గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ 2024వ సంవత్సరానికల్లా మంచినీటి ట్యాప్ కనెక్షన్లు కల్పించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ (జె.జె.ఎ.) కార్యక్రమాన్ని చేపట్టి నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు కేవలం వంద రోజుల తక్కువ వ్యవధిలో పైపుల ద్వారా మంచినీరు అందించే ప్రత్యేక బృహత్ కార్యక్రమాన్నిఅక్టోబరు 2న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చిన్నారులకు సురక్షిమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న గొప్ప సంకల్పంతో కూడిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో కేంద్ర మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా శుద్ధమైన నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రధాని ఇదివరకే అంటే 2020 సెప్టెంబరు 29న ప్రకటించారు. ఆ రోజున, జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) కింద గ్రామ పంచాయతీలకు, పానీ సమితులకు ‘మార్గదర్శిక’ విడుదల సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలకు పైపుల ద్వారా మంచినీరు కల్పించే ఈ పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవలసిందిగా వివిధ రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు చిన్న పిల్లలకు సోకే అవకాశం ఎక్కువ కాబట్టి అంగన్ స్కూళ్లకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఆరోగ్య రక్షణ కేంద్రాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందించే కార్యక్రమం కోసం జలజీవన్ మిషన్ లో తగిన ఏర్పాటు చేసినట్టు కూడా ప్రధాని చెప్పారు. గ్రామాల్లోని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛమైన నీటిని అందించే అంశంపై తీర్మానాల ఆమోదానికి సాధ్యమైనంత త్వరగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ సదుపాయాలను గ్రామ పంచాయతీలు, పంచాయీతీల సబ్ కమిటీలు, (గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలు, లేదా పానీ సమితులు) నిర్వహించవలసి ఉంటుంది. చిన్నారుల ఆరోగ్యానికి, వారి బహుముఖ అభివృద్ధికి దోహదపడేలా వారికి సురక్షిత నీటిని అందించేందుకు ఈ కార్యక్రమ రూపంలో పెద్దఎత్తున కృషి చేయనున్నారు. మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా ఇది ‘జాతిపిత’కు అందించే సరైన నివాళిగా పరిగణిస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు బుధవారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన కామాక్షి శంకర్ ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలో టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ధర్మప్రచారంలో భాగంగా టిటిడి చేపడుతున్న సుందరకాండ, వేదపారాయణం, భగవద్గీత, విరాటపర్వ పారాయణం చాలా బాగున్నాయని ఈ సందర్భంగా దాత అభినందించారు. స్వామివారి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజలకు టిటిడి ఎస్వీబీసీ ద్వారా అన్ని భాషల్లో చేరేందుకు చర్యలు తీసుకోవాలి దాతలు కోరారు. స్వామివారికి జరిగే అన్ని సేవలు సమస్త ప్రజలకు తెలియాలని, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపైనా ఉండాలన్న వారు ఎస్వీబీసీ ద్వారా ఎందరో శ్రీవారి భక్తులు స్వామికోసం తెలుసుకోవడానికి వీలుపడుతుందన్నారు. అన్ని బాషల్లో ప్రసారాలు చేయడం ద్వారా దేశంలోని అన్ని వర్గాలకు స్వామి చేరువ అవుతారని అన్నారు. అనంతరం దాత శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వసంతమండపంలో జరుగుతున్న షోడషదిన సుందరకాండ పారాయణ దీక్షలో పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవారికి ప్రతినెలా జరిగే పౌర్ణమి గరుడసేవ అక్టోబరు 1న గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా, అక్టోబరు నెలలో శ్రీ మలయప్పస్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా నెల ప్రారంభంలో అక్టోబరు 1న, చివరిరోజైన అక్టోబరు 31న, అదేవిధంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నుద్రుష్టిలో ఉంచుకొని ముఖ్యమైన అర్చకులు ఆలయంలోని ప్రధాన శాఖ అధికారులు తప్పా,మరెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతించలేదు. పైగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ముందస్తు చర్యలు తీసుకుంటూనే స్వామివారికి నిర్వహించే ఉత్సవాలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. కార్యక్రమాలన్నీ ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది..
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల శాఖ కింద ఉండే మధ్యప్రదేశ్ లోని రాఘోగడ్ కి చెందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటిఐ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యం పెంచి భారీ పరిశ్రమలలోను, ప్రాసెసింగ్ యూనిట్లలోను ఉద్యోగావకాశాలను అందుకోగలిగేలా ఉద్యోగ సామర్థ్యం పెంచటానికి శిక్షణ ఇవ్వటం ఈ ఒప్పంద లక్ష్యం. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ లాంటి వృత్తి విభాగాలలో యువతకు శిక్షణ ఇవ్వటానికి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా యువతకు రెండు రకాల శిక్షణనిస్తారు. ఆరు నెలలపాటు ఐటిఐ లో థియరీ నేర్చుకోవటంతో బాటు ఎన్ ఎఫ్ ఎల్ విజయ్ పూర్ యూనిట్ లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. మొత్తంగా శిక్షణ మొత్తం ఐటిఐ సిలబస్ ప్రకారం సాగుతుంది. అయితే అందులో భాగంగా ఆరు నెలలపాటు పరిశ్రమలో పనిచేసిన అనుభవం పొందుతారు. ఎన్ ఎఫ్ ఎల్ యూనిట్ ఈ అవకాశం కల్పిస్తుంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కు అమ్మోనియా ఆధారిత యూరియా తయారీ యూనిట్లు ఐదు ఉన్నాయి. వాటిలో పంజాబ్ లో నంగల్, బఠిండా లలోను, హర్యానాలో పానిపట్ లోను, మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా విజయ్ పూర్ లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఎన్ ఎఫ్ ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జగదీప్ షా సింగ్ సమక్షంలో ఎన్ ఎఫ్ ఎల్ విజయ్ పూర్ యూనిట్ చీఫ్ మేనేజర్ (హెచ్ ఆర్) నరేందర్ సింగ్, రాఘోగడ్ ఐఐటి ప్రిన్సిపాల్ జెపి కోలి ఈ ఒప్పందం సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. స్కిల్ ఇండియాకు ఊతమిచ్చేందుకు చుట్టుప్రక్కల ఉన్న మరిన్ని సంస్థలకు చెందిన యువతతో ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని కంపెనీ భావిస్తోంది.
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ తాత్వికత అయిన ఆరోగ్య స్వావలంబన ద్వారా సంపూర్ణ స్వావలంబన సంధించడం అనే అంశం పై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాచురోపతి (ఎన్ఐఎన్) వరుస వెబినార్లను నిర్వహించనుంది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వెబినారు్ల నవంబర్ 18, నేచురోపతి డే వరకు సాగుతాయి. మనందరికీ సులభంగా అందుబాటులో ఉన్న సరళమైన సహజ (ప్రకృతి) పద్ధతులను అవలంబించడం దా్వరా ప్రజలు తమ ఆరోగ్యానికి తామే బాధ్యత తీసుకోవచ్చనే సందేశాన్ని ఈ వెబినార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాయని కేంద్ర ఆయుష్ విభాగం పేర్కొంది. ప్రకృతి వైద్య పద్ధతులనుతారి్కకంగా నిరూపించడం ద్వారా ప్రజలలో ప్రకృతి వైద్యం పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. లైవ్ చాట్ల ద్వారా, ఆ వృత్తిని అవలంబిస్తున్న వారితో చర్చల ద్వారా ఫీడ్ బ్యాక్ తో సెషన్లను బలోపేతం చేయనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమై 48 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమం రోజుకు ఒక గంటపాటు, అది కూడా భారతీయ కాలమానం (ఐఎస్‌టి) ప్రకారం నిర్ధిష్ట సమయంలో జరుగుతుంది. నవంబర్ 18న నేచురోపతీ దినోత్సవం సందర్భంగా వర్చువల్ వెబినార్లు ముగియన నున్నాయి. ఇదే రోజున మహాత్మా గాంధీ ఆలిండియా నేచర్ క్యూర్ ఫౌండెషన్ ట్రస్టుకు జీవితకాల చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుని, అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి వైద్య ఉపయోగాలను, లాభాలను అందించే లక్ష్యంతో ఒక ఒప్పందంపైఔ సంతకం చేశారు. వెబినార్లతో పాటుగా కాలేజీ, పాఠశాల విద్యార్దులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు, సాధారణ ప్రజలకు సోషల్ మీడియాలో పోటీలు నిర్వహించనున్నారు. అలాగే అంతర్జాతీయ గాంధేయ సంస్థలైన మహాత్మా గాంధీ కెనెడియన్ ఫౌండేషన్ ఫర్ వరల్్డ పీస్, జర్మనీకి చెందిన గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్, మహాత్మా గాంధీ సెంటర్ ఫర్ గ్లోబల్ నాన్ వయొలెన్్స వర్జీనియా, యుఎస్ఎ, యుటిఎస్, సిడ్నీ, ఆస్ర్టేలియాకు చెందిన ప్రముఖ వక్తలు కూడా ఇందులో పాల్గొననున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీలో శీతాకాలపు నెలల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వాయు కాలుష్యం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పౌరులు కలసికట్టుగా కృషి చేయవలసి ఉంటుందన్నారు. మంగళవారం ఈమేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వాయు కాలుష్యంపై ఢిల్లీతోపాటు, దాని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పర్యావరణ శాఖా మంత్రుల వర్చువల్ సమావేశం అక్టోబరు 1న నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే మొదట సదరు సమస్యను గుర్తించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో గాలి నాణ్యతా సూచికను ప్రారంభించారని చెప్పారు. వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, కాలుష్యాన్ని నియంత్రణకు విధానపరమైన చర్యలు తీసుకునేలా తగిన సూచనలు చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. న్యూఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యానికి వాతావరణ సంబంధమైన కారణాలున్నాయని మంత్రి వివరించారు. గాలి, వాయు ప్రసరణ సరిగా లేకపోవడమే ఢిల్లీలో గాలి నాణ్యతను దెబ్బతీస్తోందన్న మంత్రి శీతాకాలాల్లో చలిగాలి, పొడిగాలులు, మైదానం ఉపరితలంపై మంద్రస్థాయి గాలుల కారణంగా ఢిల్లీ నగరంలో గాలి స్తబ్దుగా ఉండిపోతోందన్నారు. శీతాకాలాల్లో దేశం ఉత్తరాది నుంచి, వాయవ్య దిశనుంచి తూర్పు దిశగా వీచే గాలులు చివరకు తీవ్రమైన కాలుష్యానికి, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. వాయుకాలుష్యం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తీసుకున్న చర్యలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. బందార్ పూర్ విద్యుత్ ప్లాంట్.ను మూసివేయడం, సోనీపట్ విద్యుత్ ప్లాంట్.ను దశలవారీగా నిలిపివేయడం, తక్కువ కాలుష్యం వెదజల్లే బి.ఎస్.-VI వాహనాలను ప్రవేశపెట్టడం, ఇంధన ప్రమాణాలను నిర్దేశించడం, ఢిల్లీ చుట్టూ ఎక్స్.ప్రెస్.వే రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం, విద్యుత్ వాహనాలకు సబ్సిడీ సదుపాయం కల్పించడం తదితర చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు.