1 ENS Live Breaking News

వైఎస్సార్సీపీ ఎంపీలతో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం వీడియో కాన్సరెన్స్‌ ద్వారా ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై సీఎం జగన్‌ ఈ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని ఎంపీలకు సూచించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులతో పాటు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా సమావేశం జరగనుందని తెలుస్తోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సహాయంపై ఎంపీలతో చర్చించనున్నారు. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా సీఎం జగన్‌ రేపటి సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.  దీనిపై ఇప్పటికే నిర్వహించిన బీఏసీ సమావేశాంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఏపీ డిమాండ్స్‌ను వినిపించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్‌ కోరినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు.

Amaravati

2020-09-13 22:12:28

గీతా పారాయ‌ణం కొనసాగించండి..శ్రీవారి భక్తులు

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్రసారం చేస్తున్న సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం, గీతాపారాయ‌ణం, వేద‌పారాయ‌ణం లాంటి కార్య‌క్ర‌మాలు చాలా బాగున్నాయ‌ని, వీటి కొన‌సాగింపుగా మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు రూపొందించి ప్ర‌సారం చేయాల‌ని ప‌లువురు భ‌క్తులు కోరారు. ఈ కార్య‌క్ర‌మాలు భ‌క్తుల్లో ఆధ్యాత్మిక‌త చైత‌న్యం, సానుకూల దృక్ప‌థాన్ని పెంపొందించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని ప్ర‌శంసించారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో ఆదివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌, జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం)  ఎస్‌.భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇలు  నాగేశ్వ‌ర‌రావు,  వేంక‌టేశ్వ‌ర్లు, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఎస్వీబీసీ సీఈవో  సురేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2020-09-13 17:45:22

నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా తెలియదా లోకేశం..

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి టీడీపీ నాయుకుడు నారా లోకేష్‌ బాబుపై ట్విట్టర్ వేధికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్పీజీ విషయంలో లోకేష్‌ చేస్తున్న దుష్ప్రచారంపై ఘాటుగా స్పందించారు. ఆదివారం ఆయన ట్విటర్‌ వేదికగా ‘‘  లోకేశం.. నేచురల్ గ్యాస్‌కి ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా?.. నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?.. అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?.. ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’’ అంటూ ఎద్దేవా చేశారు. అంతకు క్రితం ట్వీట్‌లో.. ’’ చంద్రం..మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా?.. సీఎం వైఎస్‌ జగన్ శ్రీకారం చుట్టిన''‘వైఎస్సార్‌ ఆసరా' నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా?.. కానీ మీ కుట్ర విఫలం. ‘వైఎస్సార్‌ ఆసరా' సఫలం. మళ్లీ వినండి.. మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్’’ అని పేర్కొన్నారు. కరోనా పుణ్యమాని అధికారపార్టీ నేతల మాటలన్నీ సోషల్ మీడియా వేదికగానే అధికంగా సాగుతుండటంపైనా నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు...ఒక్కముక్కలోనే మనులో మాట బయటపెడుతున్నారంటూ రిప్లై ఇస్తున్నారు..

Amaravati

2020-09-13 11:55:05

స‌ర్వ‌ద‌ర్శ‌నానికే టిటిడి అధిక ప్రాధాన్య‌త‌..

తిరుమలలో శ్రీవారి భ‌క్తుల‌కు సామాన్య ద‌ర్శ‌నం చేయించ‌డానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని టిటిడి తెలియ‌జేస్తోంది. తిరుప‌తిలో కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వ‌చ్చి ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాక స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని వెల్ల‌డించింది. తిరుప‌తిలోని కౌంట‌ర్ల ద్వారా రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌డానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుప‌తిలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్నందువ‌ల్ల మొద‌టిసారి టోకెన్ల జారీని నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్పుడు పెర‌టాసి మాసం ర‌ద్దీ దృష్ట్యా టికెట్ల జారీని తాత్కాలికంగా నిలుపుద‌ల చేసింది. తిరుప‌తిలో రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయ‌గా, త‌మిళ ‌నాడు నుంచి 10 వేల నుండి 12 వేల మంది భ‌క్తులు క్యూలైన్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి తిరుప‌తిలో కోవిడ్ వ్యాప్తి పెరిగిపోయే ప్ర‌మాద‌ముంద‌ని కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు, స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వ‌చ్చింది. అయితే ర‌ద్దు చేసిన 3 వేల స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్ల‌ కోటాను ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి కేటాయించ‌డం జ‌రిగింది. అంతేగానీ, సామాన్య భ‌క్తుల‌పై టిటిడికి ఎలాంటి ఇత‌ర ఆలోచ‌నా లేదు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు తీసుకున్నవారికి కూడా స‌ర్వ‌ద‌ర్శ‌న‌మే జ‌రుగుతోంది కానీ మ‌రొక‌టి కాదు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

Tirumala

2020-09-12 19:12:31

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు‌..

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌ని‌‌వారం ఉద‌యం జరిగిన సుందరకాండలోని  12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయ‌ణం, శ్రీ‌రామ నామ స్మ‌ర‌ణ‌తో  తిరుమ‌లగిరులు పుల‌కిం చాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ మాట్లాడుతూ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామ‌య‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్నిటిటిడి అద్భుతంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తు‌న్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హం వ‌ల‌న త్వ‌ర‌లో క‌రోనా వైర‌స్ న‌శించి ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌న్నారు. సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ ‌ప్ర‌పంచ ప్ర‌జ‌ల యోగ‌ క్షేమం కొర‌కు టిటిడి 156 రోజులుగా శ్రీ‌వారి అనుగ్ర‌హంతో మంత్ర పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు తెలిపారు. సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో 94వ రోజైన శ‌నివారం 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను  4వ విడ‌త అఖండ పారాయ‌ణం నిర్వ‌హించామ‌న్నారు. అఖండ పారాయ‌ణంలో భాగంగా జూలై 7 నమొద‌టి ప‌ర్యాయం ప్ర‌థ‌మ‌స‌ర్గ‌లోని 211 శ్లోకాల‌ను, ఆగష్టు 6 న 2వ ప‌ర్యాయం ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను, ఆగస్టు 27 న 3వ ప‌ర్యాయం అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను పారాయ‌ణం చేసిన‌ట్లు తెలిపారు. కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ప్రసిద్ధ త్యాగరాజ పంచరత్న కృతులు " జగదానందకారక.... జ‌య జ‌నాకి ప్రాణ‌ నాయక......"   అనే సంకీర్త‌న‌తో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ బి.ర‌ఘునాథ్ బృందం అందించిన హనుమాన్ భజన్‌తో కార్య‌క్ర‌మం ముగిసింది. అఖండ పారాయ‌ణంలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధానితో క‌లిసి శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ శేషాచార్యులు పారాయ‌ణం చేశారు. ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.  ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  మోహ‌న రంగ‌చార్యులు, ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్‌,  శ్రీ‌వారి ఆల‌య ఒఎస్డీ  పాల శేషాద్రి, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మ  పాల్గొన్నారు.

తిరుమల

2020-09-12 14:41:47

అక్టోబర్ 27 పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవం..

ఉత్తరాంధ్రా ప్రజల కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు  అధికారులు ప్రకటిం చారు. ఈ మేరకు  అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం మరియు పందిరి రాట వేస్తారు,  అక్టోబర్ 22 న అర్ధ మండల దీక్షలు ప్రారంభం అవుతాయి, అక్టోబర్ 26 న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు, 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం జరుగుతుంది, నవంబర్ 3న తెప్పోత్సవం, నవంబర్ 10 న ఉయ్యాల కాంబల ఉత్సవం, నవంబరు11 న చండీహోమం నిర్వహించిన తరువాత అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ 19 ను ద్రుష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు అధికంగా వున్న సమయంలో ప్రజలు అమ్మవారి ఉత్సవంలో కూడా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఈమేరకు మరోసారి జిల్లా అధికారులు నిబంధనలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి...

విజయనగరం

2020-09-11 22:17:38

అక్కాచెల్లెళ్ల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం..సీఎం జగన్

రాష్ట్రంలో అక్కాచెల్లెళ్ల  అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్  మాట్లాడుతూ ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని అన్నారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయన్న సీఎం నాలుగు విడతల్లో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం  ద్వారా వాటిని చెల్లిస్తున్నామని చెప్పారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పీఅండ్‌జీ, హెచ్‌యూ ఎల్‌ లాంటి మల్టీనేషనల్‌ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామని, పసిపిల్లల నుంచి ముసలవ్వల వరకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వివరిం చారు. తల్లి, బిడ్డలకు పౌష్టికాహారం అందించేలా వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌, ఆరేళ్ల పిల్లల నుంచి ఇంటర్‌ విద్యార్థుల చదువుల కోసం అమ్మఒడి అమలు చేస్తున్నామని, అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు.  30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతూనే... కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని అయినప్పటికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, మద్యాన్ని నియంత్రించేందుకు 43వేల బెల్ట్‌షాపులు తొలగించామని పేర్కొన్నారు. 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. 33శాతం మద్యం షాపులు తగ్గించామని వెల్లడించారు సీఎం జగన్‌ తెలిపారు.

Amaravati

2020-09-11 13:35:15

అన్ని పనులకు కేరాఫ్ గ్రామ సచివాలయాలే..

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజలకు సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం సేవలన్నీ వీటికిందకు తీసుకొస్తుంది. మీసేవాల్లో అందించే సేవలకేంటే అధికంగా ఇక్కడ ప్రజలకు అందించడం ద్వారా ఎవరూ మండల కేంద్రానికి వెళ్లే పనిలేకుండా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఈమేరకు అన్ని గ్రామవార్డు, సచివాలయాల్లో నవంబరు నాటికి అన్ని ఖాళీలను భర్తీ చేయడంతోపాటు సేవలన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చి ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందించాలని ప్రభుత్వం చూస్తుంది. ఇందులో భాగంగానే రెవిన్యూ సేవలతోపాటు, ట్రాన్స్ పోర్టు సేవలను కూడా ప్రభుత్వం గ్రామసచివాలయాకు అందజేసింది. మరికొద్ది రోజుల్లోనే ఆరోగ్యసేవలు విలేజ్ క్లినిక్ ల ద్వారా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ సేవలకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తిగా అక్కడి నుంచే గ్రామస్థాయిలోనే సేవలను మరింతగా రైతులకు చేరువ చేయాలని యోచిస్తోంది. ఏ పనికావాలన్నా ప్రజలు సచివాలయాన్నే సంప్రదించాలనే విధంగా ప్రభుత్వం చాలా పెద్ద ప్రణాళికతోనే ముందుకు వెళుతుంది. అయితే ప్రస్తుతం వున్న డిజిటిల్ అసిస్టెంట్లతో ఇన్ని సేవలు ఎలా అందిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారినప్పటికీ, సచివాలయ సిబ్బంది మొత్తాన్ని కార్యాలయాల్లోనే వుంచి సంబంధిత పనులను శాఖల వారీగా చేయించాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం సాధారణంగా నడుస్తున్న సచివాలయాలు పూర్తిస్థాయి ప్రభుత్వ కార్యాలయాలుగా త్వరలోనే మారబోతున్నాయి.

Velagapudi

2020-09-11 08:08:05

కానిపాక వినాయక హుండీ ఆదాయం రూ.41,38 లక్షలు

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం  స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి  హుండీ ఆదాయం 41 లక్షల 38వేల 796 రూపాయలు వచ్చినట్టు ఈఓ వెంకటేశు తెలియజేశారు. గురువారం ఈ మేరకు 24 రోజుల యొక్క హుండీ లెక్కింపు చేపట్టినట్టు వివరించారు. ఇందులో బంగారం-38.గ్రాములు, వెండి-258.గ్రాములు , బంగారు రథం ద్వారా వచ్చిన ఆదాయం - 83,191, అన్నదానం ద్వారా రూ. 1785, ప్రచార రథం ద్వారా 3077, బిక్షడి హుండి ద్వారా 7,946, ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో  వివరించారు.  ఈ హుండీ లెక్కింపు లో   దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈఓలు చిట్టెమ్మ, రవీంద్ర బాబు, విద్యాసాగర్ రెడ్డి,హరి మాధవరెడ్డి, సి ఎఫ్ ఓ -బి,యన్ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు ప్రసాద్, శ్రీధర్ బాబు, వెంకటేశ్వర్లు, బ్యాంకు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Kanipakam

2020-09-10 21:19:16

ఆర్ధిక నేరాలపై కఠిన చర్యలు తీసుకుండి.. సీఎస్

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి బాధితులకు నాయ్యమందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. 19వ స్టేట్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీ వర్చువల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆమె కార్యాలయంలో గురువారం జరిగింది. ఆ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ, 19వ స్టేట్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ,  ఈ ఏడాది జనవరి 29న జరిగిన 18 వ  స్టేట్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన పలు సంస్థల కేసులు ఏ యే దశల్లో ఉన్నాయో ఆరా తీశారు. ప్రజల కష్టాన్ని దోచుకునే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అదే సమయంలో బాధితులకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. మోసాలకు పాల్పడక ముందే, ఏర్పాటైన చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉన్నాయా...? సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు ఉన్నాయా..? అని గుర్తించాలన్నారు. అగ్రి గోల్డ్, అక్షయ్ గోల్డ్, అభయ్ గోల్డ్, హీరా గ్రూప్, కపిల్ గ్రూప్, సహారా సహా పలు సంస్థలపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలను సీఎస్ కు  సిఐడి, పోలీసు అధికారులు వివరించారు. ఎక్కువ కేసులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నమోదవుతున్నట్లు సీఎస్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఎక్కువ వడ్డీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న ఆర్థిక సంస్థలపై కేసులు దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి, బాధితులకు న్యాయమందించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్, కార్యదర్శి సునీత, ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, సీఐడీ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Velagapudi

2020-09-10 21:16:22

గుడ్ న్యూస్ ఇక డ్రైవింగ్ లైసెన్సులు అక్కడే..

రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ లో పరిపాలన కేంద్రీకరణలో భాగంగా సులభమైన విధానంలో పౌరసేవల అందించేందుకు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 440 పట్టణ సచివాలయాలు, 845 గ్రామ సచివాలయాలలోనూ  రవాణాశాఖ అందించే వివిధ సేవలను ప్రజలకు చేరువ చేయనుంది. ఇందులో భాంగా రవాణాశాఖ ప్రధానంగా నిర్వహించే డ్రైవింగ్ లైసెస్సుల జారీ, వాహనదారుల రిజిస్ట్రేషన్లు, రవాణాశాఖ పన్నులు, వాహనముల పర్మిట్లకు సంబంధించిన 4 విభాగాల్లోని 56 సేవలను వారి ఉన్న ప్రాంతాలలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించి సేవలను పొందే అవకాశం వుంటుంది.. ఇందుకోసం గ్రామ,వార్డు సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ సహాయ కార్యదర్శలను నియమించడం జరిగిందన్నారు. తద్వారా ప్రజలకు వారు ఉన్న ప్రాంతాల్లో రవాణాశాఖ అందించే సేవలు అందించడంతో పాటు దళారి వ్యవస్థను కట్టడికి సాధ్యమవుతుందని రవాణాశాఖ భావిస్తోంది. ముఖ్యంగా ఏజెంట్లు ప్రైవేటు వ్యక్తుల జోక్యం తగ్గిపోవడంతోపాటు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. రవాణాశాఖ ద్వారా క్షేత్రస్థాయిలో వివిధ సేవలను ప్రజలకు అందించే దిశలో ప్రతి జిల్లా నుండి నలుగురు చొప్పున 13 జిల్లాల నుంచి వచ్చిన వారికి మాస్టర్ ట్రైనీర్స్ ఎంపిక చేసి ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో సాంకేతిక విధానంపై శిక్షణ అందిస్తారు. శిక్షణ పొందిన మాస్టర్ శిక్షకులు జిల్లాలలోకి వెళ్లి ప్రణాళిక ప్రకారం మిగతా సిబ్బందికి శిక్షణనిస్తూ గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్, సంక్షేమ సహాయ కార్యదర్శిల ఆధ్వర్యంలో రవాణాశాఖ సేవలు అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయం అందించే రవాణాశాఖ సేవలను పూర్తిస్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న రవాణా శాఖ దళారులను,  మధ్యవర్తులను ఆశ్రహించవద్దని  ప్రజలను చైతన్యం చేస్తుంది...

Amaravati

2020-09-10 20:56:00