ఆంధ్రప్రదేశ్ లో మార్చినాటికి అన్ని గ్రామసచివాలయాలు, ఆర్బీకే సెంటర్లుకు పూర్తిస్థాయిలో భవనాలు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించిన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదినక సాగుతున్నాయి. మార్చినాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాలు పూర్తయితే, అక్కడే విలేజ్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకొని విలేజ్ క్లినిక్ లకు కూడా భవనాలు నిర్మించి అందులో ప్రాధమిక వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. విలేజ్ క్లినిక్ ల ద్వారా సుమారు 50 రకాల రోగాలకు మందులును అందించడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. జనవరి నెలలో రాష్ట్రంలో నిర్మించబోయే విలేజ్ క్లినికల్ సంఖ్యను ప్రభుత్వం ప్రకటించే అవకాశం వుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలోనూ నిర్మిస్తారా, లేదంగా గ్రామానికి ఒకటి చొప్పున నిర్మిస్తారా అనేది తేలాల్సి వుంది. అందులో కూడా పీహెచ్సీలు, సిహెచ్సీలు ఉన్నచోట విలేజ్ క్లినిక్ లను నిర్మించకుండా అక్కడి ప్రజలను పీహెచ్సీలకు అనుసంధానం చేయాలని కూడా ప్రభుత్వం యొచిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చినాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తిస్థాయిలో భవనాలు, మరో నాలుగు నెలల్లో విలేజ్ క్లినిక్ లకు భవనాలు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి...
రాష్ట్ర, రాష్ట్రేతరులను, విదేశీ సందర్శకులను సైతం ఆకర్షించేవిధంగా రాష్ట్రంలో పర్యాటక స్ధలాల అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ భవానిపురంలోని హరితారిస్సార్ట్స్ బెర్మ్ పార్క్‌నందు బుధవారం టూరిజం శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజానికి సియం వై.యస్. జగన్ “ బ్రాండ్ అంబాసిడర్ ” అని మంత్రి శ్రీనివాస్ ప్రకటించారు. సినీనటులు, సెలబ్రెటీలను పెట్టుకుని ఇతర రాష్ట్రాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆంధ్రరాష్ట్రం మాత్రం సియం జగన్ అంబాసిడర్‌గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో త్వరలో నూతన పర్యాటకపాలసీ ప్రవేశ##పెడుతున్నామని ఆయన తెలిపారు. ఈపాలసీద్వారా పబ్లిక్ పై#్రవేట్ పార్టనర్‌షిప్ (పిపిఏ) పద్ధతిలో బోట్లు, హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పధకాలతోపాటు పై#్రవేట్ పబ్లిక్ సంస్ధల భాగస్వామ్యంతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఉపద్రవం పర్యాటకరంగంపై తీవ్రప్రభావాన్ని చూపిందన్నారు. గత 6 నెలల నుండి సుమారు నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని పర్యాటకశాఖ కోల్పోయిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవలే పర్యాటకప్రాంతాలకు సందర్శకులను అనుమతించడం జరిగిందన్నారు. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సుమారు 60 బోట్లు నడిపేందుకు అనుమతించడం జరిగిందన్నారు. ప్రకాశంబ్యారేజ్ వరదప్రవాహం తగ్గిన తర్వాత నీటిపారుదలశాఖ అధికారుల అనుమతి తీసుకుని బోట్లు నడిపేందుకు అనుమతిస్తామన్నారు. రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని భవాని ఐల్యాండ్‌ను అభివృద్ది చేసి వనభోజనాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఈనెల 10వ తేదీన భవాని ఐల్యాండ్‌కు సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకులకు కావాల్సిన సదుపాయాలు, భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత అనుభవాలను, సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోట్లు నడిపే 9 ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, టూరిజం, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి వారి ఆధ్వర్యంలో బోట్లు నడిపేవిధంగా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పర్యాటకశాఖ ద్వారా 38 హోటల్స్‌ను నిర్వహిస్తున్నామని కరోనా సమయంలో హోటల్స్‌నందు కోవిడ్ సెంటర్ల నిర్వాహణతోపాటు కోవిడ్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేయడం ద్వారా రూ. 28 కోట్ల ఆదాయాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. తిరుపతి, విశాఖపట్నంలలో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రయత్నాలను ముమ్మరం చేసామన్నారు. ఇప్పటికే ఓబరాయ్ సంస్ధ ఇందుకు సంబంధించి స్ధలాల పరిశీలించడం కూడా జరిగిందని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో కోవిడ్ నియమనిబంధనలను పాటిస్తూ పర్యాటకులను అనుమతిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో వాటర్ టూరిజం, ఇకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంలను మరింత అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎలక్షన్ కిమషనర్ నిమ్మగడ్డ రమేష్ నీతి, న్యాయం పాటించకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మట్లాడుతూ.. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నమే తాము చేస్తున్నామని, ఎవరిని టార్గెట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో నిన్న(మంగళవారం) అఫిడవిట్ వేసినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. హైకోర్టుకు నిన్ననే ఈసీ నివేదించినట్లు పత్రికల్లో వచ్చిందని, హైకోర్టులో మాత్రం ఆ అఫిడవిట్ బుధవారం ఫైల్ అయినట్లుగా ఉందని పేర్కొన్నారు. ముందుగానే పత్రికలకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు లీక్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్మాలని నిలదీశారు. పైగా ప్రభుత్వం తనకు ఎలాంటి సహకారం అందించలేదని చెప్పడం దేనికనిన్నారు. నిమ్మగడ్డ చేసే పనులన్నీ చంద్రబాబు ఆదేశాలతో చేస్తున్నట్టు ఈ ఒక్కవ్యవహరంతోనే రుజువైందన్నారు.. స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెండు కేసులు వచ్చి నపుడు కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన ఆయన ఇప్పడు సరాసరిగా ౩ వేల కరోనా కేసులు రోజుకు వస్తున్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసేసిన పార్టీకి గడపదాటని నాయకుడు చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏమీ చేయడం లేదు. అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ది శూన్యం. అమరావతిలో చంద్రబాబు అడుగుకు 12వేలు దోచుకుని సర్వనాశనం చేశారు. విజయవాడలో దుర్గ వారధిని కూడా కొద్దిగా చేసి వదిలేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరిట చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే తత్వం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎస్ఈసీ రమేష్ పని చేస్తున్నారన్న శ్రీకాంత్ రెడ్డి స్వార్థం కోసం చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లోంచి బయటకు రాని నాయకుడు చంద్రబాబు. జూమ్ మీటింగ్‌లలో ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య అని మండిపడ్డారు..
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం గ్రామసచివాలయ ఉద్యోగాలకు అర్హత పరీక్ష రాసిన వారికి శుభవార్త చెప్పింది. ఇటీవల అర్హత పరీక్ష రాసిన వారికి లక్కీ చాన్స్ కొట్టే అవకావం వస్తుంది. దీనితో గతంలో మిగిలిపోయిన పోస్టులు, ప్రస్తుతం ఖాళీగా వున్న పోస్టులను అన్నిజిల్లాల్లో ఒకేసారి నవంబరు నెలాఖరునాటికి భర్తీచేసి డిసెంబరు మొదటి వారానికి పూర్తిస్థాయిని సిబ్బందిని ఉంచడానికి పక్కాగా రూపకల్పన చేస్తున్నది ప్రభుత్వం. దీనికోసం అన్నిజిల్లాల్లో గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న ఖాళీలను ఈసారే భర్తీచేయాలని అన్నిజిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో గతంలో ప్రకటించిన పోస్టులతోపాటు, అదనంగా ఖాళీగా ఉద్యోగాలు కూడా భర్తీజరుగుతుంది. గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. అన్ని రకాల సేవలు గ్రామస్థాయిలోనే అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి సిబ్బంది కొరత అడ్డురావడంతో ఉద్యోగప్రకటన జారీచేసి, వాటికి కరోనా తగ్గిన తరువాత పరీక్షలు నిర్వహించింది. ఈసారి అభ్యర్ధులకు ర్యాంకులను కూడా ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగానే అభ్యర్ధుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేసి అర్హత సాధించినవారందరికీ నియామకాలను చేపట్టనుంది. అంతా అనుకున్నట్టు జరిగితే డిసెంబరు మొదటివారానికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు సిబ్బందితో కనిపిస్తాయి.