ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి 3ఏళ్లు(నేటితో) పూర్తైన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాసంకల్ప యాత్ర ఓ చరిత్ర అన్న ఎమ్మెల్యే వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఆయన వెంట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని, చాలా వరకూ చేసిన హామీలన్నీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర కెక్కారని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని, బ్యాంకుల ద్వారా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఏప్రిల్ నాటికి బాగుచేస్తానని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. సీఎం ఏం చెప్పినా చేయడం ఆయన ప్రత్యేకతని, అందరికలా వినతిపత్రాలు తీసుకుని పక్కన పెట్టేవ్యక్తి జగన్ కాదని కితాబిచ్చారు..
భారత దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం, చరిత్రాత్మకం, వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన చేసిన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్ర. నాటి ప్రతిపక్షనేత, నేటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్రకు నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింది. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆ పాదయాత్రను ఒక్కసారి అవలోనకం చేసుకుంటే.. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీర్వాద బలంతో 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను జగన్ ఎండనక, వాననక 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా కొనసాగించారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసిన ఈ యాత్రలో తొలి నుంచీ జనంతో మమేకం అవుతూ.. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలతో తన రాజకీయ ప్రస్థానాన్ని చేరుకున్నారు. పాదయాత్రలో ప్రజలసమస్యలే వైఎస్సార్సీపీకి మేనిఫెస్టో అయ్యాయి. నవరత్నాలుగా నేడు ప్రజలకు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపుగానే 70శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్ చరిత్ర స్రుష్టించారు. కేంద్ర ప్రభుత్వానికే సాధ్యం కాని ఒక గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి లక్షా 26వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు ప్రజలకు సేవలు గ్రామంలోనే అందాలనే లక్ష్యంలో ఏర్పాటు చేసిన 4లక్షల గ్రామ, వార్డు వాలంటరీలతో నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాది దొరికినట్టు అయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాద్యమ విద్య, నాడు-నేడు కింద పాఠశాలల అభివ్రుద్ధి, నిరుపేదల వైద్యానికి పెద్దపీట ఇలా చెప్పుకుంటే పోతీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసినన్ని సంక్షేమ పథకాలు మరే ఇతర ప్రభుత్వంమూ చేయలేదని చెప్పవచ్చు. అంతటి చరిత్రను స్రుష్టించిన సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంతో ఎలాంటి సందేహం లేదు..
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులంటే ఎంతో హడావిడీ..వెనుక ఐదారు కార్లు..గన్ మేన్లు వగైరా...నిమిషం కూడా ఖాళీ ఉండదు..కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రులు అలా కాదు..వాళ్లకి ప్రజల కష్టాలు తెలుసు, బాధలను కళ్లారా తక్షణమే స్పందిస్తారు కూడా.. అదిఎలాంటి సందర్భమైనా ఒక్కటే వారికి.. తమవంతుగా సహాయం చేస్తూ నిత్యం ప్రజల మనిషిగా ఉంటారు...ఆ విధంగానే గురువారం ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు...మంత్రులమైనా తోటివారికి సహాయం చేయడంలో ముందుంటామని నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి రాష్ట్ర మహిళా మంత్రులు తమ సేవాగుణాన్ని ప్రదర్శించారు..వివరాలు తెలుసుకుంటే.. దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలై రోడ్డుపక్కనే పడివున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి మరో మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తక్షణ సహాయం అందించాల్సింది మంత్రులు వైద్యులనుఆదేశించారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు హోంమంత్రి సుచరిత, మరో మంత్రి తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా మంత్రులు చేసిన ఈ సహాయం పట్ల రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు..
2018 -2020 డీఎడ్ స్పాట్, మేనేజ్మెంట్ కోటాలో చేరిన 27 వేలమంది విద్యార్థులకు ఈ రోజు నుంచి జరగాల్సిన మొదటి సంవత్సరం పరీక్షలును తదుపరి ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం పరీక్షలు వాయిదాపడ్డ విషయాన్నిరాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారని డీఎడ్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతయ్య చెప్పారు. కరోనా నేపథ్యంలోనే పరీక్షలు వాయిదా వేసినట్టు ఆయన చెప్పారు. దీని వలన అభ్యర్ధులు పరీక్షలకు మరింతగా ప్రిపేర్ కావడానికా అవకాశం వుంటుందన్నారు. అదేసమయంలో కొందరు విద్యార్ధులకు పరీక్షలు వాయిదాపడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అయితే పరీక్షల వాయిదాపై విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తరువాత వెలువరించే షెడ్యులు ద్వారా పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉంటుందన్నారు. చాలా మంది విద్యార్ధుల్లో విద్యాసంవత్సరం నష్టపోతామనే భయం వుందన్నారు. ప్రభుత్వమే పరీక్షలు వాయిదా ప్రకటన చేయడం ద్వారా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విశాఖలోని గాజువాక వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు ఒక్కొక్కటిగీ బయటకు వస్తున్నాయి. నిందితుడు అఖిల్ సాయి వెంకట్ తనకు దూరమైన వరలక్ష్మి మరెఎవరికీ దక్కకూడదనే కోపంతో పగ పెంచుకొని ఈ హత్యకు పథకం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేయడంతో పాటు, నేరం బయటపడకుండా ఉండేందుకు అతడు పాపులర్ క్రిమినల్ సినిమాలను చూశాని కూడా చెబుతున్నారు. ఓ పాపులర్ సినిమాలో హత్య చేసిన తర్వాత చుట్టూ కారం చల్లితే డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టని సీన్లను చూసినట్టు నిందితుడు పోలీసుల విదచారణ ఒప్పుకోవడం ఆశ్చర్యాన్నికలిగించింది. పక్కా పథకం ప్రకారం ముందుగానే కారం పొట్లం కొనుగోలు చేశానని, అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి రప్పించుకున్నానని, బ్లేడుతో కోసి, ఎటువంటి ఆధారాలు లభించకుండా చుట్టూ కారం చల్లాలని ఒప్పుకున్నాడు. అలాగే 'దృశ్యం' సినిమాలో చేసినట్లు పోలీసులను తప్పుదారి పట్టించిన మరొకరిపై నేరాన్ని మోపే ప్రయత్నం కూడా చేశాడని స్పష్టమైంది. అయితే గాజువాక శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్ (21) శనివారం రాత్రి బ్లేడ్‌తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన విషయంపై హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నేడు (గురువారం) మరోసారి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. చుట్టుపక్కల పరిసరాలలో కొందరి నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు పోలీసులు. నిందితుడిపై హత్యానేరంతోపాటు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభియోగంపై యాక్ట్ జత చేసినట్టు పోలీసులు తెలియజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏసీపీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ. కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ అమలు చేస్తామని మీడియాకి వివరించారు..
ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచే రేషన్ సరుకులను, నాణ్యమైన బియ్యాన్ని లబ్దిదారుల ఇంటికే అందజేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. గురువారం అమరావతిలో కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు ఇంటి వద్దకే గ్రామవాలంటీర్ల ద్వారా అందించనున్నామన్నారు. మేని ఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించిన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి 90శాతం పథకాలను అమలు చేశారని ఆయన చెప్పారు. ప్రజాసంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి ఆ విషయంలో రాజీలేకుండా సీఎం వైఎస్ జగన్ శ్రమిస్తున్నారని అన్నారు. అదేవిధంగా నవంబర్ 24 నుంచి జగన్న చేదోడు పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులు వుంటే గ్రామవాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వీటితో పాటు కేబినెట్ లోని పలు అంశాలను మంత్రి మీడియా సమావేశంలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో మార్చినాటికి అన్ని గ్రామసచివాలయాలు, ఆర్బీకే సెంటర్లుకు పూర్తిస్థాయిలో భవనాలు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించిన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదినక సాగుతున్నాయి. మార్చినాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాలు పూర్తయితే, అక్కడే విలేజ్ క్లినిక్ లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకొని విలేజ్ క్లినిక్ లకు కూడా భవనాలు నిర్మించి అందులో ప్రాధమిక వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. విలేజ్ క్లినిక్ ల ద్వారా సుమారు 50 రకాల రోగాలకు మందులును అందించడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. జనవరి నెలలో రాష్ట్రంలో నిర్మించబోయే విలేజ్ క్లినికల్ సంఖ్యను ప్రభుత్వం ప్రకటించే అవకాశం వుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలోనూ నిర్మిస్తారా, లేదంగా గ్రామానికి ఒకటి చొప్పున నిర్మిస్తారా అనేది తేలాల్సి వుంది. అందులో కూడా పీహెచ్సీలు, సిహెచ్సీలు ఉన్నచోట విలేజ్ క్లినిక్ లను నిర్మించకుండా అక్కడి ప్రజలను పీహెచ్సీలకు అనుసంధానం చేయాలని కూడా ప్రభుత్వం యొచిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చినాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తిస్థాయిలో భవనాలు, మరో నాలుగు నెలల్లో విలేజ్ క్లినిక్ లకు భవనాలు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి...
రాష్ట్ర, రాష్ట్రేతరులను, విదేశీ సందర్శకులను సైతం ఆకర్షించేవిధంగా రాష్ట్రంలో పర్యాటక స్ధలాల అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ భవానిపురంలోని హరితారిస్సార్ట్స్ బెర్మ్ పార్క్‌నందు బుధవారం టూరిజం శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజానికి సియం వై.యస్. జగన్ “ బ్రాండ్ అంబాసిడర్ ” అని మంత్రి శ్రీనివాస్ ప్రకటించారు. సినీనటులు, సెలబ్రెటీలను పెట్టుకుని ఇతర రాష్ట్రాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆంధ్రరాష్ట్రం మాత్రం సియం జగన్ అంబాసిడర్‌గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో త్వరలో నూతన పర్యాటకపాలసీ ప్రవేశ##పెడుతున్నామని ఆయన తెలిపారు. ఈపాలసీద్వారా పబ్లిక్ పై#్రవేట్ పార్టనర్‌షిప్ (పిపిఏ) పద్ధతిలో బోట్లు, హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పధకాలతోపాటు పై#్రవేట్ పబ్లిక్ సంస్ధల భాగస్వామ్యంతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఉపద్రవం పర్యాటకరంగంపై తీవ్రప్రభావాన్ని చూపిందన్నారు. గత 6 నెలల నుండి సుమారు నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని పర్యాటకశాఖ కోల్పోయిందన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవలే పర్యాటకప్రాంతాలకు సందర్శకులను అనుమతించడం జరిగిందన్నారు. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సుమారు 60 బోట్లు నడిపేందుకు అనుమతించడం జరిగిందన్నారు. ప్రకాశంబ్యారేజ్ వరదప్రవాహం తగ్గిన తర్వాత నీటిపారుదలశాఖ అధికారుల అనుమతి తీసుకుని బోట్లు నడిపేందుకు అనుమతిస్తామన్నారు. రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని భవాని ఐల్యాండ్‌ను అభివృద్ది చేసి వనభోజనాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఈనెల 10వ తేదీన భవాని ఐల్యాండ్‌కు సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకులకు కావాల్సిన సదుపాయాలు, భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత అనుభవాలను, సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోట్లు నడిపే 9 ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, టూరిజం, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి వారి ఆధ్వర్యంలో బోట్లు నడిపేవిధంగా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పర్యాటకశాఖ ద్వారా 38 హోటల్స్‌ను నిర్వహిస్తున్నామని కరోనా సమయంలో హోటల్స్‌నందు కోవిడ్ సెంటర్ల నిర్వాహణతోపాటు కోవిడ్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేయడం ద్వారా రూ. 28 కోట్ల ఆదాయాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. తిరుపతి, విశాఖపట్నంలలో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రయత్నాలను ముమ్మరం చేసామన్నారు. ఇప్పటికే ఓబరాయ్ సంస్ధ ఇందుకు సంబంధించి స్ధలాల పరిశీలించడం కూడా జరిగిందని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో కోవిడ్ నియమనిబంధనలను పాటిస్తూ పర్యాటకులను అనుమతిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో వాటర్ టూరిజం, ఇకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంలను మరింత అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి అన్నారు.