర్నాటకలోను, ఆంధ్రప్రదేశ్ లోను ఒక్కో రాష్టంలో 97,000 కు పైగా చికిత్స పొందుతూ రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొంది.  గడిచిన 24 గంటల్లో 1,172  మరణాలు నమోదు కాగా, నిన్న ఒక్క మహారాష్ట్ర నుంచే 380 మరణాలు నమోదయ్యాయి. 128 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా 78 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.  మొత్తం మరణాలలో 69%  కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావటం కూదా గమనార్హం. అవి మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాయని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది...

New Delhi

2020-09-10 12:58:04

రఫేల్ రంగ ప్రవేశం..ప్రత్యర్ధి దేశాలకు గుండె కలవరం

రఫెల్ ఈ పేరు వినగానే ప్రత్యర్ధులకు ఒక రకమైన ఉలికిపాటు వస్తుంది... గగణ తలంలో దీని మెరుపుదాడి తట్టుకోవాలంటే గాలికూడా వెళ్లి వారెవరితోనో విన్న విం చుకుంటుంది. అలాంటి శత్రు దుర్భేధ్యమైన ఈ విహంగ సాహసి ఈరోజు భారత వైమానిక దళంలోకి అడుగు పెడుతుంది. ఈరోజు అంబాలా వైమానిక స్థావరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రవేశపెడతారు. రఫెల్ యుద్ధ విమానాలు చూపించే శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్ లు కయ్యానికి కాలు దువ్వుతూ వస్తుండేవి ఎపుడైతే రష్యా నుంచి భారత్ ఈ అసాధారణ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని తెలిసిందో భారత రక్షణ సంపత్తి ఏ పాటిదో అర్ధం చేసుకుంది. అంతేకాదు త్వరలో మరో 36 రఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలోకి రానున్నాయి. ఈమేరకు రష్యాతో భారత్ ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీటిని నడపడానికి, అత్యవసర సమయంలో సమరానికి సిద్ధం చేయడానికి మెరికల్లాంటి ఫైలట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. అంతేకాదు అనుకున్నట్టుగా భారత్ మరో 36 రఫెల్ యుద్ధవిమానాలకు రష్యాకి ఆర్ఢర్ దారి సుగమం అయితే...మరింత మంది ఫైలట్లను సిద్ధం చేస్తుంది భారత్, ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు త్రివిధ దళాలను పూర్తిస్థాయిలో సమాయాత్తం చేయడంతోపాటు, మన రక్షణ సంపద ప్రపంచంలోనే మేటిగా తయారు చేయాలన్నది భారత్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. ఇప్పటికే చాలా వరకూ మన త్రివిధ దళాలు సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా భారత్ కొన్ని మిత్రదేశాలతో అన్ని రకాల కవాతులు చేస్తూనేవస్తోంది.  ఈ క్రమంలోనే రఫేల్ భారత వాయుసేనలోకి అడుగుపెడుతున్న వేళ దేశం మొత్తం వీటినే చూస్తుంది...

Ambala

2020-09-10 12:29:30

రియల్ హీరో సోనూసూద్ ఫాలోవర్స్ ఎంతో తెలుసా...

ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడు అని అందరూ అనడమే తప్పా ప్రపంచం మొత్తం అలాంటి వ్యక్తిని ఒకేసారి చూడాల్సి వస్తే అది సోనూ సూద్ అని మాత్రమే చెబుతున్నారు నెటిజన్లు. అంతేకాదు సోనూ చేసే సేవలకు ఫిదా అయిపోయి ఆయనను విపరీతంగా ట్విట్టర్ లో ఫాలో చేస్తున్నారు. దీంతో సోనూసూద్ ఫాలోవర్ల సంఖ్య 3.7 మిలియన్స్ చేరుకుంది. అటు ఫేస్ బుక్ అయితే 12 మిలియన్స్ ఫాలోవర్స్ దాటిపోయింది. ఈ ఏడాది చివరిలోపు ఆ సంఖ్య 4 మిలియన్లకు చేరుకుం టుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా, దానిని తీర్చేందుకు సోనూసూద్ ముందుకి రావడంతో ఇప్పటికే లెక్కలేనంత మందికి మేలు జరిగింది. ఎన్నో వందల మంది కరోనా సమయంలో సోనూ సహాయంతో వారి గ్రామాలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులతో పాటు అన్నిరకాల సేవలు కరోనా సమయంలో ప్రపంచంలో ఏఒక్కరూ చేయలేని తలకుమించిన సహాయాన్ని చేశారు సోనూసూద్.  చాలా మీడియా సంస్థలు కూడా ఈయన సేవలను విశ్వవ్యాప్తం చేశాయి. ప్రపచంలో కరోనాలో సహాయం చేసిన ఒకే ఒక్కడు ఎవరు అంటే ఏకాలంలో వినిపించే పదం సోనూసూద్ అంతా ఆయన సేవలు ప్రజల మనస్సులను తాకాయి. అలాంటి వ్యక్తికి ఓ రకంగా ఈ ఫాలోవర్స్ తక్కువనే చెప్పాలి. కానీ ఆయన విషయం తెలుసుకొని ఫాలోచేసిన వారి సంఖ్యే ఇది. ఆండ్రాయిడ్ ఫోన్లువాడుతున్నప్పటికీ సోనూను ఎలా ఫాలో చేయాలో తెలియక చాలా మంది చేయలేదు. అదే తెలిసి వుంటే మాత్రం ఆ సంఖ్య ఎంత వరకూ చేరేదో మీరే ఆలోచించొచ్చు..అవునా...!

Mumbai

2020-09-06 10:15:27

సిక్కింలో చైనా పౌరులను రక్షించిన భారత సైనికులు..

ఉత్తర సిక్కింలో, 17,500 అడుగుల ఎత్తులో దారి తప్పిపోయిన ముగ్గురు చైనా పౌరులను భారత సైనికులు రక్షించారు. ఈనెల 3వ తేదీన ఈ సంఘటన జరిగిన ప్పటికీ కేంద్ర రక్షణ శాఖ ఈరోజు ప్రకటించింది. దారి తప్పిపోయిన ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో వారి ప్రాణాలకు ప్రమాదాన్ని గుర్తించిన భారత సైనికులు తక్షణం వారికి వైద్య సాయం, ఆహారం, వెచ్చటి దుస్తులు అందించారు. వారు కోలుకున్న తర్వాత, గమ్యస్థానం చేరడానికి సరైన మార్గం చెప్పి సురక్షితంగా పంపించారు. తమకు తక్షణ సాయం అందించినందుకు భారతదేశానికి, భారత సైనికులకు చైనా పౌరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము అనుకోకుండా దారితప్పిపోయాం. ఈ సమయంలో సైనికులు అందించిన సహాయం ఎప్పటికీ మరువలేమని చెప్పారు. చైనా-భారత్ మధ్య ఘరం ఘరంగా ఉన్న సమయంలోనూ భారత్ చైనా పౌరులను కాపాడటం పట్ల...సోషల్ మీడియాలో సైనికుల సహాయానికి విపరీతంగా అభినందనలు లభిస్తున్నాయి.

New Delhi

2020-09-05 20:00:27

మోహ్రం, వినాయక నిమజ్జనాల నిర్వహణ భేష్...

హైదరాబాద్‌ జంటనగరాల్లో మొహర్రం ఊరేగింపు, గణేష్‌ నిమజ్జనం శాంతి యుతంగా జరగడంలో పోలీసుల పనితీరుభేష్‌గా ఉందని హోంమంత్రి మహమూద్‌అలీ ప్రశంసించారు. శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ, ప్రజలు స్నేహపూర్వక కార్యక్రమాలలో తెలలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నారని అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందదర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, నేరాలను గుర్తించడం, ట్రాఫిక్‌ నిర్వహణ, సైబర్‌ నేరాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం సమర్ధవంతంగా ఉపయోగించుకోవడాన్ని మంత్రి ప్రశంసించారు. పోలీస్‌శాఖలో కరోనా వైరస్‌ కారణంగా చర్యలను, పోలీస్‌ సిబ్బంది , అధికారులు కరోనా బారిన పడకుండా కాపాడ్డం, కరోనాను ఎదుర్కొనేందుకు యోధులుగా విధులను నిర్వహిస్తున్న పోలీస్‌ అదికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈనేపధ్యంలోనే ప్లాస్మా దానంపై ప్రచారం ప్రారంభించినందుకు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సహకారంతో ప్లాస్మా బ్యాంక్‌ను స్థాపించడంలో చురుకైన, సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్‌కమిషనర్‌ సజ్జనార్‌ను హోంమంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, అదనపు కమిషనర్‌ (నేరాలు) శిఖాగోయల్‌, అదనపు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌, రాచకొండ అడిషనల్‌కమిషనర్‌ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Hyderabad

2020-09-04 19:30:40

ప్రభుత్వ కరోనా లెక్కలపై తెలంగాణ హైకోర్టు సీరియస్...

తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న బులిటెన్లకి, జరుగుతున్న మరణాలకు చాలా వ్యత్యాసం వుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం హైకోర్టులో కరోనా పరిస్థితులపై జరిగిన విచారణ లో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ‘‘ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉంది. జిల్లాల్లో కరోనా వైద్య సదుపాయాలు పెంచాలి. కరోనా మృతుల సంఖ్యపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోంది. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉంది. అని పేర్కొంది.  మృతుల సంఖ్యపై వాస్తవ వివరాలు వెల్లడించాలన్న హైకోర్టు జిల్లా స్థాయి బులిటెన్లపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 4వరకు జిల్లా బులిటెన్లు ఇవ్వాలి’’ అని  రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Hyderabad

2020-09-04 15:42:57