1 ENS Live Breaking News

శ్రీవారి రూ.300/- స్పెషల్ ద‌ర్శ‌న టికెట్ల కోటా విడుద‌ల‌..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల అద‌న‌పు కోటాను టిటిడి బుధ‌వారం సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసింది. సెప్టెంబ‌రు 10 నుండి 30వ తేదీ వ‌ర‌కు అద‌నంగా రోజుకు 3 వేల టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు టిటిడి అధికారులు ప్రకటించారు.  క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల‌ను సెప్టెంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు టిటిడి తాత్కాలికంగా నిలుపుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భ‌క్తుల కోరిక మేర‌కు అద‌నంగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దీంతో భక్తులు చేసిన ఆందోళనకు టిటిడి అధికారులు స్వామివారి ప్రత్యేక ప్రవేశ కోటా విడుదలకు చర్యలు చేపట్టారు. కరోనా సమయంలోనే స్వామివారిని భక్తులు చూడక, వైరస్ తగ్గుతున్న సమయంలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో టిటిడి తీసుకున్న నిర్ణయంతో ఆందోళనకి దిగడంతో టిటిడి మళ్లీ ఆ టిక్కెట్ల కోటా విడుదల చేయక తప్పలేదు...

Tirumala

2020-09-09 19:52:59

అంతర్వేది ఆలయ ఈ.ఓపై వేటు పడింది..!

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవస్థానంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమై సంఘటన విషయంలో ప్రభుత్వం ఆలయ ఈఓపై బదిలీ వేటు వేసింది. ఈమేరకు మంగళవారం చక్రధరరావును  దేవాదాయశాఖ కమిషనర్ విధుల నుండి తప్పించారు. ఆయన స్థానంలో  ఎర్రంశెట్టి భద్రాజీరావుని కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం.  ఆలయంలో స్వామివారి   రథం దగ్ధమైన విషయంలో జరిగిన నిర్ల్యక్ష్యం లో అనేక విమర్శలు, ఆందోళన లు,ఆరోప ణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అటు ప్రభుత్వం కూడా ఆలయ సంఘటన విషయంలో సోషల్ మీడియాలో చిలవలు పలవలుగా అల్లి చూపించే అవాస్థవాలను నమ్మవద్దని కోరింది. అంతేకాదు ఇలాంటి సంఘటనలు జరిగినపుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన కుండా లోతుగా అధ్యయనం చేయించే దిశగా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు తేనపట్టు కోసం పెట్టిన నిప్పు స్వామివారి రథంపై ఉన్న కమ్మలకు అంటుకొని ప్రమాదం జరిగినట్టుగా తేల్చిన ప్రాధమిక విచారణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచక్షణా రహితంగా అలా ఎలా చేస్తారని మండిపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం సమగ్ర విచారణ జరిపిస్తామని చెబుతోంది.

Antervedi Pallipalem

2020-09-08 20:14:43

సెప్టెంబరు10 నుంచి గీతా పారాయణం..

భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తా మని టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గీతా పారాయణం శ్లోకపఠనం, వ్యాఖ్యానంతో మూడో విడత ట్రయల్ రన్ నిర్వహించారు.  వేదపారాయణందార్ కాశీపతి భగవద్గీత పారాయణం చేయగా, వేదపండితుడు కుప్పా విశ్వనాథశాస్త్రి వ్యాఖ్యానం చెప్పారు.  ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ, సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదే తరహాలో గీతా పారాయణం విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. శ్లోక పఠనం, వ్యాఖ్యానంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తూ గీతా పారాయణం ఉంటుందన్నారు. అనంతరం పండితుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.  ఇప్పటికే సెప్టెంబరు 1, 3వ తేదీల్లో రెండు విడతల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారాయణం జరిగేందుకు వీలుగా టిటిడి చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్  కుప్పా శివసుబ్రమణ్య అవధాని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పాఠశాల పండితులు పాల్గొన్నారు. సెప్టెంబరు 12న 4వ విడత సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం..  తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై సెప్టెంబరు 12వ తేదీన 4వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉద‌యం 7 గంటల నుండి  సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 147 శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠం, వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణదారులు, పండితులు ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొననున్నారు.

తిరుపతి

2020-09-08 19:31:13

శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం అపశకున సూచికం..స్వరూపానందేంద్ర సరస్వతి

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది  శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతవడం పట్ల విశాకలోని శ్రీ శారదా పీఠం అధి పతి స్వరూపానందేంద్రసరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. స్వామిరి వారి రథం దగ్దమైన సంఘటనను తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడు తూ, స్వామివార్ల రధాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తారని అలాంటి రధం ఏవిధంగా ఆహుతైందో ప్రభుత్వం విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనల ద్వారా ప్రజలు మానసికంగా ఆందోళన చెందుతారని అన్నారు. స్వామి రథం విషయంలో నిర్లక్ష్యం తగదన్న స్వామీజీ  ఇలాంటి విషయాలను జీవకోటి మనుగడను ప్రశ్నార్ధం చేస్తాయన్నారు. స్వామివారి రథం ఆగ్నికి ఆహుతి అవడమంటే అపశకునానికి సూచిక అన్నారు. ఈ సంఘటను ద్రుష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ఆలయాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రతీచోట సిసి కెమెరాలు అమర్చాలన్నారు. తద్వారా ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే దోషులను పట్టుకొని శిక్షించడానికి వీలు కలుగుతుందన్నారు.

పెందుర్తి

2020-09-06 13:08:05

సమగ్ర భూ సర్వేతో భూవివాదాలు మటు మాయం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారం కానున్నాయి. ఈమేరకు జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వేకు అత్యాధునిక సాంకేతికతపై సర్వేయర్లకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో శిక్షణ ఇస్తున్నారు. మూడునెలల్లో శిక్షణ పూర్తయిన తరువాత సర్వేయర్లు సర్వే మొదలు పెట్టి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అదే సమయంలో భూ వివాదాలు పరిష్కారం కావడంతోపాటు, ఆక్రమణలు జరిగిన ప్రభుత్వ భూములను కూడా స్వాధీ నం చేసుకునే అవకాశం వుంది. దీంతో ఆక్రమణదారుల గుండెల్లోరైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో చాలా మంది కొనుగోలు చేసిన భూములు కంటే అధికంగా కొం డ ప్రాంతాలు, గెడ్డ ప్రాంతాలు, ఇరిగేషన్ కి చెందిన భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న సమగ్ర భూ సర్వేతో ఇలాంటి వివాదాల న్నీ పరిష్కారం కానున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఒక లెక్కతేలుతుంది. తద్వారా ప్రభుత్వ భూముల్లో ఉద్యోగులకు ఆవాసాలు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం చేకూరుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఈసర్వేతో కలగనున్నాయి.

Amaravati

2020-09-06 11:58:28

జర్నలిస్టులకే ఆ45 రోజులు చాలా కీలకం..గంట్ల

ప్రభుత్వం వచ్చే 45రోజులు కరోనా వైరస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రకటించిన నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ జర్న లిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబు సూచించారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ పాజివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వుందన్నారు. అత్యవసర సమావేశాలు, అధికారిక ప్రెస్ మీట్లకు తప్పా ఇతర సమయాల్లో బయటకు రాకూండానే జాగ్రత్త పడాలన్నారు. మనమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలన్నా ఆయన జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామన్నారు. అనునిత్యం మాస్కు ధరించడంతోపాటు, నాణ్యత కలిగిన శానిటైజర్లను వినియోగిస్తూ సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు 4.0 అన్ లాక్ లో భాగంగా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం వుందన్నారు. ఎక్కడికి వెళ్లినా వేడినీరు మాత్రమే తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యం కోసం కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గంట్ల శ్రీనుబాబు సూచించారు.

Visakhapatnam

2020-09-06 11:45:04

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..అన్ని ద్రువీకరణ పత్రాలు అక్కడే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల ద్వారా గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు మరింతగా అందించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాల నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలలు, కళాశాలలు తెరిచే నాటికి విద్యార్ధులందరికీ అన్ని రకాల సర్టిఫికేట్లు(డేటాఫ్ భర్త్, నేటివిటీ, కులము, వెనుకబడిన కులము, ఓబీసి, ఈబిసి) తదితర సర్టిఫికేట్లు పాఠశాలలు, కళాశాలలు తెరిచే లోపుగానే అందించాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వున్న వాలంటీర్ల ద్వారా వీటిని సచివాలయం ద్వారానే అందించే ఏర్పాటు చేసింది. దానికి వాలంటీర్లు వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోనూ సచివాలయం ద్వారా అందే సేవలను తెలియజేయడంతోపాటు, దగ్గరుండి విద్యార్ధులకు కావాల్సిన ద్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేయించాల్సి వుంటుంది. తద్వారా సచివాలయంలో ప్రజలకు ఏ తరహా సర్టిఫికేట్లు అందిస్తున్నారో ప్రజలకు అవగాహన రావడంతోపాటు, మీసేవాల్లో అందించే సేవలన్నీ సచివాలయంలో కూడా తక్కువ ఖర్చుతోనే చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. అంతేకాదు కొన్నిచోట్ల రెవిన్యూ సిబ్బంది, మీసేవా నిర్వాహకులు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట కూడా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, కళాశాలల్లో జాయిన్ అయ్యేందేకు కావాల్సిన ద్రువీకరణ పత్రాలన్నింటినీ సచివాలయం ద్వారానే అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. 

Amaravathi

2020-09-06 11:19:34

ఈనెలాఖరు వరకూ శ్రీవారి సర్వదర్శన టిక్కెట్లు నిలిపివేత

తిరుపతిలో జారీ చేస్తున్న శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు తాత్కాలికంగా టీటీడీ నిలుపుదల చేసినట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న టిటిడి  తిరుమల, తిరుపతిలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తిరుపతి లోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వబడవనే విషయాన్ని భక్తులు గుర్తించాలని తెలియజేసింది. పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్నవారు మాత్రమే శ్రీవారి దర్శనానికి తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ లో తనిఖీల అనంతరం అనుమతిస్తారు. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతున్న అధికారులు కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

తిరుపతి

2020-09-05 20:59:13

ఆన్‌లైన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల‌కు 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్ల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా అందించేందుకు పోస్ట‌ల్ డిపార్టుమెంటుతో పాటు అమెజాన్ సంస్థ‌తో కూడా అందించేందుకు టిటిడి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. టిటిడి పరిపాలన భవనంలో గల త‌మ కార్యాల‌ యంలో ఆయన టిటిడి‌ అధికారులు, అమెజాన్ ప్ర‌తినిధుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి డైరీలు, క్యాలెండర్లకు విశ్వ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంద‌న్నారు. గతంలో కూడా పోస్ట‌ల్‌డిపార్టుమెంట్ మ‌రియు వివిధ కొరియ‌ర్ ఏజెన్సీల ద్వారా డైరీలు, క్యాలెండర్లు అందించిన‌ట్లు తెలిపారు. కాగా  భ‌క్తుల‌కు మ‌రింత విస్తృతంగా, వేగంగా టిటిడి డైరీలు, క్యాలెండర్లు అందించేందుకు ప్ర‌ముఖ ఆన్‌లైన్ సంస్థ అయిన అమెజాన్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతునట్లు తెలియ‌జేశారు.          ఈ సంద‌ర్భంగా అమెజాన్ సంస్థ ప్ర‌తినిధులు  అభిలాష్‌,  షీతాల్ కుమార్‌లు టిటిడి డైరీలు, క్యాలెండర్ల‌ను అమెజాన్ ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అందించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికలు  త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌న్నారు. టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు ద‌శ‌ల వారిగా దేశ విదేశాల‌లోని భ‌క్తుల‌కు టిటిడి డైరీలు క్యాలెండర్లు అందిస్తామ‌న్నారు.  ఇందులో భాగంగా మొద‌ట బెంగుళూరు కేంద్రంగా ద‌క్షిణ భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు చేర‌వేస్తామ‌న్నారు. అదేవిధంగా అక్టోబ‌ర్ నుండి ఢిల్లీ కేంద్రంగా ఉత్త‌ర భార‌త దేశంలో అందిస్తామ‌న్నారు. మ‌లిద‌శ‌లో విదేశాల‌లోని భ‌క్తుల‌కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.          కాగా టిటిడి ముద్రించిన రూ.100/- విలువ‌గ‌ల 12 పేజీల క్యాలెండర్లు, రూ.15/- విలువ‌గ‌ల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు, రూ.10/- విలువ‌గ‌ల శ్రీవారు మ‌రియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు, రూ.20/- విలువ‌గ‌ల తెలుగు పంచాంగం క్యాలెండర్లు, రూ.60/- విలువ‌గ‌ల టేబుల్ టాప్ క్యాలెండ‌ర్లు, రూ.130/- విలువ‌గ‌ల పెద్ద‌ డైరీలు, రూ.100/- విలువ‌గ‌ల చిన్నడైరీలు భ‌క్తుల‌కు ఆన్‌లైన్ కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు జెఈవో తెలిపారు.          ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, సిఎవో  శేష‌శైలేంద్ర‌, డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి  రామ‌రాజు తదితరులు  పాల్గొన్నారు.

Tirupati

2020-09-05 20:53:28

సెప్టెంబరు 18నుంచి ఉప్మాక వెంకన్న బ్రహ్మోత్సవాలు

విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నక్కపల్లి ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 27 వరకు ఏకాంతంగా జరపనున్నట్టు టిటిడి అధికారులు ప్రకటించారు. స్వామివారి బ్రహ్మోత్సవం లో  శ్రీ విశ్వక్సేన ఆరాధన మరియు కంకనాధారణ, సెప్టెంబర్ 18 న అంకురార్పణం, సెప్టెంబర్ 19 న ధ్వజరోహనం మరియు ఉత్సవాలు జరుగుతాయని అనంతరం సెప్టెంబర్ 27 తో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకోవాల న్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా మాత్రమే ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒకేసారి భక్తులు అధిక సంఖ్యలో రావడం మొదలైతే కరోనా కేసులు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుందని ప్రటించారు.

Nakkapalli

2020-09-05 20:15:35

పర్యాటక వాణిజ్యాానికి మార్గదర్శకాలు జారీ...మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యాటక వాణిజ్యం ( రిజిస్ట్రేషన్ మరియు సౌకర్యాలు ) మార్గదర్శకాలు , 2020 ను విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక,  క్రీడలు , యువజనాభివృద్ది శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు , సులభతరమైన విధానంలో ప్రభుత్వ ఉత్తర్వుల నెం.188 తో శనివారం మార్గదర్శకాలను జారీచేసినట్టు వివరించారు . ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదుచేసుకోవడానికి సరియైన యంత్రాంగం , విధివిధానాలు అందుబాటులో లేవన్నారు . రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతంచేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగు తోందన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్ . జగన్మోహనరెడ్డి సమక్షంలో విధివిధానాలను రూపొందించే దిశలో పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవ్వడం జరిగిందన్నారు . ఆగష్టు 20 న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో విధివిధానాలను రూపొందించి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో అడుగులు వేస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.    రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యంపై సమగ్ర నివేదికను రూపొందించి సిఫార్సు చేయడం జరిగిందని తద్వారా టూరు ఆపరేటర్లు , అనుబంధ రంగాల వారు ప్రభుత్వం అందించే రాయితీలను , ప్రోత్సాహకాలను పొందవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు . మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు www.aptourism.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చామన్నారు . టూరు ఆపరేటర్ల , బోట్ ఆపరేటర్లు , ట్రావెల్ ఏజెంట్లు , హెూటల్సు , రిసార్ట్సు , మైస్ సెంటర్లు , వాటర్ స్పోర్ట్సు ఆపరేటర్లు తదితర అనుబంధ రంగాల అపరేటర్లను రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు . ఇందుకోసం ఆయా సంస్థలు తప్పనిసరిగా రాష్ట్ర పర్యాటక శాఖతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తద్వారా రాయితీలను , ప్రోత్సాహాలను పొందాలన్నారు . కోవిడ్ కారణంగా మూతపడిన పర్యాటక రంగానికి వైభవాన్ని తీసుకొచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ చర్యలు తీసుకొంటోందని ఆయన తెలిపారు . కేంద్ర మార్గదర్శకాలు సూచనలతో విధివిధానాలను రూపొందించి ఆయా రంగాలను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు . గోవా , రాజస్థాన్ , హిమాచల ప్రదేశ్ , కేరళ , కర్నాటక వంటి రాష్ట్రాలలో పర్యాటక రంగంలో అభివృద్ధికి అమలు చేస్తున్న విధివిధానాలపై అధ్యయనం చేయడం తద్వారా రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు సూచనలను చేశామని , సులభతరమైన మార్గదర్శకాలను జారీచేశామన్నారు . సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు నాణ్యమైన సేవలపై సూచనలు , మార్కెటింగ్ మార్గాలపై సమగ్ర నివేదిక సులభతరమైన విధానాలలో అనుమతుల మంజూరు , ఇతర రాష్ట్రాల , జాతీయ అంతర్జాతీయ పర్యాటక విభాగాలైన క్రీడలు పర్యాటక సందర్శనలు , పర్యాటక క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగ వాణిజ్యాన్ని ఇతోధికమైన స్థానాన్ని కల్పించడం చేయాలన్నారు . ఇందుకు పర్యాటక సంబంధిత రంగాలవారిని , సంస్థల వివరాలను సేకరించాలన్నారు . పర్యాటక సేవా రంగంలో ఉన్నవారిని గుర్తించి రాష్ట్రంలో సమగ్ర పర్యాటక ప్రణాళికలు మరియు గణాంకాలను పొందుపరుస్తూ డేటాబేసు అనుగుణంగా మార్గదర్శకాలను జారీచేశామన్నారు .  రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థలకు ఇది ఒక మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు చెల్ సైటును సందర్శించాలని టూరిజం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ , ఎపిటిడిసి ఎండి, ఎపిటీఏ సీఈవో ప్రవీణ్ కుమార్  తెలియజేశారు . 

Visakhapatnam

2020-09-05 19:30:53

అవినీతిని ప్రోత్సాహానికి చంద్రబాబుకి పేటెంట్..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాడు అవినీతి పరులకు కొమ్ము కాయడానికి మాత్రమే హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిం చారు. చంద్రబాబులో ఏం మార్పు రాలేదని తహశీల్ధార్ వనజ పై దాడిచేసిన చింతమనేని అధికారంలో ఉండగా వెనుకేసుకు వచ్చి, ఇపుడు ఈఎస్ఐ స్కాములో ప్రధాన నిందితులు అచ్చెన్నాయుడు,  హంతకుడు కొల్లు రవీంద్రలకు సపోర్టు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. కరోనా వైరస్ భయంకరంగా పెరుగు తున్న సమయంలో కూడా బయటకు రాని చంద్రబాబు, తన మాజీ మంత్రులు విషయంలో హైదరాబాదు నుంచి వచ్చి మరీ పరామర్శించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ తరుణంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక చేసిన ఆరోపణలకు బలం చేకూర్చింది. అంతేకాదు విజయసాయిరెడ్డి విశాఖ ఖంట కుడు పేరుతో చేస్తున్న కామెంట్లకు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుండటం విశేషం...

Amaravati

2020-09-05 14:51:12

గ్రామాల్లో వీధి దీపాల బాధ్యత గ్రామసచివాలయాలదే..

గ్రామాల్లో వీధి దీపాలు వెలిగినా, వెలగకపోయివా వాటి బాధ్యత గ్రామసచివాలయాలే చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రైవేటు పొరుగు సేవల అధీనంలో ఈ సేవలు ఇక నుంచి గ్రామసచివాలయాలే చూడనున్నాయి. ఇక నుంచి ఏ వీధిలోనైనా వీధిలైటు వెలగకపోయినా సచివాలయంలో ఫిర్యాదు చేయాలి. దానిని సత్వరమే కార్యదర్శి పరిష్కరించాలి. ఒక్కోసారి కార్యదర్శి అందుబాటులో లేనపుడు గ్రామ వాలంటీర్ ద్వారా కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గ్రామసచివాలయానికి ఒక ఎనర్జీ అసిస్టెంట్ ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయినట్టే కనిపిస్తుంది. అంతేకాదు, గతంలో పొరుగు సేవల ద్వారా పనిచేసేవారికి త్వరలోనే చెల్లుచీటి కానుందని కూడా సమాచారం. ఎందుకంటే పారిశుధ్య కార్మికుల పేరుతో నిర్వాహకులు కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టు నటిస్తూ జీతాలు తీసుకుంటున్నారు. అవిషయంపైనా ప్రభుత్వం సమగ్ర విచారణ చేయనుందని తెలుస్తుంది...

Amaravati

2020-09-05 13:56:52