తిరుమలలోని నాదనీరాజనం వేదిక పై గురువారం సాయంత్రం గీతా పారాయణం రెండో విడత ట్రయల్ రన్ జరిగింది. వేదపారాయణందార్ కాశీపతి భగవద్గీత పారాయణం చేయగా, వేదపండితుడు కుప్పా విశ్వనాథం వ్యాఖ్యానం చెప్పారు. తిరుమలలో నేరుగా పాల్గొనే భక్తులతోపాటు ఎస్విబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సాధారణ భక్తులు సులువుగా పారాయణం చేసేలా శ్లోక పారాయణంలో తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తోపాటు పలువురు పండితులు సూచనలు చేశారు. ఇస్కాన్ ప్రతినిధి లీలా పారాయణ దాస్ మాట్లాడుతూ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మానవాళి సంక్షేమం కోసం భగవద్గీత పారాయణం చేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని అభినందించారు. అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు శ్రీకృష్ణునిపై ప్రముఖ సంస్కృత కృతి అయిన మధురాష్టకాన్ని ప్రదర్శించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, డెప్యూటి ఈఓ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు శుభవార్త...ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ, ఉత్తర్వులు జారీచేసింది. ఇందులోభాగంగా క్వార్టర్ బాటిల్ ధర 120 రూపాయ లకు మించని బ్రాండ్లకు 30 రూపాయలు,ఫుల్ బాటిల్ కి 120 రూపాయల వరకూ తగ్గించిన ప్రభుత్వం..క్వార్టర్ బాటిల్ ధర 120 నుంచి 150 రూపాయల వరకూ ధర ఉన్న బ్రాండ్లకు క్వార్టర్ కి 70రూ నుంచి ఫుల్ బాటిల్ కి 280రూ వరకూ తగ్గించింది. ఆపై క్వార్టర్ బాటిల్ ధర 150 నుంచి 190 రూపాయల మధ్య ఉన్న బ్రాండ్లకు ఎలాంటి ధర మార్పులు చేయని ప్రభుత్వం..క్వార్టర్ బాటిల్ ధర 190 రూపాయల నుంచి 210 రూపాయల వరకూ ధర ఉన్న బ్రాండ్లకు క్వార్టర్ కి 70 నుంచి ఫుల్ బాటిల్ 280 రూపాయల వరకూ ధర పెంపుని కూడా ప్రకటించింది. ఇది కాకుండా అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపాయల మేర ధర తగ్గించిన ప్రభుత్వం రెడీ టూ డ్రింక్ మద్యం పై 30 రూపాయల మేర తగ్గింపుని ప్రకటించింది. ధరలన్నీ ఈరోజు నుంచే అమలవుతాయని కూడా ప్రకటించింది. తగ్గించిన మద్యం ధరలతో మందు బాబులు మరింత ఖుషీ అవడమే కాదు ప్రభుత్వ ఖజానాని కూడా నింపుతారనడంలో సందేహం. ఇప్పటి వరకూ మద్యం రేట్టు అధికంగా వున్న సమయంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఇపుడు తగ్గించడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి...
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని వేదవిద్యా బోధనలో భారతదేశంలోనే ఉత్తమ పాఠశాలగా తయారు చేయాలని టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి అధికా రులను ఆదేశించారు. ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ, మరో నెల రోజులలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో బయటి వ్యక్తులు ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. అటవీ ప్రాంతం కావడంతో టీటీడీ, ఉద్యానవన విభాగాలు కలిసి ఫెన్సింగ్ పనులను పూర్తి చేయడంతోపాటు మురుగునీరు నిల్వ ఉండకుండా మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. వీధి దీపాలన్నీ వెలిగేలా చూడాలన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వేద పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఈవో విజయసారథి దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, టిటిడి ఎస్ఇ-2 నాగేశ్వర రావు, ఈఈ జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఎంఎస్ ఈఈ మల్లికార్జున ప్రసాద్, డిఈ సరస్వతి, విజివో మనోహర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డిఎఫ్ఓ చంద్రశేఖర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కారు ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలు ఆడుతూ ఎవరైనా పట్టుబడితే ఏడాది జైలు, రెండో సారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని నిర్ణయించింది. కేంద్రం పబ్జీ గేమ్ తో సహా 118 చైనా గేమ్స్ పై నిషేధం విధించిన మరుసటి రోజే, చాలా మంది కుటుంబాలను ఆర్ధికంగా దెబ్బతీస్తున్న రమ్మీ గేమ్ ని నిషేధించడం సంచనలంగా మారింది. ఆన్ లైన్ జూదం ఆడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నవిషయమై నమోదవుతున్న సైబర్ నేరాలను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. కాగా ఆన్ లైన్ రమ్మీ, పోకర్ గేమ్ లను చాలా మంది ఆడి కోట్ల రూపాయలు డబ్బులు పోగోట్టుకోవడంతో పాటు, కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆన్ లైన్ జూదంపై నిశేషదం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నిషేధిత మావోయిస్టులను ప్రభుత్వం రెండేళ్లుగా నియంత్రిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు తెలంగాణలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మావోయిస్టులపై ఏడాది పాటు నిషేధం విధించడం చర్చనీయాంశం అవుతుంది. ఏపీ మావోయిస్టులను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కేబినిట్ నిర్ణయం తీసుకున్న తరువాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లకు జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున మరోసారి లేఖ సమర్పించనున్నట్లు సంఘం జాతీయ కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు స్పష్టం చేశారు. గురువారం విశాఖలో కోవిడ్ బారినపడి కోలుకున్న పలువురు వీడియో జర్నలిస్టులకు గురువారం డాబాగార్డెన్స్ కార్యాలయం లో తన సొంత నిధులు రూ.30 వేలు అందజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గతంలో తమ అసోసియేషన్ తరపున ప్రధాని,సీఎం లకు లేఖ రాసామని, తాజాగా మరోసారి లేఖ రాసినట్టు వివరించారు. కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు తాను సొంతంగా సుమారు ఏడు లక్షల రూపాయలతో జర్నలిస్ట్ లు, ఇతర సంస్థల కు దశల వారీగా నిత్యవసర వస్తువులు అందజేసినట్టు చెప్పారు. దీంతోపాటు కోవిడ్ బారినపడిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులకు మరో 2.60 లక్షలు తన సొంత నిదులు వెచ్చించినట్టు వివరించారు. కేవలం మానవతా దృక్పధం తోనే తాను ఈ సేవా కార్యక్రమాలు చేపడతున్నామన్నారు. నిశ్వార్ధంగా జర్నలిస్టులకు సేవచేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా విపత్తు లో జర్నలిస్ట్ లను ఆదుకోవాలనే లక్ష్యంతో తన సేవలను నిరంతరంగా కొనసాగిస్తున్నాని గంట్లశ్రీనుబాబు మీడియాకి వివరించారు.
రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్, అటవీ,శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు ఎన్. ఎస్.పి.అతిథిగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి, ఉచిత విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకున్న కరెంట్ కు ప్రభుత్వమే విద్యుత్ చార్జీల చెల్లిస్తుందని వివరించారు. రైతులకు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను నగదు బదిలీ పథకం క్రింద రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రైతులు ఖాతా లోని నగదును విద్యుత్ డిస్క్ఎం కంపెనీలకు చెల్లిస్తామని చెప్పారు.. ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్దాంతం చేస్తూ రైతులను పక్క దోవ పట్టిస్తున్నాయన్నారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న మంత్రి ప్రభుత్వం అన్ని వేళల రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిస్కమ్స్ కు రూ.1700కోట్ల కేటాయించామన్నారు. రాష్ట్రంలో పగటిపూట నిరంతరo9గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన అన్నారు. రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో టుబాకో రైతులను ఆదుకోవడానికి 70కోట్ల రూపాయల ను విడుదల చేశామని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రెవిన్యూలో అవినీతి పెరిగిపోయిందని గుర్తించిన ఏసిబి గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని అన్ని తహశీలర్దార్ కార్యాలయాలపైనా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి అనుమతి కోరగా. దానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్టు సమాచారం అందుతోంది. దీంతో రాష్ట్రం లోని 7 జిల్లాల్లో కొనసాగుతున్న దాడులు చేపట్టింది ఏసిబి. తశిల్దర్ కార్యాలయాల్లో కొనసాగిస్తూ,రికార్డ్ లను పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఎమ్మిగనూరు ఎమ్మార్వో ఆఫీసులపై దాడులు చేసిన అధికారులకు ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యం అయ్యాయి. ఇక విశాఖ జిల్లా కసింకోట తహశీల్దార్ కార్యాలయం, గుంటూరు జిల్లా రాజుపాలెం ఎమ్మార్వో కార్యాలయం, ప్రకాశం జిల్లా ఉలవపాడు ఎమ్మార్వో కార్యాలయం, బలిజపేట ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళం జిల్లా గార ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేసిన దాడుల విషయం సాయంత్రానికి పూర్తి సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని సందర్భంగా బుధవారం కడప జిల్లాలోని ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివా ళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తన తండ్రి సమాధి వద్ద సుమారు 15 నిమిషాల పాటు వైఎస్ జగన్ అలాగే మౌనంగా ఉండిపో యారు. అనంతరం కుటుంబ సభ్యులుతో కలిసి కాసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అధికంగా ఉన్న సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చే జర్నలిస్టులకు, సిబ్బందికి మంగళవారమే కోవిడ్ పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చిన అధికారులను, పోలీసులను, జర్నలిస్టులను మాత్రమే కవరేజికి అనుమతించారు. వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయ వద్ద భారీ బందో బస్తును కడపజిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ నడుస్తున్న వెల్ నెస్ కేంద్రాల్లో 24 వైద్య సహాయం అందించడం ద్వారా నిరుపేదలు ప్రైవేటు ఆసుప త్రులకు వెళ్లే భారంత తప్పుతుందని బిజెపీ సీనియర్ నేత కొప్పల రామ్ కుమార్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల(వెల్ నెస్)లో అన్ని విభాగాల్లో ఇద్దరు చొప్పున నియమించిన ప్రభుత్వం ప్రధానంగా వ్యాధి నిర్ధారణ చేసే పారామెడిల్ సిబ్బంది(ల్యాబ్ టెక్నీషియన్) మాత్రం ఒక్కరినే నియమించడం ద్వారా అత్యవసర సమయంలో వ్యాధి నిర్దారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇద్దరు వైద్యులు, ముగ్గురు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు ఫార్మాసిస్టులు, మరో ఇద్దరు ఎంఎన్ఓ లను నియమించడం ద్వారా 24 ప్రాధమిక వైద్య కేంద్రాల్లో వైద్యం అందించడానికి వీలు పడుతుందన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్టులకే అధికంగా పేద ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అత్యవసర సమయాల్లో వ్యాధి నిర్ధారణ కాకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పారామెడికల్ సిబ్బందిని కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరిద్దరు చొప్పున నియమించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని కూడా రామ్ కుమార్ గుర్తుచేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్యాన్ని తెలుసుకునే మేల్(మగ) ఆరోగ్య కార్యకర్తలను కూడా నియమించాలన్నారు. తద్వారా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసినట్టు అవుతుందన్నారు. అదే సమయంలో పూర్తిస్థాయిలో నాణ్యమైన మందులు, కనీసం 100 రకాల మెడికల్ టెస్టులు చేసే విధంగా యంత్ర సామాగ్రి కూడా పీహెచ్సీలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని రామ్ కుమార్ సూచించారు.