విశాఖజిల్లాలో సమాచారశాఖ అధికారుల బాధ్యత రాహిత్యం ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా జిల్లాకలెక్టర్, డిస్ట్రిట్ మెజిస్ట్రేట్, జిల్లా అక్రి డిటేషన్ కమిటీ చైర్మన్ సంతకాన్నే అపహాస్యం చేసేంతగా మారిపోయింది.. ఏంటి నమ్మకం లేదా.. లేదంటే మీరూ డిపీఆర్వో కార్యాలయ సిబ్బంది గత కలెక్టర్ డా.మల్లిఖార్జున సేవలోనే తరిస్తున్నట్టుగా.. మీరూ అదే బ్రమలోనే ఉన్నారా..? జిల్లా సమాచారశాఖ అధికారుల పరిస్థితి అలానే ఉంది కాబోలు. అందుకే జర్నలిస్టులకు ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సంతకానికి బదులు, గత కలెక్టర్ డా. మల్లిఖార్జున సంతకంలో అక్రిడిటేషన్ కార్డులను ప్రింటింగ్ కి పంపించారు ఇక్కడి సిబ్బంది. అదేంటి మరీ ఇంత కళ్లుమూసుకొని పంపిస్తారా..? అంటే.. పంపిస్తేనే కదా అసలు విషయం బయటకొచ్చింది.
అక్టోబరు 3న విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ తరువాత సమావేశంలో సభ్యులతోపాటు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆమోదం తెలిపారు. ఆ తరువాత ప్రక్రియ మొత్తం జిల్లా సమాచారశాఖ కార్యాలయం చేపట్టాలి. కమిటీలో అప్రూవల్ చేసిన కార్డులను సమాచారశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసి విజయవాడ రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయానికి ప్రింటింగ్ కి పంపించాలి. వీళ్లూ అలానే చేశారు. కాకపోతే జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకానికి బదులు.. గత కలెక్టర్ డా.మల్లిఖార్జున సంతకాన్నే ఉంచేసి పంపించేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్దం. అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకానికి బందులు గత కలెక్టర్ సంతకం ఉండటంతో రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలోని అక్రిడిటేషన్ కార్డులు ప్రింటింగ్ చేసే సిబ్బంది కార్డుల ప్రింటింగ్ నిలిపివేసి విశాఖజిల్లా సమాచారశాఖ సిబ్బంది చేసిన ఘనకార్యంపై కొర్రీ వేసి వెనక్కి పంపారు.
ఆ విషయం కాస్త మీడియాకి తెలియడంతో విషయం బగ్గుమంది. ముఖ్యంగా పెండింగ్ అక్రిడిటేషన్ల విషయంలో మీడియా జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ పై ఒత్తిడి తీసుకు రావడంతో కలెక్టర్ మంచి మనసుతో కార్డుల జారీకి అనుమతించారు. దానిని జీర్ణించుకోలేకపోతు సమాచారశాఖ సిబ్బంది అడుగడుగునా సాంకేతిక కారణాలను సాకుగా చూపి నేటి వరకూ తాత్సారం చేస్తూ.. చేసిన పనుల్లో తప్పులు చేస్తూ వస్తున్నారు. కనీసం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రెస్ నోట్లు రాయడం రానివారు జిల్లా సమాచారశాఖ అధికారులుగా ఉండటం.. వారి ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బంది మరింత బాధ్యతా రాహిత్యంగా ఉండటం.. వారి పనులు కూడా జిల్లా కలెక్టర్ కి మచ్చతెచ్చే విధంగా ఉండటం విశేషం.
-జిల్లా సమాచారశాఖ ఏం చేయాలి..? మరేం చేసింది..!
సమాచారశాఖ జిల్లా అధికారులు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం అయిన తరువాత ముఖ్యంగా ఆన్ లైన్ వెస్ వెబ్ సైట్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకాన్ని ఎన్ఐసి అధికారుల సహకారంతో అప్లోడ్ చేయాలి. అదే పాత కలెక్టరే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గత కలెక్టర్ మల్లిఖార్జున బదిలీ అయిపోయిన తరువాత హరేంధిరప్రసాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కూడా అయ్యింది. కానీ సమాచారశాఖ సిబ్బంది మాత్రం ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై కొత్త కలెక్టర్ సంతకాన్ని అప్డేట్ చేయడం మానేశారు. దీనితో పాత కలెక్టర్ సంతకమే ఉండిపోయింది.
కనీసం అక్రిడిటేషన్ కార్డులు డౌన్ లోడ్ చేసి.. వాటిని రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయానికి మెయిల్ చేసినపుడు కూడా జిల్లా సమాచారశాఖ అధికారులు వాటిని కనీసం పరిశీలించలేదు. దీనితో కార్డులు పాత కలెక్టర్ సంతకంతోనే విజయవాడ వెళ్లిపోయాయి. తీరా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై పాత కలెక్టర్ సంతకాన్ని గమనించిన ప్రింటింగ్ సిబ్బంది కార్డుల ప్రింటింగ్ నిలిపివేశారు. ఇదే కార్డులను ప్రింటింగ్ చేస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోననే భయంతో జిల్లా సమాచారశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది చేసిన తప్పుని వీరికి తెలియజేశారు. దీనితో కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ కాస్తా నిలిచిపోయింది.
వాస్తవానికి ఐఏఎస్ అధికారులు జిల్లాకి కలెక్టర్ గా వచ్చినపుడు ఆయన సంతకాన్ని ప్రభుత్వం ఎన్ఐసి విభాగం ద్వారా ఆన్ లైన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా జిల్లా సమాచారశాఖ ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ జిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది చాలా లైట్ తీసుకొని ఆయన సంతకాన్ని సమాచారశాఖ వెబ్ సైట్ లో కూడా అప్డేట్ చేయించడం మానేశారు. అలా చేయించాలంటే ముందుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాచారశాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పెట్టాల్సి వుంటుంది.
గత కలెక్టర్ సంతం మార్పుచేసి.. ప్రస్తుతం కలెక్టర్ సంతకం సమాచారశాఖలో అప్లోడ్ చేయడానికి అనుమతులు ఇవ్వాలని. కానీ జిల్లా కలెక్టర్ వచ్చిన తరువాత గానీ, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం పూర్తయిన తరువాత గానీ సమాచారశాఖ అధికారులు ఆ పనిచేయలేదు. ఏ పనైనా టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉండేండుకు అన్ని జాగ్రత్తలూ తీసుకొని మాత్రమే పనులు చేస్తుంటామని చెప్పే సమాచారశాఖ సిబ్బంది ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలోనూ, కార్డుపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ సంతకం కాకుండా గత జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఉంచేసి పంపడంపై ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం ఏంటో చెప్పాల్సి పనిలేదు.
-క్యాడర్ ఉండటంతో టెక్నికల్ సిబ్బందికి డిఐపీఆర్వోగా బాధ్యతలు
రాష్ట్రంలో 13జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసిన సమయంలో కొత్త జిల్లాలకు డిపీఆర్వోలను సమాచారశాఖలో నియమించాలటే ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దీనితో ఇదేశాఖలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నవారిని తీసుకువచ్చి జిల్లా సమాచారశాఖ అధికారులగా సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయం నియమించేసింది. వాస్తవానికి ఇంజనీరింగ్ పనులు తప్పా.. వీరికి మీడియా విభాగం పనులు చేతకావు.. కాదు కాదు చేయడం రాదు.. ఎవరై ఆ పనులు తెలిసిన వారుంటే వారితో డిపీఆర్వో హోదాలో చెప్పి చేయించుకోవడం తప్పితే. అదే సమయంలో ఏపీఆర్వోలు, సాంకేతిక సిబ్బందిని కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో కనీసం సమాచారశాఖ, కార్యాలయ వనులను తెలియని వారిని కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏపీఆర్వోలుగా నియమించారు. వీరంతా కార్యాలయానికి వస్తారు తప్పితే చేసే పనిలో అస్సలు క్లారిటీ ఉండదు. సరిగ్గా విశాఖజిల్లాలోనూ అదే జరిగింది.
డిఐపీఆర్వోగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎస్వీరమణను తీసుకు వచ్చి డిపీఆర్వోగా నియమించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా ఇంజనీరింగ్ విభాగంతో ఉన్న ఇంద్రావతిని కూడా కొత్త జిల్లాలో డిఐపీఆర్వోలుగా నియమించారు. వాస్తవానికి వీరికి మీడియా పనులుగానీ, కార్యాలయ పనులుగానీ చేతకావు. ఉన్న సిబ్బందిని వినియోగించుకొని మాత్రమే వీరు పనులు చేయించుకోవాలి. కానీ జిల్లాల విభజన సమయంలో గత ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర సమాచారశాఖ అమలు చేస్తూ.. మీడియా, మీడియా లైజన్, ప్రెస్ అక్రిడిటేషన్, ప్రెస్ నోట్ ప్రిపరేషన్, తెలియని వారిని నియమించడంతో వారికి తెలిసినట్టుగానే పనులు చేస్తున్నారు. దీనితో వారం రోజుల్లో కావాల్సిన పనులు నెలలైనా పూర్తి కావడం లేదు. అన్ని అర్హతలు, పనిచేయడం వచ్చినవారు పదోన్నతుల కోసం వేచిస్తున్నా.. పదోన్నతులు కూడా కల్పించకకుండా పనులు రాని వారినే జిల్లా అధికారులగా నియమిస్తున్నారు.
-విశాఖ జిల్లా కలెక్టర్ సంతకానికి మచ్చ తెచ్చిన సమాచారశాఖ
కొత్తగా విశాఖజిల్లా కలెక్టర్ గా వచ్చిన హరేంధిర ప్రసాద్ సంతకానికి జిల్లా సమాచారశాఖ మచ్చతెచ్చింది. వాస్తవానికి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఉన్న అధికారుల సంతకాల విషయంలో ప్రభుత్వ శాఖలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. సాంకేతిక కారణాలు, సమస్యలుంటే ముందుగా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి.. అవి పరిష్కారం అయిన తరువాత మాత్రమే మిగిలిన కార్యాచరణ చేయాలి. కానీ విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ శాఖలన్నా.. అందులోని అధుకారులన్నా.. ఆఖరుకి కలెక్టర్ అన్నా కూడా నిర్లక్ష్యమనే విషయం ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో తేట తెల్లం అయిపోయింది.
మమ్మల్ని మీడియా ప్రశ్నించకూడదు.. చేసిన తప్పులను కూడా వార్తలుగా రాయకూడదని తెగ బీరాలు పోయే సమాచారశార అధికారులు.. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకానికే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో మాయని మచ్చతెచ్చి.. అక్రిడిటేషన్ కార్డులు ప్రింటింగ్ కాకుండా సాంకేతికంగా ఆగిపోయేలా చేశారంటే.. ఇది కావాలని చేసిందా..? బాధ్యతా రాహిత్యంగా చేసిందా..? పనిచేతకాక చేసిందా అనేవిషయం జిల్లా కలెక్టర్ హరేంధిరప్రాద్ తేల్చాల్సివుంది. మీడియా విషయంలో సమాచారశాఖ కలెక్టర్ సంతకాన్ని లైట్ తీసుకుంటే.. మిగిలిన ప్రభుత్వశాఖల విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో జిల్లా కలెక్టర్ చెప్పాల్సివుంది. చూడాల సమాచారశాఖ అధికారులు చేసిన నిర్వాకంపై జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారనేది.!