ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో రథాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. బుధవారం ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయంలోని అమ్మవారి వెండి రథాన్ని దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జనరావుతో కలిసి మంత్రి వెలంపల్లి పరిశీలించారు. ఈ తనిఖీలో అమ్మవారి వెండిరధంపై మూడు సింహాలు కనిపించడం లేదని తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించడంలేదని, గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందన్నారు.ఈ ఘటనపై దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నామని, ఆకమిటీ విచారణ చేసి నిజాలు నిగ్గు తేలుస్తుందన్నారు. రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని మంత్రి తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని కానీ అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి ఏకాం తంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అయ్యవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం రాత్రి యాగశాలలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరిం టెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, అర్చకులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మీడియా తో మాట్లాడుతూ సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అధికమాసం కారణంగా అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల మార్గదర్శకాల ప్రకారం టిటిడి ధర్మకర్తల మండలి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తీర్మానించినట్లు వివరించారు. ఇందుకోసం జీయ్యర్ స్వాములు, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులతో చర్చించి సాంప్రధాయ బద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఏప్పటికప్పుడు సమీక్షించుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి రోజు దాదాపు 12 వేల మంది భక్తులు సంతృప్తి కరంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో ఏకాంతంగా జరిగే వాహనసేవలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 23వ తేదీ సాయంత్రం గరుడసేవ నాడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రలు సమర్పిస్తారన్నారు. ప్రతి ఏడాది సంవత్సరానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్వీబీసీ సిఈవో సురేష్ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉదయాస్తమాన సేవ మరియు వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు విజ్ఞప్తి మేరకు శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు పొందిన భక్తులతో పాటు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. ఈ ఉదయాస్తమాన సేవ మరియు వింశతి వర్ష దర్శిని దాతతో పా టు 5 మంది భక్తులను బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. వీరు దర్శనం చేసుకోవలనుకున్న తేదీకి ముందు రోజు సాయంత్రం 5 గంటలలోపు తిరుమలలోని ఆర్జితం కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయాస్తమాన సేవ మరియు వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు పొందినవారు కూడా 65 సంవ త్సరాలలోపు, 10 సంవత్సరాల పైబడి ఉండాలి. ఇతర వివరాలకు ఆర్జితం కార్యాలయం ఫోన్ నెం - 0877-2263589 లేదా ఇ - మెయిల్ arjithamoffice@gmail.com కు సంప్రదించాల్సి వుంటుందని టిటిడి తెలియజేసింది.
ఏపీ పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ కేంద్రంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చెందిన ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ లో పనిచేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బ్యూరోలు, జిల్లా కోర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల విలేకరులు, మార్కెటింగ్ మేనేజర్లు, యాడ్ ఎగ్జిక్యూటివ్స్ అర్జెంటు గా కావలెను. డిగ్రీ చదివి వుండి, స్థానిక సమస్యలు, సామాజిక అంశాలపై వార్తలు రాసే అవగహాన ఉన్నవారు అర్హులు. గతంలో ఏదైనా మీడియాలో పనిచేసిన అనుభవం వున్నవారికి ప్రాధాన్యత వుంటుంది. అదేవిధంగా ప్రముఖ దేవస్థానాలు, పర్యాటక ప్రాంతాల్లో పనిచేయడానికి కూడా విలేకరులు కావలెను. ప్రముఖుల దర్శనాలు, ఆలయాలు, టూరిజం అప్డేట్స్ తక్షణమే వార్తలుగా మలచగలిగేవారికి ప్రాధాన్యత వుంటుంది. తెలుగులో చక్కగా కంపోజింగ్ చేయడం రావడంతోపాటు, మొబైల్ ఫోన్ లోనే మంచి వీడియోలు తీయడం వచ్చి వుండాలి. అలాంటి వారికి కూడా మంచి అవకాశం పనికి తగ్గ వేతనం ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 9490280270, 9390280270లో సంప్రదించగలరు...
2021 ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాల ప్రారంభాని కంటే ముందుగా స్వామివారి రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవా దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం బ్రాహ్మణ వీధిలో దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావుతో మంత్రి వెలంపల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారన్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. రథశాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఎస్ఈ శ్రీనివాసరావు ఉన్నారు.
తిరుమలలో శ్రీవారికి సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మో త్సవాల ను పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించ నున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం వీడియో కాన్సరెన్స్ ద్వారా ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై సీఎం జగన్ ఈ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని ఎంపీలకు సూచించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులతో పాటు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా సమావేశం జరగనుందని తెలుస్తోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సహాయంపై ఎంపీలతో చర్చించనున్నారు. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా సీఎం జగన్ రేపటి సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఇప్పటికే నిర్వహించిన బీఏసీ సమావేశాంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఏపీ డిమాండ్స్‌ను వినిపించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు.
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్ బాబుపై ట్విట్టర్ వేధికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్పీజీ విషయంలో లోకేష్ చేస్తున్న దుష్ప్రచారంపై ఘాటుగా స్పందించారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా ‘‘ లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?.. నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?.. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?.. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’’ అంటూ ఎద్దేవా చేశారు. అంతకు క్రితం ట్వీట్‌లో.. ’’ చంద్రం..మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా?.. సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన''‘వైఎస్సార్ ఆసరా' నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా?.. కానీ మీ కుట్ర విఫలం. ‘వైఎస్సార్ ఆసరా' సఫలం. మళ్లీ వినండి.. మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్’’ అని పేర్కొన్నారు. కరోనా పుణ్యమాని అధికారపార్టీ నేతల మాటలన్నీ సోషల్ మీడియా వేదికగానే అధికంగా సాగుతుండటంపైనా నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు...ఒక్కముక్కలోనే మనులో మాట బయటపెడుతున్నారంటూ రిప్లై ఇస్తున్నారు..