1 ENS Live Breaking News

సచివాలయాల మార్పు మొదలైంది..!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో  త్వరలోనే కార్యరూపంలోకి వచ్చి కనిపించనుంది.. ఒక కొత్త ప్రభుత్వశాఖను తలా తోకాలేకుండా ఏర్పాటు చేసి ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన గత ప్రభుత్వ విధానాలు, పరిపాలనపై కూటమి ప్రభుత్వం నిశితంగా పరిశీలన మొదలు పెట్టింది. ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటుచేసిన గత ప్రభుత్వం ఉద్యోగులను అదిరించి, బెదిరించి, ఒక శాఖ ఉద్యోగితో ఖాళీగా ఉన్న అన్నిశాఖల పనులూ చేయించి ఉద్యోగులందరినీ ఉసూరు మనిపించింది. ఇంత చేసినా వారికి న్యాయం చేసిందా అంటే.. అన్యాయం చేసి..రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలన్నింటికీ కోత విధించి ఉద్యోగులు వారంత వారే చేస్తున్న జాబులకు రిజైన్ చేసేలా వ్యవహరించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 13,313 గ్రామ పంచాయతీల పరిధిలోని  14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల మంది ఉద్యోగాలకు దిశ, దశ లేకుండా చేసింది. తమ ప్రభుత్వ హాయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వశాఖలో ఏమైనా..ఎపుడైనా..ఎలాగైనా చేసుకోవచ్చుననే ధోరణిని ప్రదర్శించి ఉద్యోగుల జీవితాలతో ఆటాటడుకుందంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి తేడా విధానాలను ఉద్యోగులు, వారి కుటుంబాలుతో 2024 ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పారు అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగులతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా. దానిని గుర్తించిన కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి అసలైన ప్రభుత్వ సేవలు ఇంటిముంగిటే ఏ విధంగావచ్చుననే దానిపై లోతుగా పరిశీలన చేయడం ప్రారంభించింది.

దానికి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు కూడా తోడయ్యాయి. సచివాలయ వ్యవస్థలో జరుగుతున్న తంతును ఎప్పటి కప్పుడు ఈఎన్ఎస్-ఈరోజు ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం ముందు ఉంచడంలో ప్రత్యేక పాత్రపోషించింది. ఆ మాటకొస్తే ఈ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఏ మీడియా బయటపెట్టని విషయాలన్నీ ఈఎన్ఎస్ మీడియా ప్రజలముందుంచింది. అయితే గత ప్రభుత్వంలోనూ కొన్ని చర్యలు తీసుకున్నా..ప్రధాన అంశాలను మాత్రం అలాగే పక్కన పెట్టేశారు. ప్రతిపక్షంలో ఉండగా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గొంతెత్తిన టిడిపి, జనసేన, బీజేపి లు ఇపుడు అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలపు పరిష్కించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణతో ముందుకి సాగుతున్నారు. అందులో ఇపుడు డిప్యూటీ సీఎం పవన్, కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి చర్యలకు సీఎం చంద్రబాబు తోడవటంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పు తధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు గత ప్రభుత్వం కావాలని చేసిన తప్పులను, దారుణాలను పూర్తిగా పరిశీలించి ఈశాఖను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టడానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఈ శాఖకోసం మీడియా ముందు ప్రస్తావించారు కూడా. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఈ ప్రభుత్వశాఖలోని లోపాలు, సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులను ఒక్కసారి క్రమ సంఖ్యలో గత ప్రభుత్వం కావాలని చేసిన తప్పులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే చర్యలు ఏంటనేవి క్రమ సంఖ్యలో ఒక్కసారి తెలుసుకుంటే...

1)గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి, కేబినెట్ లో ఆమోదించి కూడా అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించకపోవడం

2)రెండేళ్లుకు సర్వీసు ప్రొబేషన్ చేయాల్సి ఉండగా అదనంగా మరో 9నెలలు అదే రూ.15వేలకు  పనిచేయించడం, ఆ కాలానికి పేస్కేవు వర్తింపచేయకపోవడం

3)సుమారు 19శాఖల్లో పది శాఖలకు పైగా ఉద్యోగులకు నేటికీ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం

4)మహిళాపోలీసులకు హోంశాఖ విధులకు సంబంధం లేదని హైకోర్టుకి అఫడవిట్ ఇచ్చేసి వారికి నేటికీ ప్రభుత్వశాఖను కేటాయించకపోవడం

5)పీఆర్సీ బెనిఫిట్స్, ఫుల్ పేస్కేలు  సచివాలయ ఉద్యోగులందరికీ  ఇవ్వాల్సి వస్తుందని ప్రొబేషన్ కి రెండు నెలల ముందు హెచ్ఆర్ఏ, డిఏలను కుదించడం

6)రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకొని రెగ్యులర్ అయిన ఉద్యోగులకి ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా రెండేళ్లు కాలం గడిపేయడం

7)సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వర్తించకుండా కేటగిరీ ఏర్పాటు చేయకపోవడం, డిపార్ట్ మెంటల్ టెస్టులకి సిబంధించి స్పష్టత ఇవ్వకపోవడం

8)కోవిడ్ సమయంలో విధినిర్వహణలో మృతిచెందిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు నేటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం

9)ఎనర్జీ అసిస్టెంట్లకు విధినిర్వహణలో అంగవైక్యలం అయినవారికి, మృతిచెందిన వారికి నేటికీ నష్టపరిహారం చెల్లింకపోవడంచ, ఉద్యోగ ఇవ్వకపోవడం

10)ఏఎన్ఎంలకు జిఎన్ఎం ఇన్ సర్వీసు శిక్షణ ఇచ్చి అదే ఏఎన్ఎంలుగా విధులు నిర్వహించేలా చేయడం, వారికి పేస్కేలు వర్తింపజేయకపోవడం

11) ప్రభుత్వ సంక్షేమ పథకాలకు డేటా సమకూర్చే ఎడ్యుకేషన్, అండ్ వెల్పేర్ అసిస్టెంట్లకు నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం

12)ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టు భర్తీచేసి తో అన్శి సుమారు 7 విభాగాల ఇంజనీరింగ్ పనులకు, విధులకు వీరినే అదనంగా వినియోగించేయడం

13)గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఖాళీగా ఉన్న పంచాయతీలను కేటాయించకపోవడం, వారికి డ్రాయింగ్ పవర్ వర్తింపచేయకపోవడం

14)కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్టు పాసైతే తప్పా సర్వీసులు రెగ్యులర్ చేసేది లేదంటూ వీఆర్వోలను చాలా కాలం పక్కనపెట్టేయడం

15)గ్రామ, వార్డు సచివాలయశాఖలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీచేయకుండా వదిలేసి, ఉన్నవారితో అదనంగా పనిచేయించడం

16)సచివాలయ ఉద్యోగులకు కేటగిరీని ఏర్పాటు చేయకపోవడం..దానితో వీరు అటెండర్లకు ఎక్కువ జూనియర్ అసిస్టెంట్ కి తక్కువగా మిగిలిపోయారు

17)ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులకు నియామకాల సమయంలో కలిపిన గ్రేస్ మార్కుల మెరిట్ కావాలనే కలపకపోవడం

18)రెండు మూడుశాఖ సిబ్బందికి పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల సిబ్బందిని అమలు చేయని సర్వీసు రూల్స్ అడ్డుపెట్టి ప్రమోషన్ కల్పించకపోవడం

19)ఐదేళ్లుగా అదనంగా బిఎల్వో విధులు సొంత ఖర్చులతో స్టేషనరీలు కొనుగోలుచేసి మరీ పనిచేసినా..నేటికీ వారికి ఇవ్వాల్సిన అదనపు వేతనం ఇవ్వకపోవడం

20)నేటికీ సచివాలయాలు, పంచాయతీల్లో పాడైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్టేషరీ బిల్లులు చెల్లించకపోవడం, స్టేషనరీ సరఫరా చేయకపోవడం

21)సిబ్బంది విధులకు కూడా అన్నిశాఖల సిబ్బందిని సొంత ఖర్చులతో స్టేషనరీని కొనుగోలు చేసుకోమని ఆదేశాలు జారీచేయడం, వాటి బిల్లులు ఇవ్వకపోవడం

22) గ్రామీణ మత్స్య సహాయకులకు ఉద్యోగాల్లోకి చేరనపుడు కలుపుతామన్న గ్రేస్ మార్కులను నేటికీ కలపకోవడం వలన ప్రమోషన సీనియార్టీ కోల్పోవడం

23)భూముల రీ-సర్వే సమయంలో సర్వేయర్లను దూర ప్రాంతాలకు వారి సొంత ఖర్చులతోనే తిప్పి వారికి టిఏ, డిఏలు చెల్లించకపోవడం.

ఈ లోపాలతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ప్రజలకు నేటికీ ఇక్కడ అందే సేవలేంటో తెలియదంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. అధికారంలోకి రాగానే ప్రజలకు అత్యంత దగ్గరగా వున్న ఈశాఖను పూర్తిస్థాయిలో చక్కదిద్దితే ప్రజలకు ఇంటిముంగిట ప్రభుత్వసేవలు, పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దానిని ఏవిధంగా గాడిలో పెట్టాలి, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఏవిధంగా న్యాయం చేయాలని లోతుగా సమాలోచనలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లోపాలు మంత్రిమండలి దృష్టికి వెళ్లే అవకాశం వుంది. అంతేకాకుండా ఈశాఖకు చట్టబద్దత, మహిళా పోలీసులకు శాఖ కేటాయింపు లేకుండా వదిలేసిన అంశాలపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ విషయాన్ని ఇప్పటికే హోం మంత్రి వంగలపూడి అని పోలీసుశాఖ రివ్యూలోనే చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా సచివాలయవ్యవస్థలో లోపాలపై గట్టిగా తన వాణి వినిపించిన ఆమె ఇపుడు హోంశాఖ మంత్రిగా రావడం, పోలీసుశాఖ ప్రక్షాళనకు పూనుకోవడంతో ఫలితాలు వేగంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పైన పేర్కొన్న అంశాలను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది ఎప్పుడుజరుగుతుందనే విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రమే జవాబు రావాల్సి వుంది. కూటమి ప్రభుత్వంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం గంపెడు ఆశలు పెట్టుకున్నారు తమ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని.

visakhapatnam

2024-06-29 18:49:19

డిప్యూటీ సీఎం పవన్ కి పంచాయతీల సవాల్..!

గ్రామ గ్రామానా గ్రామస్వరాజ్యం అన్నారు.. ఇంటి ముందే ప్రజలకు ఉచిత సేవలన్నారు.. ఏ పనైనా గ్రామ సచివాలయాలుగా మారిన పంచాయతీల్లోనే అన్నారు.. ఏది ఎక్కడ..? ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 4 పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగిస్తే పనులు ఎలా చేపడతారు? ఎలా సేవలు అందిస్తారు.. నిధులన్నీ ప్రభుత్వం దారి మళ్లిం చేస్తుంటే.. కనీసం వీధుల్లో వీధిలైట్లు ఎవరు వేయిస్తారు.. పారిశుధ్య సిబ్బంది లేమి భారీ ఉంటే కాలువల్లో చెత్తను ఎవరు ఎత్తిస్తారు.. టెక్నికల్ సిబ్బంది లేకపోతే ఇంటింటికీ మంచినీటి కుళాయిలు మరెవరు వేయిస్తారు.. రోడ్డు ప్రక్కన దోమలు ప్రభల కుండా బ్లీచింగ్ అని పిలవబడే తెల్లబూడిదను ఎవరు చల్లిస్తారు.. గ్రామ పంచాయ తీల్లో నిధు ల్లేక సర్పంచ్ లు సొంత నిధులు, ఆపై చాలక అప్పులు చేస్తుంటే ఆ బిల్లులు చెల్లించేది ఎవరు..? గత ప్రభుత్వంలో అన్నీ కాకిలెక్కలు.. ప్రకటనలకు ఖర్చులు తప్పా ప్రజ లు ఒరిగింది ఏమీ లేదు. నిజమైన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాలతోనే సిద్ధిస్తుందని చెప్పి 1.25లక్షల ఉద్యోగాలు భర్తీచేసినా..నేటికీ ప్రజలకు సేవలు అందకపో వడానికి లోపాలు ఎక్కడున్నాయి..? అస్తవ్యస్థ గ్రామ పంచాయతీ పరిపాలన ఇపుడు ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ముందుకి వచ్చింది.. మరి పాలన గాడిన పడుతుందా..? సిబ్బంది లేమితో చతిలక పడుతుందా..?

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 13,313 గ్రామ పంచాయతీలు, 14వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 1.25 లక్షల మంది 19శాఖల సిబ్బంది ఉన్నా నేటికీ పంచాయ తీల్లో కార్యదర్శిలంతా ఒక్కొక్కరూ నాలుగైదు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీలకు సర్పంచ్ ఉంటే సరిపోతుందా..? పరిపాలన చేయడానికి కార్యదర్శి అవసరం లేదా..? ఉన్న సిబ్బందితో పనులు అయిపోతాయా కష్టమే అంటోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇప్పటికే ఇన్చార్జిల పాలనతో నడుస్తున్న గ్రామ పంచాయతీలు మరికొద్ది నెలల్లో మరింత సిబ్బంది కొరతను ఎదుర్కోనున్నాయని ఆందోళన చెందుతోంది. గత ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పంచాయతీ పాలనకు..నేటి కూటమి ప్రభుత్వంలోనై మోక్షం వస్తుందా అని రాష్ట్రస్థాయి అధికారులే ఎదురు చూస్తున్నారంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి భారీగా ఉద్యోగాలు భర్తీచేసినా.. పంచాయతీలకు అవసరమైన పంచాయతీ కార్యదర్శిలను మాత్రం పూర్తిస్థాయిలో భర్తీచేయలేకపోయింది. చేసిన వారికైనా గ్రామపంచాయతీలను అప్పగించిందా అంటే అదీలేకుండా పోయింది.

మేజర్ పంచాయతీల్లో మూడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతీ సచివాలయానికి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిని నియమించి ఒకే చోట ముగ్గురు కార్యదర్శిలను ఉంచింది తప్పితే.. భారీగా ఖాళీలు ఉన్న పంచాయతీల్లో మాత్రం వీరిని నియమించలేదు. అదేమంటే వారికి పూర్తిస్థాయి శిక్షణ, అనుభవం లేదని ఐదేళ్ల పాటు కాలం నెట్టుకొచ్చేసింది. అంతా సర్వేలు, రిపోర్టులంటూ సిబ్బందిని అసలైన సేవలకు వినియోగించకుండా అనవసర సేవలకు వినియోగిస్తూ వచ్చింది. తీరా ఇపుడు అదే సిబ్బంది లేమి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీలపై తీవ్రంగా పడింది. ఇన్చార్జి కార్యదర్శిలతో ఏ పంచాయతీలోనూ ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. దానితో ఉన్న సిబ్బందినే ఖాళీగా ఉన్న విభాగాల సేవలకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 74 ప్రభుత్వ శాఖల్లో లేని విధానం ఒక్క గ్రామ సచివాలయాల్లోనే నడుస్తుందంటే అతిశయోక్తి కాదేమో. ఏ ప్రభుత్వశాఖలోనైనా సదరు ప్రభుత్వశాఖ విధులు మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ సిబ్బంది ఏ విభాగంలో ఖాళీ ఉంటే ఆ విభాగం పనులు చేయాల్సిందే. అదీ సీనియర్ పంచాయతీ కార్యదర్శిల బెదిరింపులు, జిల్లా, మండల స్థాయి అధికారుల ఆదేశాలతో.  అలా పనిచేసినా పంచాయతీల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పంచాయతీల్లో 740 సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినా.. కనీసం 50 సేవలు కూడా ప్రజలకు అందడం లేదు.

కారణం గత ప్రభుత్వం సేవలకు అనుమతులు ఇవ్వకపోవడమే. దీనితో సేవలతోపాటు, గ్రామాల్లోని ప్రజలకు మౌళిక వసతులు కూడా పంచాయతీలు సమకూర్చలేని పరిస్థితి ఏర్పడింది. పారిశుధ్య సిబ్బంది కొరత, వారితో పనిచేయించే పంచాయతీ కార్యదర్శిల కొరత గ్రామం పంచాయతీలను తీవ్రంగా వేధిస్తోంది. కాగా గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 62కి పెంచడం వలన మరో ఆరునెలల్లో భారీగా పంచాయతీ కార్యదర్శిలు భారీగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. అపుడు పరిస్థితి మరింత జఠిలం అవుతుంది. ఈ ఇబ్బందిని గుర్తించిన గత ప్రభుత్వం ఒకేసారి 4 ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాసిన సచివాలయ మహిళా పోలీసులకు ఆప్షన్లు ఇచ్చి ఖాళీ అయిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల్లోకి వీరిని స్లైడింగ్ ఇచ్చి భర్తీచేయాలని చూసింది. అంతకంటే ముందుగా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు కొన్ని పంచాయతీలు అప్పగించి. తరువాత మిగిలిన వారికి పంచాయతీలును అప్పగించాలని ప్రయత్నించింది. దానికి కారణం ఏంటంటే సచివాలయాల్లోని మహిళా పోలీసు ఉద్యోగాలపై కోర్టు కేసులు నమోదు కావడంతో వారంతా పోలీసు శాఖకు చెందిన వారు కాదని డిజిపి కార్యాలయం నుంచి హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేశారు.

ఆ తరువాత వారందరినీ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న విభాగాల్లోని సేవలకోసం వినియోగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్పేర్ అసిస్టెంట్లు పోస్టులకి స్లైడింగ్ ఇచ్చి పంపాలని భావించారు. కానీ కాలయాపన చేయడం, వీరికి సర్వీసు నిబంధనలు పూర్తిస్థాయిలో లేకపోవడం, ఈ శాఖకు చట్టబద్దత లేకపోవడంతో ఆ పనికి కూడా మంగళం పాడేసింది. ఇపుడు ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. త్వరలో ఖాళీ అయిపోయే పంచాయతీ కార్యదర్శిల స్థానంలో కొత్తగా భర్తీచేయాంటే సుమారు 3500పైగా పోస్టులను భర్తీచేయాలి. అయితే ఆర్ధిక పరమైన అంశాల జోలికి వెళ్లకూడదని సీఎం చంద్రబాబునాయుడు అన్ని ప్రభుత్వశాఖలను ఆదేశించడంతో కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ముందు పంచాయతీలను గాడిలో పెట్టాలన్నా, ప్రజలకు పూర్తిస్థాయిలో పరిపాల న అందించాలన్నా..ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శిలను భర్తీ అయినా చేయాలి..లేదంటే ఏ ప్రభుత్వశాఖకు చెందని మహిళా పోలీసులనైనా సదరు ఖాళీల్లో  స్లైడిండ్ ఇచ్చి భర్తీచేయాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఎలా వుంటుందో చేతల్లో చూపిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు భారీ లక్ష్యం ఉంది. ఇపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద మాత్రమే ఖాళీల భర్తీ ఆర్ధిక భారం పడకుండా చేపట్టడానికి ఆస్కారం వుంటుంది. అదే సమయంలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు కూడా పంచాయతీల అప్పగింత, పదోన్నతులు కూడా చేపడితే తప్పా ఉన్న సిబ్బంది ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి భారీ లక్ష్యాన్ని ముందుంచుకున్న డిప్యూటీ సీఎం పంచాయతీల సవాల్ ను ఏ విధంగా స్వీకరిస్తారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు ఎలా అందిస్తారనేది ఇపుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ కు ఎలాంటి పుల్ స్టాప్ పెడతారనేది..?!

visakhaptanam

2024-06-28 18:12:52

అనిత మహిళా పోలీసుల భవిత..!

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి, మోసానికి గురైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. ఇపుడు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. అందునా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మహిళ కావాడం, సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ పై మంచి పట్టుఉండటం..  సచివాలయశాఖలో మహిళాపోలీసులే అన్యాయం అయిపోవడం, వారి సమస్యల పరిష్కారానికి హోం మంత్రి  మాత్రమే తమ భవితకు భరోసా అని  రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 12వేలకు పైగా మహిళా పోలీసులు నమ్మకం పెట్టుకున్నారు.  హోం మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సచివాలయ శాఖలో తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ శాఖకు తలా తోకా లేకుండా చేసిందని, కనీసం ప్రభుత్వశాఖకు ఐదేళ్ల కాలంలో చట్టబద్ధత కూడా తీసుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తమ మహిళా పోలీసు ఉద్యోగాలపై హైకోర్టులో కేసులు ఉండటంతో గత ప్రభుత్వ హయాంలో పోలీసుశాఖ ద్వారానే మహిళా పోలీసులు పోలీసు సిబ్బంది కాదని ఏజితో అఫడిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుందని వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు చేపకట్టకపోగా మహిళా పోలీసులందరినీ గాల్లోనే ఉంచి.. సచివాలయాల్లో ఖాళీగాఉన్న ప్రభుత్వశాఖల సిబ్బంది పనులన్నీ చేయించదని కన్నీరు మున్నీరవుతున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని.. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అత్యంత నిర్లక్ష్య దోరణి గత ప్రభుత్వం ప్రదర్శించిందని చెబుతున్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా సచివాలయ ఉద్యోగులంతా ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోజనాలు కోల్పోయినా.. కనీసం ఉద్యోగమైనా నిలుస్తుందా అంటే ఇపుడు సదరు శాఖకు చట్టబద్దత లేకపోవడం, తమ ఉద్యోగులపై కోర్టుల్లో కేసులు నమోదు కావడం.. దానికి ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసి ఉద్యోగులను కేసుల నుంచి రక్షించడం వంటివి గత ప్రభుత్వం కనీసం చేపట్టలేకపోయిందని వాపోతున్నారు. ప్రస్తుతం హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి హోంశాఖ ఉద్యోగులుగా విధుల్లోకి చేరిన మహిళా పోలీసుల ప్రధాన సమస్యను ఆమె దృష్టికి తీసుకు వెళ్లడం.. అదే సమయంలో ప్రభుత్వం కూడా వీరిని ఇదే పోలీసుశాఖలో మహిళా పోలీసులను క్లరికల్ విభాగంలోకి తీసుకోవాలని యోచన చేయడం.. ఇంజనీరింగ్ చదివిన వారిని సైబర్ క్రైమ్ విభాగంలో వినియోగించుకోవాలని చూడటం.. కార్యాలయాల్లో కూడా మినిస్టీరియల్ సిబ్బంది కొరత అధికంగా ఉండటంతో ఆ ఖాళీల్లో వీరిని వినియోగించుకోవాలని పోలీసు అధికారులు మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వంటి వార్తలొస్తున్నాయి. 

మరో వైపు ఉద్యోగులు ఎప్పటినుంచో అడుగుతున్నట్టుగా .. తాము నాలుగు పోస్టులకి పోటీ పరీక్ష రాసి మహిళా పోలీసు ఉద్యోగాలకి ఎంపిక అయ్యామని.. కనీసం ఖాళీగా ఉన్న మిగిలిన నాలుగు విభాగాల పోస్టుల్లోకి అయినాత తమను తీసుకోవాలని మహిళా పోలీసులు స్లైడింగ్ ఆప్షన్ అడుగుతున్నారు. ఇదిలా ఉండగా మరో ఏడాదిలో పెద్ద ఎత్తు పంచాయతీ కార్యదర్శిలు ఉద్యోగవిరమణలు చేస్తున్నతరుణంలో మరిన్ని ఖాళీలు రాష్ట్రంలో ఏర్పడనున్నాయి.  ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి మూడు నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. కనీసం మహిళా పోలీసుల ఖాళీ అయిన పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్టైడింగ్ ఇచ్చినా ప్రభుత్వానికి కొత్తగా మళ్లీ ఉద్యోగాలు భర్తీచేసే ఆర్ధిక భారం తప్పుతుంది. ఖాళీగా ఉంటే విభాగాల్లో సిబ్బందిని కూడా నియమించినట్టు అవుతుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం. అయితే ఇవన్నీ ఊహాగానాలు.. కొందరు అధికారులు అనధికారికంగా చెప్పడం తప్పితే నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం ప్రస్తుతం 74 ప్రభుత్వశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగుల దగ్గర నుంచి గ్రూప్-1, 2, 4, కేటగిరీల వారీగా ఖాళీలు వివరాలు సేకరిస్తోంది.. జాబితా వస్తే ఇతర ప్రభుత్వశాఖల్లోకి జూనియర్ అసిస్టెంట్లుగానైనా స్లైడింగ్ ఇచ్చి పంపుతారనే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా సమాచారం అందుతోంది.

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు నష్టపోయిన ప్రయోజనాలు, గతప్రభుత్వ చర్యలు ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే..

-గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కల్పించకపోవడం, ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం
-సచివాలయ మహిళా పోలీసులను పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు కాదని డిజిపి కార్యాలయం నుంచే కోర్టుకి అఫడవిట్ దాఖలు చేయడం
-రెండేళ్ల తరువాత చేస్తామన్న ప్రొభేషన్ డిక్లరేషన్ 9నెలలు అనంతం చేసి..ఆ 9నెలలు ఫుల్ పేస్కేలు సచివాలయ ఉద్యోగులకు రాకుండా చేయడం
-ప్రొబేషన్ పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, వాటి గురించి కనీసం ప్రస్తావించకపోవడం
-సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యే నాటికి ప్రభుత్వ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందని..ప్రొబేషన్ ఖరారుకి ముందు డిఏలు, హెచ్ఆర్ఏ కుదించేయడం
-సచివాలయ ఉద్యోగులతోనే ఖాళీగా ఉన్న విభాగాల సిబ్బంది విధులు చేయించడం, ఒక్కో సచివాలయ కార్యదర్శికి కనీసం 4 పంచాయతీలు అప్పగించడం
-ఉద్యోగుల సర్వీసు పూర్తయి మొదటి పదోన్నతికి దగ్గర పడినా సర్వీసు నిబంధనల ప్రకారం ఏ తరహా పదోన్నతి ఇస్తారో ఉద్యోగులకు చెప్పకపోవడం
-కొన్నిశాఖల సిబ్బందికే ఇన్ సర్వీసు శిక్షణ అమలు చేసి, మళ్లీ అదే జీతానికి సచివాలయశాఖలోనే పనులు అప్పగించడం(ఏఎన్ఎంలు)
- మహిళా పోలీసులకే అదనంగా బిఎల్వో విధులు అప్పగించి వారి  సొంత ఖర్చులతోనే స్టేషనరీ కొనుగోలు చేయించి నేటికి బిల్లులు చెల్లించకపోవడం
-గత నాలుగేళ్లుగా బిఎల్వో విధులు నిర్వహించిన మహిళా పోలీసులకు తహశీల్దార్ కార్యాలయాల్లో అదనపు విధుల బిల్లులు పెట్టకపోవడం
-పీఆర్సీని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మాదిరిగా పూర్తిస్థాయిలో సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడం, అరియర్స్ ఇవ్వకపోవడం
-మహిళా పోలీసుల సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ప్రకారం వీరికి 5 దశల్లో సిఐ వరకూ పదోన్నతులుగా చూపిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం
-ఆచరణలో మాత్రం అన్నిశాఖల కంటే ముందుగా ఒక్క పోలీసుశాఖ ద్వారా విధుల్లోకి చేరిన మహిళా పోలీసులనే గాల్లోనే ఉంచేసిన గత ప్రభుత్వం
-మొదటి పదోన్నతి దగ్గరపడినా..మహిళాపోలీసులకు ప్రభుత్వశాఖను కేటాయించకపోవడం, వారిపై కోర్టు కేసులకు శాఖాపరంగా సమాధానం చెప్పకపోవడం
-గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధులకు స్వచ్చందంగా రాజీనామాలు చేసి వేరే శాఖలకు వెళ్లిపోవడం
-ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక శాఖ ఉద్యోగి నాలుగైదుశాఖలకు చెందిన విధులు ఒక్క సచివాలయాల్లోనే సెలవురోజుల్లో కూడా పనిచేయడం

visakhapatnam

2024-06-26 19:25:10

రాజధాని పేరులో విశాఖ ఔట్..!

అవును రాజధాని పేరు నుంచి విశాఖ ఎగిరిపోయింది.. ఇక శాస్వత రాజధాని అమరావతి మాత్రమే..దానికోసం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సీఎం చంద్రబాబునా యుడు కార్యాచరణను వేగం పెంచారు. రాజధానిని పూర్తిస్థాయిలో చేపట్టి ఇక రాజధానిని విభజించడానికి వీలు లేకుండా ఒకే దగ్గర కేంద్రీకృతం చేసేలా యోచన చేస్తున్నా రు. ఇక ఎప్పుడూ ఉన్నట్టుగానే విశాఖ ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చెందనుంది. ఇక్కడకు రాబోయే సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా రాజధాని ప్రాంతానికే తరలిపోయే అవకా శాలున్నాయి. గత వైఎస్సార్సీపీ ఓవర్ కాన్ఫిడెన్స్.. మూడు రాజధానుల పేరుతో చేసిన తాత్సారం..మళ్లీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేస్తామన్న ఆలోచనతో చేసిన కాల యాప సరిగ్గా కూటమి ప్రభుత్వం వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. కూటమి దెబ్బకి ఒక్కసారిగా విశాఖలోని రియలెస్టేట్ కుప్పకూలిపోయింది.

అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొని దిగాలుగా ఉన్నవారందికీ పంట పడినట్టే. విశాఖలో పడిపోయిన రియలెస్టేట్ అమరావతిలో పుంజుకోనుంది. రాజధాని అక్కడే వస్తుందని ముందుగా ఊహించి భూములు కొన్నవారందరికీ దశ తిరిగిపోనుంది. అదే ఆలోచన భూములు విశాఖలో కొన్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్నబూములను ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడే వారంతా రాజధాని విషయంలో క్లారిటి రావడంతో క్యూ కట్టే అవకాశాలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏపీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మీడియా నుంచి మేజర్ కంపెనీ లన్నీ అమరావతికే వచ్చేయనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్క సెక్రటేరియట్ అసెంబ్లీ మాత్రమే వున్న రాజధాని ప్రాంతంలో ఇపుడు అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులకు కూడా నివాసాలు నిర్మించేందుకు యుద్ద ప్రాతిపదిక కార్యాచరణ జరుగుతోంది. వాటితోపాటు 75 ప్రభుత్వశాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్ కి చెందిన క్వార్ట్రర్స్ కూడా నిర్మాణం చేపడితే అక్కడ పనిచేయడానికి ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండ వనేది ప్రభుత్వం ఆలోచన. 

వాటితోపాటు, రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లోని అఖిలభారతస్థాయి అధికారులకు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించడం ద్వారా పరి పాలన సులభతరం అవతుందనేది ప్రభుత్వం ఆలోచన. ప్రభుత్వ ఆలోచన అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి రాజధానితోపాటు, అధికారులకు నివాసాలు, క్యాంపు కార్యా లయాలు అంతేవేగంగా వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు ఎమ్మెల్యేలకు కూడా క్వార్టర్స్ రాజధాని ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రజాప్రతినిధులకు కూడా రాకపోకలకు వీలుగా వుంటుంది. కూటమి ప్రభుత్వం శాస్వత రాజధానిని అమరావతిలోనే నిర్మించాలనుకోవడంతో విశాఖ కేవలం ఆర్ధిక రాజధా నిగా పేరు మాత్రమే పొందనుంది. ఇక ప్రధాన కార్యకలాపాలన్నీ కూడా అక్కడే జరగనున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడు రాజధానుల పేరుతో చేసిన రాజకీయం, తాత్సారం కూడా నేడు కూటమి ప్రభుత్వం ద్వారా శాస్వత రాజధానిని అమరావతిలోనే నిర్మించుకోవడానికి మార్గం సుగమం అయ్యింది.

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి అంకురార్ఫణ..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మించడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారుల కార్యాలయాలు ఒకేటకు చేర్చితే పరిపాలన కు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా ఒకేచోట అన్ని కార్యాలయాలూ ఉంటాయి. అటుప్రభుత్వానికి కూడా నిర్వహణ భారం చాలా తగ్గిపోతుంది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశాలకు కూడా చక్కగా ఉంటుందని యోచిస్తున్నారు. తెలంగాణలో మాదిరిగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించి, వాటి ద్వారా వచ్చే ఫలితాలను పొందిన తరువాత ఇంటిగ్రేడెట్ మండల కాంప్లెక్స్ లను నిర్మించడం ద్వారా కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిచడానికి వీలుగా వుంటుందని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. అందులోనూ ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ దాదాపుగా శిధిల స్థితికి వచ్చేశాయి. దీనికారణంగా కొత్తవాటిని అన్ని కార్యాలయాలకు కలిపని ఒకేచోట నిర్మిస్తే పరిపాలన సౌలభ్యానికి వీలుగా వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన.

జిల్లా కేంద్రాల్లోనూ అధికారుల నివాసాలు..
అమరావతి రాజధాని తరహాలోనే జిల్లా కేంద్రాల్లోని అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించడ ద్వారా అందరూ ఒకేచోట నివాసాలు ఉండటానికి వీలుగా వుంటుంది. అంతేకాకుండా అధికారులకు బదిలీలు, పదోన్నతులు ఏర్పడినపుడు వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అధికారులకు క్వార్టర్స్ నిర్మిస్తే ఎప్పుడు ఏ అధికారికి బదిలీచేపట్టినా వెంటనే విధుల్లోకి చేరడంతోపాటు కుటుంబాలను కూడా వెంటనే మార్చుకునేందుకు తరలించుకోవడానికి వీలుగా వుంటుంది.ఇప్పటికే దానికోసం గత ప్రభు త్వమే యోచన చేసినా అది అమలులోకి రాలేదు. కాని ఇపుడు రాజధాని నిర్మాణంతోపాటే జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను కూడా అంతేవేగంగా చేపట్ట డం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. మొత్తానికి రాజధాని వ్యవహారం యావత్ పరిపాలన రూపు రేఖలనే మార్చేసేందుకు మార్గం సుగ మం చేసింది. ఇన్ని ఆలోచనలు, యోచనలు ఉన్నా ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుందనేదే ఇక్కడ ప్రశ్న..?!

visakhapatnam

2024-06-13 04:37:31

సచివాలయ మహిళా పోలీసులకి స్టైడింగ్ ..?!

ఆంధ్రప్రదేశ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే సమర్ధవంతమైన పరిపాలన అనేది ఉద్యోగులు, ప్రజల్లో ఒక నమ్మకం. ఆయన నిర్ణయం తీసుకుంటే  దిశ, దశ మారడం ఖాయం.. సంపదను సృష్టించాలన్నా ఆయనే.. ఉన్న వనరులను అదనపు భారం పడకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలన్నా ఆయనే..అందుకే బాబు వస్తే జాబుకి గ్యారెంటీ వస్తుందని యువత అంతా బలంగా నమ్ముతారు..ఇపుడు అదే నమ్మకం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూడా గాడిలో పెట్టి ప్రజలకు ఇంటి ముంగిటే ప్రభుత్వ సేవలు అందించడానికి ఉపయోగ పడేలా మారనుంది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ఈశాఖలోని లోపాలు, అభివృద్ధి, ఇబ్బందులు.. ప్రజలకు అందే సేవలు, ప్రభుత్వానికి ఈశాఖ వలన ఉపయోగాలపై ఈఎన్ఎస్-ఈరోజు మాత్రమే మరే మీడియా రాయని వాస్తవాలు రాసింది.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్టు.. ముఖ్యమంత్రి తీసుకునే ఒక్క నిర్ణయంతో కొత్త ఉద్యోగాల కల్పన లేకుండా ఉన్న ఉద్యోగులతోనే పూర్తిస్థాయిలో ప్రజలు సేవలు అందించడంతోపాటు, ఉద్యోగుల భవిష్యత్తుకి కూడా గ్యారెంటీ వస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఆ నిర్ణయం ఏంటి..? ఎందుకు తీసుకోవాలి..? దాని వలన ఉపయోగాలేంటి..? ఒక ప్రభుత్వ శాఖ ప్రక్షాళనకు ఆ నిర్ణయం ఏ విధంగా దోహద పడుతుందనేది ఈ స్టోరీ చదివితే మీకే అర్ధం అవుతుంది..! 

గ్రామ, వార్డు సచివాలయశాఖ.. పేరుకి ప్రభుత్వశాఖ అన్నమాటే గానీ ఇందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం తమ ఉద్యోగాల భవిష్యత్తు ఏంటో అనే అనుమానమే విధుల్లోకి చేరిన దగ్గర నుంచి నేటి వరకూ ఉద్యోగులను వెంటాడుతూనే ఉంది. దానికి కారణం ఈ శాఖను ఏర్పాటు చేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనికి దిశ, దశ కల్పించకపోవడమే. ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ..ఇపుడు ఉద్యోగుల భవిష్యత్తుని కూడా అంధకారంలోకి నెట్టేసింది. తొలి తప్పు ఈ శాఖకు చట్టబద్ధత కల్పించకపోవడం. రెండవ తప్పు ప్రధాన ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం, మూడవ తప్పు నిబంధనలకు పట్టించుకోకుండా నియామకాలు చేపట్టడం. కోర్టుకేసులు పడినా వాటికి ప్రభుత్వం తరపునుంచి పరిష్కారం చూపకపోవడం. ఇలా చెప్పుకుంటే పోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు నేడు సచివాలయ ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి ఉద్యోగాల నియామకాల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలు అమలు చేయకుండా నియామకాలు చేపట్టారని హైకోర్టులో ఉమ్మడి విశాఖజిల్లాకు చెందిన వ్యక్తి కేసు వేస్తే..దానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం తరపున కౌంటర్ ఇవ్వని ప్రభుత్వం వీరిని పోలీసులుగా పరిగణించమని, వారికి పోలసు విధులు అప్పగించమని చెప్పి హైకోర్టుకి అఫడిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది. దీనితో మహిళా పోలీసుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఇపుడు వీరు పేరుకి పోలీసుశాఖ ఉద్యోగులైనా..వీరికి ఎలాంటి పదోన్నతులు రాకుండా కోర్టుకేసులు మోకాలడ్డుతున్నాయి. వాస్తవానికి పోలీసుశాఖ నుంచి నియమితులైన వీరంతా అదే పోలీసుశాఖ వీరు మా ఉద్యోగులు కారని, వారికి పోలీసు విధులు అప్పగించమని చెబితే మరే ప్రభుత్వశాఖకు చెందిన ఉద్యోగులనేది గత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అలాగని వీరికి పోలీసుశాఖ విధులేమైనా ఇవ్వడం మానేశారా అంటే కోర్టుకి సమర్పించిన అఫడవిట్ మినహా పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు. అంతేకాకుండా సచివాలయాల్లో ఖాళీగా ఉన్నశాఖల ఉద్యోగాల విధులు కూడా వీరితోనే చేయిస్తున్నారు.

అదటుంచితే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సు 62ఏళ్లకు పెంచేయడంతో సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శిలు రిటైర్ కాకుండా సుమారు మూడు వేల మంది ఉండి పోయారు. వాళ్లంతా వచ్చేఏడాది మార్చి తర్వాత మూకుమ్మడిగా ఉద్యోగ విరమణ చేస్తారు. అపుడు ఒకేసారి సచివాలయాలు ఖాళీ అయిపోతాయి. ఆ సమయంలో ప్రభుత్వం ఉద్యోగాలను కొత్తనోటిఫికేషన్ తో భర్తీచేయకపోతే గ్రామాల్లో సేవలు అందించడం కష్టమవుతుంది. ఇప్పటికే సచివాలయశాఖలో చాలా ఉద్యోగాలు భర్తీకాకుండా ఉండిపోయాయి. ఖాళీలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీచేస్తున్నా, దీనికంటే మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగులు ఈ ఉద్యోగాన్ని వదలి వెళ్లిపోతున్నారు. దానితో ఏ ప్రభుత్వశాఖకు చెందని మహిళా పోలీసులతోనే సచివాలయాల్లోని ఖాళీగా వున్న ప్రభుత్వశాఖల  విధులను చేయిస్తోంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగులు వారి శాఖకు చెందిన విధులు మాత్రమే చేస్తారు. వెరైటీగా సచివాలయశాఖలోని ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన విధులూ ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. వాటికితోడు సొంత ఖర్చులు పెట్టుకొని మరీ చేసే బిఎల్వో విధులు వీరికి అధనం. అదనపు విధులు అప్పగించిన ప్రభుత్వం వారితోనే స్టేషనరీ, ట్రాన్స్ పోర్టు ఖర్చులన్నీ పెట్టుకొని మరీ చేయమంటుంది. బలవంతంగా చేయిస్తోంది కూడా. అలా చేయని ఉద్యోగులపై సస్పెషన్సులు, చార్జి మెమోలు కూడా ఇచ్చి భయపెడుతోంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు సస్పెన్షన్ కి గురై విధుల్లోకి చేరకుండా ఉండిపోయారు.

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14వేలకు పైబడి మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లు ఇపుడు ఏ ప్రభుత్వశాఖకు చెందిన ఉద్యోగులో ప్రభుత్వం దగ్గర కూడా నివేదికలు లేవు. ఏ కారణంగా వీళ్లని పోలీసులుగా పరిగణంచమని చెప్పి హోంశాఖ హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేయడమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉద్యోగులకు స్లైడింగ్ ఇస్తే..ఇదే గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఖాళీగా ఉన్న కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్పేర్ అసిస్టెంట్లు పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చేయాలని గత ప్రభుత్వం కూడా ఆలోచించినా దానిని ఆచరణలో పెట్టలేదు. కారణం ఆ భయంతోనైనా వైఎస్సార్సీపీకే సచివాలయ ఉద్యోగులందరూ ఓటువేస్తారనే కుటిల ఆలోచనతో అలా చేసిందనే బలంగా నమ్మారు. ఉద్యోగులు. ఒక్క శాఖ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని మొత్తం 19శాఖల ఉద్యోగులను భయపెట్టి..వారి చేతులో పెట్టుకోవాలని చూసిందని కూడా ఇపుడు ఒంటికాలపై లేస్తున్నారు. త్వరలో సుమారు మూడువేల మంది పంచాయతీ కార్యదర్శిలు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అపుడు ఒకేసారి సచివాలయాల్లో సేవలకు ఉన్న ఉద్యోగులకే మళ్లీ అదనపు బాధ్యతలు ఉన్నఅప్పగించాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్క పంచాయతీ కార్యదర్శి మూడు నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దానితో ఏ పంచాయతీకి న్యాయం చేయలేకపోతున్నారు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పై నాలుగు ఉద్యోగాలకు పోటీ పరీక్షరాసి మహిళా పోలీసులుగా ఎంపికై వారికి స్టైడింగ్ అమలు చేయడం ద్వారా మహిళా పోలీసులు కోరుకున్న, ఖాళీ ఉద్యోగాల్లో భర్తీకి మార్గం సుగమం అవుతుంది.

 మహిళా పోలీసుల్లోనూ చాలా మంది బిటెక్ చేసిన వారు, డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరి అర్హతలతో 19విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులన్నీ స్టైడింగ్ ద్వారా ప్రభుత్వం ఎంచెక్కా భర్తీచేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వానికి కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే ఆర్ధిక భారం కూడా తప్పుతుంది. ఎలాగూ మహిళా పోలీసు వ్యవస్థకి పోలీసుశాఖలో హోంగార్డు నుంచి ఎస్ఐ వరకూ అందరూ వ్యతిరేకమే కనుక.. ఈ మహిళా పోలీసు వ్యవస్థను తీసేయడానికి, కోర్టు కేసుల నుంచి వీరికి విముక్తి కల్పించడానికి మంచి అవకాశం కూడాఏర్పడుతుంది. ఇపుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్ కూడా ఇదొక్కటే. ఒక్క ఐడియాతో గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత, ఖాళీల భర్తీ, అయోమయంలో ఉన్న ఉద్యోగులకు స్లైడింగ్ ద్వారా ఉద్యోగ భద్రత అన్నీ వచ్చేస్థాయ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాఖ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎంతో  నమ్మకం పెట్టుకొని మరీ చూపించిన ఓటు మద్దతుకు సీఎం చంద్రబాబు తీసుకునే ఒక్క నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయనడంతో ఎలాంటి సందేహం లేదు.. వచ్చిన అశకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉద్యోగులకు సమ న్యాయం చేయడంతోపాటు కోర్టు కేసులకి సమాధానం చెప్పే పనికూడా ఉండదు. చూడాలి కూటమి ప్రభుత్వం సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

visakhapatnam

2024-06-11 05:20:53

వీళ్లంటే మోజు..వాళ్లంటే గలీజు..!

అవును గ్రామ సచివాలయాల్లోని గ్రామీణ వ్యవసాయ సహాయకులంటే ప్రభుత్వానికి మోజు.. కాదు ఇష్టం.. లేదు ప్రేమ.. కానీ వాళ్లంటే(ఎఈఓ) మాత్రం గలీజు..ఇవన్నీ కాదుగానీ వీళ్లని అడ్డం పెట్టుకొనే అన్నీచేయొచ్చు.. ఏంటి తేడాగా ఉంది వ్యవహారం అనుకుంటున్నారా..? ఎస్ పక్కా తేడా.. అంతకు మించిన కల్తీ కూడా.. ఇంకా ఆపైన ఏమైనా చెప్పుకోవచ్చు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయశాఖలోని పేస్కేలు ఎక్కువగా ఉన్న ఒక క్యాడర్(ఏఈఓ) పోస్టులను ఏకంగా రద్దు చేసేయడానికి పక్కాగా ప్రణాళిక వేసింది. కాకపోతే అందరూ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని అనుకున్నారు గానీ..ఆ ముసుగులో ఒక క్యాడర్ పోస్టునే రద్దుచేసేయడానికి కుట్ర జరిగిందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వాస్తవాలు తెలుసుకుంటే మీరు కూడా నిజమే కదా అంటారు. వ్యవసాయశాఖలో జరుగుతున్న తేడాలపైనా.. ప్రభుత్వం ముందుకి ఈఎన్ఎస్-ఈరోజు ప్రత్యక కథనాలను తీసుకొచ్చేందుకు సిద్దపడింది. 

గ్రామ సచివాలయశాఖలో గ్రామీణ వ్యవసాయ సహాయకుల(విఎఎ) పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా భర్తీచేసిన ప్రభుత్వం అప్పటికే విధులు నిర్వహిస్తున్నఏఈఓ(అగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ ఆఫీసర్) పోస్టులను భర్తీచేయడం మానేసింది. ఇపుడు అదే ఏఈఓ పోస్టుల్లోకి ప్రస్తుతం పనిచేస్తున్న విఎఎలకు గ్రేడ్-2 విఎఎలుగా పదోన్నతులు కల్పించడానికి ఫైల్ సిద్దం చేసి 26 జిల్లాల నుంచి సచివాలయాల్లోని విఎఎల సమాచారం కోరుతోంది.. మళ్లీ ఇదే ఏఈఓలను పదోన్నతులు కల్పించకుండా పక్కన పెట్టేసింది. ఒక ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే సమయంలో అన్ని క్యాడర్ పోస్టలకు రోస్టర్ పాయింట్ విధానంలో పదోన్నతులు కల్పించాలి. అది ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సూచిస్తుంది. కానీ వ్యవసాయశాఖలోని ఈఏఓలకు పదోన్నతులు కల్పించడానికి మాత్రం కమిషనరేట్ లోని ఉన్నతాధికారులు ససమేమిరా అంటున్నారు. మాకు పదోన్నతులు ఇవ్వరా సారూ అంటే ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు..  నిప్పులో నెయ్యివేసినట్టుగా గత ప్రభుత్వం ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వకుండా పక్కనపెట్టేసిన పనికి ఇదేశాఖలోని ఏఓ(మండల వ్యవసాయాధికారులు) కూడా మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఇపుడు అదే ఏఓలు ప్రస్తుత ఏఈఓ(అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్) గా ఉన్న ఉద్యోగులకు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పదోన్నతులు రాకుండా మోకాళ్లు అడ్డుపెడుతున్నారు. దానికి కారణం ఏఓల చదువు(బిఎస్సీ అగ్రికల్చర్) వ్యవసాయశాఖలోని కమిషనర్ తరువాత అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ వరకూ అందరూ చదివింది  ఏజీబిఎస్సీనే. ఏదో అతి కొద్ది మంది అధికారులు, సిబ్బంది మాత్రమే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివారు.

 అదే వీరి మాట ప్రభుత్వంలో చెల్లుబాటు కావడానికి కారణం అయ్యింది. ఎజీబిఎస్సీ చదివి మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తున్న తమ క్రింద ఏఈఓలకు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా పదోన్నతి కల్పిస్తే వాళ్లూ మేము ఒకటే అయిపోతామని చెప్పి రాష్ట్రస్థాయిలో అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో అగ్రికల్చర్ డిప్లమో చదివి ఏఈఓలుగా ఉద్యోగాలు చేస్తున్నావారు పదోన్నతులకు దూరం అయిపోయారు. వీరి పదోన్నతులకు సంబంధించి గతంలోని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తీవ్రంగా ప్రయత్నించి విసిగిపోయారు. ఆ తరువాత కమిషనరేట్ నుంచి మండల స్థాయి వరకూ ఏఓలంతా ఒక్కటైపోయి వీరికి పదోన్నతులు రాకుండా అడ్డుకున్నారనే విషయం తెలుసుకొని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్థాయిలో ఫైలు కదిపినా.. కమిషనరేట్ అధికారులు దానికి సంబంధించి ఫైల్ కదపకపోవడంతో చేసేది ఏం లేక వెనుతిరిగారు. ఒకా నొక సమయంలో మీశాఖలోని అధికారులే మీ పదోన్నతులకు అడ్డుపడుతుంటే నేను మాత్రం ఏం చేయగలనని మంత్రి ఉన్నప్పుడే కన్నబాబు చేతులెత్తేశారు. 

కాగా ఇపుడు తాజాగా గ్రామ సచివాలయాల్లోని విఎఎలకు గ్రేడ్-2 ఏఈఓలుగా పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం అంతా సిద్దం చేసింది. ఆ సమయంలో వీరికంటే ముందుగా ఉన్న ఏఈఓలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన తరువాత. ఆ ఖాళీల్లోని పోస్టులను రోస్టర్ పాయింట్ల ద్వారా భర్తీచేయాల్సి వుంది. కానీ ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వకుండానే ఇపుడు విఎఎలకు పదోన్నతులు కల్పించడం ఏంటని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈఏఓలు నెత్తీనోరూ కొట్టుకుంటూ లబోదిబో మంటున్నారు. ఈఏఓలకి పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే క్యాడర్ ను ఏర్పాటుచేస్తే దానికి ఏఓల సంఘం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకొని అదే చదువులో కమిషనరేట్ విధులు నిర్వహిస్తున్న అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ అధికారులు కూడా ఏఈఓ ప్రమోషన్ ఫైల్ పక్కన పెట్టేశారు. కావాలంటే వీరికి ప్రభుత్వం ద్వారా ఇన్ సర్వీస్ లో ఏజీబిఎస్సీ చదివించి ఆపై ఏఓలుగా పదోన్నతులు ఇవ్వడానికి అంగీకరిస్తాం తప్పితే .. డిప్లమా అగ్రికల్చర్ చదివి తమ క్యాడర్ కి సమానంగా తమ క్రింది ఆఫీసర్ అనే పదంతో వీరికి పదోన్నతులు ఇస్తే.. వారికి మాకూ పెద్దగా తేడా ఏముంటుందని..ఏఓలంతా రాష్ట్రస్థాయిలో నెట్వర్క్ తిప్పడంతో.. వీరికి మద్దతుగా కమిషనరేట్ లో కూడా ఏఈఓ ప్రమోషన్ ఫైలు పక్కన పెట్టేశారు.

ఇపుడు మళ్లీ విఎఎలకు పదోన్నతులు ఇస్తున్న వేళ ఏఈఓలు కూడా తమకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరిలో చాలా మంది పదోన్నతులు రాక ఏఈఓటుగానే ఉద్యోగ విరమణ చేయడంతో తాము కూడా ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందని ప్రస్తుతం ఉన్న ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏఈఓల పదోన్నతుల ఫైల్ క్లియర్ అయిన తరువాత మాత్రమే సచివాలయశాఖలోని విఎఎలకు పదోన్నతులు కల్పించాలి. అలాకాకుండా వెనుక విధుల్లో చేరిన విఎఎలకు కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పదోన్నతులు ఇచ్చి...పదేళ్లు, 20ఏళ్లుగా పనిచేస్తున్న ఏఈఓలను ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టేయడానికి ఏఈఓలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఏఈఓలు వ్యవసాయశాఖ చేస్తున్న తేడా వ్యవహారాలపై కోర్టును ఆశ్రయిస్తే.. దానిని ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కేవలం అగ్రికల్చర్ ఆఫీసర్ క్రింద అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే పదం వస్తే తట్టుకోలేకపోతున్న ఏఓలు, కమిషనరేట్ అధికారుల కుటిల బుద్ధి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న ఏఈఓలు పదోన్నతులకు దూరం అయిపోయారు. 

ఇపుడు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న విఎఎల్లో చాలా మంది బిఎస్సీ అగ్రికల్చర్ చేసినవారు, ఎమ్మెస్సీ చేసిన వారు కూడా ఉన్నారు. బహుసా ఈ కారణంతోనే వీరి పదోన్నతుల విషయంలో ఏఓలు కమిషనరేట్ లోని రాష్ట్రస్థాయి అధికారులు నోరు మెదపలేదు. అయితే పదోన్నతులు లభిస్తు అందులో కూడా డిప్లమా అగ్రికల్చర్ చేసిన ఉద్యోగులు ఉన్నారు.. మరి అలాంటపుడు వారి విషయంలోనైనా అడ్డుతగులు తారా అంటే..ఇప్పుడేం తగలం ఆ తరువాత పదోన్నతుల సమయంలో మాత్రం మళ్లీ తెరమీదకి సమస్యను తీసుకు వస్తాం అన్నట్టుగా రాష్ట్రస్థాయి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. కమిషనరేట్ అధికారులు, ఏఓలు మోకాలు అడ్డుపెట్టిన ఫలితంగా ఏఈఓలు పదోన్నతులకు దూరమైపోయారు. అయితే ఇప్పటికైనా కొత్తగా ఏర్పడే రాష్ట్రప్రభుత్వం ఈఏఓలకు జరిగిన అన్యాయంపై దృష్టిసారిస్తే ముందు వీరికి పదోన్నతులు ఇచ్చిన తరువాత, గ్రామ సచివాలయాల్లోని విఎఎలకు పదోన్నతులు కల్పిస్తుంది. లేదంటే ఈ ప్రభుత్వంలోనూ ఏఈఓలు పదోన్నతులు రాని ఉద్యోగులుగానే మిగిలి పోతారు. అయితే ఇక్కడ గ్రామ సచివాలయ గ్రామీణ వ్యవసాయ సహాయకులకు పదోన్నతులు రావడం ఈఎన్ఎస్-ఈరోజు వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయశాఖలో సేవలందిస్తున్న ఏఈఓలకు కూడా సర్వీసు నిబంధనలు అమలు జరిగి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు దక్కాలన్నది మాత్రమే లక్ష్యం.  చూడాలి కూటమి ప్రభుత్వం వ్యవసాయశాఖలోని అధికారుల నిర్లక్ష్యం, ఓర్వలేని తనం కారణంగా అన్యాయంగా పదోన్నతులు కోల్పోయిన ఏఈఓల విషయంలో ఏ విధంగా న్యాయం చేస్తుందనేది...!


visakhapatnam

2024-06-09 06:55:35

కూటమి పైనే ఆశలన్నీ..!

ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో మరోసారి అడుగులు వేయబోతున్న పరిపాలనా దక్షుడు నారాచంద్రబాబునాయుడుపైనే ప్రజలు ఆశలు పెట్టుకు న్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబు అంటే పరిపాలన- పరిపాల అంటే చంద్రబాబు కానీ ఇపుడు ఆ పరిపాలనకు మరో మంచి మనసు కూడా తోడవబోతుంది. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించే మనస్థత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన సలహాలు, సూచనలు, కేంద్రంలోని బీజేపి సహాయ సహకా రాలతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యే కలలకు మళ్లీ జీవం వచ్చింది. త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కూటమి నేతలకు ప్రధాన అంశాలు ‘ఈరోజు-ఈఎన్ఎస్’ప్రభుత్వం ముందు ఉంచుతోంది. ఏ విషయాన్నైనా సూటిగా ప్రజల తరపున ప్రభుత్వం ముందు ఉంచడంలో ‘ఈరోజు-ఈఎన్ఎస్’తొలి వరుసలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా అస్థవ్యస్థమైన పరిపాలనను గాడిలో పెట్టడానికి పగ్గాలు చేపట్టబోయే కూటమి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన విషయాలను కూడా తెలియజే బాధ్యతను ‘ఈరోజు-ఈఎన్ఎస్’బుజాన వేసుకుంది. పరిపాలన, విధాన పరమైన అంశాలను చాలా లోతుగా పరిశీలిస్తూ, సాంకేతిక అంశాలను, లోపాలను, జరుగుతున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు అందించే ‘ఈరోజు-ఈఎన్ఎస్’ఇపుడు ప్రభుత్వానికి కూడా తమవంతు సహాయ సహకారాలు ప్రజలు మెచ్చే విషయంలో అందించడానికి సిద్దంగా వుందని కూడా తెలియజేస్తున్నాం. 

ఎలాగూ త్వరలో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు గత ప్రభుత్వం పెంచేసిన రెండేళ్ల ఉద్యోగ విరమణ వయస్సు వలన రిటైర్ కాబోతున్నారు. తొలిసంతకంతో మళ్లీ ఉపాధ్యా య డిఎస్సీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూటమి ప్రభుత్వం  పేరుతెచ్చుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే దానికి మూల స్థంబం ప్రభుత్వ ఉద్యోగులు వారి విషయంలో గత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పులే నేడు కూటమి అధికారంలోకి రావడానికి కారణం అయ్యాయి. ఆ తప్పులు కూటమి కూడా చేయకుండా ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయనేది గుర్తించాలి. సంఖ్యా శాస్త్రం ప్రకారం 26వ నెంబరుని డెవిల్ నెంబర్ అంటారు. మీకు ఎలాగూ కొత్త జిల్లా పెంచే ఆలోచన, కొత్త మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసే యోచన ఉంది కనుక ఆవిషయంలో ముందుకెళ్లాలని కూడా ప్రజల తరపున కోరుతున్నాం. ప్రస్తుతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అత్యంత కీలకం. కొత్తశాఖను ఏర్పాటు చేసి ఇందలో పనిచేసే ఉద్యోగులకు తాడూ బొంగరం లేకుండా చేసిన గత ప్రభుత్వ తీరుకి భిన్నంగా సత్వరమే ఈ శాఖకు చట్టబద్దత తీసుకు రావాల్సిన అవసరం వుంది. అదేవిధంగా ఇందులోని చాలా విభాగాల్లోని ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన శాఖలపై కోర్టుకేసులున్నా గత ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారం చేపట్టబోయే కూటమి దానిని స్వీకరించి ఈ వ్యవస్థ కాస్త మెరుగు పరిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి ఆస్కారం వుంటుంది. 

అదేవిధంగా ఈశాఖలోని మిగులు ఉద్యోగాలు భర్తీచేసినా, లేదంటే కారుణ్య నియామకాల ద్వారా పూర్తిచేసినా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివా లయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుతాయి. కూటమి కోసం ప్రత్యేకంగా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు మీ ప్రభుత్వంలోనే ఒక దిశ, దశ వస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇస్తామన్న పీఆర్సీ ఉద్యోగులకు ప్రకటించడం(వైఎస్సార్సీపీ లా రివర్స్ పీఆర్సీ కాదు సుమీ) బకాయి డిఏలు, సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు సత్వరమే ఇవ్వడం ద్వారా ఉద్యోగుల నుంచి సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశాలున్నాయి. చాలా సంవత్సరాలు పెద్ద పంచాయతీలు విభజన, మండలాల విభజన జరగలేదు. వాటికి కొత్త గుర్తింపు తేవడం ద్వారా త్వరలో జరగబోయే నియోజకర్గాల పునర్విభజనలో కొత్త ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. అదే సమయంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం పొందడం ద్వారా కొత్త జిల్లాల్లో మౌళిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది. 

ఇక అన్నింటికంటే అత్యవసరంగా చేపట్టాల్సింది అస్థవ్యస్థమైన పరిపాలనను గాడిలో పెట్టడం ద్వారా ఉద్యోగులు వారి వారి విధులు సక్రమంగా చేసుకొని ప్రజలకు పూర్తిస్థా యిలో సేవలు అంచడానికి వీలుగా వుంటుంద. ఈ క్రమంలో జరిగే మార్పులు, చేర్పులు, అభివృద్ధి, అవినీతి విషయంలోనూ, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగుల బాధలను కూడా ఎప్పటికప్పుడు ‘ఈరోజు-ఈఎన్ఎస్’ద్వారా ప్రజల మాటగా మీ దృష్టికి ప్రత్యేక వార్తా కథనాల రూపంలో తీసుకు రావడంలో అన్ని మీడియాల కంటే ముందుగానే ఉంటామని.. మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా లిఖిత పూర్వకంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై అశేష ప్రజానీకం విశేషం గా పెట్టుకున్న ఆశలను సాకారం చేస్తారని ఎదరు చూస్తోంది. ఇక ఏం చేస్తారో.. ఎలా చేస్తారో ప్రజల్లో భాగమైన మీడియా కూడా వేచి చూస్తుంది..!


visakhapatnam

2024-06-09 01:23:44

గ్రామ సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..?

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడబోయే టిడిపి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఉంచుతుందా..తుంచుతుందా..? అదేంటి ఒక ప్రభుత్వశాఖను అలా ఎలా తీసేస్తా రు అనే అనుమానం రాకమానదు ఎవరికైనా.. ఈ ప్రభుత్వశాఖను తీసేయడానికి కూడా ప్రభుత్వంలో చాలా అవకాశాలే ఉన్నాయి. దానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అలా తమకి అనుకూలంగా మార్చుకొని సచివాలయ ఉద్యోగులను బెదిరించి మరీ పనిచేయించుకోవాలని చూసింది. అనూహ్యంగా ప్రతిపక్షహోదా కూడా లేకుండా ఓడిపోయి ఒక మూలన కూర్చుంది. అదే సమయంలో సచివాలయాలను తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని నాడు టిడిపి నేతలు చెప్పిన మాటలు నేడు వైరల్ అవుతున్నాయి. 1.30 లక్షల మంది ఉద్యోగులను కూడా అనేక అనేక అనుమానాలు వెంటాడేలా చేస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఈ శాఖలోని లోటు పాట్లను, అభివృద్ధిని, జరుగుతున్న, జరగబోయే కార్యక్రమాలను ఒక్క ఈఎన్ఎస్-ఈరోజు ద్వారా మాత్రమే తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఏ ఒక్క మీడియా దృష్టిపెట్టలేదని, వాస్తవాలను బయటకు తీయలేదని కూడా దైర్యంగా చెప్పగం. ప్రస్తుత పరిస్థిలో ఈశాఖను తొలగిస్తే వచ్చే అనర్ధాలు, ఉంచితే కలిగే ప్రయోజనాలు, ఒక ప్రభుత్వశాఖను తొలగించడానికి, లేదా ఉంచేయడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సాంకేతిక, పరిపాలనా పరమైన కారణాలు, అవకాశాలున్నాయో కూడా ఒకసారి తెలుసుకుందాం. !

పునాధులు లేకుండా ఇల్లు కట్టడానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో..అదేవిధంగా చట్టబద్దత లేదని ప్రభుత్వ శాఖలను కూడా ప్రభుత్వంలో కొనసాగించడానికి, వచ్చే ఇబ్బందులను కోర్టు ద్వారా తట్టుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలి. సర్వీసు నిబంధనలు, పదోన్నతుల పూర్తిస్థాయిలో కల్పించని ఉద్యోగులున్న ప్రభుత్వశాఖను ఉంచడానికైనా, తుంచడానికైనా ప్రభుత్వం దగ్గర చాలా అవకాశాలే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వశాఖను తొలగించడానికి వీలుపడుతుంది కానీ, ఉద్యోగులను మాత్రం తొలగించడానికి అస్సలు కుదరదు. ఖాళీలు ఉన్న ప్రభుత్వశాఖలకు వీరిని అప్పగించేస్తే తప్పా. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయశాఖ అని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈశాఖను ప్రస్తుతం ఉన్న 74 ప్రభుత్వశాఖల మాదిరిగా తీర్చిదిద్దలేకపోయింది. నాలుగేళ్ల కాలంలో కనీసం ఈశాఖలో పనిచేసే చాలా విభాగాల్లోని ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయకుండా ఉద్యోగుల భవిష్యత్తుని గాల్లో పెట్టి.. హైకోర్టులో దాఖలైన కేసులకు అఫడవిట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. దానిపై ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి వాదనలనూ పూర్తిస్థాయిలో వినిపించకుండా ఉద్యోగుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టేసింది. అదే సమయంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టిడిపి కూడా తాము అధికారంలోకి వస్తే ఈ శాఖను తొలగించేస్తామని చెప్పడం కూడా ఇపుడు ఉద్యోగులను ఆందోళన పడేలా చేస్తుంది. 

వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖను రద్దు చేయాలంటే దానికి మంత్రిమండలి, గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో చట్టం చేసి దానిని తొలగించవచ్చు. అదేవిధంగా చట్టం చేయాలన్నా అదే విధానాన్ని అమలు చేయాలి. కానీ ఉద్యోగులను తొలగించడానికి వీలుపడదు. అదే సాంకేతిక కారణాన్ని వినియోగించుకున్న నాటి ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుని గాల్లోనే ఉంచేసి.. ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చట్టబద్దత లేకుండా చేసింది. ప్రస్తుత్తం ఈ శాఖను తొలగించి ఉద్యోగులను మాతృ శాఖలకుతరలించాల న్నా సేవలన్నీ ఇపుడు సచివాలయాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈశాఖను రద్దుచేస్తే ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడుతుంది. అలాగని సిబ్బందిని వారి శాఖలు పంపి పనిచేయించాలన్నా ఒక శాఖ పనులు మాత్రమే అపుడు ఉద్యోగులు చేస్తారు. అదే సచివాలయాల్లో అయితే అన్నిశాఖల సిబ్బంది అన్నిశాఖల పనులూ చేస్తారు. ఇక్కడ ఒక్క మహిళా పోలీసు పోస్టులపై కోర్టులో అఫడిట్ దాఖలైన నేపథ్యంలో వీరిని త్వరలో భారీగా ఏర్పడే పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి పోస్టులకు స్లైడింగ్ ఇస్తే ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని గతప్రభుత్వమే ఆలోచన చేసింది. కానీ అమలు చేయలేదు. ఎందుకంటే వీరంతా డిగ్రీ అర్హతతో నాలుగు కెటగిరీ పోస్టులకు ఒకే పోటీ పరీక్ష రాసి వచ్చారు. అలాగని వీరిని మహిళా పోలీసులుగా పోలీసుశాఖలోనే ఉంచేస్తే వీరి ప్రభుత్వశాఖ ఏదో తెలియని ఉద్యోగులగానే ఉండిపోతారు. సర్వీసు మొత్తం సచివాలయాలకే పరిమితం అయిపోతారు.

ఇపుడు కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ముందు అవకాశం ఒక్కటే సచివాలయశాఖలోని ఖాళీలను భర్తీచేయడంతోపాటు, అర్హత ఉన్న ఉద్యోగులకు స్టైడింగ్ విధానం ద్వారా ఆప్షన్లు ఇస్తే త్వరలో భారీగా ఏర్పడే ఖాళీలను భర్తీచేసే పనుండదు. ప్రభుత్వంపై ఆర్దిక భారం పడదు. అదే సమయంలో కోర్టులో దాఖలైన కేసులకు కూడా ఒక లేఖ రాసి పూర్తిగా వాటిని కొట్టించేయడానికి ఆస్కారం వుంటుంది. మహిళా పోలీసులు, వీఆర్వోలు తదితరులపై పడ్డ  కోర్టు కేసులకు విముక్తి కలుగుతుంది. 

సచివాలయశాఖ ఏర్పాటు వెనుక దారుణమైన ఆలోచన 
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటుతో ఇంటిముంగిటే సేవలు అందిస్తున్నామని చెప్పిన నాటి ప్రభుత్వం దారుణమైన ఆలోచన చేసి మాత్రమే ఈ శాఖను ఏర్పాటు చేసిందనే కారణాలు, అనుమానాలు ఇపుడు తెరపైకి వస్తున్నాయి. ఉద్యోగులను పూర్తిస్థాయిలో సెలవుల్లో కూడా వాడేసుకున్న గత ప్రభుత్వం వీరికి చట్టబద్ధంగా కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించకుండా అత్యంత దారుణంగా మోసం చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు అత్యం దారుణంగా ప్రయోజనాలు నష్టపోయారు.  సుమారు 19 విభాగాలతో ఏర్పాటైన ఈశాఖలోని ఉద్యోగులు అన్నిశాఖల పనులూ చేయాల్సి వుంటుంది. సాధారణంగా అయితే ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగులు ఆ శాఖ యొక్క పనులు, విధులు మాత్రమే చేస్తారు. కానీ ఈశాఖలోని ఉద్యోగులు మాత్రం అన్నిశాఖల పనులూ చేయాల్సి వచ్చింది. ఏ శాఖ ఉద్యోగి ఖాళీ ఉంటే ఆ శాఖ ఉద్యోగి సదరు సచివాలయంలో ఉన్న ఇతర ఉద్యోగులు పనిచేయాల్సి వుంటుంది. అంతేకాదు ఈ శాఖ ఏర్పాటు తర్వాత అన్నిశాఖలను ఈ శాఖకు అనుసంధానించి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలను పూర్తిగా నిలిపివేయడంలో పై చేయి సాధించింది. ఉదాహరణకు తీసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు..వీరి మాత్రుశాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్. కానీ వీరి విధులు విద్య, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖలకు సంబంధించిన సంక్షేమశాఖల పనులన్నీ చేయాలి.

అంటే వీరి నియామకం వలన 5 ప్రభుత్వశాఖల్లో నియామకాలకు గండి పడిపోయింది. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీరి మాతృశాఖ పంచాయతీరాజ్..  వీరి నియామకంతో ఆర్అండ్బీ, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖల్లోని పనులన్నీ వీరే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మూడు శాఖల్లో ఉద్యోగాలకు అడ్డుకట్టపడిపోయింది. తరువాత మహిళా పోలీసులు వీరి మాతృశాఖ హోంశాఖ.. కానీ వీరు ఐసీడిఎస్, పోలీసు, రెవిన్యూలోని(బిఎల్వో), కార్యాలయంలోని  శాఖకు సంబంధించిన పనులు, విధులు, కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సేవలు చేయాలి. అంటే ఇక్కడ 3 ప్రభుత్వశాఖల ఉద్యోగాల్లో కోత పడిపోయింది. డిజిటల్ అసిస్టెంట్లు(గ్రేడ్-5పంచాయతకార్యదర్శిలు) వీరి మాతృశాఖ పంచాయతీరాజ్, వీరైతే మరీ దారుణం వీరు అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన డేటాను మొత్తం వీరేచేయాల్సి వుంటుంది. వీరి నియమాకం వలన జూనియర్ అసిస్టెంట్, డేటా అసిస్టెంట్ పోస్టుకు మంగళం పాడేశారు. సుమారు మూడు విభాగాల్లో పోస్టులకు కోత.  అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్ అసిస్టెంట్ పోస్టులు..వీరి మాతృశాఖ వ్యవసాయశాఖ వీరి నియామకాల వలన నేరుగా నియామకాలు జరిగే ఎక్సటెన్షన్ ఆఫీసర్ల పోస్టులు కనుమరుగైపోయాయి. ఆపోస్టులనే ఇపుడు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల పేరుతో ఇస్తున్నారు. అక్కొ ఒక కేటగిరీ పోస్టు రద్దైపోయింది.ఇక ఫిషరీష్ అసిస్టెంట్లు, యానిమల్ హజ్బండరీ అసిస్టెంట్లు.. ఇక్కడ కూడా ఒక్కో కేటగిరీ పోస్టులు కనుమరుగైపోయాయి.. ఇక్కడ కూడా అలా పోయిన పోస్టులను పదోన్నతుల పేరుతో వీరికే ఇస్తున్నారు. హెల్త్ సెక్రటరీ పేరుతో ఏఎన్ఎంలను నియమించారు.

వారి వలన గ్రామల్లో నియమించాల్సిన హెల్త్ అసిస్టెంట్ల నియామకాలు రద్దైపోయాయి. కానీ వీరికి ఇన్ సర్వీసు జిఎన్ఎం శిక్షణ ఇచ్చి వారిని జిఎన్ఎంలుగా మార్చారు. అలా చేయడం వలనే నేరుగా తీసే జిఎన్ఎం పోస్టులు రద్దు అయిపోయాయి.  ఏఎన్ఎంలకే శిక్షణ ఇచ్చి వారితో సేవలు చేయిస్తూ.. జిఎన్ఎం పోస్టులు భర్తీచేసినట్టు లెక్కల్లో చూపిస్తున్నారు. ఏఎన్ఎంలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక ఎనర్జీ అసిస్టెంట్లు వీరి మాతృశాఖ విద్యుత్ శాఖ.. వీరి నియామకాల వలన నేరుగా తీసే లైన్ మెన్ పోస్టులు భర్తీకి కనుమరుగైపోయింది. వీరికే పదోన్నతులు కల్పించి లైన్ మేన్ లను చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా ఇక్కడ కూడా ఒక కేడర్ నియామకాలు పోయాయి. ఒక్క సచివాలయశాఖ ఏర్పాటుతో చాలా వరకూ పనులు చేయించేయడంతో..ఇతర ప్రభుత్వశాఖల్లోని నాల్గవర తరగతి ఉద్యోగాల, ఇతర కేటగిరీ ఉద్యోగాలు తీసే అవకాశం లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా వక్రమార్గంలో ఆలోచన చేసిన నియామకాలు చేపట్టి కూడా ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్దత లేకుండా చేసి ఉద్యోగుల్లో ఒక భయాన్ని మాత్రం అలాగే వదిలేసింది. కొన్ని విభాగాలనే సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ చార్ట్ ఏర్పాటు చేసిన మిగిలిన శాఖల ఉద్యోగులకు ఏర్పాటు చేయలేదు. దానికి కూడా కారణం ఉంది. ఒకేసారి ఇక్కడ నియమించిన ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తే..వాళ్లంతా ఏడేళ్ల తరువాత వారి వారి మాతృశాఖల్లోకి పదోన్నతులపై వెళ్లిపోతారు. మళ్లీ కొత్తగా నియామకాలు చేయాల్సి 
వుంటుంది.

అదే నియామకాలు చేసిన తరువాత తాత్సారం చేస్తే కనీసం వారినే ఒక పదేళ్ల పాటు ఒకే శాఖలో ఎలాంటి పదోన్నతులు లేకుండా భయపెడుతూ ఉంచేయవచ్చుననది నాటి ప్రభుత్వ కుటిల బుద్ధి. అయితే నాటి ప్రభుత్వ తేడా ఆలోచనను గ్రహించిన ఉద్యోగులు వారి కుటుంబాలు ఓటుతోనే బుద్ధి చెప్పారు.సచివాలయాలు రద్దైతై ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. త్వరలో చాలా ప్రభుత్వశాఖల్లో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తు ఉద్యోగ విరమణలు చేయనున్నారు. అలాంటి సమయంలో ఈశాఖను రద్దుచేస్తే సంక్షేమ పథకాల అమలు గ్రామ స్థాయిలో నిలిచిపోతుంది. అలాగని ఇక్కడి ఉద్యోగులకు గత ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం కోసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఏర్పాటుచేయకుండా వదిలేసింది. దాని కోసం ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు, ఉత్తర్వులు ఇచ్చి ఇపుడు ఉద్యోగులకు కల్పించాల్సి వుంటుంది. అంతేకాదు సత్వరమే గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కూడా కల్పించాలి. కోర్టుకేసుల విషయంలోనూ ఉద్యోగుల భవిష్యత్తు కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు వివిధ కారణాలతో ఇక్కడ ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని ఉద్యోగాలు భర్తీ కాలేదు. వాటిని ప్రభుత్వం భర్తీచేసేస్తే చాలా కాలం వరకూ ఈ ప్రభుత్వంపై చాలా శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు తీసే అశకాశం ఉండదు. సచివాలయ ఉద్యోగులకు, ఈ శాఖకు చట్టబద్దత తీసుకురావడం, మిగులు ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా  గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుతాయి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కూడా లభిస్తుంది. ఈ విషయంలో త్వరలో ఏర్పాటయ్యే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. త్వరలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సచివాలయశాఖ, ఉద్యగోల విషయంలో ఏం చేస్తుందనేది వేచి చూడాలి మరి..?!

visakhapatnam

2024-06-07 04:17:36

గాలితీసేసిన గ్రామ సచివాలయ ఉద్యోగులు..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు..  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు అంత్యంత కీలకం అయ్యారంటే నమ్మగలరా.. అదేంటి 1.25లక్షల మందికి రెగ్యులర్ ఉద్యోగాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే కదా వచ్చాయి అంటారా.. వచ్చాయి.. కానీ కంచే చేనుని మేసిన చందంగా ప్రభుత్వమే వారిని దారుణాతి దారుణంగా వినియోగించుకొని వారి ప్రభుత్వ శాఖను గాలిలోనే పెట్టేసిన పార్టీకి వాళ్లు కూడా శక్తి వంచన లేకుండా గుణపాఠం చెప్పారు. దేశమంతా తొంగిచూసిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు జరిగిన దారుణం, పోయిన ప్రాణాలు, ఇంకా రెగ్యులర్ కానీ ఉద్యోగాలు, వారి సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్, కోల్పోయిన ప్రయోజనాలే వారిలో కసిని పెంచి రివర్స్ ఓటింగ్ లో పాల్గొనేలా చేశాయి. విషయాల ధీన గాధ తెలుసుకుంటే వాళ్లు చేసింది నిజమేనని ఈ స్టోరీ చదివాళ్లంతా ఒప్పుకుంటారు.. 

వైఎస్సార్సీపీ ఓటమికి ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా పూర్తిస్థాయిలో గుర్తింపు పొందని ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా అంటే అది గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులే. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 15వేల4 సచివాలయాల్లోని సుమారు 1.30వేల మంది ఉద్యోగులు.. వారికి జరిగిన అన్యాయం ఏంటో సాంకేతికంగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసింది. వారికిచ్చిన నియామక పత్రాల్లోనే రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ అనంతరం మీ ఉద్యోగాలు 2ఏళ్త తరువాత రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కంప్యూటర్ ఎఫిషయన్సీ టెస్టు పేరుతో అదనంగా తొమ్మిది నెలలు కేవలం నెలకు రూ.15వేలతో పనిచేయించుకుంది. ఆ సమయంలోనే కరోనాతో చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఇచ్చిన ప్రభుత్వం వీరిని మాత్రం వారంలో 7రోజులు ఆదివారాలు కూడా వదలకుండా సేవలు చేయించుకుంది. ఆ సమయంలో చాలా మంది ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. అయినా కూడా ప్రభుత్వం కనికరించలేదు. వీరితో అలానే విధినిర్వహణ చేయించింది. దానిని కొనసాగిస్తూ.. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వ సెలవు వచ్చినా ఆరోజే వీరితో ప్రత్యేకంగా పనులు చేయిస్తూ వస్తోంది. 

ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేస్తే సదరు ఉద్యోగులకు ఒక క్యాడర్ ని ఏర్పాటు చేస్తుంది. కానీ సచివాల ఉద్యోగులకు మాత్రం ఏ క్యాడర్ లేకుండా చేసింది. వీరు అటెండర్లకు ఎక్కువ, జూనియర్ అసిస్టెంట్లకు తక్కువ. అంతేకాదు మొత్తం 19శాఖల ఉద్యోగాలను ఈ శాఖలో మిళితం చేసిన ప్రభుత్వం అందులో సుమారు 8 నుంచి 10శాఖలకు పైగా సర్వీసు రూల్స్ ని, ప్రమోషనల్ ఛానల్ ని ఏర్పాటు చేయలేదు. అలా చేయకపోతే వీరంతా జీవితాంతం ఇదేశాఖలో ఒకే క్యాడర్ ఉద్యోగంలో పనిచేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖలకు చట్టబద్దత ఉంది కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖకి మాత్రం చట్టబద్దత లేదు. అలా చట్టబద్ధత లేని శాఖలను ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి..వారికి ఇష్టం లేకపోతే ఉద్యోగాలు తీసేయరు కానా.. ఆ శాఖను రద్దు చేసే అవకాశం వుంటుంది. పైగా ఈశాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా చేయడానికి ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. అదేమంటే మాతృశాఖలోని ఉద్యోగులు మాదిరిగా వీరికి కూడా అన్ని వర్తిస్తాయని నోటిమాటగా చెప్పి ఊరుకుంది. ఆ కోపం కూడా ఉద్యోగులను తీవ్రంగా ఆలోచింపజేసి ఎన్నికల్లో రివర్స్ లో ఓటు వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా చేసింది.

రెండేళ్ల 9 సంవత్సరాలు తరువాత ఉద్యోగాలను చచ్చీ చెడీ రెగ్యులర్ చేసిన తరువాత. అన్నిశాఖల మాదిరిగా వీరికి కూడా పూర్తిస్థాయి పేస్క.ేలు ఇవ్వాలి వాస్తవంగా అయితే..ఇక్కడే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత తెలివిగా వ్యవహరించింది. సచివాలయ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయడానికి కంటే ముందు పేస్కేలు పెరగకుండా ఉండేలా హెచ్ఆర్ఏ,డిఏలను పూర్తిగా కుదించేస్తూ జీఓ జారీ చేసింది. అలా చేయడం ద్వారా ఉద్యోగులకు పెరగాల్సిన పేస్కేలు కుదించుకుపోయింది. రెగ్యులర్ అయిన వెంటనే ప్రొబేషన్ లో సర్వీసు చేసినందకు ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు. అలా కొంత పెరగాల్సిన పేస్కేలు మరోసారి కుదించుకుపోయింది. అవి ఇవ్వకపోగా..అదే సమయంలో ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పి..రివర్స్ పీర్సీ అంటే..కుదించేసిన మొత్తాన్ని కలుపుతున్నట్టుగా లెక్కలు చూపించింది. అయినా కూడా వీరికి ఇవ్వాల్సిన డిఏ, అరియర్స్ నేటికీ ఇవ్వలేదు. దీనితో పెద్దమొత్తంలో ఉద్యోగులు పేస్కేలు కోల్పోవాల్సి వచ్చింది. అదనంగా పనిచేయించుకున్న 9 నెలల కాలంలో పేస్కేలు, తరువాత లెక్కల్లో జిమ్మిక్కులు చేసి మొత్తానికి ఎసరు పెట్టింది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు పేస్కేలు, ఇతర ప్రయోజనాలు కలిపి నెలకు సుమారు 38వేల నుంచి 42 వరకూ రావాల్సిన జీతం ఇపుడు కేవలం రూ.28వేల దగ్గరే ఉండి పోయింది. అంటే ఈ రెండున్నరేళ్ల కాలంలో సచివాలయ ఉద్యోగులు ఎంతమేర నష్టపోయారో. ఈ నష్టంతో పీఆర్సీతో వచ్చే ప్రయోజనాలు కూడా వీరు పెద్దమొత్తంలో కోల్పోవాల్సి వచ్చింది. ఆ బాధ ఉద్యోగులతో రివర్స్ లో ఓటు వేయించేలా చేసింది.

ఇక ఎనర్జీ అసిస్టెంట్లు..వీరి మాతృశాఖ విద్యుత్ శాఖ. ఇందులో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు వ్యక్తి ప్రాణ రక్షణకు సంబంధించిన ఏ ఒక్క టూల్ కిట్ గానీ, గ్లౌజులు గానీ, సెఫ్టీ హెల్పెట్లుగానీ, బెల్టులుగానీ, ఏమీ ఇవ్వకుండా వీరితో పనిచేయిస్తోంది ప్రభుత్వం. ఫలితంగా రాష్టవ్యాప్తంగా సుమారు 50 మందికి పైనే విధినిర్వహణలో  ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వికలాంగులై మంచాలకి పరిమితం అయిపోయారు. ఇలా ప్రాణాలు పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ప్రభుత్వం కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ విభాగంలో పనిచేస్తూ మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వికలాంగలు అయిన వారికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వీరికి కూడా ప్రభుత్వం సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లేర్పాటు చేయలేదు. దానితో వీరి సేవలు కూడా జీవితాంతం సచివాలయంలోనే చేయాల్సి వుంది. రెండు, మూడు ప్రభుత్వశాఖలకు(అగ్రికల్చర్, హార్టికల్చర్, హెల్త్) ప్రమోషనల్ ఛానల్ అమలు చేసి. ఒకటి అరా పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖలను వదిలేశారు. ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు ఇచ్చి వారికి జిఎన్ఎం శిక్షణ ఇప్పించారు. అందరూ ఒకేసారి విధుల్లో చేరినా.. కొందరికే పదోన్నతులు, ఇన్ సర్వీసు ప్రయోజనాలు రావడం మిగిలిన సచివాలయ శాఖలోని ఉద్యోగులకు రాకపోవడం, దానికి ప్రభుత్వమే ప్రధాన కారణం కావడంతో ఉద్యోగుల్లోని కోపాన్ని, కసిని మరింత పెంచేశాయి. దీనితో అంతా మూకుమ్మడిగా రివర్స్ లో గుద్దేశారు.

అన్నింటికంటే ముఖ్యమైనది..ప్రజలతోనే నిత్యం సంబంధాలు ఉండే శాఖ పోలీసు శాఖ..ఈ మాతృశాఖ ఆధారంగా నియమించబడ్డ  ఉద్యోగులు మహిళా పోలీసులు ఇపుడు ఏ ప్రభుత్వశాఖకు చెందని ఉద్యోగులగా వీరంతా మిగిలిపోయారు. కారణం సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసే సమయంలో వీరిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలు అమలు చేయకుండా భర్తీ చేశారని విశాఖపట్నం జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టుకి కోర్టుకి వెళ్లారు. దీనితో వీరితో పోలీసుశాఖ పనులు ఏమీ చేయించుకోమని..అసలు వీరు పోలీసుశాఖలో ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పి ఏజి నుంచి హైకోర్టుకి పోలీసుశాఖ నుంచి అఫడవిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకున్నారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖలో మొట్టమొదట సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేసింది మహిళా పోలీసులకే. అదీ కూడా అప్పటి డిజిపి గౌతం సవాంగ్ నేతృత్వంలో పనులన్నీ ఒక విధానంలో చక చకా జరిగిపోయాయి. తరువాత రాష్ట్రంలో డిజిపిలు మారడం వీరిపై అదనంగా మరో రెండు కేసులు కోర్టులలో ఉండటంతో వీరి పదోన్నతులు కూడా నిలిచిపోయాయి.

లేదంటే మహిళా పోలీసు నుంచి సీనియర్ మహిళా పోలీసు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వలరకూ వీరికి ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేశారు. అదీ ఎందుకు చేశారంటే దిశ మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి వీరి ద్వారానే సేవలు అందించడానికి. ఇన్నిరకాలుగా ఇబ్బందులు పడిన ఉద్యోగులు అదును చూసి దెబ్బ కొట్టారు. ఉద్యోగం వచ్చినా తమ పిల్లలకు నిద్రా సుఖాలు లేకుండా పోతున్నాయని వారి తల్లిదండ్రులు కూడా రివర్స్ లో గుద్దేశారు.  ఇపుడు అర్ధమైందా సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎందుకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినా..కావాలనే తమని నిర్వీర్యం చేయాలని చూసిన వైఎస్సార్సీపీకి ఏ రకంగా రివర్స్ లో ఓటు వేశాయో. ఒక్క ఈ శాఖ ఉద్యగులే ఇలా ఉంటే.. మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు, అధికారులు ఏ విధంగా ఆలోచించి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారో మీరే అర్ధం చేసుకోవచ్చు..!

visakhapatnam

2024-06-05 07:39:40

ఏపీలో నేడే విడుదల..!

ఐదేళ్ల సంక్షేమం..ఐదేళేళ్ల సంక్షోభం..ఐదేళ్ల  ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలు.. ఐదేళ్లు నిరుద్యోగుల వయస్సు పెంచేసిన జాబ్ క్యాలెండర్ లేని హామీలు..ఐదేళ్ల ప్రతిపక్షాల నిరీక్షణకు నేడు ఓటు వేసిన ఓటు..బుల్లిపెట్టెలో దాగున్న గుట్టు బయట పడునుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని ఓటింగ్ పర్శంటేజీ ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడితే..అదే ఓటింగ్ రెండు రాజకీయపార్టీల మధ్య బలబలాలను కూడా ప్రదర్శించుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. ఎన్నికల సంఘం చైతన్య కార్యక్రమాలతో భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీని అధికార పీఠం ఎక్కిస్తుంది. మరేపార్టీని ప్రతిపక్షంలోకి నెట్టేస్తుందనేది తేలిపోతుంది. ఎన్నడూలేనివిధంగా అత్యధిక శాతం పోలైన పోస్టల్ బ్యాలెట్ పొలికేకతో ప్రారంభమయ్యే మెజార్టీ ఏపార్టీకి దన్నుగా నిలుస్తుందో కూడా రుజువైపోతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొత్తగా చేరిన 10.38 లక్షల కొత్త ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో కూడా ఫలితాల్లో వచ్చేస్తాయి. పరిపాలన ప్రతిభింబించే ఫలితాలు వచ్చే ఈరోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిలుచున్న అభ్యర్ధుల జాతకాలేంటో కూడా తేలిపోనున్నాయి. ప్రజలు మెచ్చిన నిజమైన ప్రజాప్రతినిధి ఎవరు, ప్రజలు తిరస్కరించిన ప్రజాప్రతినిధి ఎవరు..? ఏ పార్టీ వైపు ప్రజలు దన్నుగా నిలుచున్నారో కూడా స్పష్టమైన మెజార్టీతో లెక్కలొచ్చేస్తాయి.

 ఎన్నడూ లేనివిధంగా సారి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ముందు లెక్కిస్తారు గనుక అక్కడి నుంచే ప్రధాన పార్టీల మెజార్టీ కూడా లెక్కలోకి వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ నిర్వహించిన 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్ధులతోపాటు ఓటర్లు కూడా ఎంతో ఆశక్తిగా వేచి చూసిన సమయం రానే వచ్చింది. ఉదయం 8 గంటలతో ప్రారంభంమయ్యే కౌంటింగ్ మధ్యాహ్నాం నాటికి మెజార్టీ సాయంత్రం నాటికి ఓ మోస్తరు ఫలితాలు..సరాసరి రాత్రి 10 నుంచి 11 మధ్య పూర్తి ఫలితాలు వచ్చేస్తాయి. దానికోసం ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాటు కూడా చేసింది. భారీ బంధో బస్తు, సిబ్బంది మధ్య ఓటర్లు నొక్కి ఈవీఎం బాక్సులను ఒక్కొక్కటీ తెరుస్తుంటే అపుడు వచ్చే టెన్షన్ మాట్లో చెప్పలేం. అధికారంలో ఉండగా పూర్తిస్థాయిలో చేసిన సంక్షేమం, వారి ప్రాంతాల్లో ప్రజలకు చేయూతగా నిలిచిన తోడు.. బలం ఎక్కువగా ఉందని తలకెక్కిన గర్వం.. బెదిరించిన బెదిరింపులు.. కక్షగట్టిన విధానాలు అన్నీ ఆ క్షణంలో ఏమీ కనిపించవు. కేవలం గెలుపా.. ఓటమా ఈ రెండు అంశాలు మాత్రమే అభ్యర్ధులకి కనిపిస్తాయి. ఒక్కో రౌండ్ పూర్తవుతున్నకొద్ది అభ్యర్ధులు ఈ ఐదేళ్లలో తాము ఏం చేశామో అన్నీ గుర్తుకి వచ్చేస్తుంటాయి. ఎంత చేసినా ఎన్నికల సమయంలో ఓటుకి నోటు ఎంతిచ్చారో అదికూడా ఫలితాల్లో కనిపించేస్తుంది. 

 ఏ వ్యక్తికైనా అవకాశం ఇచ్చేది సార్వత్రిక ఎన్నికలు మాత్రమే. ఆ ఎన్నికలో ఓటరు వార్ వన్ సైడ్ చేయాలనుకుంటే అనుకున్న పార్టీని గద్దె దించేస్తాడు.. లేదా ఇచ్చిన మాట.. చెప్పిన హామీ అమలు చేస్తే మరోసారి పీఠం ఎక్కిస్తాడు. ప్రస్తుత కాలంలో ఓటరు చైతన్యం కావడానికి సోషల్ మీడియా కూడా ఎంతో ఉపయోపడింది. ఈ సార్వత్రిక ఎన్నికలో డబ్బు, సంక్షేమం, అభివృద్ధి ఎంత ప్రభావం చూపించాయో అన్నింటికంటే ఎక్కువగా సోషల్ మీడియా కూడా ప్రభావం గట్టిగా చూపించడంతో దాని ఫలితం కూడా నేడు వచ్చే ఫలితాలకు తోడవనుంది. ముఖ్యంగా కొత్తగా చేరిన యువత ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, మందుబాబులు, వ్యాపారస్తులు,  ఉద్యోగులు, జర్నలిస్టులు ఇలా ఐదు వర్గాల ఓట్లు యొక్క సత్తా కూడా పార్టీల అభ్యర్ధులకు వచ్చే ఓట్ల ఫలితాలను ప్రకటించడంతో కీలకంగా వ్యవహరించనున్నాయి. అంతేకాదు ఓటరు ప్రభుత్వంపై గానీ, రాజకీయపార్టీలపై గానీ చిరాకు తెచ్చుకుంటే దాని ఫలితం కూడా నోటా రూపంలో బయటకు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల ఫలితాల్లో నోటాకి కూడా ఓట్లు అధికంగానే పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. పక్కగా పడతాయనుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లుకూడా ఎవరికి పడ్డాయో తెలియక కొట్టిమిట్టాడుతున్న పార్టీలకు నేటితో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా. ప్రజలు మెచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలకి చేరువగా మంచి పరిపాలన అందిస్తే మళ్లీ మళ్లీ అదే ప్రజాప్రతినిధికి ప్రజల మద్దతు లభిస్తుంది. అలెక్కలన్నీ ఈరోజు రాత్రిలోపు అందరు అభ్యర్ధుల రాజకీయ జాతకం చెప్పే ఈవీఎం బాక్సు చెప్పేస్తుంది. ఏం జరుగుతుందనే మనమూ వేచిచూద్దాం గెలుపెవరిదో..!

visakhapatnam

2024-06-03 11:59:54

ఈసారైనా సాధించగలరా..?!

మీకు తెలుసా.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డుల్లో మాత్రమే రాష్ట్రంలో 26 జిల్లాలు..ఇంకా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఇంకా 13 జిల్లాలే. అదేంటి రాష్ట్రంలో ఒకలా..కేంద్రంలో ఒకలా ఉంటుందా వ్యవహారం.. ఎస్.. అలానే ఉంటుంది. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి..దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే ఏపీలోని 26 జిల్లాల జాబితా కేంద్రంలో కూడా 26 జిల్లాలుగా నమోదు అవుతుంది. అపుడు మాత్రమే స్థానిక సంస్థల విభజన కూడా జరుగుతుంది. లేదంటే ఉమ్మడి జిల్లాల జిల్లాపరిషత్ లు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, జోన్ లో అన్నీ పాత 13 జిల్లాల ప్రాతిపదికన మాత్రమే జరుగుతాయ. నిధులు కూడా ఆ.. పాత 13  జిల్లాలకు మాత్రమే కేంద్రం నుంచి విడుదల అవుతాయి..ఈ విషయం మన రాష్ట్రప్రభుత్వంలోని మంది ఎంపీలకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అలాగని ఈ విషయంపై పార్లమెంటులో సైతం ఏవిధంగా మాట్లాడాలో అంతకంటే తెలీదు. మన ఎంపీలకు తెలిసిందల్లా ఒక్కటే రాష్ట్రప్రభుత్వం పార్లమెంటులో ఏం మాట్లాడమంటే అది మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేయండం. మన ఎంపీ నిర్లక్ష్యం కారణంగా పదేళ్లు విభజన హామీలు అమలు కాలేదు. విభజన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు, జిల్లాల పునర్విభజనకు కేంద్రంలో ఆమోద ముద్ర రాలేదు. ఫలితం చాలా నిధులు, రాష్ట్ర అభివృద్ధి కోల్పోవాల్సి వచ్చింది..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపార్టీలు అధికారం కోసం చూపిన శ్రద్ధ నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవడానికి చూపించలేదనడంలో రాష్ట్రవిభజన జరిగి పదేళ్లు, రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగి రెండేళ్లు అవుతున్నా నేటికీ రాష్ట్రానికి కేంద్రం నుంచి పోరాడి తెచ్చుకోవాల్సిన ఆమోదాన్ని మాత్రం తెచ్చుకోలేకపోయాయి. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి రాష్ట్రంలో గెజిట్ విడుదల చేసి ఊరుకున్న ప్రభుత్వం దానికి కేంద్రం నుంచి ఆమోదాన్ని నేటి వరకూ సాధించలేకపోయింది. దాని కారణంగా రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభన కూడా కోల్పోవాల్సి వచ్చింది. అదే జరిగితే రాష్ట్రంలో మన ప్రజాప్రతినిధుల బలంపెరిగి కేంద్రంలో మన మాటకి పలుకుబడి మరింత పెరిగేది. కానీ ఆ దిశగా మన ఎంపీలుగానీ, రాష్ట్రప్రభుత్వం గానీ ఏ కోశానా చర్యలు తీసుకోలేదు. ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలవడంలో చూపిన శ్రద్ధ, అదే సమయంలో రాష్ట్రంలోని కొత్తజిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపైకూడా ఒత్తిడి తెచ్చివుంటే చట్టసభల్లో మనకి వచ్చే సీట్లు, తద్వారా వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా పెరిగేవి. కేంద్రజాబితా పరిధిలోకి వచ్చే ఈ అంశాలకు సంబంధించి బిల్లు తొలిగా పార్లమెంటులో పాస్ కావాల్సి వుంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదం పొందితే మనకు వచ్చే ప్రయోజనాలతో రాష్ట్ర అభివృద్ధికూడా అదే స్థాయిలో జరగడానికి ఆస్కారం వుండేది. కానీ విభజన ఆంధ్రప్రదేశ్ లోని 2 రాజకీయపార్టీలు ప్రభుత్వాన్ని నడిపిన వారు కేంద్రం నుంచి మాత్రం ఆమోదాన్ని సాధించలేకపోయారు. జూన్ 4 తరవాత ఏర్పాటు కాబోయే కొత్తప్రభుత్వం ముందు ప్రధానంగా ఈ అంశాలన్నీ ప్రధానంగా దండకట్టుని నిలబడతాయి. ఆ విషయంలో గతంలో చేసినట్టుగా తాత్సారం చేస్తే మరో ఐదేళ్లు మనం సాధించుకోవాల్సిన ప్రధాన అంశాలు మరుగున పడిపోతాయి. విధాన పరమైన అంశాలకు మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీలు కూడా ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించకపోవడం వలన రాష్ట్రాభివృద్ధికి నిధుల రాకకు కేంద్రంలోనే అడ్డుకట్టపడిపోతున్నది.

విభజన ఆంధ్రప్రదేశ్ లో జనాభా గణన జరిగితే తొలుత అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు రెండూ పెరుగుతాయి. అలా పెరగడం వలన రాష్ట్రంలోని పెద్ద సభ శాసన మండలి సీట్లు పెరుగుతాయి. కేంద్రంలోని పెద్దలసభ రాజ్యసభలోనూ సీట్లు పెరుగుతాయి. ఇక రాష్ట్రంలో జిల్లా పరిషత్ లు పునర్విభజన ప్రతీజిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఏర్పాటవుతుంది. కొత్త మండలాలతో పాటుగా కొత్త పంచాయతీల ఏర్పాటు కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదమోదం లేకుండా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ లు విడుదల చేసినా అవి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి. అలా కాకుండా విధానపరంగా ఆమోదం పొందాలంటే మాత్రం పార్లమెంటులో విభజన రాష్ట్రాల్లోని కొత్త జిల్లాలు, స్థానిక సంస్థల పునర్విభజనకు ఆమోదం లభించి ఆపై రాష్ట్రపతి సంతకం కూడా కావాల్సి వుంటుంది. అలా జరిగిన రోజు మాత్రమే రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్విభజనకు చట్టబద్దత ఏర్పాటై కేంద్రం దృష్టిలో కూడా 26 జిల్లాలుగా  గుర్తింపు లభిస్తుంది. అపుడు జిల్లాలకు ఇచ్చే నిధుల శాతం కూడా పెరుగుతంది. తర్వాత సివిల్ సర్వీసు అధికారులకు జిల్లా కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మాణం జరుగుతాయి. జిల్లాల స్వరూపాన్ని బట్టి కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటు కూడా మన ఎంపీల డిమాండ్ తో నెరవేరే అవకాశం వుంటుంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ యూనివర్శిటీలు, కేంద్రప్రభుత్వ సంస్థల జోనల్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు పార్లమెంటులో బిల్లు పాసై రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలి..దానికోసం మన ఎంపీలు రాష్ట్ర పరిస్థితిని పార్లమెంటులో చర్చించాలి. దానితోపాటు రాష్ట్రప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా  ప్రత్యేకంగా రాష్ట్ర సమస్యలను కేంద్రానికి నివేదికలు ద్వారా తెలియజేయాలి. ఇవన్నీ సాధించాలంటే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాలి..ఆ రకంగా చేస్తారా..? ఈసారైనా అన్నీ సాధిస్తారా? అనేది కొత్త ప్రభుత్వం ఆలోచన మీద మాత్రమే ఆధారపడి వుంటుంది..!

visakhapatnam

2024-05-28 01:29:05

ఏపీలో ‘ఆయుష్’ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ శాఖ కమిషనర్ ఇక్కడి ఉద్యోగులు, వైద్యులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయేలా చేయడంలో సఫలీ కృతులు అయ్యారనే విషయం ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసి నిరూపించుకున్నారు. ఈయన ఇంత మొండిగా ప్రభుత్వ ఉద్యోగ, వైద్యుల వ్యతిరేక కార్యకలాపాలు చేయడం వెనుక అసలు కారణంపై ఇదేశాఖలో నేడు పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర వ్యతిరేక ఉంది. దానిని తమ శాఖలోని వైద్యులు, ఉద్యోగుల ద్వారా మరింతగా పెంచడంలో కమిషనర్ ఒంటెద్దు పోకడలు ఇపుడు కారణం అవుతున్నాయి. దీనితో ఇపుడు ఉద్యోగులంతా కమిషనర్ చర్యల వలనే తాము ప్రభుత్వానికి దూరం కావాల్సి వచ్చిందని, తమ కుటుంబాలు కూడా ప్రభుత్వానికి దూరంగా ఉంచుతామని బల్లగుద్ది మరీ చెబుతున్నారట. దానికోసం వాట్సప్ గ్రూపులు, వైద్యులు, సిబ్బంది కలిసినపుడు పెద్ద పెద్ద సమావేశాలే పెడుతున్నట్టు సమాచారం అందుతుంది. కమిషనర్ తాను చేసే ఉద్యోగ, వైద్య వ్యతిరేక విధానాలకు ఇప్పటికే విసుగు చెందిన వారంతా ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో ఓటు వేయకుండా ఉంటారని భావించే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా పక్కన పెట్టేశారన్న ఆరోపణలున్నాయి. లేదంటే దేశంలో ఏ ప్రభుత్వ శాఖ కూడా ఎన్నికల సంఘం ఆదేశాలను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే ఈ విధంగా జరిగింది. 

కమిషనర్ చేసే ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటికీ అటు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీక్రిష్ణబాబు కూడా మద్దతు తెలియజేసినట్టే జిఓలు కూడా రావడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను చేసే ఉద్యోగ, వైద్య వ్యతిరేక విధానాలన్నీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతలో కొట్టుకుపోతాయని.. ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా దిక్కరించి అనుకున్నట్టుగా ఉద్యోగుల డ్రాయింగ్ పవర్ తీసేయడంలోనూ, జీఓ ఇవ్వడంలోనూ కమిషనర్ సఫలీ కృతులు అయ్యారనే చెప్పవచ్చు. అయితేఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రం ఇప్పటి వరకూ 75 ప్రభుత్వశాఖల్లో ఏ ఒక్క శాఖ వ్యతిరేకించి, పక్కన పడేసింది లేదు. అలాగని డ్రాయింగ్ పవర్ తీసేసిన కమిషనర్ ఉద్యోగుల నుంచి వైద్యుల వరకూ అందరికీ తమ కర్యాలయం నుంచే జీతాలు వేస్తామని చెప్పి..నేటికీ వారికి జీతాలు వేయలేదు. అదేమంటే కొత్తగా ఒక విధానం ప్రభుత్వం చేపడుతున్నట్టు ఆమాత్రం లేటవుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆయుష్ శాఖ కమిషనర్. వాస్తవానికి ప్రభుత్వంలోనైనా  కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తారు. కానీ విచిత్రంగా ఆదేశాలిచ్చిన తరువాత కూడా వాటిని బుట్టదాఖలు చేసి మరీ తాను అనుకున్నట్టుగా, ఉద్యోగులను, వైద్యులను వేధించడానికే ఏపక్షంగా తీసుకున్న చర్యలు ఇపుడు ఇతర శాఖలకు కూడా ప్రాకుతున్నాయి. ప్రభుత్వశాఖలో ఏ శాఖ అయినా ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకపోతే తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవాలి. 

ఇక్కడ అదీ కూడా జరగలేదు. అంటే కమిషనర్ చర్యలకు ప్రభుత్వమే మద్దతు పలుకుతుందనేది ఇక్కడ ఆయన ఇచ్చిన జీఓల ద్వారానేస్పష్టమవు తుంది. అలాంట పుడు ఆయుష్ శాఖలోని ఉద్యోగులు, వైద్యులు, వారి కుటుంబాలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకోవడంలో తప్పేముందనే వాదన ఇపుడు క్రమేపీ బలపడుతోంది. ప్రస్తుతం ఆయుష్ శాఖలో మొదలైన ఈ తేడా వ్యవహారాలన్నీ మెల్లగా ఇతర ప్రభుత్వశాఖలకు, పేరెండ్ డిపార్ట్ మెంట్ గా వున్న వైద్యఆరోగ్యశాఖకు పాకితే ప్రభుత్వంపై ఉన్న కాస్తో కూస్తో గౌరవం పోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ప్రభుత్వశాఖల్లో పనిచేసే కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిలకు ఆయా శాఖలపై పట్టు వుంటుంది. వారు పనిచేసే కాలయంలో సదరు శాఖలను అభివృద్ధి చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని చూస్తారు. విచిత్రంగా ఆయుష్ శాఖలో మాత్రం కమిషనర్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడి ఉద్యోగులను ఏ రకంగా, ఏ జీఓ ద్వారా ఇరింకించాలి..? ఏ ఆదేశంతో వారిని ఇబ్బంది పెట్టాలి..? ఏ అధికారంతో రెగ్యులర్ కావాల్సిన ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా ఆపేయాలి..? ఏ ఉద్యోగిని ప్రశాంతంగా వారి విధులను వారు నిర్వర్తించకుండా చేయాలనే కోణం లో ఆలోచించరు. అ కోణాలన్నీ ఇపుడు ఆయుష్ శాఖలోని ఎస్సీ, ఎస్టీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆయుష్ కమిషనర్ తీసుకునే మోనార్క్ నిర్ణయాలను నియంత్రికచెకపోతే ఈ విధానం ఇతర శాఖలకు కూడా ప్రాకి, యావత్ ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ ప్రభుత్వానికి మరింత శత్రువులా మారతారనడంతో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..!

amaravathi

2024-05-05 11:13:26

ఎలక్షన్ కమిషన్ అయితే ఏంటి..!

భారత దేశంలో ఎన్నికల సంఘం ఆదేశాలంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానం..ఒక్కో సందర్భంలో వాటికంటే ఎక్కువ పవర్‌ ‌వుంటు ందికూడా. కానీ అలాంటి ఎన్ని కల సంఘం ఆదేశాలు మాత్రం ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్యశాఖలోని ఆయు ష్‌ ‌కమిషర్‌ ‌బుట్ట దాఖలు చేస్తున్నారు. కమిషన్‌ ఆదేశాలిచ్చిన తరువాత కూడా మొండిగా వ్యహరిస్తూ కమిషన్‌ ఉత్తర్వులనే అపహాస్యం చేస్తున్నా..వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి. క్రిష్టబాబు సైతం నోరు మెదకపోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఆయుష్‌ ‌కమిషర్‌ ‌డా.ఎస్‌.‌బి. రాజేంద్రకుమార్‌ ‌చేస్తున్న వ్యవహారాలు ఎన్నికల సంఘాన్ని ఎదిరిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల సంఘం ఉత్తర్వులిస్తే ప్రభుత్వశాఖల అధిపతులు వాటిని అమలు చేయాలి. కానీ ఆయుష్‌ ‌శాఖలో దానికి వ్యతిరేకంగా జరుగుతుం డటమే కాకుండా.. కమిషనర్‌ ‌వైద్యులు, అధికారులు, సిబ్బందిపై కక్షగట్టి నట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఇతర ప్రభుత్వశాఖల అఖిలభారత సర్వీసుల అధికారులకు సైతం విస్మయానికి గురిచేస్తున్నది.

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీల్లోని వైద్యులకు డిడిఓ పవర్స్‌ను రద్దు చేస్తూ కమిషనర్‌ ఏకంగా జీఓని తెచ్చి దానిని బలవంతంగా అమలు చేస్తున్నారు. అయితే దానిని వ్యతిరేకించిన వైద్లు సంఘం ఏపీ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. దానితో (యుఓ) అర్జెంట్‌ ఆర్డర్‌ ‌క్రింద ఆయుష్‌ ‌కమిషనర్‌ ‌జారీ చేసిన జీఓను వెనక్కి తీసుకొని, రద్దు చేయాలని  మార్చి 19న ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా అయితే ఎన్నికల సంఘం ఉత్తర్వులు వస్తే ఆగమేఘాలపై సదరు ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు వెంటనే ఆదేశాలను అమలు చేస్తారు. కానీ ఆయుష్‌ ‌శాఖలో మాత్రం కమిషనర్‌ ‌రాజేంద్రకుమార్‌ ‌చర్యలను, ముఖ్యకార్యదర్శి సమర్ధిస్తున్న ట్టుగానే కనిపిస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకుండా డిస్పెన్సరీ వైద్యుల సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీలను మ్యాపింగ్‌ ‌చేయడం మొదలు పెట్టారు. అదీ ఎలా అంటే సదరు సీఎఫ్‌ఎంఎస్‌ ‌కమిషనర్‌ ‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని..కమిషనరేట్‌ అధికారులు, సిబ్బందితో బలవంతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులకు డిడిఓ పవర్స్ ‌రద్దు చేసిన తరువాత మేమే కష్టపడి వారికి జీతాలు ఇవ్వగలమని చెప్పించారట. 

కమిషనర్‌ ‌నేరుగా సిబ్బందిని ఆదేశించడం, చేయలేకపోతే లిఖిత పూర్వకంగా తెల్లకాగితంపై రాసి ఇమ్మని చెప్పడంతో భయపడిన కమిషనరేట్‌ ‌సిబ్బంది సిఎఫ్‌ఎంఎస్‌ ‌కమిషనర్‌ ‌తో తాము చేయగలమని వీడియో కాన్ఫరెన్సులో ఒప్పుకొని ఇపుడు ఆగమేఘాలపై వైద్యుల ఐడీలను మ్యాపింగ్‌ ‌చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశించినా ఎందుకు చేస్తున్నారంటే..తనను ఏ ఒక్కరూ ఆపలేరని..ప్రభుత్వ సౌలభ్యం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నానని అధికారులకు, సీఎఫ్‌ఎంఎస్‌ ‌కమిషనర్‌ ‌కు కూడా చెప్పినట్టు సమాచారం అందుతుంది. అసలు ప్రభుత్వమే ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలోని ఒక శాఖకు కమిషనర్‌ ‌గా ఉన్న అధికారి ఏకంగా ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చినా దానిని కాదని, బుట్టదాఖలు చేసి మరీ తాను అనుకున్నది చేస్తున్నారంటే ఏమనుకోవాలో ప్రభుత్వమే చెప్పాల్సిఉంది. ఇంత జరుగుతున్నా..కనీసం వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కూడా కమిషనర్‌ ‌మొండి వ్యవహారాన్ని నియం త్రించకపోవడం చూస్తుంటే ఆయన కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం ఉత్తర్వులని పక్కన పెట్టేసినట్టు స్పష్టమవుతుంది. మామూలుగా అయితే ముందు ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేసి..ప్రభుత్వం గౌరవాన్ని పెంచుతారు. 

కానీ ఆయుష్‌ ‌కమిషనర్‌ ‌తాను ఎవరికీ భయపడేది లేదని, అందులోనూ తనపై వ్యతిరేక వార్తలు రాయించిన వైద్యులను అసలకే వదిలిపెట్టేది లేదని కూడా కమిషనరేట్‌ అధికారుల ముండే ఒంటి కాలిపై లేచారట. దీనితో వైద్యులపై కావాలనే కమిషనర్‌ ‌చేస్తున్నట్టు బావించిన అధికారులు కూడా మీరు ఎలా చెబితే అలానే చేస్తామని తలూపుతున్నారట. తనను ఎవరూ ఏమీ చేయ లేరని..ఎన్నికల సంఘం తనపై వేటు వేసినా..తాను అనుకున్నది చేసి తీరుతానని మంగమ్మ శపథం చేస్తున్న ఆయుష్‌ ‌కమిషనర్‌ ‌తీరు ఇపుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. శాఖను ప్రక్షాలన చేస్తానని వైద్యులపై కక్ష సాధిస్తున్న తీరుపై ఇక కమిషన్‌ ‌నేరుగా ద్రుష్టి పెడితే తప్పా ఉత్తర్వులు అమలయ్యేలా కనిపించడం లేదు..! 

amaravathi

2024-04-23 06:49:46

ఏపీలో ఐఆర్ ఇవ్వనది అందుకేనా..?!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసకందాయంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్సనర్లు వారి కుటుంబాలు 2వ ప్రధాన ఓటుబ్యాంకుగా మారనున్నారు.అది ఎంతంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 సీట్లను ప్రభావితం చేసేంతగా. ఉద్యోగులకు ఎన్నికల ముందు పీఆర్సీ, ఐర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దానిని తొలిసారిగా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పీఆర్సీ ఇవ్వడమే మానేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఎన్నడూలేని విధంగా రివర్స్ మోడ్ లో పీఆర్సీ ఇచ్చింది. ఆ సమయంలోనే ఇక పీర్సీ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఉండదని.. పదేళ్లకు మాత్రమే వుంటుందని ప్రకటించింది కూడా. దీనితో ఒంటికాలపై లేచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు నాటి నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. కానీ ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు కావడంతో మీడియా దగ్గర నుంచి అందరూ భయపడే పరిస్థితికి వచ్చారు. అప్పటి నుంచి వారి వ్యతిరేకత వారిలోనూ ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో వారి ఓటు బలం ఏంటో చూపించాలనే నిర్ణయంతో ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు పీర్సీ ఇస్తామని ప్రకటించింది. దానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో సంబంధం లేదని కూడా చెప్పింది.  అయితే కమిటీలేదు, కనీసం ఐర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించలేదు. ఒక వేళ ఐర్ ప్రకటిస్తే దానిపై ఎంతో కొంత పెంచే పీఆర్సీ ఇవ్వాల్సి వుంటుందని భావించిన ప్రభుత్వం కాలయపన చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులు, వారి కుటుంబాలు అధికార ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.. ఈ సమయంలో ఐఆర్ ఇచ్చినా, పీఆర్సీ ఇచ్చినా ఉపయోగం లేదని భావించే కాలయాపనా చేస్తూ వచ్చిందనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. ఐర్, పీఆర్సీ ఇచ్చినా ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతలో అధికార పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తారని.. అలాంటి దానికోసం ఇవ్వకుండా ఉంటేనే బెటరని.. పైగా ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుందని పార్టీ వర్గాలు ఆలోచించే ఈ విధంగా చేశాయని ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీకి ముందు ఐర్ ఇస్తుంది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ కూడా అమలు చేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత పీఆర్సీ ఇచ్చింది. అంటే మరో రెండేళ్ల వరకూ పీఆర్సీ ఇవ్వకుండా ఉండేదుకు.. ఆ మధ్యలోనే పదేళ్లకు ఒకసారి పీఆర్సీ జీఓని అమలు చేసేందుకు వీలుగా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచనగా ప్రకటించింది కూడా. దానిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేక వ్యక్తం అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ లోని మొత్త ప్రభుత్వ శాఖలు 75 ఉండగా, 26 జిల్లాల పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా వన్ సైడ్ అయిపోతే 175/175 సంఖ్యలో భారీ తేడాలు వచ్చేస్తాయి. అలాగని కూటమి తమ మద్దతు ఇద్దామన్నా కూడా ఆ వర్గం 
నుంచి కూడా పీఆర్సీ, ఐర్ తోపాటు, సిపిఎస్ రద్దు విషయంలో ఎలాంటి అనుకూల ప్రకటనా రాలేదు. వాస్తవానికి సిపిఎస్ ని ప్రవేశపెట్టింది టిడిపి ప్రభుత్వమే దానితో వాళ్లే తిరిగి దానిని రద్దు చేయడానికి సాహసించడం లేదు. పైగా సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానాన్ని కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పట్ల కూడా ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, వారి కుటుంబాల ఓటు బ్యాంకు ఏ పార్టీ ఖాతాలో పడుతుందోననే ఉత్కంఠ రోజు రోజుకీ పెరగుతుంది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ అధికారంలో వస్తే ఇక పదేళ్లకు ఒక్కసారి మాత్రమే పీఆర్సీ ఇచ్చే విధంగా చట్టం చేసినా చేస్తారనే భయం కూడా ఉద్యోగుల్లో వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ విషయమం మీదే ఉద్యోగ సంఘాలు, వారి వారి సామాజిక మాద్యమాల్లో ప్రధానంగా చర్చను లేవదీస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో కనీసం ప్రాధాన్యత ఇవ్వని అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలా..? లేదంటే ఆ విషయంలో కనీస ప్రకటన కూడా చేయని కూటమికి మద్దతు ఇవ్వాలా..? లేదా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి తమ డిమాడ్లను నెరవేర్చుకోవాలా అనేది ఉద్యోగులు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ- టిడిపి, బీజేపీ, జనసేన కూటమికి మధ్య మాత్రమే ప్రధాన పోటీ జరుగుతున్నది. దీనితో ఉద్యోగులు ఎటూ ఆలోచించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి కుటుంబాల మద్దతు అధికారపార్టీకి ఎలాగూ ఉండదని నిర్ణయించుకున్న తరువాత ఐఆర్ ఇచ్చినా ప్రయోజనం లేదని అధికార పార్టీ భావించినట్టు చెబుతున్నారు. 

అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి 1.25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించిన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగం నుంచి రెగ్యులర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబాల ఓట్లు, పలు ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారు మాత్రమే అధికార వైఎస్సార్సీపీ మద్దతుగా నిలుస్తారని, 
మిగిలిన వారి దగ్గర నుంచి పూర్తి వ్యతిరేకత మాత్రమే వస్తుందని ఉద్యోగ సంఘాలే పేర్కొంటున్నాయి. ఇటీవల అన్ని ప్రధాన పార్టీలు ఉద్యోగ సంఘాల్లోని అనుకూలితుల ద్వారా ఏర్పాటు చేసుకున్న రహస్య సమావేశాల్లో కూడా ఇదే విషయం వెల్లడైందని తెలిసింది. ఉద్యోగులకి ఇవ్వాల్సిన డిఏ బకాయిలే దఫ దఫాలు ఇస్తే ఇక ఐర్, పీఆర్సీ ఏం ప్రకటిస్తారనే పెదవి విరుపు కూడా ఉద్యోగుల నుంచి వ్యక్తం అవుతుంది. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అన్యాయం చేశారని.. రెండేళ్లకు రెగ్యులర్ చేయాల్సి ఉద్యోగాలను తొమ్మిది నెలలు పెంచడంతోపాటు, పేస్కేలు పూర్తిస్థాయిలో ఇవ్వాల్సి వస్తుందని ఆ సమయంలోనే డిఏ, హెచ్ఆర్ఏ తగ్గించి, రెగ్యులర్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని కూడా కొందరు ఉద్యోగులు అధికార పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారు. అంతేకాకుండా చాలా విభాగాల ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదని, ఒకేసారి ఉద్యోగాల్లోకి వచ్చిన వారికి ఒకే విధానం అమలు చేయకుండా ఒక్కో శాఖ ఉద్యోగి ఒక్కోలా పదోన్నతులు కల్పించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదేశాఖలోని మహిళా పోలీసుల ఉద్యోగాలు ఉంటాయో, కోర్టు కేసుల నెపంతో ఊడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు..నేటికీ కూడా ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్దతను అధికార వైఎస్సార్సీపీ తీసుకు రాలేదు. ఈ కారణాల దృష్ట్యా కూడా కొందరు వ్యతిరేకం అయ్యే అకవాశాలున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలు, నాడు నేడు కార్యక్రమాల ద్వారా చేసిన అభిృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా అధికారపార్టీకి విధేయులుగా కూడా మారారు. కానీ రాజకీయ చదరంగంలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగు, ఉపాధ్యాయ, పెన్షనర్లు వారి కుటుంబాలు ఎప్పుడు ఏవిధంగా మారి వారి ఓటుతో సమాధానం చెబుతాయో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.  త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, వారి కుటుంబాలు పూర్తిగా ఎవరివైపు ఉంటాయనేది మాత్రం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది..!

visakhapatnam

2024-04-19 04:03:45

జర్నలిస్టుల గోడు పట్టేదెవరికి..?

జర్నలిస్టు పనిచేయకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. జర్నలిస్టు వార్త రాయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి తెలీదు.. జర్నలిస్టు ఫోటో తీయకపోతే వాస్తవాలకి ప్రతిరూపం కనిపించదు.. జర్నలిస్టులు కథనం రాయకపోతే సమస్యకి పరిష్కారం లభించదు..జర్నలిస్టు సందేశాత్మక వార్తలు రాయకపోతే ప్రజల్లో చైతన్యం రాదు.. మీడియా, ప్రెస్, జర్నలిస్టులు లేకపోతే ఈరోజు ప్రపంచమే ఒక్కసారిగా స్థంబించిపోతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న మీడియాకి సొసైటీలో నాలుగో స్థంబంగా గుర్తింపు ఉంది. అయితే అది పేరుకి..కాగితాలపై మాత్రమే కనిస్తున్నది. 77ఏళ్ల స్వాంత్ర్య భారత దేశంలో నేటికీ చాలామంది జర్నలిస్టులు అర్ధాకలితోనే జీవిస్తు న్నారంటే అతిశయోక్తి కాదు. ఓట్లను నోట్లకు కొని అధికార పీఠాలు చేజిక్కించుకునే రాజకీయపార్టీలు కూడా వారి కార్యకలాపాలన్నీ ప్రజలకు తెలియజేసే మీడియాని కనీసం పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలకి వర్తింపజేసే ఒక్క సంక్షేమ పథకానికి కూడా జర్నలిస్టు నోచుకోవడం లేదంటే వీరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని సుమారు 60 వేల జర్నలిస్టుల కుటుంబాలున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఏ ఒక్క సంక్షేమ పథకానికి నోచుకోకపోవడంతో ఈసారి జర్నలిస్టు సమస్యలను కూడా రాజకీయపార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని, పరిష్కారం కాని సమస్యలు, అమలు చేయని డిమాండ్లను జర్నలిస్టులు రాజకీయపార్టీల ముందు ఉంచుతున్నాయి. అలాగైతేనే మా మద్దతు మీకుంటుందని కూడా తెగేసి చెబుతున్నారు.

ఒకప్పుడు జర్నలిం అంటే ప్రజలను చైతన్యవంతం చేసేదిగా ఉండేది. ఇపుడు రాజకీయపార్టీలు కూడా సొంతంగా మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకోవడంతో అది కాస్త ప్రచార వేధికలుగా మారిపోయాయి తప్పితే ఫోర్త్ ఫిల్లర్ కి ఉండే గుర్తింపు కనుచూపు మేరలోకూడా కనిపించడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రచారాలకు మాత్రమే నేడు మీడియా ఒక ప్రత్యేక సాధనంలా కనిపిస్తున్నది. వారి మీడియా సంస్థలకు ఆదాయ మార్గాలను మాత్రమే వారు వెతుక్కుంటున్నారు. ఇతర చిన్న, మధ్య తరగతి మీడియా సంస్థలను గాలికొదిలేస్తున్నారు. వారి సంస్థలను అభివృద్ధి చేసుకోవడానికి చిన్న మీడియా సంస్థల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నారు. ఎక్కడలేని నిబంధనలు పెట్టి పూర్తిగా మీడియా నియంత్రణ తో అణగదొక్కాలని చూస్తున్నారు. చేతిలో ఉన్న అధికారంలో, తమ సొంత సంస్థలను అడ్బం పెట్టుకొని ఎన్నిచేసినా.. ఈ సొసైటీలో జర్నలిస్టులూ ఓటర్లే..వారి చేతిలోనూ కలం వుంటుంది..వారి బుర్రలోనూ ఆలోచన వస్తుంది..వారి పెన్నూ పనిచేయడం మొదలు పెడుతుంది. అలా జరిగిన రోజు మాకూ మీడియా సంస్థలు ఉన్నాయని చెప్పుకొని విర్రవీగే వారందరికీ పతనం మొదలవుతుంది. భారత దేశంలో బ్రిటీషు కాలంలో కూడా మీడియాపై ఇన్ని ఆంక్షలు లేవు. ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పాటైన దగ్గర నుంచి మీడియాపై ఆంక్షలను, నిబంధనలను పెంచుతూ నియంత్రణ దిశగానే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రజల కోసం ఆలోచించిన జర్నలిస్టులు తొలిసారి వారి కోసం వారు ఆలోచించడం మొదలు పెట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వారికే తమ మద్దతు, వారు రాసే అక్షర చైతన్య మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. దానికోసం ఏనాటి నుంచో అమలుకి నోచుకోని సమస్యలను, డిమాండ్లను ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ పార్టీల ముందు ఉంచుతున్నారు.

జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు ఏంటి..? వాటిని ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి..? అనే విషయాలు ఒక్కసారి తెలుసుకుంటే.. వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపుని ఇవ్వాలి(ప్రెస్ అక్రిడిటేషన్), నిత్యం ప్రజలకు సమాచారం అందించేందుకు తిరిగే జర్నలిస్టులకు ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్న్ కల్పించి వాటిని ప్రభుత్వమే భరించాలి, జర్నలిస్టుల సంక్షేమ నిధిని 100 కోట్లు చేసి, వాటి ద్వారా వచ్చే వడ్డీతో రిటైర్ అయిన జర్నలిస్టులకు కనీసం నెలకు రూ.7500 పెన్షన్ ఇవ్వాలి, ప్రెస్ అక్రిడిటేషన్ల మంజూరులో నిబంధనలు సరళతరం చేయాలి, చిన్న, మధ్య తరహా పత్రికలకు ఆదాయం లేని సంస్థలకు జిఎస్టీ పూర్తిగా తొలగించాలి, పెద్ద పత్రికలన్నింటికి ఒక ఏడాది ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే అదే మొత్తాన్ని రాష్ట్రంలోని చిన్నపత్రికలకు మరో ఏడాది ప్రకటనలు ఇవ్వాలి, పేపరు డిజైనింగ్, ప్రింటింగ్ ఖర్చులు భారీగా పెరిగినందున ప్రింట్ కాపీల సంఖ్యలను తగ్గించాలి, ప్రతీ మండల విలేఖరికి ప్రెస్ అక్రిడిటేషన్, రాయితీ రైల్వే పాస్ మంజూరు చేయాలి, జర్నలిస్టుల హెల్త్ కార్డులో అన్ని రకాల వైద్యసేవలు, మెడికల్ టెస్టులు చేయించుకునే విధంగా నిబంధనలు మార్పు చేయాలి, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఉచితంగానే కేటాయించి, హౌసింగ్ స్కీములో ఇళ్లు మంజూరు చేయాలి,

 జర్నలిస్టు విధి నిర్వహణలకు, కార్యకలాపాలు చేసుకోవడానికి వీలుగా డివిజన్, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే ప్రెస్ క్లబ్ ల నిర్మాణాన్ని చేపట్టాలి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరహాలోనే న్యూస్ ఏజెన్సీలకు కూడా నియోజవర్గానికి రెండు లేదా, పార్లమెంటు నియోజకవర్గానికి నాలుగు చొప్పున ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ మొత్తాన్ని 8లక్షలకు కుదించి,  ప్రెస్ అక్రిడిటేషన్లకు అధికారుల కమిటీలను తొలగించి పాత విధానంలోనే గుర్తింపు పొందిన, ట్రేడ్ యూనియన్ల జర్నలిస్టులతోనే కమిటీలు(పెద్ద పత్రికలు, చిన్నపత్రికలు, లోకల్ కేబుల్ టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఏజెన్సీల ప్రతినిధులతో)వేయాలి, కఠిన తరం చేసిన ఆర్ఎన్ఐ నిబంధనలను సరళీకృతం చేసేలా రాష్ట్రప్రభుత్వమే పూనుకోవాలి, జర్నలిస్టుల పిల్లలకు ఖచ్చితంగా అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో 50శాతం రాయితీ కల్పించాలి, కేంద్రీయ విద్యాలయం లాంటి విద్యాసంస్థల్లోనూ జర్నలిస్టుల పిల్లలకు కనీసం 25 సీట్లుకేటాయించాలి, సిఎస్ఆర్ నిధులతో జర్నలిస్టులకు రాష్ట్రప్రభుత్వమే ఏడాదికి ఒకసారి క్రీడా పోటీలు ఏర్పాటు చేయాలి, మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి జర్నలిస్టులకు విద్యార్హతలను ఏర్పాటు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి వంటి డిమాండ్లను పరిష్కరించాలని జర్నలిస్టులు కోరుతున్నారు. 

తమ సమస్యలపై ఏ రాజకీయపార్టీ సానుకూలంగా స్పిందిస్తుందో వారికి తమ సంపూర్ణ మద్దతు, తమ కుటుంబాల మద్దతు వుంటుందని కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జర్నలిస్టుల సంఘాలన్నీ ఏకమై రాజకీయపార్టీ అధిష్టానాలకు జర్నలిస్టుల సమస్యలు మేనిఫెస్టోలో పెట్టాలంటూ అర్జీలు కూడా పెడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే..మరికొందరు అది జరిగే పనేనా..? అంటూ పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్లు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తే తమవంతు చైతన్యం కూడా ప్రజల్లో వచ్చే చేస్తామని అంటున్నారు జర్నలిస్టులు..  చూడాలి.. ఈసారి ఏ రాజకీయపార్టీ జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి కనీసం జర్నలిస్టులను గుర్తిస్తుందనేది...? అలా కాని పక్షంలో ఎన్నికల బరిలో నిలబడే రాజకీయపార్టీల కోసం, వారి ప్రచారాల కోసం  కూడా జర్నలిస్టులు వేరే రకంగా ఆలోచించాల్సి వస్తుందనే హెచ్చరికలను కూడా పంపించడానికి కలం కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం అందుతుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..?! 

amaravathi

2024-04-09 03:54:52