1 ENS Live Breaking News

అన్నవరం దేవస్థానంలో విజిలెన్సు తనిఖీలు..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో విజిలెన్సు తనిఖీలు నిర్వహించారు. ఏకంగా పాలకవర్గం సభ్యుడే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా దేవస్థానం భూముల ఆక్రమణ, నకిలీ ఉద్యోగులు, థర్డ్ పార్టీ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ల వ్యవహారం, అంతేకాకుండా ట్రస్టుబోర్డు చైర్మన్ పై కూడా ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు దేవస్థానంలో లోతుగా విచారణ చేపట్టారు. అయితే ఏఏ అంశాలపై విజిలెన్సు అధికారులు విచారణ చేపట్టారనే విషయాన్ని ఇటు దేవస్థాన అధికారులుగానీ, తనిఖీ సిబ్బంది సైతం బయట పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా దేవస్థానంలో రెండు విభాగాల్లో ఇద్దరు ఉద్యోగులు యాక్టింగ్ ఈఓలుగా వ్యవహరించడం, పెంచిన ధరలు, జరుగుతున్న అభివ్రుద్ధి పనుల్లో అవినీతి, లేని ఖర్చులు అధికంగా చూపడం తదితర అంశాలపై విచారణ జరిగినట్టు చెబుతున్నారు. అయితే దేవస్థానం అధికారులకి ఏసీబీ అధికారులంటే లెక్కలేని తనం ఉండటంతో విజిలెన్సు అధికారులు తనిఖీలను వీరు సాధారణ పరిపాలనాపరమైన తనిఖీలుగా భావించడం ప్రాధాన్యత సంతరించుకుంది..

Annavaram

2021-12-20 12:11:10

మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి కొత్త మా అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ట్విట్టర్‌ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  కొత్త కమిటీ  ప్రమాణ స్వీకారం ఎప్పుడూ ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

Hyderabad

2021-10-13 16:08:51

‘మా’సభ్యత్వానికి ప్రకాష్ రాజా గుడ్ బయ్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు సోమవారం ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అనంతరం ప్రకాష్ రాజ్  మీడియాతో మాట్లాడుతూ, 'మా' ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలియజేశానని.. మా ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు. 'నేను తెలుగు వాడిని కాదు.. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు.. అందుకే  తెలుగుబిడ్డను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 'మా' తో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చారు. అతిథిగానే వచ్చాను.. అతిథిగానే ఉంటాను.. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా అని చెప్పారు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. ఇలాంటి ఎజెండా ఉన్న అసోసియేషన్ లో నేను ఉండలేను. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. నన్ను నాన్‌ లోకల్ అన్న కోట, రవిబాబు మాటల్ని గౌరవిస్తా. లోకల్‌, నాన్‌ లోకల్ అజెండాల మధ్య ఉండలేను. మా సభ్యత్వం లేకుంటే సినిమాలు చేయనివ్వరా?' అని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను ఇక్కడే వుంటాను తప్ప..మాలో మాత్రం ఉండలేనని స్పష్టం చేశారు..

Film Nagar

2021-10-11 07:42:25

పొట్టచెక్కలయ్యేంత నవ్వొచ్చేస్తుంది..

నిత్యం ఏదో పనిలో బిజీబిజీ జీవితం గడిపేవారు మనసారా నవ్వుకొని ఆ వర్క్ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ పొందాలని భావిస్తుంటారు. అలాంటి వారికి ఈ వీడియో చక్కని లాఫింగ్ టానిక్ లా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జానపద కళల్లో ఒకటైన వెరైటీ బుర్రకథ..దీనిని వెరైటీ బుర్రకథ అని ఎందుకు అన్నారంటే..ఇందులో ఉండేవన్నీ డబులు మీనింగ్ డైలాగులే..వాస్తవానికి ఎవరూ బాహ్య ప్రపంచంలో డబుల్ మీనింగ్ డైలాగులు వినియోగించలేరు. కానీ కళాకారులు పండుగల సమయంలో ప్రదర్శించే ఈ బుర్రకథల్లో ప్రేక్షకులను కదలకుండా అలాగే తమ కార్యక్రమం మొత్తం చూసేలా చేయడానికి మధ్య మధ్యలో కాస్త డబుల్ మీనింగ్ డైలాగులుతో ఎంతో ఉత్సాహ పరుస్తుంటారు. అలా చేయకపోతే కళాకారులను గుర్తించరు సరికదా..నవ్వు కూడా రాదు. ఎవరినో ఏదో తప్పుడు మాట అనాలని కాదు గానీ..కేవలం ప్రేక్షకులకు వైరటీ హ్యూమరసాన్ని పంచడం కోసం ఈ తరహా బుర్రకథలు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి..కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.

Srikakulam

2021-07-12 17:18:46

2021-02-27 22:33:55

కరోనాను ఓడించిన నాన్ స్టాఫ్ ఆన్లైన్ సంగీత శిక్షణ..

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ కకావికలు చేస్తే...అదే కరోనా వైరస్ ప్రముఖ సంగీత దర్శకులు డాక్టర్ మహర్షి(జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి) రూపంలో విశాఖలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో సంగీత కళాకారులుగా మార్చింది. ఇంటి నుంచి కాలు కదపడానికి వీలుపడని రోజుల నుంచి జనజీవనం అంతా కలిసి తిరిగే పరిస్థితి వచ్చేలోపు అంటే సుమారు ఏకదాటిగా 320 రోజుల పాటు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సంగీత పాఠాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడి మరెందరో తమని తాము గాయకులుగానూ, ఇనిస్ట్రుమెంట్ ఆర్టిస్టులను గానూ మలచుకోవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారింది. జాన్ క్రిష్టోఫర్ అంటేనే ఒక సంగీతం..ఆయనను మరోపేరుతో పిలచే మహర్షి అంటేన ఒక గమకం..అన్నీ వెరసీ కళాకారులను సంగీత సాధనలోనూ, వివిధ రకాల వాయిద్య పరికాలను అలవోకగా వాయించే మ్యుజీషియన్లుగాను తయారు చేసి భారతదేశంలోనే ఒక రికార్డును స్రుష్టించింది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆన్లైన్ క్రైస్థవ సంగీత శిక్షణ కరోనాను ఓడించిందా అన్నట్టు నిర్విరామం సాగడం విశేషం.. ప్రస్తుతం రికార్డులు నమోదు చేసే జాతీయ స్థాయి సంస్థలు డా.మహర్షి(జాన్ క్రిష్టఫర్) నాన్ స్టాప్ ఆన్లైన్ మ్యూజిక్ ట్రైనింగ్ రికార్డును నమోదు చేయాలని కూడా చూస్తున్నాయి. క్రిష్టియన్ శాస్త్రీయ సంగీతాన్ని ఔత్సాహిక గాయకులకు నేర్పి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దాలనే ఆయన తపనకు కరోనా వైరస్ వేదిక కల్పించింది. హోమో ఐసోలేషన్ లో ఏమీ పాలుపోకుండా ఉండేవారందరూ ఈయన నేర్పే సంగీతాన్ని ఆన్ లైన్ ద్వారా నేర్చుకొని మంచి ప్రావీణ్యత సాధించారు. ఎప్పుడూ వైవిధ్య భరిత వార్తల్లో నిలిచే ఈ ప్రముఖ సంగీతదర్శకులు కళను బ్రతికించడానికి, కాళాకారులను తయారు చేయడానికి చేస్తున్న తపన అంతా ఇంతా కాదు. ఆ వివరాలు తెలుసుకుంటే.. ప్రముఖ సంగీత దర్శకులు డా. మహర్షి (జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి)  విశాఖ నగరం లో  2003 6వతేదీన ట్రినిటీ చర్చ్ లో, సంఘ కాపరులు, పెద్దలు, యవనస్థుల సమక్షంలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ని స్థాపించారు. క్రైస్తవులు శాస్త్రీయ సంగీతం నేర్చుకునే అవకాశం లేక సరియైన పద్దతిలో చెప్పేవారు.. ప్రోత్సహించే వారు.. లేక శాస్త్రీయ సంగీతాన్ని క్రైస్తవ సాహిత్యంతో, క్రైస్తవ విశ్వాసంతో నేర్చుకోవాలనే "తృష్ణ" కలిగిన పెద్దలు, యవనస్థులు, పిల్లలు ఎన్నో సంవత్సరాలుగా ఆ విద్యకు దూరమైన సంధర్భాలలో మహర్షి గారి  40 సంవత్సరాల సంగీత అనుభవముతో  "క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం" అనే గ్రంధాన్ని రచించి, క్రైస్తవ విశ్వాసం, క్రమశిక్షణా మార్గంలో అనేక గీతాలు, రాగమాలికలు, కృతులు రచించి స్బ్వరకల్పన చేసి, శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే పద్ధతులతోనూ, విధానాలతోనూ ఒక పాఠ్యాంశంగా దానిని రూపొందించారు. ప్రముఖ క్రైస్తవ సంఘ కాపరులు, పెద్దలు ఆ గ్రంధానికి ముందు మాటలు రాసి ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు. దానిని పాఠ్యాంశంగా "క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్" లో జాయిన్ అయిన చిన్న, పెద్దలకు శాస్త్రీయ సంగీతాన్ని మహర్షి గారు బోధించడం ప్రారంభించానరు. స్వంత బిల్డింగ్ లేకపోయినా, సంఘ కాపరులు, సంఘ పెద్దలు ఆయనకు  అండగా నిలిచి వారి చర్చెస్ లో నే "క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్" కి స్థానం కల్పించారు. అలా ప్రారంభమయిన ఈ సంస్థ దినదినాభివ్రుద్ధి చెందింది. ఈ కాలేజ్ లో నేర్చుకున్న విధ్యార్ధులతో "వర్షిప్ కాన్సర్ట్స్" ను ఎంతో వైభవంగా విశాఖ నిర్వహించడం విశేషం. అంతే కాకుండా ప్రముఖ క్రైస్తవ వాగ్గేయ కారులు రచించి స్వరపరచిన, ఎంతో ప్రాముఖ్యత నంతరించుకున్న "ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు" "శాస్త్రీయతను తీసుకొని వచ్చి" ఒక గ్రంధం గా మలచాలనే దైవ సంకల్పంతో ఆ కీర్తనలకు ఇటు కర్ణాటక, వెస్ట్రన్ నొటేషన్స్ వ్రాయాలని తలంచి దాదాపు 200 కీర్తనలకు స్వరాలు ఆ పుస్తకంలో రాశారు. వీటిని శాస్త్రోక్తంగా విద్యార్ధులకు నేర్పి తిరిగి ఆ కీర్తనలు ప్రతీ చర్చ్ లోనూ స్వరబధ్ధంగా పాడించాలనే ఉద్దేశంలో ఉండగా అనుకోని విధంగా ఈ కరోన వ్యాధి వలన విధ్యార్ధులు నేర్చుకోవడానికి రావడం కష్టతరమయ్యింది. ఆ సమయంలో పాస్టర్ షాలేం గారు (డైరెక్టర్, జీవ జలములు) "జూం"  ఆన్ లైన్ లో వాక్యోపదేశం ప్రారంభించి మీరు కూడా ఇలా ఆన్ లైన్ లో క్లాసులు తీసుకొండి అని సలహా చెప్పి ఆయన "జూం" నుండి మహర్షి గారికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. దీనితో 15-4-2020, న ఆయన  ప్రారంభించిన ఆన్ లైన్ వోకల్ క్లాసుకు మొట్టమొదట్టి సారిగా ఎంతో మంది చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా జాయిన్ అయ్యి శాస్త్రీయ సంగీతం యొక్క మెళకువలను నేర్చుకోవడం ప్రారంభించారు. అలా ప్రారంభమైన ఈ క్లాసులు ఆన్ లైన్ లో చీన్న వాళ్ళకు 200 వ రోజులు, మరియు పెద్దవాళ్ళకు 300 రోజులు పూర్తయ్యాయి. సంగీత స్వరాల ఆవిర్భావం, వివిధ రాగ లక్షణాలు, తాళ ప్రక్రియలు బాగా తెలుసుకొని అర్ధం చేసుకొనీ స్పష్టమైన స్వరాలతో ఆ రాగ తాళములకు అణుగుణంగా "ఆంధ్ర క్రీస్తవ కీర్తనలు" మరియు ఆయన రాసి స్వరపరచిన గీతాలు, రాగమాలికలు, కృతులు నేర్చుకుంటూ ఈ రోజు విధ్యార్ధులు 300 వ రోజు సంబరాన్ని చేసుకుంటున్నారు. ఎంత అద్భుతం. ఇది కేవలం దేవుని ప్రణాలిక అని ఇక ఆగని సంగీత జీవ నది ప్రవాహమని, ఒక్కొక్క విధ్యార్షి ఒక్కొక్క శాస్త్రీయ సంగీత ఉపాధ్యాయులుగా మారి క్రైస్తవ శాస్త్రీయ సంగీతానికి ఒక కొత్త జీవాన్ని వెలుగును తీసుకొని వస్తారనీ ప్రముఖుల ప్రశంశలు అందుకున్న ఈ తరుణంలో ఈ 300 వ రోజు (08-02-2021 సోమవారం)  "క్రైస్తవ శాస్త్రీయ సంగీత పండుగ  అందరినీ అలరించింది. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది జాయిన్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అతిధులుగా వచ్చిన ప్రముఖ రచయిత, కవి, పండితులు, తాతపూడి రాజేష్ , ప్రముఖ గాస్పెల్ గాయకులు, సాహితీ రత్న ఆకుమర్తి డేనియల్  వారి గ్రీటింగ్స్ తెలియచేసి మహర్షి గారినీ, అద్భుతం గా పాడిన పిల్లలను, పెద్దలను అభినందించి మహర్షి  చేస్తున్న ఈ సంగీత సేవ ఒక "యజ్ఞమనీ నిరంతర సంగీత ప్రవాహమనీ, ఇది కేవలం దైవ సంకల్పమనీ కొనియాడారు. పెద్దలు డా. శేమ్యూల్ సొంగా, ఆశీర్వాదం, యు.కె నుండి హాజరయ్యిన ఎబినేజర్ , సిస్టర్ రూత్  అందరికీ తమ శుభాకాంక్షలు తెలియచేసారు. తాతపూడి రాజేష్  మాట్లాడుత్తు త్వరలొ నాలుగు ప్రాంతాలలో, విశఖపట్టణం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ నగరాలలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఫిజికల్ బిల్డింగ్స్ రావాలనీ దానికి కృషి చేస్తామనీ అంతేకాకుండా "ఆంధ్ర క్రీస్తవ కీర్తనలను  "క్రైస్తవ శాస్త్రీయ సంగీత గ్రంధంగా" తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియచేసారు. ఈ విషయాలను దృష్టిలో వుంచుకొని అందరూ తమ తమ ప్రార్ధనలో దేవునికి విజ్ఞాపన చేయాలని కోరారు. దీనంతటికీ ప్రోత్సహిస్తూ వెన్నంటి నడిపిస్తున్న “జీవ జలములు రేడియో , మీడియా మినిస్ట్రీస్, విశాఖపట్టణము, అధినేత పాస్టర్ షాలేమ్ ఇజ్రాయేల్ మహర్షి , సభ్యులతో పాటు వచ్చిన అతిధిలు ఎంతగానో ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరస్తులు, సభ్యులు, క్రిష్టియన్ సంగీత కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-20 11:45:07

2021-02-19 22:58:29

త్వరలో రాజశేఖర్ 92వ సినిమా..

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ఓ కొత్త సినిమాను శనివారం ప్రకటించారు. ఆయనకి ఇది 92వ చిత్రం. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'గతం' ఫేమ్ కిరణ్ కొండమడుగుల దర్శకత్వంలో రాజశేఖర్ నటించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై సినిమా తెరకెక్కబోతుంది. 'గతం' నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు... రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈమేరకు సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న 'శేఖర్' పూర్తయిన తర్వాత ఆగస్టులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కొండమడుగుల మాట్లాడుతూ "దర్శకుడిగా నేను తీసిన 'గతం' సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. నా తదుపరి సినిమా రాజశేఖర్ తోనే చేయబోతున్నా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. యాంటీ సోషల్ ఎలిమెంట్ సెక్స్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా జరగబోతుందని అన్నారు. సినిమా మొత్తమంతా అమెరికాలోనే చిత్రీకరించేలా ప్లాన్ చేశాం అని వివరించారు. హీరో క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. రాజశేఖర్ గారికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ప్రేక్షకులందరూ సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు. నిర్మాత భార్గవ పోలుదాసు మాట్లాడుతూ "నన్ను 'గతం'లో అర్జున్ పాత్రలో చూసి ఉంటారు. ఆ సినిమా నిర్మాతల్లో నేను ఒకడ్ని. మా నెక్స్ట్ సినిమాను కిరణ్ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ తో చేస్తున్నాం. కిరణ్ రాసిన కథ రాజశేఖర్కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సినిమా చేయడానికి చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాం.  ఈ సినిమా 'గతం' కన్నా మంచి పేరు తెస్తుందనీ, మీరంతా సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. నిర్మాత హర్ష ప్రతాప్ మాట్లాడుతూ "కిరణ్ దర్శకత్వం వహించిన 'గతం' చిత్రనిర్మాతల్లో నేను ఒకడిని. 'గతం' తర్వాత మరోసారి కిరణ్ దర్శకత్వంలో, హీరో రాజశేఖర్ గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.. ఆగస్టు నుంచి అమెరికాలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ వేల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీలా తీయాలనేది మా ప్రయత్నం. ప్రేక్షకులకు హాలీవుడ్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. స్క్రిప్ట్ బాగా వచ్చింది. 'గతం' సినిమాను ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.

Visakhapatnam

2021-02-06 14:53:26

2021-02-01 20:54:04

నిండుమనిషి చిత్రానికి 43 వసంతాలు..

లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్ బ్యానర్ పై N.R.అనురాధాదేవి నిర్మించిన చిత్రం  " నిండుమనిషి"  ఈ చిత్రంలో కథానాయకుడు "హీమ్యాన్", "నటభూషణ" శోభన్‌బాబు. చిత్ర కథానాయిక జయచిత్ర, సంగీతం : సత్యం . ఈ చిత్రానికి ఎస్ .డి .లాల్ దర్శకత్వం వహించారు. కెమెరామెన్: గోపాలకృష్ణన్ .చిత్రం విడుదల తేదీ 26-01-1978. ఇప్పటికి ఈ సినిమా విడుదలై నేటికి 43 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో సినిమాలను ప్రేక్షకులను విశేషంగా అలరించేవి. ముఖ్యంగా సినిమా టైటిట్స్ తోనే హీరోలు, హీరోయిన్ లు ప్రేక్షకులు బాగా గుర్తు పెట్టుకునేవారు. ఆ సినిమాల్లో వారి నటనకు ఫిదా అయిపోతూ, సినిమాలో జీవించిన పాత్రను నిజజీవితంతోనూ వారితో పోల్చుకుంటూ చాలా మంది గడిపేవారంటే అతిశయోక్తి కాదు. శోభన్ బాబుకి ప్రతీ సినిమాకి ఒక వైవిధ్యం చూపించడం అలవాటు. నిండు మనిషి చిత్రంలో శోభన్ బాబు నటన ఏ స్థాయిలో ప్రేక్షకులకు ఆకట్టుకుందంటే..ఏదైనా మంచి పనిచేస్తే నిండు మనిషి చిత్రంలో శోభన్ బాబు గుర్తొచ్చారు అనేంతగా ప్రేక్షకులు సినిమాలను ఆదరించేవారు. అలా సినిమా టైటిళ్లు ప్రేక్షకుల నిజజీవితాల్లో ప్రభావితం చూపించేవి..!

సినిమాడెస్క్

2021-01-26 13:39:41

అర్థాంగి చిత్రానికి 66 వసంతాలు..

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం అర్ధాంగి. కుటుంబ కధా చిత్రానికి ఈ సినిమా నిలువెత్తు నిదర్శనం, ఈ సినిమా నాటికి హీరో, హీరోయిన్లు ఇద్దరూ లేతవయసులో ఉన్నవారే కావడం విశేషం. ఒక్క ముక్కలో చెప్పాలంటే భార్య అంటే అర్ధాంగి చిత్రంలో సావిత్రలా ఉండాలి అనేవారు చాలా మంది ఈ సినిమా చూసిన తరువాత. అంతలా ఈ అర్ధాంగి చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.  బెంగాలీ నవల ఆధారంగా "అర్ధాంగి" చిత్రాన్ని రాగిణి పిక్చర్స్ నిర్మించింది.ఈ బెంగాలీ నవలను మణిలాల్ రచించారు. ఈ చిత్రానికి మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ .సంగీతం బి.నర్సింహారావు. దర్శకనిర్మాత పి పుల్లయ్య. అక్కినేనికి ఇది నలభై రెండవ చిత్రం. 26-01-1955 తేదీ నాడు ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో అక్కినేని , సావిత్రిల తోపాటు జగ్గయ్య , గుమ్మడి, శాంతకుమారి ,చదలవాడ, సురభి ,బాల సరస్వతి మొదలగు వారు నటించారు .

సినిమా డెస్క్

2021-01-26 13:19:00

2021-01-23 14:38:14

2021-01-20 16:52:52

2021-01-02 19:55:09

2021-01-01 17:55:29