1 ENS Live Breaking News

గ‌జ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం..

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురు‌‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయ ప్పస్వామివారు గ‌జ వాహ‌నంపై క‌టాక్షించారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన శుక్ర‌వారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌న‌మిస్తారు. వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌శాంతి, డా.నిశ్చిత‌,శేఖ‌ర్ రెడ్డి,  గోవింద‌హ‌రి,  డిపి అనంత‌, ఆలయ డెప్యూటి ఈఓ  హరీంద్రనాథ్, పేష్కార్  జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2020-09-24 20:57:23

2020-09-24 20:55:42

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈఓ  పి.బసంత్ కుమార్, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డా.నిశ్చిత‌,  శివకుమార్,  గోవింద‌హ‌రి,  డిపి.అనంత తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2020-09-24 20:54:08

నిలకడగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది.. గత శనివారం నుంచే కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నారు. ఇంకా వెంటిలేటర్‌ మీదనే ఉండి చికిత్స తీసకుంటున్నారని చెప్పారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సి ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయన్నారు. ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 20 నిమిషాలు ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని వివరించారు. ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. . ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్‌కేర్‌లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ ఇస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.  ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌ వచ్చిన దగ్గర చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అభిమానుల కోసం చరణ్ ప్రతీ వారానికి ఒకసారి తన తండ్రి బాగోగులను వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

Chennai

2020-09-23 13:01:17

6నెలల్లో 13244 అత్యాచార ఫిర్యాదులు..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదించిన ప్రకారం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) లో 01.03.2020 నుంచి 18.09.2020 వరకు చిన్నపిల్లలపై నమోదైన మొత్తం అశ్లీలత / అత్యాచారం మరియు సామూహిక అత్యాచార ఫిర్యాదులు 13244 అందుకుంది.  నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) నివేదించిన ప్రకారం, ఎన్‌సిపిసిఆర్ 2020 మార్చి 1 నుండి 2020 ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్ పోర్టల్స్, హెల్ప్‌లైన్స్ మరియు ఇతర మీడియా ద్వారా 420 పిల్లల లైంగిక వేధింపుల సమాచారాన్నినమోదు చేసింది. చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ (సిఐఎఫ్) నివేదించిన ప్రకారం, 2020 మార్చి 1 నుండి 2020 సెప్టెంబర్ 15 వరకు పిల్లల లైంగిక కేసులకు సంబంధించి 3941 కాల్స్ సిఐఎఫ్‌కు వచ్చాయి ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పోక్సో చట్టం అమలును పర్యవేక్షించాల్సిన చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్), పిల్లల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర కమిషన్ (ఎస్‌సిపిసిఆర్‌లు) సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్‌ను అభివృద్ధి చేసి, www.ncpcr.gov.in లో అందుబాటులో ఉంచాయని పేర్కొన్నారు.

New Delhi

2020-09-22 20:54:51

24 గంటల్లో లక్షకు పైనే కోవిడ్ నుంచి కోలుకున్నారు..

భారత్ లో ఒకే రోజు కనీవినీ ఎరుగని రీతిలో  కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో లక్షమందికి పైగా (1,01,468) కోవిడ్ నుంచి కొత్తగా కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వరుసగా 4 రోజులుగా కొనసాగుతున్న ధోరణికి అనుగుణంగానే ఈ విధమైన పెరుగుదల నమోదు చేసుకోవటం చరిత్రాత్మకమైనదిగా భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 45 లక్షలు (44,97,867) చేరింది. ఈ ఎదుగుదల కారనంగా కోలుకున్నవారి శాతం 80.86కు చేరినట్టయింది. కొత్తగా కోలుకున్న కేసులలో దదాపు 70% పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్.   వీటిలో మహారాష్ట్ర అన్నిటికంటే ఎక్కువగా 32,000 కేసులు ( 31.5%) కోలుకున్నట్టు నమోదు చేయగా ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు కోలుకున్నవారి సంఖ్య 10,000 మందికి పైగా ఉంది. ఈ విధంగా భారతదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతు ఉండటంతో ప్రపంచస్థాయిలో కూడా ఎక్కువమంది కోలుకున్న దేశంగా నిలిచింది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు కోలుకోవటానికి ప్రధాన కారణం కేంద్రం అనుసరిస్తున్న వైద్య విధానాలే కారమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది...

New Delhi

2020-09-22 14:59:42

రేపు 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు..

కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో చేప‌డుతున్న చ‌ర్య‌లు, ఆ వ్యాధి సంక్ర‌మ‌ణ ను అరిక‌ట్ట‌డానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్య‌మంత్రులతో, ఆరోగ్య శాఖ మంత్రుల రేపు జరిగే జరిగే  ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్సులో  ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోదీ మాట్లాడనున్నారని పీఎంఓ తెలియజేసింది. ఈ రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల లో మ‌హారాష్ట్ర, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, త‌మిళ నాడు, పంజాబ్ లతో పాటు దిల్లీ కూడా ఉంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల లో 63 శాతానికి పైగా కేసులు ఈ 7 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతం లోనే కేంద్రీకృతమవుతున్నాయి. అంతేకాదు, నిర్ధార‌ణ అయిన మొత్తం కేసుల లో 65.5 శాతం కేసులు, మొత్తం మ‌ర‌ణాల లో 77 శాతం మ‌ర‌ణాలు కూడా ఈ 7 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనే ఉండటం విశేషం.  ఇత‌ర 5 రాష్ట్రాల‌ తో పాటు, పంజాబ్‌, దిల్లీ లలో బ‌య‌ట‌ప‌డుతున్న కేసులు ఇటీవలి కాలంలో  పెరుగుతున్నాయి.  మ‌హారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీ ల‌లో కేస్ ఫాట‌లిటీ రేట్ (సిఎఫ్ఆర్) 2.0 శాతం గా కంటే ఎక్కువ‌గా ఉంది.  పంజాబ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లు మిన‌హా, వాటి పాజిటివిటీ రేటు జాతీయ స‌గ‌టు అయిన 8.52 శాతం క‌న్నా మించిపోయింది. ఈ విషయాలపై మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడతారని పిఎంఓ పేర్కొంది...

New Delhi

2020-09-22 14:43:14

గగణతలంలో మహిళా శౌర్యం చూపిస్తాం..

ఆడది ఆకాశంలో సగం..అవును ఈ ఇద్దరు మహిళా పైలట్లను చూస్తే నిజమనే జాతిగర్వం ఆకాశమంత పెద్దదిగా అనిపిస్తుంది. భారత నౌకాదళంలో చారిత్రలోనే తొలిసారిగా అత్యాధుని ఎంహెచ్ 60 హెలీకాఫ్టర్లులో పనిచేయానికి భారత నావికాదళం వీరిని నియమించింది. యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు త్వరలోనే అడుగు పెట్టనున్నారు. భారత నావికాదళంలో ఎందరో మహిళా ర్యాంకర్ అధికారిణులున్నప్పటికీ, అన్ని పరీక్షలు నెగ్గి, పురుషులకు తామేమీ తక్కువ కాదంటూ గగణ తల వీరత్వానికి సిద్దమయ్యారు. ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి. అలాంటి విహంగాలు తాము చెప్పినట్టు నడుస్తాయని ఎంతో ఠీవీగా చెబుతున్నారు ఈ భారతీయ మహిళా మణులు. గతంలోనే ఇండియన్ నేవీలోని అన్ని విభాగాల్లో మహిళలను కూడా దించాలనే కేంద్రం ఆలోచన పెద్దగా ఫలించలేదు. దానికి కారణం పురుషులకే తక్కువగా ఉండే బాత్ రూమ్ లు, మహిళలకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఎలా నెట్టుకొస్తారని కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే ఇపుడు యుద్ధ నౌకల్లో మహిళలు కూడా రాణించగలరని సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు రుజువు చేశారు. అంతేకాదు రఫేల్ యుద్ద విమానంలో కూడా ఒక మహిళా పైలట్ ను నియమించాలనే కేంద్రం ఆలోచన చేస్తున్న వేళ వీరి గ్రాండ్ ఎంట్రీ దానికి బలాన్ని చేకూర్చింది. యుద్ధనౌకల్లో వీరి ఎంపికతో మరెందరో మహిళలు ఇండియన్ నేవీలోకి అడుగిడతారనడానికి వీరే ప్రధాన సంకేతంగా నిలుస్తున్నారు.

Mumbai

2020-09-21 15:28:47

హౌరా-జగదల్ పూర్ మద్య పార్శల్ ఎక్స్ ప్రెస్..

నిత్యావసర వస్తువులను నిరంతరంగా సరఫరా చేయడానకి రైల్వే సోమవారం నుంచి హౌరా- జగదల్పూర్ మధ్య టైమ్ టేబుల్డ్ పార్సెల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఎకె.త్రిపాఠి చెప్పారు. సోమవారం ఆయన రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ రైలు హౌరా-జగదల్పూర్ (రైలు నంబర్ 00805) నేని నుంచి 21.20 గంటలకు సోమవారం, గురువారాలు హౌరా నుండి బయలుదేరుతుందని చెప్పారు. అటు జగదల్పూర్-హౌరా (రైలు నం. 00806) బుధవారం, శనివారం 06.00 గంటలకు జగదల్పూర్ నుంచి బయలుదేరుతుందని చెప్పారు. ఈ రైళ్లు మేచెడా, పన్స్కురా, ఖరగ్‌పూర్, టాటానగర్, చక్రధర్‌పూర్, రూర్కెలా, జార్సుగూడ, సంబల్పూర్, బార్గర్ రోడ్, బాలంగీర్, టిట్లఘర్, కేసింగా, రాయగడ, హౌరా మరియు జగదల్‌పూర్ మధ్య కొరాపుట్ వద్ద  ఆగుతుందన్నారు. అంతేకాకుండా ఐదు పార్శిల్ వ్యాన్లు తోపాటు రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు ఈ రైలులో వుంటాయని చెప్పారు. పైగా ఈ సర్వీసులకు సంబంధించి ఎలాంటి సహాయానికైనా కవితా నేగి, జగదల్పూర్ -6396664727,కె నాగ్- కోరాపుట్- 8763091271,జె బి కిరో-రాయగడ -7979922507 నెంబర్లలో సంప్రదించవచ్చునని చెప్పారు. సరుకు రావాణా చేయాలనుకున్న వ్యాపారస్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిసిఎం తిప్రాఠి కోరారు.

వాల్తేరు రైల్ భవన్

2020-09-21 13:57:15

రైతుల చేతికే అధికారం వస్తుంది..ప్రధాని మోదీ

భారత వ్యవసాయ రంగ చరిత్రలో ఇదో శుభదినం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు ఆమోదం పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయన్న మోదీ కోట్ల మంది రైతులకు చేతికి అధికారం వస్తుందని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కీలక బిల్లుల ఆమోదం అనంతరం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘దేశ వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం. ఈ బిల్లులు వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు కోట్లాది రైతుల చేతికి అధికారం ఇస్తుంది. దశాబ్దాలుగా రైతు సోదరసోదరీమణులు మధ్యవర్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లులు వారికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తాయి. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మా ప్రయత్నాలకు ఈ బిల్లులు దోహదపడతాయి. అంతేకాదు, మన వ్యవసాయ రంగానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. వీటితో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. దీంతో దిగుబడి పెరగడమే కాక.. మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇకపైనా రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కొనసాగిస్తామని, ప్రభుత్వం నుంచి పంటల సేకరణ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేయడానికే తాము ఉన్నామని, వారికి మెరుగైన జీవనం అందించడమే తమ లక్ష్యమని వివరించారు.

New Delhi

2020-09-20 20:52:46

దేశవ్యాప్తంగా గ్రామపంచాయతీలు డిజిటలైజేషన్..

గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పించే ఉద్దేశ్యంతో.. పంచాయతీలను డిజిటలైజేషన్ చేసి బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది.  ఈమేరకు  'ఈ-గ్రామ్ స్వరాజ్' అనే పోర్టల్‌ను (https://egramswaraj.gov.in/) అభివృద్ధి చేసింది. గ్రామ పంచాయతీలలో చేప‌ట్టిన పనుల సమర్థవంతమైన పర్యవేక్షణ, మూల్యాంకనకు ఈ పోర్ట‌ల్ దోహ‌దం చేయ‌నుంది. 'ఈ-గ్రామ్ స్వరాజ్' గ్రామ పంచాయతీల ప్రణాళిక, అకౌంటింగ్ మరియు పర్యవేక్షణ విధులను ఏకీకృతం చేస్తుంది. ఇది ఏరియా ప్రొఫైలర్ అప్లికేషన్, లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) మరియు పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో (పీఎఫ్‌ఎంఎస్) కలిపి గ్రామ పంచాయతీ కార్యకలాపాలను సులభంగా నివేదించడానికి, ట్రాక్ చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. పంచాయతీ యొక్క పూర్తి ప్రొఫైల్, పంచాయతీ ఆర్థిక వివరాలు, ఆస్తుల‌ వివరాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ద్వారా చేప‌ట్టిన‌ కార్యకలాపాలు, ఇతర మంత్రిత్వ శాఖలు / శాఖల నుండి తీసుకున్న పంచాయతీ సమాచారం, జ‌నాభా లెక్క‌లు-2011, ఎస్ఈసీసీ డేటా, మిషన్ అంత్యోదయ సర్వే నివేదికల‌ను గురించి తెలుసుకొనేందుకు ఇది ఒక ఏకగ‌వాక్షంగా కూడా పని చేస్తుంది. 2020-21 సంవత్సరానికి సుమారు 2.43 లక్షల గ్రామ పంచాయతీలు ఈ-గ్రామ్ స్వరాజ్ పై తమ జీపీడీపీని ఖరారు చేశాయి. ఇంకా, సుమారు 1.24 లక్షల గ్రామ పంచాయతీలు ఈ-గ్రామ్ స్వరాజ్ ఆన్‌లైన్ చెల్లింపు మాడ్యూల్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపాయి.

New Delhi

2020-09-20 20:34:33

3.82 లక్షల కంపెనీలు రద్దు..అందుకేనా..

దేశంలో గ‌డిచిన మూడేళ్ల‌ కాలంలో మొత్తం 3,82,581 డొల్ల కంపెనీలు తొలగించామని కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వ క సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి  అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో డొల్ల (షెల్‌) కంపెనీలను గుర్తిం చడం వాటిని ర‌ద్దు చేయ‌డానికి గాను ప్ర‌భుత్వం ప్ర‌త్యేక డ్రైవ్‌ను చేప‌ట్టింది. వ‌రుస‌గా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి ఆర్ధిక వివ‌రాల నివేదిక‌లు(ఎఫ్ఎస్) దాఖలు చేయకపోవడం ఆధారంగా ఈ కంపెనీలు గుర్తించబడ్డాయి.కంపెనీల చట్టం, 2013 లోని సెక్షన్ 248 ప్రకారం అందించిన నిర్ధ‌ష్ట చట్టబ ద్ధమైన ప్రక్రియను అనుసరించిన తరువాత కంపెనీల నియ‌మాలు, 2016 (కంపెనీల రిజిస్టర్ నుండి కంపెనీల పేర్లను తొలగించడం) మేర‌కు గ‌డిచిన మూడేళ్ల‌ కాలంలో మొత్తం డొల్ల కంపెనీలు తొలగించామని పేర్కొన్నారు. దేశంలో డొల్ల (షెల్‌) కంపెనీలను గుర్తించడం వాటిని ర‌ద్దు చేయ‌డానికి గాను ప్ర‌భుత్వం ప్ర‌త్యేక డ్రైవ్‌ను చేప‌ట్టిందని కూడా వివరించారు...

New Delhi

2020-09-20 20:20:39

24 గంటల్లో 94వేల మంది కోలుకున్నారు..

దేశంలో వ‌రుస‌గా రెండో రోజు కూడా 94,000 మందికి పైగా గ‌రిష్ఠ‌స్థాయిలో కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గ‌త 24 గంట‌ల‌లో దేశఃలో 94,612 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 43 ల‌క్ష‌లు (43,03,043) దాటింది. ఫ‌లితంగా రిక‌వ‌రీ రేటు 79.68 శాతానికి చేరింది. కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న కేసుల‌లో 60 శాతం మంది మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్రప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన‌వారు. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 23,000 మందికి పైగా కొత్త కేసులు కోలుకున్నాయి. ఒక్క‌రోజు 10,000 మందికి పైగా కోలుకున్న రాష్ట్రాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,క‌ర్ణాట‌క లు ఉన్నాయి.  గత 24 గంట‌ల‌లో మొత్తం 92,605 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. 52 శాతం కొత్త కేసులు ఐదు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఇవే రాష్ట్రాలు గ‌రిష్ట స్థాయిలో కొత్త‌గా కొలుకున్న‌ కేసులు కూడా క‌లిగి ఉన్నాయి. 20 వేల‌కు పైగా కొత్త కేసులు మ‌హారాష్ట్ర‌లో (22.16 శాతం) న‌మోద‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,క‌ర్ణాట‌క రెండూ 8,000కు పైగా కేసులు న‌మోదుచేశాయి. కాగా గ‌త 24 గంట‌ల‌లో 1,133 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.

New Delhi

2020-09-20 19:58:33

రైల్వేలో 9.79లక్షల పని దినాలు కల్పన

కేంద్రం ప్రవేశఫెట్టిన గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకం కింద 2020వ సంవత్సరం సెప్టెంబరు 18కల్లా  6 రాష్ట్రాల్లో 9,79,000కిపైగా పనిదినాలు కల్పించినట్టు భారతీయ రైల్వే పేర్కొంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకం అమలు జరుగుతోందన్న రైల్వే  ఈ పథకం కింద చేపట్చిన పనుల ప్రగతిని, ఆయా రాష్ట్రాల వలసకూలీల కోసం ఉపాధి పనుల కల్పన తీరును రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ నిశితంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారని తెలియజేసింది. రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించిన దాదాపు 164 ప్రాజెక్టులను  ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలుకోసం 2020వ సెప్టెంబరు 18కల్లా 12,276 మంది కార్మికులను వినియోగించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుకోసం 2,056.97కోట్ల రూపాయలు విడుదలైంది. ఈ పథకం అమలులో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పూర్తి స్థాయి సమన్వయం కోసం ప్రతి జిల్లాకు, రాష్ట్రానికి నోడల్ అధికారులను కూడా నియమించారు.

New Delhi

2020-09-20 19:56:04