1 ENS Live Breaking News

2020-10-30 08:02:14

సింహాచల భూ సమస్య పై ప్రత్యేక కమిటీ..

సింహాచలంలోని భూసమస్యపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు,  పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్,సీఎం సలహాదారు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, సింహాచల ఆలయ కార్యదర్శి సభ్యులుగా వుంటారు. వీరితోపాటు, ఎంపీలు విజయసాయిరెడ్డి, బి.సత్యవతి, దేవాదాయశాఖ కమిషనర్ కూడా సలహాదారులుగా ఉంటారు. ప్రభుత్వం సింహాచలం పంచగ్రామాల సమస్యపై ప్రకటించిన విధంగా కమిటీ ఏర్పాటు చేసింది. భూ సమస్యపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వం పంచగ్రామాల సమస్య నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో జనవరి నుంచి జరగనున్న సమగ్ర భూ సర్వే కూడా ఈ భూసమస్యకు పరిష్కారం చూపించనుంది. సర్వేద్వారా దేవస్థానం భూములు ఎంత వరకూ ఉన్నాయి... ఆక్రమిత భూములు ఎంతవున్నాయనే విషయం కూడా తేలిపోనుంది. కాగా గత ప్రభుత్వంలో కమిటీ వేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా ప్రజా ధనం దుర్వినియోగం అయ్యింది..

Velagapudi

2020-10-29 20:09:01

ఏపీలో పెట్టుబడులకు పోస్కో రెడీ..

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ ప్రతినిధులు వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి పోస్కో ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ఏవిధంగా ప్రోత్సహిస్తున్నామో కూడా తెలియజేశారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటు నందించి, పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో  పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు ఉన్నారు.

Velagapudi

2020-10-29 19:00:39

2020-10-29 18:41:32

అక్టోబ‌రు 31న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌..

తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే శ్రీవారి  పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ అక్టోబ‌రు 31న శ‌నివారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య జ‌రుగ‌నుంది.  కాగా, అక్టోబ‌రు నెల‌లో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి మూడుసార్లు గ‌రుడ‌సేవ జ‌ర‌గ‌డం విశేషం. ఈ నెల‌లో ఇప్పటికే పౌర్ణ‌మి సంద‌ర్భంగా అక్టోబరు 1న‌, శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 20న గ‌రుడ వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తుల సందర్శనార్ధం స్వామివారి గరుడసేవను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం కూడా చేయనున్నారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని కొద్ది మంది అధికారులు, అర్చకులతో మాత్రమే శ్రీవారికి  ఈ సేవను నిర్వహించనున్నారు.

Tirumala

2020-10-29 18:23:23

2020-10-29 17:53:41

2020-10-29 14:08:35

2020-10-28 21:12:34

ఆటో డ్రైవర్ మనసెరిగిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి అంటే ఒక ప్రత్యేక హోదా..వెనుక నలుగురు గన్ మెన్లు...ఐదు కార్ల కాన్వాయ్...ఎదుట పైలెట్ వెహికల్...మంత్రి ప్రయాణించే కారు బాగా ఖరీదైనదే వుంటుంది. అంతటి హోదాని వదిలి ఒక సాధారణ ఆటోలో ప్రయాణించడమంటే అదొక చిన్నచూపుగా ఫీలవుతారు ఎవరైనా అయితే.. కానీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి పేదల మనసు తెలుసు. తాను చేసే సహాయం మంత్రికి చెప్పడానికి వచ్చిన ఒక  సేవకుడి ఆటోలో ఎక్కిమరి ప్రయాణించిన మంత్రి తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు తన ప్రయాణానికి గుర్తుగా ఆటో చార్జికూడా తనజోబులోనుంచి తీసి చెల్లించారు. ఈ అరుదైన సంఘటన విశాఖలోని సీతమ్మధారలో జరిగింది. గోపాలపట్నానికి చెందిన ఊళ్ళూరు ప్రకాశరావు ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్నారు. గర్భిణీలు, వృద్దులకు, ప్రయాణించే వాళ్లకు తన వంతుగా.. ఉచితంగా తీసుకెళుతూ తనవంతు సహాయం అందిస్తున్నాడు. ఆ విషయాన్ని మంత్రికి చెబుదామని వచ్చిన ప్రకాశరావు ఆటోలో ఎక్కి అలా ఒక్కసారి ప్రయాణించి వచ్చారు మంత్రి.. వెనుక ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇదంతా జరిగింది. అంతేకాదు మంచి సేవలందిస్తున్నఆటో డ్రైవర్నుఅభినందించి సేవలు మరింతగా చేయాలని, ఎలాంటి సహకారం కావాలన్నా నేరుగా నాదగ్గరకు రావాలని మంత్రి భరోసా ఇచ్చారు. స్వయంగా మంత్రి ముత్తంశెట్టి తన ఆటోలోఎక్కి ప్రయాణించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు ప్రకాశరావు. చాలా మంది మంత్రి కోసం చెబితే ప్రచారం అనుకున్నానని, కాని స్వయంగా చూసిన తరువాత ఆయన మంచి మనసు తెలిసిందని చెప్పాడు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంలో మరింత మందికి సేవలందిస్తానని గర్వంగా చెప్పాడు. ఎంతైనా మనుసున్న మంత్రులు చేసే కొన్ని మంచికార్యక్రమాలు ఇలానే వుంటాయని ఈఎన్ఎస్ లైవ్ కూడా ఆ తంతు మొత్తాన్ని మీ కళ్లముందుంచే ప్రయత్నం చేసింది..

Seethammadara

2020-10-28 20:09:14

2020-10-28 19:55:02

2020-10-28 19:30:40

2020-10-28 19:10:27

శ్రీవారి ఆర్జిత సేవల రిఫండ్ అవకాశం..

లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-ద‌ర్శ‌న్ మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది. ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను excel టెక్ట్స్ లో‌ టైపు చేసి  refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు. టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని టిటిడి కోరుతోంది.

Tirumala

2020-10-28 19:08:33

2020-10-28 16:53:52