జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీర మరణం పొందారు. దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు.మరోవైపు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వర్గం సందర్శించి పరామర్శించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు లు రెడ్డివారిపల్లి కి వెళ్లి ప్రవీణ్ కుటుంబీకును పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి ప్రవీణ్ కుటుంబీకులకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మేము వచ్చామన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబరు 14న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య అమాంతంగా 28 నుంచి 32 పెరిగింది.. అలా పెరగడానికి కారణం సంఖ్యా శాస్త్రమనే చెబుతున్నారు నిపుణులు..3+2=5 అంటే అంఖ్య విజయానికి చిహ్నం. దానితోపాటు, ఒక్కోజిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపినా ఆ సంఖ్య కూడా 32 జిల్లాలుగానే తేలుతుంది. దీంతోఆ దిశగానే ఏపీలో 32 జిల్లాలు ఏర్పాటు జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. తొలుత 26 జిల్లాలు అనుకున్న ప్రభుత్వం ఇపుడు ఏకంగా 32 జిల్లాలుగా అభివ్రుద్ధి చేసి పరిపాలన వికేంద్రీకరణను పూర్తిస్థాయిలో చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిశగా జిల్లా సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు చక్కెర్లు కొడుతుంది. ఏ పేరుతో ఏజిల్లా ఏర్పాడుంది. ఆ జిల్లా కిందను కనీసం 4 నియోజకవర్గాలు వచ్చేటట్టుగా డిజైన్ చేసి మరీ ఆ జాబితాలను సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్నారు. ప్రస్తుతం ఏపిలో కొత్త జిల్లా ఏర్పాటుకి అధికార యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల గుర్తింపును చేపట్టడంతోపాటు వాటిని ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించి అందులో అప్లోడ్ చేస్తుంది. సీఎం వైఎస్ పాదయాత్ర సమయంలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే జిల్లాలు ఏర్పాటవుతాయని అంతా భావించినా కొన్ని ముఖ్య ప్రాంతాలు నియోజవర్గాల ఆధారంగా జిల్లాలు ప్రకటిస్తే సమన్యాయం జరుగుతుందని ఒక్కో జిల్లాలో నాలుగు నియోజకవర్గాలను చేర్చి ఒక జిల్లాగా కుదించి.. అన్నీ కలిపి 32 జిల్లాలుగా వచ్చేటట్టుగా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. ఐదు సంఖ్య విజయానికి చిహ్నంగా భావిస్తారు. దీంతో 32 అంటే టోటల్ గా 5 వచ్చే విధంగా చేస్తే అత్యధిక జిల్లాలు ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా చెబుతున్నారు. అయితే పక్కాగా ఎన్నిజిల్లాలు అనే సంఖ్య మాత్రం 2021లో సీఎం ప్రకటిస్తారని కూడా అధికారులు తేల్చి చెబుతున్నారు. ఎన్ని ఊహా గానాలు జరిగినా అసలు సంఖ్యను ముఖ్యమంత్రి ఖరరారు చేస్తారని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా చెప్పారు...
విశాఖలోని రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన 40.50ఎకరాల రూ.800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ దురాక్రమణ చేసిన అంశంలో రాష్ట్రప్రభుత్వం అక్రమాల చిట్టా తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ చిట్టా ప్రకారం గీతం దేశంలో ఏ మూలకు వెళ్లినా చేసిన ఆక్రమణల విషయంలో తప్పించుకునే వీలులేకుండా ఆధారాలను మొత్తం ఒక ఫైలుగా ప్రభుత్వం రూపొందింస్తున్నట్టు తెలుస్తుంది. గీతం విద్యాసంస్థలు ఏర్పాటు చేసే సమయంలో గీతం ఆస్తులెన్ని, తరువాత గీతం ఎంత మేరకు ప్రభుత్వ భూమిని కబ్జాచేసింది, ఆపై ఎంత భూమిని ప్రభుత్వం నుంచి అతి తక్కువ రేటుకి పొందింది, ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో ఎన్ని పక్కా నిర్మాణాలు చేసింది, ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేసేసమయంలో జివిఎంసీ నుంచి గానీ, అప్పట్లో ఆ పరిధిలోని పంచాయతీ నుంచి గానీ అనుమతులు తీసుకుందా, జీవిఎంసీ ఏర్పాటు అయిన తరువాత ఆ పరిధిలోకి వచ్చిన తరువాత అనుమతులు లేకుండా గీతం ఎన్ని నిర్మాణాలు చేసింది, నిర్మాణాలు చేస్తున్న సమయంలో జివిఎంసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పటి ఎన్నిదఫాలుగా విద్యాసంస్థ ప్రభుత్వం నుంచి భూములు పొందింది, అసలు ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూములు పొందిన విద్యాసంస్థలు ఎంత మంది నిరుపేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించింది, అదే సమయంలో విద్యార్థుల నుంచి ఏ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుంది, గీతం విద్యాసంస్థల నుంచి ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీగా మారే సమయంలో ప్రభుత్వ భూములను తన సొంత భూములు చూపించి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొందింది, తరువాత ఎందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన తప్పుడు పత్రాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఉన్నత విద్యామండలి గీతం విద్యాసంస్థల విషయంలో ఏ ఆధారాలు చూపి అనుమతులు ఇచ్చింది, గీతం విద్యాసంస్థలు చూపిన పత్రాలపై ఎందుకు విచారణ చేయలేదు, ఎంవివిఎస్ మూర్తి ఎంపీగా ఉన్న సమయంలో ఎంపీలాడ్స్ ను గీతం విద్యాసంస్థలకు ఏ విధంగా వినియోగించారు.. తదితర అంశాలన్నింటికీ ఒక ప్రత్యేక ఫైలు తయారు చేసే పనిలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ఆక్రమిత భూమిని కొంత మేరకు స్వాధీనం చేసుకోవడంతోపాటు, కొన్ని నిర్మాణాలను కూల్చేసిన ప్రభుత్వం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూడా కూల్చేందుకు, ఎలాంటి అడ్డంకులు లేకుండా అటు కోర్టుకి నివేదించేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అనుకున్నట్టు ఫైలు మొత్తం రెడీ అయితే కోర్టుకి సమర్పించి, అటుపై కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే గీతం భూ ఆక్రమిత విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందనేది భూ దురాక్రమణ గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ తెరపై చూడాల్సిందే...!
ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగుల యూనియగ్ గా గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం నిలవబోతుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యూనియన్లు పెద్దవిగా ఉన్నాయి. తరువాత స్థానం ఏపీఎన్జీఓలు ఆక్రమించారు. తాజా ఇపుడు ఏపీఎన్జీఓ సంఘాన్ని కూడా పక్కకు నెట్టి గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం నిలవబోతుంది. ఈ యూనియన్ లో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26వేల మంది ఉద్యుగులు సభ్యులు కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో లక్షా పదివేల మంది సభ్యులుండగా, ఆ సంఖ్య మరో రెండు నెలల్లో 1.26లక్షలకు చేరునుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఈ యూనియన్ కి గుర్తింపు ఇస్తే రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగులున్న సంఘంగా గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం నిలబడుతుంది. అంతేకాదు, ప్రభుత్వంలో కీలమైన పనులు చేసే ఉద్యోగులుగా కూడా వీరు నిలవబోతున్నారు. ప్రస్తుతం ఇందులోని కొంత మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సంఘంలోనూ, మరికొందరు ఏపీఎన్జీఓలోనూ సభ్యులుగా ఉన్నా పూర్తిస్థాయి సంఘం మాత్రం ఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘంగానే నిలవబోతుంది. ప్రస్తుతం ఆ దిశగా కార్యాచరణ జరుగుతోంది. అందులోనూ గ్రామసచివాలయాల్లో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న 70శాతం మంది యువకులే కావడంతో వీరికి మంచి నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించుకోవడానికి ఈ సంఘం మంచి వేదికగా పనిచేస్తుంది. ఉద్యోగులంతా ప్రస్తుతం ప్రొహిబిషన్ లో ఉండటంతో అధికారిక కార్యక్రమాలు చేయనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా మాత్రం జిల్లాల కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు మెల్లగా ఏర్పాటవుతున్నాయి. తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత తమ సంఘం పటిష్టం చేస్తూ ముందుకు నడుస్తామని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం అత్యధిక శాతం ఉద్యోగులున్న శాఖ రాష్ట్రంలో గ్రామసచివాలయ శాఖ పేరుగాంచడంతో వీరిలో అత్యధికమందిని ప్రస్తుతం ఉన్న యూనియన్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి...ఎన్నిచేసినా తమ యూనియన్ ప్రత్యేకంగానేఉంటుందని మాత్రం యూనియస్ సభ్యులు చెబుతున్నారు..ఏం జరుగుతుందో వేచిచూడాలి..
ఒడిశాకు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఆదివారం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ విరాళం డిడిని శ్రీవారి ఆలయం ఎదుట విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి చేతులమీదుగా టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, శ్రీవారి కార్యక్రమాలు అన్ని ప్రధాన భాషల్లో ప్రసారం చేయడానికి టిటిడి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ భాషల్లో స్వామివారి కార్యక్రమాలు ప్రసారం చేయడం వలన దేశవ్యాప్తంగా వున్న భక్తులకు స్వామి కార్యక్రమాలు చేరుతాయన్నారు. తద్వారా స్వామిని చూడటానికి భక్తులు మరింతగా వచ్చే అశకాశాలు కలుగుతాయన్నారు. విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి ద్వారా స్వామికి విరాళం అందించడం చాలా ఆనందంగా వుందని అన్నారు.
విశాఖలో భూదురాక్రమణ గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ వ్యవహారం ఇపుడు లోకాయుక్తవరకూ చేరింది. రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన 40.50 ఎకరాల భూమిని దురాక్రమించి మరీ విద్యాసంస్థల ప్రాంగణంలో జీవిఎంసీ అనుమతులు సైతం లేకుండా అక్రమంగా నిర్మించిన సంస్థపై విచారణచేయాలంటూ లోకాయుక్తాకు ఫిర్యాదు చేరింది. అంతేకాకుండా ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీ స్థాపనకు తనవి కాని ప్రభుత్వ ఆస్తులను తనవి చూపించి ఇటు యూజీసిని, ఏఐసిటీఈ,ఎన్ఎంసి, నేక్ కు తప్పుడు పత్రాలు సమర్పించిందని అధికారపార్టీ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి సైతం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదులు చేశారు..ప్రభుత్వాలను మోసం చేసి గీతం విద్యాసంస్థల ప్రైవేటు డీమ్డ్ టుబీ హోదాను తక్షణమే రద్దు చేయాలన్నది ఆ ఫిర్యాదులో సారాంశం. ఇపుడు తాజాగా గీతం విద్యాసంస్థల ఆస్తులను స్వాధీనంచేసుకొని, అక్రమ కట్టడాలపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న విద్యాసంస్థపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ఆంధ్రాయూనివర్శిటీకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ, ప్రజాసంఘాల జేఏసి అధ్యక్షులు జెటిరామారావు లోకాయుక్తాకి ఫిర్యాదు చేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమించడంతోపాటు ఇటు విద్యార్ధులను, అటు ప్రభుత్వాలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకు ముందు ఈడీ, సీబిఐలకు, స్థానిక పోలీస్ స్టేషన్ లలో కూడా జెటి ఫిర్యాదులు చేశారు. ఒక ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీపై అధికారపార్టీ రాజ్యసభ సభ్యులు ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదులు చేయడంపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతుంది. అందులోనూ ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమించి అందులోనే నిర్మాణాలు చేసి మరీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసం చేయడం సర్వత్రా చర్చకు తీస్తోంది. ఇపుడు లోకాయుక్తాకి ఫిర్యాదు వెళ్లడంతో భూ దురాక్రమణ గీతం వ్యవహారం, గుర్తింపుల రద్దుపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది..
తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత రెండు రోజులుగా ట్రైల్ రన్ నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ ఆర్.టి.సి. బస్సును శనివారం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుమలలో పరిశీలించారు. ఎలక్ట్రిక్ బస్సు పని తీరును ఆర్.టి.సి. అధికారులు ఛైర్మన్ కు వివరించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన వీర వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రస్తుతం ఉన్న డీజీల్ బస్సు లను ఎలక్ట్రిక్ బస్సు లుగా మార్పు చేస్తునట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా ఎలక్ట్రిక్ బస్సు ను రోజుకు మూడు ట్రిప్ లు తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డులో నడిపి పరీక్షించినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 170 కిమీ ప్రయాణిస్తుందని వివరించారు. అనంతరం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన ఎలక్ట్రిక్ బస్సు లో అన్నమయ్య భవన్ వరకు ప్రయాణించి బస్సు పని తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.సి.ఆర్.ఏం. చెంగల్ రెడ్డి, డెప్యూటీ సి.ఎం.ఈ.లు నరసింహులు, శ్రీనివాస్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్ధిక స్వావలంభన కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం డా.వైఎస్సార్ కాపునేస్తాన్ని తీసుకొచ్చిందని కాపుకార్పోరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో కాపులకు ప్రతీ ఏటా రూ. 1000 కోట్లమేర ప్రయోజనం కల్పిస్తామని వాగ్ధానం ఇచ్చి హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ప్రతీ ఏటా కాపులకు రూ. 2 వేలకోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో రూ. 10 వేల కోట్ల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి 14 నెలల సమయంలోనే వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ. 6 వేల కోట్ల పైబడి ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ. 572 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద రూ. 93 కోట్లు, జగనన్న విద్యాదీవెన క్రింద రూ. 367 కోట్లు, వై.యస్ఆర్ వాహనమిత్ర ద్వారా రూ. 57 కోట్లు, వైయస్ఆర్ పెన్షన్ కానుక క్రింద రూ. 1706 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ. 14 కోట్లు, జగనన్న నేతన్న నేస్తం ద్వారా రూ. 1240 కోట్లు, వైయస్ఆర్ ఆసరా ద్వారా స్వయంసహాయక మహిళా గ్రూపులకు రూ. 697 కోట్లు ప్రయోజనం చేకూర్చామన్నారు. 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రైతుభరోసా ద్వారా 7,56,107 మంది రైతులకు, కౌలురైతులకు రూ. 1497 కోట్లు నేరుగా నగదు బదిలీపధకంలో ప్రయోజనం కల్పించామన్నారు. వీటికి అదనంగా వైయస్ఆర్ లానేస్తం, జగనన్నతోడు పధకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని జక్కంపూడి రాజా తెలిపారు. హౌస్ సైట్స్ పధకం ద్వారా రాష్ట్రంలోని 2,56,424 మంది లబ్దిదారులకు రూ. 516.71 కోట్ల మేర ప్రయోజనం కలగజేస్తున్నామన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణపధకం ద్వారా 1,50,800 మంది లబ్దిదారులకు రూ. 93.16 కోట్ల మేర ప్రయోజనం అందజేస్తున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు. అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం పధకాలను అమలు చేస్తున్నదని, గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండే నైజం తమదికాదని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి కాపులకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈసమావేశంలో తొలుత లబ్దిదారులకు రూ. 143 కోట్ల రూపాయల చెక్కును మంత్రి అందజేసారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, కాపు కార్పోరేషన్ యండి శ్రీనివాస శ్రీ నరేష్, జనరల్ మేనేజరు (ఫైనాన్స్) పి.స్రవంతి, ఓయస్‌డి డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.