1 ENS Live Breaking News

ఆహా తలుపు తట్టిన 'వినరో భాగ్యము విష్ణు కథ'

ఆహా తలుపు తట్టింది కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా. రిలీజ్ అయిన తరువాత మంచి సక్సెస్ ను  కూడా సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరగింది. మురళీ కిశోర్ దర్శకత్వం వహించగా.. ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది.  కశ్మీర పరదేశి కథానాయికగా నటించిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. ఈ సినిమా మంచి వసూళ్లను సైతం రాబట్టింది. అలాంటి ఈ సినిమా 'ఆహా' ద్వారా పలకరించడానికి రెడీ అయిపోయింది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని సినిమా వర్గాలు పేర్కొన్నాయి. ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఆహాలో వచ్చి ఇపుడు ప్రేక్షకులను పలుకరించబోతుంది. సో రెడీగా ఉండండి.

Hyderabad

2023-03-15 16:29:38

యాపిల్ బ్యూటీ హన్షిక.. ఆ7ఏళ్లకథ రహస్యాన్ని చెప్పేసింది

విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన యాపిల్ బ్యూటీ హీరోయిన్‌ హన్సిక  తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాతన ఈ అమ్మడు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోహైల్‌ కథూరి యాను వివాహం చేసుకుని వివాహబంధంలోకి ప్రవేశించిది. ఆ తరువాత మీడియా ముందుకి వచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో  తమ ప్రేమ వివాహం వెనుక అసలు రహస్యాన్ని చెప్పింది. సోహైల్‌ ప్రేమను తాను అంగీకరించడానికి ఏడేళ్ల సమయం పట్టిందని.. బాంబు పేల్చింది.

‘‘తాను స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశాను. బ్రేకప్‌ తర్వాత మరొకరికి ఓకే చెప్పి వాళ్ల ప్రేమను మనస్పూర్తిగా అంగీకరించేందుకు 7 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై ఎంతో నమ్మకం ఉంది. స్వచ్ఛమై ప్రేమను పంచుకునే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం తీసుకున్నాను. సోహైల్‌ కథూరియా కూడా నా ప్రేమ కోసం కూడా ఎంతో ఎదరుచూశాడు అంటూ చెప్పుకొచ్చింది. తను నన్ను ఎంతగా ప్రేమిస్తాడో మాటల్లో చెప్పలేనని.. అది అనుభవించిన నాకు మాత్రమే తెలుస్తుందని’’ అని చెప్పింది. తన ఓల్డ్‌  రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ అలాంటివి పెద్దగా గుర్తుంచుకునేవి కాదు..పనికిరాని విషయాలను ఎవరైనా గుర్తుంచుకుంటారా అంటూ కాస్త చిరాకు కూడా ప్రదర్శించింది. ప్రస్తుతం దేవుడు నాకు మంచి దారి చూపించాడు. ప్రతి ఒక్కరి జీవితానికి ఓ కొత్త ప్రారంభం ఉంటుందని నేను నమ్ముతాను’’అంది.

హన్సిక వివాహ వేడుక ‘లవ్‌ షాదీ డ్రామా’పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో తన కెరీర్‌లో ఎదురైన అనేక అనుభవాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను హన్సిక చాలా ఎక్కువగానే ప్రేక్షకులతో పంచుకుంది. కథానాయికగా హన్సిక ఎంట్రీ ఇచ్చే క్రమంలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు అప్పట్లో వచ్చిన వార్తలపైనా కూడా ఆమె స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదని తెలిపింది. వాళ్ల సోషల్ మీడియా హైప్ కోసం ఏవేవో రాస్తే దానిపై స్పందించాలా .. ఆ వార్తలన్నీ ఫేక్ అని, ఒకానొక సమయంలో మీడియా ఇలా నీచంగా ప్రవర్తిస్తుందానే అసహనాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం హన్సిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘పార్ట్‌నర్‌’,‘105 మినట్స్‌’ చిత్రాల షూటింగ్‌ పూర్తి కాగా, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ తదితర చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. పెళ్లి తరువాత కూడా హన్షిక సినిమాలు అదరగొడుతుంది. అవి బాక్సాఫిసు దగ్గర విజయం సాధించాలని కోరుకుందాం..!


Hyderabad

2023-02-20 08:32:41

విశ్వనాధ్ సిరివెన్నల స్వర్గంలో సంగీతం ఆశ్వాదిస్తారు.

కె.విశ్వనాధ్ భౌతికంగా దూరమైనా..ఆయన మంచి చిత్రాలు ప్రతీ ఒక్కరి మనసులోనూ పదిలంగా ఉంటాయని.. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. ఆయన సిరివెన్నల సర్గంలో దివ్యమైన సంగీతాన్ని ఆశ్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆయన విలక్షణమైన దృశ్యశైలి, సంగీతం, ఆయన గౌరవించే సంస్క్రుతి సంప్రదాయాలు, మరెన్నో విలక్షణమైన పాత్రలు ప్రతీ పాఠకుడూ గుర్తించుకుంటాడని ట్వీట్ చేశారు.

Hyderabad

2023-02-03 07:00:24

విశ్వనాధ్ మృతిపట్ల ప్రధాని, సీఎం సంతాపం

ప్రముఖ దర్శకుడు కే.విశ్వనాథ్ నేడు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. 'శ్రీ కె. విశ్వనాథ్ గారు మృతి చెందడం బాధాకరం. అతను ఒక సృజనాత్మక మరియు బహుముఖ దర్శకుడిగా సినీ ప్రపంచంలోని ప్రముఖుడు. ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి' అని ట్వీట్ చేశారు. ఆయనతోపాటు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విశ్వనాధ్ మృతి సినీరంగానికి తీరని లోటని అన్నారు.  వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.

Chennai

2023-02-03 05:36:34

ప్రియాంకా చోప్రా కూతుర్ని చూశారా ఎలాఉందో

బాలీవుడ్ అగ్రతార ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతుర్ని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. అమెరికన్‌ సింగర్‌, నటుడు నిక్‌ జొనాస్‌, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక బిడ్డను కన్నారు. అయితే అప్పటి నుంచి ఇంతవరకు కూతురు మాల్తీ మేరీ ఫేస్‌ను చూపించలేదు. కానీ రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరై ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త వైరల్ అవుతున్నాయి. చాలా వరకూ సినిమా తారలు స్వయంగా కాకుండా సరోగసీ ద్వారానే పిల్లలను కనడం పరిపాటిగా మారింది..!

Mumbai

2023-01-31 04:56:10

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి హఠాత్మరణం

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎ.శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో అయన తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస మూర్తి తమిళ హీరో సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పి పాపులర్ అయ్యారు. రాజశేఖర్, అజిత్ కుమార్, విక్రమ్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, ఉపేంద్ర, ప్రభుదేవా లాంటి హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. వాటిపాటు ఎన్నో యాడ్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. విషయం తెలుసుకున్న హీరో సూర్య తన ప్రగాఢ సంతాపాన్న తెలియజేశారు. 

Chennai

2023-01-27 08:53:50

టాలీవుడ్ లో విషాధం..నటి జమున కన్నుమూత

తెలుగు చిత్రసీమ సీనియర్ నటి జమున(86) ఈరోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో  తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జమున మృతదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు. జమున 1930 ఆగస్టు 30న హంపిలో జన్మించారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. 1953 లో పుట్టిల్లు సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. 1955లో మిస్సమ్మ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Hyderabad

2023-01-27 04:18:25

మళ్లీ తెరుచుకున్న కంగనా ట్విట్టర్ ఖాతా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించారు. తాజాగా, ఆమె ‘అందరికీ నమస్కారం. ట్విట్టర్ కు తిరిగి రావడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్ 
చేసింది. ఆమె ట్విట్టర్ ఖాతాను 2021 మేలో సంస్థ శాశ్వతంగా నిషేధించింది.  దాదాపు రెండేళ్ల తర్వాత శాశ్వతంగా నిషేధించిన ఖాతాను పునరుద్ధరించడంపై 
నెట్టింట తీవ్ర చర్చ జరగుతోంది. కంగనాతోపాటు మరికొందరి ఖాతాలను కూడా ట్విట్టర్ మూసివేసింది. అయితే కొన్ని ప్రధాన షరతులపై మళ్లీ ఖాతాను 
పురుద్దరించినట్టు సమారం అందుతోంది. చాలా కాలం ట్విట్టర్ ఖాతా లేకపోవడంతో ఫేస్ బుక్ లోనే పోస్టులు పెట్టేది కంగనా..!

Maharashtra

2023-01-24 15:36:00

బాలయ్యకు కాస్తగట్టిగానే నాగచైతన్య కౌంటర్

వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన పలు వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అక్కినేని, తొక్కినేని అంటూ 
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య తాజాగా కౌంటర్ తోనే స్పందించాడు. 'నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ 
రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం' అని నాగచైతన్య ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ 
ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..అటు అక్కినేటి ఫ్యాన్స్ సైతం బాలయ్యపై ఫైర్ అవుతున్నారు.

Hyderabad

2023-01-24 12:20:05

ట్రిపులార్ కు మరో అరుదైన అవార్డు..

దర్శక మాంత్రికుడు ఎస్ఎస్.రాజమౌళి మ్యాజిక్ తో రూపుదిద్దుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ అంతర్జాతీయంగా పలు అవార్డులను కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.. తాజాగా మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకొని వార్తల్లో నిలిచిందిజ. ప్రతిష్టాత్మకమైన జపాన్ అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా RRRకు పురస్కారం లభించింది. ఈ అవార్డును మార్చి 10న అందజేయనున్నారు. తెలుగు సినిమాకి ఈ అవార్డు రావడం పట్ల సినీవార్గాలు హర్షం వ్యక్తం చేశాయి.  జపాన్ లో గతేడాది ఈ సినిమాను విడుదల చేయగా భారీ స్థాయిలో రికార్డులు నమోదుచేసింది.

Film Nagar

2023-01-24 03:59:44

విశాఖలో జర్నలిస్టుల కోసం కొరమీను సినిమా ప్రదర్శన

విశాఖలో కొరమీను సినిమాను నగరంలోని జర్నలిస్టుల సౌకర్యార్దం శారదా థియేటర్ లో గురువారం ప్రదర్శిం చారు. ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డేవిడ్ రాజ్ ప్రత్యేక పాత్ర పోషించారు. మంచి, కధాంశంతో తెరకె క్కిన సినిమాను, జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.  కాగా ఈ సినిమాలో నటు లు ఆనంద్, రవి, కిషోర్ ధాత్రక్, హరీష్, ఉత్తమన్, శత్రు చక్కటి పాత్రలు పోషించారు. ప్రేక్షకుడిని ఆలోచింప జేసే విధంగా సినిమాను శ్రీపతి కర్రి తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకి నిర్మాత పెళ్లకూరుసామాన్యారెడ్డి. సిని మాటోగ్రఫీ కార్తీక్ కొప్పర, ఎడిటింగ్ కె.విజయ్ వరన్..!

Visakhapatnam

2023-01-05 16:33:39

అంబరాన్ని తాకిన వైజాగ్ ఫిల్మ్ ఫెస్టివల్

విశాఖ వేధికగా నిర్వహించిన వైజాగ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 5 రాష్ర్టాలకు చెందిన కళాకారులకు అవార్డుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ర్టంలోనే విశాఖ సినిమా షూటింగ్ లకు ప్రదాన కేంద్రంగా మారిుపోయిందన్నారు. ఇప్పుడు కొత్తగా విశాఖను మరిన్ని సినిమాల చిత్రీకరణకు ఉపయోగించుకోవచ్చునన్నారు. జాలాది చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో విశాఖ వేధికగా ఐదు రాష్ర్టాలకు చెందిన కళాకారులకు అవార్డులు ప్రధానం చేసుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రస్తుతం సినిమా రంగంలో సక్సస్ రేటు ఐదు శాతం మాత్రమే ఉందన్నారు. 

గతంలో ఇది ఎనిమిది శాతంగా ఉండేదన్నారు. వంద సినిమాలకు ఐదు సినిమాలు నూరు శాతం సక్స్ స్ ను సాధించడం జరుగుతుందన్నారు. గౌరవ అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం, పలు రాష్ర్టాల నుంచి ముఖ్య కళాకారులు ఇక్కడకు రావడం అభినందనీయమన్నారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో జాలాది విజయ మాట్లాడుతూ తాము సంకల్పించిన ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రాష్ర్టాల నుంచి కళాకారులు రావడం ఇందుకు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ తమకు అండగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. తమ తండ్రి జాలాది ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారన్నారు. 

ఈ సందర్భంగా పాగల్, రాదేశ్యామ్ తో పాటు తెలుగు, తమిళం, మళయాల, కన్నడ, కర్ణాటకతో పాటు పలు రాష్ర్టాలకు చెందిన సినిమాలకు , టెక్నీషియన్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహాంజలి సంస్థ భారీ ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఫౌండర్ పులగం రామచంద్రారెడ్డి, కో పౌండర్ జాలాది విజయ, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, సినీ ప్రముఖులు సాయివెంకట్, నరసింగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ తామాడ శ్రీనివాస్, సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గాప్రసాద్ ఐనాడ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-04 15:59:00

అలాంటోడు దొరికితే పెళ్లిక రెడీ..ప్రగతి కీలక వ్యాఖ్యలు

తెలుగు సినీ ఆర్టిస్టు ప్రగతి తన రెండో పెళ్ళి విషయంలో ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. మీడియా ఏ పనీపాట ఉండదని..ఏదో ఒక గాసిప్ జనాలమీదకు వదులుతారని అంది. ఎప్పటికప్పుడు తన జిమ్ వర్కవుట్ పోస్టులతో అందరినీ ఆకట్టుకునే ఈమె తన భర్తతో విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తోంది. ఇటీవల ఆమె 2వ పెళ్లి విషయం పై స్పందిస్తూ.. పెళ్లి అని కాదు కానీ జీవితంతో ఉండాలి కదా అని చాలాసార్లు అనుకున్నాననని తన మనసులో మాట బయటపెట్టింది. నా మెచూరిటీ లెవల్ కు తగ్గవాడు దొరకడం కష్టమేనని చెప్పుకొచ్చారు. అలాంటోడు దొరికితే అప్పుడు ఆలోచిద్దామని టాపిక్ ను కట్ చేసింది ప్రగతి..!

Hyderabad

2023-01-03 14:47:26

బాలయ్య పవన్ ఎపిసోడ్ అప్పుడే..కాస్తక్లారిటీ

అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణతో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ పార్ట్-1 స్ట్రీమ్ అయ్యి చరిత్ర తిరగరాస్తున్నది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నవేళ కాస్త క్లారిటీ వచ్చింది. ముందు ఈ ఎపిసోడ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్నారు.. కానీ, సంక్రాంతికి ప్రోమో రిలీజ్ చేసి అదే నెల చివరిలోనైనా, ఫిబ్రవరి మొదటి వారంలోనైనా పవన్ ఎపిసోడ్ ప్రసారం చేయాలని ఆహా భావిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. బాలయ్య అన్ స్టాపబుల్ సిరిసీస్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్నది.

Hyderabad

2023-01-03 14:09:27

ప్రచంచాన్ని కుదిపేస్తున్న అవతార్ రికార్డులు..

అవతార్ 2 సినిమా ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపుతున్నది.  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విశేషంగా స్పందన వస్తోంది. జేమ్స్‌ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్, అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. 16 రోజుల్లోనే ఇండియా మొత్తం మీద రూ.310.40 కోట్లు నెట్, రూ.360.88 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ చిత్రాల రికార్డులను కూడా తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.10,294.10 కోట్లు వసూలు చేసి భారీ రికారర్డు సృష్టించింది.

Hyderabad

2023-01-02 07:57:15