1 ENS Live Breaking News

లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ గట్టిగానే లాగుతోంది

లైగర్‌ చిత్రానికి పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గట్టిగానే పట్టుబట్టి వివరాలు లాగుతోంది. దీనికోసం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్‌ ఇండియా సినిమాకు సంబంధించి చిత్ర దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు  ప్రశ్నించింది. తాజాగా శుక్రవారం సినీ ఫైనాన్షియర్‌ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు చెబుతున్నారు. లైగర్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా బోల్తాపడి నష్టాలు వచ్చిన తరువాత కూడా ఈడీ సినిమాకి చెందిన పెట్టుబడులపై గట్టిగానే బుర్రపెట్టి వివరాలు లాగుతోంది. 

ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్‌ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీశారట. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారాల్లో మరికొందరుని ఈడీ త్వరలో ప్రశ్నించ నున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. తన పని తాను చల్లగా చేసుకుపోతున్న ఈడీ విచారణ విషయంలో మాత్రం విషయాన్ని బయటకు రానీయకుండా ఎక్కడా ప్రకటనలు చేయకుండా మాత్రం జాగ్రత్తపడుతోంది. ఇలా ప్రకటన చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడా లైగర్ విషయంలో ఈడీ ఇంకెంత మందిని ప్రశ్నించి ఎలాంటి సమాచారం రాబడుతుందనేది.

Hyderabad

2022-12-17 06:06:53

వృద్ధ కళాకారుల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి

అనకాపల్లి జిల్లాలో గల రంగస్థల వృద్ధ కళాకారులకు పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులైన వారు  దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. గురువారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి, 58 సం.లు నిండిన కళాకారులు ఈ పించనుకి అర్హులని చెప్పారు. వీరికి ఏ ఇతర పింఛను రాకుండా ఉండాలని, కళాకారునిగా గుర్తింపు పత్రం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జత చేసి వెంటనే  జిల్లా కలెక్టరేట్ లో గల సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. అదేవిధంగా కళాకారుల గుర్తింపు కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.  వీరు రంగస్థల నాటకాలు, బుర్రకథలు తదితర కళారూపాలలో వారికి ఉన్న అనుభవము, వారిచ్చిన ప్రదర్శనల ఫోటోలు ప్రశంసా పత్రాల నకళ్ళు, స్థానికత, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమైతే కుల ధ్రువీకరణ పత్రాలను జత చేయాలన్నారు. 

Anakapalle

2022-12-15 10:47:41

విశాఖలో జనవరి 4న విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్

ఇండి యన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ ను  నిర్వహిస్తు న్నట్లు ఇండయన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఫౌండర్ పులగం రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విశాఖాలోని డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరిన 4న విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుందని చెప్పారు. తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సినిమా రంగంలో 24 విభాగాలకు చెందినవారు సినిమాలు,వెబ్ సీరిస్,షార్ట్ ఫిల్మ్ లను ఈనెల 28 లోపు తమ ఫిల్మ్ లను పంపించాలని చెప్పారు. విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీ పర్యవేక్షణలో ఎంపిక చేసిన వారికి ప్రముఖుల ద్వారా అవార్డులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.

 సింహాచలం ధర్మకర్తల మండల సభ్యులు, విశాఖ విమానాశ్రయ సలహా మండలి సభ్యులు, విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రతిభా వంతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు విశాఖ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూవీ మేకర్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ అందరు కూడా ఫెస్టివల్ కు తమ ఎంట్రీలను పంపించాలని కోరారు. మంచి కాన్సెప్ట్లతో ఫిలిమ్ లకు కచ్చితంగా ఆదరణ ఎక్కువగా ఉంటుందని అన్నారు. అటువంటి చిత్రాలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ, ఔత్సాహక ఫిలిం మేకర్స్ కు, షార్ట్ ఫిలిం మేకర్స్ కు ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. తప్పకుండా అందరూ ఈ ఫెస్టివల్ పాల్గొనాలని చెప్పారు. 

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారని, విజేతలకు అవార్డులను ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.  సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ తామాడ శ్రీనివాసు, సినీ రైటర్,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ 
ఐనాడ దుర్గాప్రసాద్, ప్రముఖ నిర్మాత,నటులు తమ్మినేని జనార్ధనరావు,ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Daba Gardens

2022-12-14 10:22:07

సినిమాలకు విశాఖ మెయిన్ సెంటిమెంట్..గంట్ల

చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన విశాఖలో సెంటిమెంట్ ఎంతోమంది నటులు అగ్ర తారలుగా అభివృద్ధి చెందారని  శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  పేర్కొన్నారు. ఎస్. ఎస్. ఎల్ .ఎస్. క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న కంచర్ల చిత్రం హీరో ఉపేంద్ర బాబు, హీరోయిన్ మీనాక్షి జెస్వాల్ కు తన ప్రేమ ప్రతిపాదన చేసే సన్నివేశాలను చిత్రీకరణను మంగళవారం శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్ర కథానాయకుడు ఉపేంద్ర కూడా ఈ సెంటిమెంటుతో అగ్ర తారల జాబితాలోకి చేరుకోగలడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 చిత్ర కథానాయకుడు ఉపేంద్ర బాబు మాట్లాడుతూ విశాఖ ప్రజల ఆదరణ ప్రోత్సాహంతో తన తొలి మూవీ" కంచర్ల 'ద్వారా సినీ పరిశ్రమలో చక్కని గుర్తింపును పొందగలనని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తొలి షెడ్యూల్లో అనేక సన్నివేశాలు నాలో ఉత్సాహాన్ని మరింత రేకెత్తించాయి అన్నారు. రెండవ షెడ్యూల్ కూడా సర వేగంగా చిత్రీకరణ జరుగుతున్నదని పేర్కొన్నారు. చిత్ర దర్శకులు యాద కుమార్ మాట్లాడుతూ ఎస్ .ఎస్. ఎల్ .ఎస్. క్రియేషన్స్ నిర్మాత కంచర్ల అచ్యుత రావు చిత్రీకరణలో ఎక్కడ రాజీ పడకుండా తమ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని  తెలుగు ప్రేక్షకులకు కానుకగా అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.

కొత్త వారైనప్పటికీ హీరో ఉపేంద్ర చక్కని హావభావాలతో ,హీరోయిన్ మీనాక్షి జస్వాల్ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే విధంగా నటిస్తున్నారన్నారు. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ప్రేమ, కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులకు దూరమవుతున్న తరుణంలో S.S.L.S. క్రియేషన్స్ ఒక సాంప్రదాయ ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించడానికి ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మేనేజర్ బాలగంగాధర్, కెమెరామెన్ గుణశేఖర్, జబర్దస్త్ నిహాన్, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, పార్క్ అద్యక్షులు సనపల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-06 11:33:29

సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అనారోగ్యం..

సూపర్ స్టార్ క్రిష్ణ ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.  క్రిష్ణ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ..ఇంటికే పరిమితం  అయ్యారు. ఇటీవలే కృష్ఱ.. భార్య ఇందిరాదేవి కన్నుమూయడంతో బాగా కృంగిపోయారు. అప్పటి నుంచి ఆ బాధలోనే ఉంటున్నారు.  తాజాగా అనారోగ్యం పాలయ్యారు. తెలుగు సినిమా రంగంలో 5 దశాబ్దాల పాటు వెలుగు వెలిగారు కృష్ణ. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని సమాచారం అందుతోంది. అయితే సూపర్ స్టార్ క్రిష్ణ అనారోగ్యానికి గురైందనే వార్త ప్రస్తుతం సినిమా వర్గాలను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం అంతా క్రిష్ణ ఆరోగ్య సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Hyderabad

2022-11-14 05:35:43

గరికపాటి నోటిగార వదిలిస్తున్న రాంగోపాల్ వర్మ వీడియో ట్వీట్

వార్నీ.. రాంగోపాల్ వర్మ నువ్వు మామూలోడివి కాదు అంటూ నెటిజన్లు, చిరంజీవి అభిమాన్లు రామ్ గోపాల్ వర్మ  ట్విట్టర్ లో పెట్టిన వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. మరికొందరు పాపం గరికపాటి నోటిగార వదిలిస్లున్న రాంగోపాల్ వర్మ అంటూ తిరిగి ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ అసలు కద చెప్పనే లేదు కదా.. గరికపాటి ఓ ప్రైవేటు టీవీ ఛానల్ లో నెమలి సంభోగం జరగుకుండా కంటి దారతో పిల్లల్ని కంటుందని..అదొక ప్రత్యేక ప్రక్రియ అని చెప్పిన వీడియో క్రింద.. రెండు నెమళ్లు సంభోగాన్ని చేస్తున్నట్టుగా డిజైన్ చేసిన వీడియోని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. దీనితో నెటిజన్లు ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. 

అంతేకాదు దానికి అనుగుణంగా రక రకాల వీడియోలు గరికిపాటికి వ్యతిరేకంగా పెడుతూ ట్విట్టర్ షేక్ చేస్తున్నారు. ఇటీవల గరికపాటి మెగాస్టార్ చిరంజీవిని సభలో మాట్లాడిన మాటలను కాస్త సీరియస్ గానే తీసుకున్న అభిమానులు నాటి నుంచి నేటి వరకూ ఒక రకంగా గరికపాటిని ఆట ఆడుకుటున్నారు. దానికి బదులుగా గరికపాటి అఫిషియల్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తనపై వచ్చే వీడియోలను నమ్మొద్దని ప్రచారం చేసుకున్నా ఎక్కడా ఫలితం మాత్రం కనిపించలేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి యావత్ సభ లో చేసిన వ్యాఖ్యలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తున్నది. మరీ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు ఈ తరహా వీడియోలు పోస్టు చేయడం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది..!

2022-10-12 08:43:25

సింహ వాహనసేవ‌లో క‌ళాకారుల కోలాహ‌లం

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు గురువారం ఉద‌యం శ్రీ మలయ ప్పస్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 15 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌ లిచ్చాయి.ఇందులో పుదుచ్చేరికి క‌ళాకారులు ఓళియాట్టం, పొడుగు క‌ర్ర‌ల‌తో చేసిన సంప్ర‌దాయ భ‌జ‌న‌, క‌ర్ణాట‌క క‌ళాకారుల భ‌ర‌త‌నాట్యం, మ‌హారాష్ట్ర క‌ళాకారులు కోలాటం భ‌జ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అదేవిధంగా, తూర్పుగోదావ‌రి జిల్లా మ‌ల్లేప‌ల్లికి చెందిన మారుతి నాసిక్ డోలు బృందం అఘోరా నృత్యం, భువ‌నేశ్వ‌రి భ‌జ‌న మండ‌లి తాళాల‌తో చేసిన నృత్యం, అనంత‌పురానికి చెందిన శ్రీ‌కృష్ణ బృందం సంప్ర‌దాయ నృత్యం, బెంగ‌ళూరుకు చెందిన కైలాస‌ధ‌ర బృందం నృత్యం, తిరుప‌తికి చెందిన ఆనంద‌నిల‌య‌వాసా భ‌జ‌న మండ‌లి నృత్య కార్య‌క్ర‌మాలు అల‌రించాయి.

          వీటితోపాటు విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, విశాఖ‌, తిరుమ‌ల‌, తిరుప‌తి క‌ళాకారుల కోలాటం భ‌జ‌న‌, తెలంగాణ రాష్ట్రం మ‌హ‌బూబ‌ర్ న‌గ‌ర్ క‌ళ‌కారుల చెక్క‌భ‌జ‌న‌, అన్న‌మ‌య్య జిల్లా క‌ళాకారుల పిల్ల‌న‌గ్రోవి నృత్యం భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Tirumala

2022-09-29 06:09:33

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక‌ శోభ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రం, అన్న‌మాచార్య క‌ళామందిరం, శ్రీ‌రామ‌చంద్ర పుష్క‌రిణి వద్ద ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధ‌వారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు  బి.లక్ష్మీ సువర్ణ బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన  ఆర్‌.వాణిశ్రీ బృదం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు  ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాలకు చెందిన శ్రీ‌మ‌తి పి.శైల‌జ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.
       
         సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన  బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం,  పి.మునిర‌త్నంరెడ్డి అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు  విజ‌య‌కుమారి హ‌రిక‌థాగానం చేశారు. తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు టిటిడి ఆస్థాన విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ భ‌క్తి సంగీతం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా గానం చేశారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి  కె.విశాలాక్షి ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు చ‌క్క‌గా ఆల‌పించారు. అదేవిధంగా, రామ‌చంద్ర పుష్క‌రిణిలో సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద‌తాడేప‌ల్లికి చెందిన  గ‌ణేష్‌కుమార్ భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

Tirumala

2022-09-28 16:54:24

విజయనగరంలో సినీ, లలిత సంగీతం పోటీలు

విజయనగరం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు చెందిన గాయకులకు సినీ,  లలిత సంగీత పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబర్ 9,10 తేదీలలో ఆర్.టి.సి బస్సు స్టాండ్ ఎదురుగా నున్న రెవిన్యూ కళ్యాణ మండపం నందు జరుగు ఈ పోటీలలో  15 నుండి 45 సంవత్సరముల వయసు గల  స్త్రీ పురుషులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను  కలెక్టరేట్ లో నున్న జిల్లా సమాచార పౌర సంబ్వంధాల శాఖ  కార్యాలయానికి నేరుగా గానీ  provizianagaram@gmail.com  మెయిల్ ద్వారా గానీ పంపవచ్చని తెలిపారు. దరఖాస్తుదారు తమ బయో డేటా , చిరునామా, మొబైల్ నెంబర్ తదితర  వివరాలను పూరింఛి దరఖాస్తులను మెయిల్ కు లేదా నేరుగా అందజేయవచ్చని తెలిపారు. అభ్యర్ధులు  దరఖాస్తు తో పాటు ప్రవేశ రుసుముగా 100 రూపాయలను  చెల్లించ వలసి ఉంటుందని  తెలిపారు.

  రుసుమును నేరుగా లేదా  నగదు రూపం లో గానీ  9618188624  నారాయణ రావు   కు  ఫోన్ పే  ద్వారా చెల్లించి స్క్రీన్ షాట్ ను పెట్టవలసి ఉంటుందని స్పష్టం చేసారు.  దరఖాస్తులను సెప్టెంబర్ 30 వ తేదీ లోగా అందేలా పంపాలన్నారు.  పోటీలలో పాల్గొనే  వారికీ ప్రధమ, ద్వీతీయ, తృతీయ బహుమతులతో పాటు మేమెంటో, సర్టిఫికేట్ లను అందజేయడం జరుగుతుందన్నారు. అస్లీల సాహిత్యం ఉన్న పాటలు నిషిద్ధమని,   పాల్గొనే  వారందరికీ పార్టిసిపేషన్  సర్టిఫికేట్లను అందిస్తామని తెలిపారు.  మిగిలిన వివరాలకు 9121215263  మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు. శాస్త్రీయ సంగీత పోటీలను కూడా ఇదే వేదిక వద్ద 9,10 తేదీలలో నిర్వహిస్తున్నామని, ఈ విభాగానికి చెందిన దరఖాస్తులను ఇంచార్జ్ అధికారి అయిన జిల్లా ఆడిట్ ఆఫీసర్ కార్యాలయానికి అందించాలని తెలిపారు.

Vizianagaram

2022-09-28 11:41:49

ఈటీవిలో జబర్ధస్త్ కి మంట పెట్టారా..?

జబర్ధస్త్..జబర్ధస్త్.. జబర్ధస్త్..ఒకప్పుడు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్ వున్న ఈటీవీ ప్రోగ్రామ్.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు..బుల్లి తెరపై కూడా ధీటుగా కామెడీ అద్భుతంగా వుంటుందని తెలుగు ప్రజలకు తెలియజేసిన ఏకైన నవ్వుల కార్యక్రమం. అంతేకాదండోయ్ ఎన్నిపనులున్నా వారంలో గురువారం, శుక్రవారం కుటుంబం మొత్తాన్ని ఈటీవికి అతుక్కుపోయేలా చేసిన ఏకైక ప్రోగ్రామ్ గా కూడా పేరు సంపాదించింది. అంతటి మంచి కార్యక్రమం ఎనిమిది సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగింది..చాలా సంవత్సరాలు ప్రోగ్రామ్ కి న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా లు వ్యవహరించారు. అయితే సరిగ్గా ఇక్కడే చిక్కు వచ్చిపడింది. షడన్ గా మల్లెమాల టీవీ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకున్నారు. ఎప్పుడైతే ఆయన తప్పుకున్నాడో..ఫేమస్ టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర లాంటి వారు కూడా తప్పుకున్నారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా కార్యక్రమం నుంచి తప్పుకుంటూ వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే కావాలనే ఈటీవీలో అత్యధిక రేటింగ్ వచ్చే ప్రోగ్రామ్ కి మంటపెట్టారనే అనుమానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇటీవలే కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు మల్లెమాలో జరిగిన అవమానాలపై మీడియా ముందుకి వచ్చి చెప్పడంతో..ఆ విషయాన్నా చాలా యూట్యూబ్ ఛానళ్లు ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాలు కూడా పెట్టి గట్టిగానే సొమ్ము చేసుకున్నాయి.

నాగబాబు, రోజా తప్పుకోవడంలో చెదిరిన కళ..
ఈటీవీలో వచ్చే జబర్ధస్త్ అంటే రోజా..నాగబాబే..ప్రేక్షకులకు నవ్వు రాకపోయినా..వారు నవ్వే నవ్వుకి.. బ్యాక్ గ్రౌండ్ డైలాగులకే అందరూ మరీ పగలబడి నవ్వేవారు. ఒకరకంగా చెప్పాలంలే జబర్ధస్త్ లో రోజా, నాగబాబు లేని కార్యక్రమాన్ని ప్రేక్షకులు కూడా పెద్దగా స్వీకరించలేకపోయారు. అలాంటి సమయంలో హైపర్  ఆది, ఆటో రాంప్రసాద్ లాంటివారు తమ స్కిట్ లతో ఏదో అలా రంజింప చేసినా..మిగిలిన వారు చేసే కామెడీ స్కిట్ లలో స్కిట్ తప్పా కామెడీ లేకపోవడం అలాంటి సమయంలోనే అప్పారావు లాంటి కంటెస్టెంట్లు కూడా బయటకు వెళ్లిపోవడంతో మల్లెమాల మూగబోవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో కూడా ప్రేక్షకులకు నవ్వు తెప్పెంచేందు మనోలాంటి వారిని న్యాయనిర్ణేతగా తీసుకువచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇటీవలే రోజా కూడా కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో కార్యక్రమం కళమొత్తం కళావిహీనం అయిపోయింది. ఆ తరువాత న్యాయనిర్ణేతలుగా వచ్చిన వారు కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్లలేని పరిస్థితి అయిపోయింది.

జబర్ధస్త్ లో కామెడీ అంటే వాళ్ల తరువాతే..
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కార్యక్రమంలో కామెడీ అంటే హైపర్ ఆది, రైజింగ్ రాజు, సుడిగాలి ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, అప్పారావ్, అవినాష్ లదే. అయితే వీరందరి టీమ్ లలో ఉన్నవారంతా నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో ఆయనతోపాటుగానే మాటీవిలోకి వెళ్లిపోయారు. అక్కడ కామెడీ కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించడంలో విజయం సాధించారు. అదే సమయంలో టీవీలో వచ్చే కార్యక్రమంలో కామెడీ తగ్గిపోవడం, ప్రేక్షకులను మెప్పించే న్యాయనిర్ణేతలు లేకపోవడం, ఒక స్కిట్ లో కనిపించిన వారు మరో స్కిట్ లో కనిపించకపోవడం తదితర కారణాలన్న మల్లెమాల మంటకు నిప్పులో నెయ్యి పోసినట్టు అయ్యాయి. ఎన్ని మార్పులు, చేర్పులు చేసినా జబర్ధస్త్ ని ప్రేక్షకులు మళ్లీ పాత పద్దతిలో ఆదరించే స్థాయికి తీసుకు రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కంటెస్టెంట్, టీమ్ లీడర్లు బయటకు వచ్చి మల్లెమాల చేసిన వ్యవహారాలను వివిధ రకాల యూట్యూబ్ ఛానళ్లలో బయటకు తీసుకు రావడంతో ఆ మంట కకాస్తా మరింత రాజుకున్నట్టు అయ్యింది.

అత్యధిక పారితోషకం ఇచ్చినా ఫలితం సున్నా..
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కార్యక్రమంలో కామెడీ చేసేవారికి అత్యధిక మొత్తంలో పారితోషకాన్ని ఇవ్వాలని మల్లెమాల డిసైడ్ అయినా ఆ స్థాయిలో స్కిట్ లు వేసేవారు కరువైపోయారు. దీనితో జబర్ధస్త్ కార్యక్రమం కాకుండా ఈటీవీలో స్లాట్లు బుక్ చేసుకున్న ఇతర కార్యక్రమాలపై మల్లెమాల ద్రుష్టిపెట్టాల్సి వచ్చింది. ఇటీవలే యాంకర్ అనసూయ, సుధీర్ లాంటి వారు కూడా మరో కార్యక్రమానికి వెళ్లిపోవడంతో..సోలో యాంకరింగ్ కి ఇష్టపడే రష్మీకి సైతం ఇమేజ్ తగ్గుతూ వస్తోందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఒకప్పుడు జబర్ధస్త్ కార్యక్రమం అంటే ఆత్రుతగా ఎదురు చూసేవారంతా ఇపుడు ఆ కార్యక్రమం సుద్ద దండగ అనే స్థాయికి వచ్చేశారు. ఇంకా హైపర్ ఆది..ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను వంటి వారంతా ఏదో పైకి తీసుకు రావాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా కళతప్పి, కళా విహీనంగా మారిన కామెడీ స్కిట్లు వారి మైలేజిని కూడా తగ్గించేస్తున్నాయని చెబుతున్నారు. ఆ కారణంగానే ఈటీవీ జబర్ధస్త్ లో చేసే కమీడియన్లంతా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వెతుక్కుంటా మళ్లీ వెండితెరపై వారి అద్రుష్టాన్ని వెతుక్కుంటున్నారు. చూడాలి ముందు ముందు ఇంకెన్నీ కామెడీ స్కిట్లు చేసే కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లు బయటకు వెళ్లిపోయి మల్లెమాలకు పెట్టిన మంటలో నెయ్యివేస్తారో లేదా పెట్టిన మంటను ఆర్పుతారో..!

Hyderabad

2022-08-29 05:13:42

సినీ తారలకు కేన్సర్ రావడానికి కారణమిదే

సినిమా సినిమా సినిమా.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా చూడాంటే ఎవరికైనా చెప్పలేనంత సరదా. యావత్ ప్రపంచానికి ఎంతో వినోదాన్ని పంచే సినిమా మాత్రం ఇపుడు కేన్సర్ అనే మరణసయ్యపే తొణికిసలాడుతోంది. అవును వినడానికి, చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం.  ప్రపంచంలో కేన్సర్ తో అత్యధికంగా మ్రుతిచెందేది సినిమా తారలు మాత్రమే అంటే వినడానికే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు నేటికీ చాలా మంది సినిమా తారలు స్టేట్1 కేన్సర్ నుంచి డెడ్ ఎండ్ కేన్సర్ వరకూ బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. సినిమా అంటే రంగుల ప్రపంచమనే ఇప్పటి వరకూ మనందరికీ తెలుసు. కానీ అలా రంగుల తెరపై నటించే వారిలో చాలా మంది కేన్సర్ అనే మహమ్మారికి ప్రతీ ఏటా ఏదోరూపంలో బలవుతున్నారనే వార్త వినడానికి..చడదవానికి గుండెలు పిండేసినట్టుగా వుంటుంది. అసలు సినిమా తారలకే కేన్సర్ వ్యాధి అధికంగా ఎందుకు వస్తుందనే విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

విచ్చల విడిగా డ్రగ్ర్ వినియోగం 
సినిమా ప్రపంచం అంటే అంటే మాగ్జిమమ్ అంతా తెగబలిసిన వారే అధికంగా ఉంటారు. లెక్కకు మించి ఖర్చు చేయ గల స్థితితో విచ్చల విడిగా డ్రగ్స్ వినియోగం అధికంగా చేస్తుంటారు. క్షణిక సుఖం కోసం సేవించే డ్రగ్స్ కాలక్రమంలో క్యాన్సర్ గా మారి తారల జీవితాలకు చరమ గీతం పాడుతుంటాయి. ఇది ఇప్పటి మాట కాదు. సినిమా ప్రపంచం మొదలైన నాటి నుంచి జరుగుతున్న తంతు. హీరో హీరోయిన్ ల దగ్గర నుంచి కాస్తో కూస్తో కాస్త సౌండ్ పార్టీలన్నీ ఈ డ్రగ్స్ వినియోగం అధికంగా చేస్తారు. డ్రగ్స్ వినియోగిం కేన్సర్ కి దారి తీస్తుందని తెలిసినప్పటికీ ఎక్కడా తగ్గకుండానే వాటిని వినియగిస్తారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగంలో జంతువులు, విష సర్పాలతో కూడా బైట్స్ ద్వారా డ్రగ్స్ సేవించే కల్చర్ అధికం అయ్యింది. విష సర్పాలకు అత్యంత ఖరీదైన డ్రగ్స్ ను ఎక్కించి వాటితో కాటు వేయించుకొని ఆనందిస్తారు. దీనిని స్నేక్ బైట్ గా అభివర్ణిస్తారు.

మేకప్ రంగులే శాపాలవుతాయి..
వెండితెరపై సినీతారలు అందంగా కనిపించాలంటే వారు మొహానికి రంగులు వేసుకోవాలి. మేకప్ సరిగ్గా ఉంటేనే వారంతా వెండితెరపై తలుక్కున మెరుస్తూ ప్రేక్షకులను ఆనందింప చేస్తారు. సరిగ్గా అలాంటి రంగులు కూడా సినీతారలను కేన్సర్ వ్యాధికి గురిచేస్తున్నాయనే ప్రచారం అధికంగా జరుగుతోంది. అయితే వాస్తవానికి కోట్లాది రూపాయల ఖర్చుతో తీసే సినిమాలకు అదే స్థాయి ఖర్చు పెట్టి తారల మొహాలకు అద్దె రంగులను కూడా కొంటారు నిర్మాతలు అయినప్పటికీ రంగుల వినియోగం కూడా క్యాన్సర్ కారకం అంటున్నారు వైద్య నిపుణులు. పదే పదే మొహానికి రంగులు వేసుకోవడం ద్వారా కూడా కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయట. పైగా సినిమా ప్రపంచంలో అత్యధిక హీరోలు, హీరోయిన్ లు ప్రధాన తారాగణం నుంచి వచ్చిన వారే. అలా వస్తున్న వారిలో అంటే ముందుగానే తల్లిదండ్రులకు కేన్సర్ ఉన్నట్టైతే..వంశపారం పర్యంగా డబ్బు, హోదాతోపాటు వారికుండే కేన్సర్ కూడా వారి సంతతికి చేరుతోంది. అలా కేన్సర్ వచ్చిన చాలా మంది హీరోలు, హీరోయిన్ లు, ఇతర తారలు, వారి భార్యలు నేటికీ కేన్సర్ కి వైద్యం పొందుతూనే ఉన్నారు. కొంత మంది వైద్యం చేయించుకుంటూ మధ్యలోనే మ్రుతిచెందిన వారు కూడా లేకపోలేదు.

క్యాన్సర్ తో మ్రుతిచెందిన ప్రముఖులెందరో..
సినిమా ప్రపంచంలో ఎందరో హీరోలు, హీరోయిన్ లు నిర్మాతలు కేన్సర్ తోనే మ్రుతి చెందన వారున్నారు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత డా.డి.రామానాయుడు, నాటి తరం హీరో అక్కినేని నాగేశ్వర్రావు, మరో హీరో శ్రీహరి, వేణుమాదవ్, ఏవీఎస్, సావిత్రి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదిగానే వుంటుంది. ప్రస్తుతం ఇదే డా.రామానాయుడు తరానికి చెందిన కుటుంబలో దగ్గుబాటి రాణా ప్రస్తుత కేన్సర్ కి చికిత్స చేయించుకుంటున్నారు. ఈయనే కాదు చాలామంది సినిమా వర్గానికి చెందిన వారు ప్రస్తుతం కేన్సర్ కి చికిత్సలు చేయించుకుంటున్నారు. మరికొందరుఆ కేన్సర్ రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నవారు కూడా ఉన్నారు.

కేన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఆర్గానిక్ ఫుడ్..
సినీ ప్రపంచంలో డబ్బు ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో కేన్సర్ వ్యాధి కూడా అంత కంటే ఎక్కుగా విస్తరిస్తోంది. దీనితో కాస్త సౌండ్ పార్టీలుగా వున్న తారలు ఈ కేన్సర్ వ్యాధి దరి చేరకుండా ఉండేందుకు ఆర్గానిక్ ఫుడ్(మంచి ఆహారం) తీసుకుంటున్నారు. దాని కోసం చాలా మంది హీరోలు, హీరోయిన్ లు ప్రత్యేకంగా భూములు కొని అక్కడ ప్రక్కుతి వ్యవసాయం చేయించి వాటి ద్వారా పండే ఉత్పత్తులను మాత్రమే తీసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు కేన్సర్ రాకుండా చూసుకునేందుకు ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు జిమ్ లలో కూడా పెద్ద ఎత్తున వర్కవుట్లు కూడా చేస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు కేన్సర్ తో పోరాడే గుణం అధికంగా ఉండటంతో సినీ తారాలు సంపాదించిన ఆదాయంలో కొంత మొత్తాన్ని భూములు కొనుగోలు చేసి వారికి కావాల్సిన పప్పుదినుసులు, ఇతర కూరగాయలు, పండ్లుల ఇలా అన్ని రకాల పంటలను వేయిస్తున్నారు. ఒకప్పుడు అత్యధిక మొత్తం వెచ్చించి జంక్ ఫుడ్ కి ప్రాధాన్యత ఇచ్చే సినిమా ప్రపంచం ఇపుడు ఆహారంతోనే కేన్సర్ ను తరిమికొట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇదంతా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవాలని చూసే ఒక వర్గానికి చెందిన వారికైతే మరో వర్గం నాటి నుంచి నేటి వరకూ వారి ఆనందం కోసం, సంతోషం కోసం నేటికీ డ్రగ్స్ వినియోగించి కావాలనే వారి జీవితాలను అర్ధంతరంగా ముగించేసుకుంటున్నారు. ప్రపంచానికి వెండితెరపై తళుక్కున మెరుస్తూ ఆనందాన్ని పంచే సినిమా తెర వెనుక నేటికీ పీడ కలలా పీడిస్తున్న కేన్సర్ నేటికీ వుందంటే దారుణమే. ఈ సమాచరం కేవలం కొందరు సీనీ ప్రముఖులు, మరెందరో తారలు మ్రుతిచెందిన వారి కేన్సర్ చరిత్ర నుంచి సేకరించినదే. క్యాన్సర్ నియంత్రణలో ఒక్క సినీతారలే కాదు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అయితే తప్పా ఈ మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యం కాదు..!

Hyderabad

2022-08-15 01:52:25

ఓటీటీని ఎలా వచ్చిందో తెలిస్తే షాక్

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనేలో కాదు..యావత్ భారత దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ కొందరి బడా నిర్మాతల చేతుల్లో అనాది కాలం నుంచి బంధీగా ఉండిపోయింది. సినిమా విషయంలో వారు ఆడింది ఆట.. పాడింది పాట..ఈ నియంత్రుత్వ విధానానికి చరమ గీతం పాడాలంటే భారీ స్థాయిలో స్కెచ్ వేస్తే గానీ సరిపోదని భావించారు చిన్న నిర్మాతలు, దర్శకులు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు కీలక సూత్రదారులు అలా తీవ్రంగా చేసిన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినదే ఈ ఓటిటి(ఓవర్ ది టాప్..Over The Top ఎప్పుడూ పైనే ఉండేలా) ప్రస్తుతం ఈ ఓటీటీ విధానం దేశవ్యాప్తంగా గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. సాధారణంగా ఓటిటి వచ్చిన కొత్తలో టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పుగా సినీ పరిశ్రమ భావించింది. అయితే అది టెక్నాలజీ తెచ్చినది కాదని..చాలా మంది మూకుమ్మడిగా టెక్నాలజీతోనే సినీ పరిశ్రమను తమ కబంధ హస్తాల్లోనే దాచిపెట్టిన బడా నిర్మాతలను కిందికి దించి.. వారి కొమ్ములు విరవడానికేననే సంకేతాలను పంపి ప్రజలకు సినిమాను చేరువ చేయడానికే ఈ ఓటీటీని తీసుకు వచ్చారనే విషయం నేడు తేటతెల్లమైంది. అలాకాకపోతే బడా నిర్మాతల సినిమాలకే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న సినిమా థియేటర్లు సరిపోయేవి. ఆ సమయంలో ఏ ఒక్క చిన్న సినిమా వచ్చినా దానిని ప్రదర్శించడానికి చిన్న నిర్మాతలకు సినిమాహాలు దొరికే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఒకవేళ కావాలంటే అత్యధిక మొత్తం వెచ్చించాల్సి వచ్చేది. అలాంటి సమయంలో చిన్న సినిమాలు ప్రజాదరణకు నోచుకోకపోతే ఆ నిర్మాత దివాలా తీసేవాడు. ఇలాంటి దోపిడీ వ్యవస్థ భూ స్థాపితం కావాలంటే థియేటర్ ఆలో ఆడే సినిమాను ప్రజల చేతిలోకి తీసుకురావాలని భావించే.. ఈ ఓటీటీని తీసుకొచ్చారనేది నేడు సినిమాల నిర్మాణాలు బంద్ కావడంతో అసలు విషయంపై అత్యధిక స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ వాళ్లవే..
తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, ఐనాక్స్ లు, ఐమాక్స్ లు ఇలా అన్ని సినిమా థియేటర్లు బడా నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు నగరాల్లో వారే సొంతంగా సినిమా థియేటర్లు కూడా నిర్మించుకున్నారు. ఒక్కో సినిమా కాంప్లెక్స్ లో నాలుగైదు స్క్రీన్లు ఉండే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మరికొన్ని చోట్ల థియేటర్లన్నీ వారే లీజుకి తీసేకోవడంతో చిన్న సినిమాలు థియేటర్ కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చాలా కాలంగా చిన్న సినిమాలు పూర్తయినా వాటిని ప్రజల ముందుకి తీసుకు రావడం కోసం చిన్న నిర్మాతలు సుమారు ఆరు నెలలు వేచి వున్న రోజులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క థియేటర్లే కాదు, తీసిన సినిమాను ల్యాబ్ లలో డెవలప్ చేయించడానికి, ఎడిటింగ్ లు చేయించడానికి కూడా చిన్న నిర్మాతలకు ల్యాబ్ లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. ఈ తరుణంలో పెద్ద నిర్మాతలను చిన్న నిర్మాతలు ప్రసన్నం చేసుకొని ఒకటి అరా థియేటర్లు, నాలుగైదు ల్యాబ్ లు, మరో ఒకరిద్దరు ఎడిటర్లను అద్దెకు తెచ్చుకునే పరిస్థితులు ఉండేవి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కనుమరుగైపోతారని భావించిన కొందరు నిర్మాతలు ఈ ఓటీటీని తెరపైకి తీసుకొచ్చి. దాని స్థాయిని భారీ పెంచి ఓటీటీ ప్రాముఖ్యతను.. పాటకుడి సులువుని క్యాస్ చేసుకునే పనిలో పడ్డారు. తద్వారా బడా నిర్మాతలను ప్రసన్నం చేసుకునే పనిగానీ, వాళ్ల చుట్టు తిరిగి థియేటర్ల కోసం బతిమిలాడుకునే పని కూడా ఉండదు. థియేటర్లకు పెట్టే ఖర్చు కంటే చాలా తక్కు మొత్తంతో ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే కూర్చుని సినిమా చూసుకోవడానికి వీలుపడుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలే కాదు..షార్ట్ ఫిల్మ్ లు, ప్రత్యేక దారావాహికాలు ఇలా అన్నీ ఓటీటీలోనే ప్రత్యక్షం అవుతున్నాయి. టిక్కట్లు బ్లాక్ కొని చూసే యాతన కూడా ప్రేక్షకులకు తప్పిపోయింది.

ఓటీటీ ద్వారా రెండింతల ఆదాయం
ఒకప్పుడు బడా నిర్మాతల దగ్గర సినిమా థియేటర్లు లీజుకి తీసుకుని సినిమా ఆడిస్తే..అది హిట్ అయితే తప్పా సినిమాపై పెట్టిన ఖర్చు నిర్మాతకి వచ్చేది కాదు..డైరెక్టర్ కి మరో సినిమా దొరికేది కాదు. ఈ ఓటీటీ ద్వారా నిర్మాతకు రెండింతల ఆదాయం వస్తుంది. సినిమా తీయడం పూర్తయిన తరువాత థియేటర్లపై పెట్టిన కర్చుతో ఏకంగా ఓటిటి ప్లాట్ ఫాంనే నిర్మించుకుంటున్నారు నిర్మాతలు. వాటిలో సినిమాను తక్కువ ధరకే పెట్టం ద్వారా ప్రతీ ఒక్కరూ చాలా చక్కగా ఇంట్లో కూర్చునే సినిమాలను చూసే అవకాశం కలుగుతుంది. అంతేకాదండోయ్ మధ్య మధ్యలో వచ్చేయాడ్స్ వలన కూడా నిర్మాతలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. సినిమాకి ముందు యూట్యూబ్ ప్రమోషన్ ద్వారా కూడా అత్యధిక ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు నిర్మాతలు. దీనితో ఎలాంటి నిర్మాతకైనా ఇపుడు సినిమా థియేటర్ అవసరం లేకుండా పోయింది. ఒక్క ఓటిటి ప్లాట్ ఫాం లీజుకి తీసుకుంటే చాలు తన సినిమా ప్రేక్షకుల ముందుకి వెళ్లిపోతుంది. ఒక వేళ ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫాం స్లాట్ దొరక్కపోయినా..నిర్మాతే మంచి పేరుతో ఓటీటీని తయారు చేసి మరీ సినిమాలను జనాలపైకి వదులుతున్నాడు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు నిర్మాతలు, దర్శకులు, సినిమా హీరోలతో సహా.

ఓటిటిపై అసలు ట్విస్ట్ తెలిస్తే నిజంగా షాక్ 
తెలుగు రాష్ట్రాలు, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్ల కొరత వుంది. దానికితోడు బడా నిర్మాతల గుత్తాధిపత్యంతో చిన్ని నిర్మాతలు సినిమాలు అనుకున్న సమాయినికి తెరపైకి ఎక్కే పరిస్థితి లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొందరు టెక్నాలజీ తెలిసిన నిర్మాతలు
ఓటీటీని జనాల ముందుకి తీసుకు రావడంలో సఫలీ క్రుతులు అయ్యారు. దానికోసం అమెరికా, ఆస్ట్రేలియా, సిడ్నీ, సింగపూర్ లలో పనిచేసే సూపర్ న్యూమరిక్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు అత్యధిక మొత్తం చెల్లించి ఈ ఓటీటీని తెరపైకి తెచ్చారనే విషయం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది.. అంతేకాకుండా యూట్యూబ్ ని కూడా కట్టడి చేయాలనే ఆలోచనతోనే ఈ ఓటీటీ తయారు చేయించినట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాంను మొదట తయారు చేయించడానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి తొలిసారిగా 2008లో భారత దేశంలో అభివ్రుద్ధి చేశారు. అయితే అప్పటికి టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం అంతగా లేదు. అంతేకాదు ఓటీటీకి సర్వర్ ఖర్చు కూడా వేల డాలర్లలో ఉండేది. సరిగ్గా 2012 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం భారత్ లో పెరగడంతో సాఫ్ట్ వేర్ లో వున్న వివిధ రకాల వెర్షన్లును వినియోగించి అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చి 2018 నాటికి పెద్ద పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫాంలను తెరపైకి తీసుకు రాగలిగారు టెక్నాలజీ తెలిసిన నిర్మాతలు. ప్రొడక్షన్ సంస్థలు. 

అప్పటి నుంచి దేశంలోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బడా నిర్మాతల గుత్తాధి పత్యానికి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇక చిన్న నిర్మాతలు వెనుతిరిగి చూడకుండా ఓటీటీపైనా, యూట్యూబ్ పైనా తమ పెట్టుబడిని పెట్టి ఛానల్ తయారు చేసుకొని మరీ ఆర్జించడం మొదలు పెట్టారు. అదికాస్త ఇపుడు చిలికి చిలికి గాలివానగా మారి ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనే ఓటీటీ ప్లాట్ ఫాంకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో సినిమా థియేటర్లన్నీ షాపింగ్ మాల్స్ గా మారిపోవడం ఖాయమనే సంకేతాలు ప్రస్తుతం అన్ని నగరాల్లో మూతపడుతున్న థియేటర్ల సంఖ్యే రుజువు చేస్తున్నది. బడా నిర్మాతలకు, ఓటీటీ ఫ్లాట్ ఫాంలకు జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం, సినిమా నిర్మాణాల విషయంలో జరుగుతున్న గొడవలు ఎంత వరకూ దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది. మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు కూడా ఓటీటీలు ప్రారంభిస్తుండటంతో సినిమా థియేటర్లు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవే ఆన్ లైన్ డెలివరీ సంస్థలకు సినిమా థియేగర్లు స్టాట్ గోడౌన్లుగా మారిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి. ఓటీటీకి..సినిమా థియేటర్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో ఎవరిది పైచేయి అవుతుందనేది..!

Hyderabad

2022-08-03 16:07:13

సినీ తారలు అందం వెనుక రహస్యమిదే

సినిమాల్లో నటించే హీరోలు.. హీరోయిన్ లు ఎంద అందంగా ఉంటారో కదా..ఏకంగా హీరోయిన్ లు అయితే గిల్లితేనే పాలు కారిపోతాయా అన్నట్టుగా అందంలో పోటీ పడతారు. అది బాలీవుడ్ కావొచ్చు..టాలీవుడ్ కావొచ్చు..కోలీవుడ్ కావొచ్చు. ఎక్కడైనా అందమే ప్రాణామానికం. అంతటి అందం వీరికి ఎలా వస్తుంది. దానికోసం ఏమైనా సర్జరీలు చేయించుకుంటారా..అంటే చాలా మంది అవుననే చెబుతారు. అందం కోసం రక రకాల ఉత్పత్తులు వినియోగిస్తారనేది ఇప్పటి వరకూ జరిగిన జరుగుతున్న ప్రచారం. కానీ సినీ తారల అందం వెనుక వున్న అసలు రహస్యం తెలిస్తే అంతా నోరెళ్ల బెట్టాల్సిందే. అవునండీ ఇది నమ్మినా నమ్మకపోయినా పచ్చినిజం. అసలు సినీ తారల అందాన్ని ఎలా కాపాడుకుంటారు..దానికోసం వారు ఏం చేస్తారో తెలిసినా అందరూ నోరెళ్ల బెట్టాల్సిందే. కానీ వాస్తవం చెబితే ఎవరూ నమ్మరు. కానీ విషయాలు నేడు ఇపుడు ఈఎన్ఎఎస్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

సినిమా తారలులా అందంగా ఉండాలంటే ఏం చేయాలి..వారు నటించి ప్రచారం చేసే ఉత్పత్తులు వాడితే సరిపోతుందా..అలా చేస్తే డబ్బులు లాసు తప్పితే మరేమి మిగలదనేది జగమెరిగిన సత్యం. మరేం చేస్తే వారిలా అందంగా..తెల్లగా..ఆరోగ్యంగా..వయస్సు తెలియకుండా ఉండొచ్చు అంటే దానికి చాలా రహస్యాలే మీకు తెలియజేయాలి. సినీ తారలులా మీరూ అందంగా కనిపించాలంటే కాస్త ఖర్చు అయినా వారికంటే నేచురల్ బ్యూటీ సొంతం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. తారల అందం బ్యూటీపార్లర్ కి వెళితే వచ్చింది కాదనేది ముందు అంతా తెలుసుకోవాలి. దానికోసం శరీరంలోనే మార్పులను ఆహార నియమాలతో మార్చుకోవాలని గుర్తించాలి. అవునండి మనం కూడా తినేది ఆహారమే కదా మరెందుకు వారిలా అందంగా లేమూ అనుకుంటే కాదు. దానికి కూడా చాలా పద్దతులున్నాయి. ఆ పద్దతులను అనుసరిస్తూ..పాటిస్తే సినీ తారలు మించిన అందాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు.

సినిమా తారలు నలుగు ఎలా పెట్టించుకుంటాంటే..
ఏంటి సినిమా తారలు కూడా నలుగు పెట్టించుకుంటారా..? మీరు చెప్పేది నమ్మవచ్చా..అంటే నమ్మాలి.. అలా చేయండం వలనే వారి అందాన్ని తగ్గకుండా వారు కాపాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ నలుగు పెట్టించుకునే విధానంలో మాత్రం వాడేవన్ని సేంద్రియ ఉత్పత్తులే ఉంటాయి. అవునండి సినీ తారలు తినే ఆహారం దగ్గర నుంచి తాగే పళ్ల రసాలన్నీ కూడా సేంద్రియ పద్దతిలో పండించినవే తీసుకుంటారు. వారి అందంలో సేంద్రియ ఉత్పత్తులు ఎంతో కీలక భూమిక పోషిస్తాయి. సేంద్రియ పద్దతిలో పండిన శనగల్లో పోషక విలువలు పోకుండా వాటిని పిండి చేసి దానికి కూడా సేంద్రియ నువ్వుల నూనే రాసుకొని మాత్రమే నలుగు పెట్టించుకుంటారు. తద్వారా శరీరం నిగారింపు సంతరించుకుంటుంది. అలా చేసే సమయంలో వారు కుంకుమ పువ్వుని కూడా వినియోగిస్తారు. పాలలో కుంకుమ పూవుని నానబెట్టి వాటిని శనగపిండిలో కలిపి నలుగు పెట్టించుకుంటారు. దానికి ముందు అదే నువ్వుల నూనెతో శరీరం మొత్తం మసాజ్ చేయించుకుంటారు. ఇలా చేయడం ద్వారా మ్రుత కణాలు జీవం పోసుకుంటాయి. తద్వారా శరీరం నిగారింపు సంతరించుకుంటుంది.

బ్యూటీప్యాక్ లు కాదు..పళ్ల గుజ్జుతోనే ప్యాక్ లు..
సినీ తారలు పెద్ద పెద్ద బ్యూటీపార్లలో ట్రీట్ మెంట్ చేయించుకుంటారని అందరికీ తెలుసు..అది సినిమా షూటింగ్ ల సమయంలోనే మిగితా సమయంలోనే నేచురల్ బ్యూటీషన్లు అంతా సినీ తారలకు పండ్లు, పండ్ల గుజ్జుతోనే శరీరం మొత్తం ప్యాక్ లు వేస్తారు. సాధారణంగా పండ్ల రసాలతోనే సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు. కానీ సినిమా షూటింగ్ ల సమయంలో తప్పితే సినీ తారలు వాటిని ఎక్కువగా వినియోగించరు. మిగిలిన సమయం సేంద్రియ పద్దతిలో పండించే పండ్లతోనే సౌందర్యాన్ని కాపాడకుంటుంటారు. దానికోసం ప్రత్యేకంగా బ్యూటీషన్లు సినీ తారల ఇంటివద్దనే పనిచేస్తారు. ఏ ఒక్క ఉత్పత్తీ రసాయనాలు కలిపినవి వినియోగించరంటే అతియోక్తి కాదు..

సౌందర్యంలో కీలకంగా క్యారెట్, బీట్ రూట్
సినీతారల అందంలో క్యారెట్, బీట్ రూట్ రసాలు చాలా కీలక భూమిక పోషిస్తాయి. ఒక్కోసారి పచ్చికూరగాయ రసాలు కూడా వారి శరీంపై ముసలి ఛాయను రాకుండా కాపాడతాయి. ప్రతినిత్యం సినీతారలు ఉదయం సాయంత్రం సేంద్రియ క్యారెట్, బీట్ రూట్ రసాలు తేనెతో కలిపినవే తాగు తారు. శరీరంలో మలినాలు పోయేందుకు తులసీ టీ, గ్రీన్ టీని ఎక్కువగా సేవిస్తారు. మంచినీటిని కూడా ప్రత్యేకవిధానంలో ఆర్వో చేసిన వాటినే ఎక్కువగా తాగుతారు. అందరూ అనుకున్నట్టుగా సినీ తారలు మాంసాహారాన్ని అధికంగా తీసుకోరు. తీసుకున్నా వాటి కోసం ప్రత్యేకంగా జిమ్ లలో ప్రత్యేక వర్కవుట్లు చేస్తారు. ముఖ్యంగా ఆవిరి స్నానం తారల అందానికి మెరుగులు దిద్దుతుంది. ప్రతినిత్యం వర్కవుట్లు అనంతరం స్టీమ్ బాత్ చేయడం ద్వారా కూడా అందం తగ్గకుండా ఉంటారు. దానికోసం తారల ఇళ్లల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తారు. తినే బియ్యం నుంచి కూరగాయలు, నూనె, పండ్లు, పప్పులు ఇలా అన్నీ సేంద్రియ ఉత్పత్తులనే వినియోగిస్తారు. వీటికోసం తారలు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. అలా చేయడం ద్వారానే వారి అందాన్ని తగ్గకుండా కాపాడుకుంటారు. కానీ చాలా మంది సర్జరీలు చేయించుకోవడం ద్వారా వీరి అందం పెరుగుతుందని బావిస్తారు. అదేమీ కాకుండా వీరంతా సేంద్రియ ఉత్పత్తులు వినియోగించే వీరి అందం తగ్గకుండా చూసుకుంటారు.

అందం ఉన్నంత వరకే వారికి ఛాన్సులు..
సినిమాల్లో నటించే హీరోలైనా..హీరోయిన్ అయినా అందం వున్నంత వరకే వారికి ఛాన్సలు తన్నుకుంటూ వస్తాయి.. అలా రావాలంటే వారు అందాన్ని పది కాలాల పాటు కాపాడుకుంటూ ఉండాలి దానికోసం అత్యధిక మొత్తంలో ఖర్చు చేయడంతోపాటు, వర్కవుట్లు కూడా చేస్తుంటారు. ప్రత్యేకంగా డైటీషియన్లు, బ్యూటీషియన్లు, హెయిర్ డ్రెస్సర్స్ లను మెయింటేన్ చేస్తుంటారు. ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తుల వినియోగం పెరగడంతో సాధ్యమైనంత వరకూ వాటినే వినియోగిస్తూ వారి అందాన్ని పదిలంగా చూసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ మేకప్ లకు దూరంగా ఉండేందుకే సినీతారలు సమయం కేటాయిస్తారు. బయటకు వెళ్లినపుడు, సినిమా షూటింగ్ లు జరిగినపుడు తప్పా..ఇంట్లో ఉండే సమయంలో అందంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. అందుకే చాలా మంది హీరో, హీరోయిన్ లకు వయసు నాలుగు పదులు దాటినా వారి అందం చెక్కు చెదర కుండా వుంటుంది. ఇపుడు మీకు అర్ధమైందా వారి అందం వెనుక దాగి వున్న రహస్యం ఏమిటో..!

Hyderabad

2022-07-29 07:46:26

Hyderabad

2022-06-08 04:12:30

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

మ్యూటేషన్ నిమిత్తం రూ. 7వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోని లంచం తీసుకుంటుం డగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప కధ వివరాలు తెలుసుకుంటే.. అనకాపల్లి సౌత్ విభాగ వీఆర్వోగా సూరిశెట్టి భవానీ వరప్రసాద్ పని చేస్తున్నారు. మ్యూటేషన్ కోసం స్థానిక బంగారం వ్యాపారి సూరిశెట్టి రామలింగ జగ్గా అప్పారావు కొన్నాళ్లుగా వారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే తనకు రూ.7వేలు లంచం ఇస్తే పని పూర్తవుతుందని వరప్రసాద్ చెబుతూ వచ్చారు. వీఆర్వో అడిగిన మొత్తం ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆ విషయాన్ని బాధితుడు అప్పారావు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అధికారుల పథకం ప్రకారం బుధవారం వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా వరప్రసాద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశ పెడతామని అధికారులు తెలిపారు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీ రామచంద్ర రావు, సీఐలు రమేష్, కిషోర్, ప్రేమ కుమార్, సతీష్, శ్రీనివాస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Anakapalle

2022-05-11 16:48:49