1 ENS Live Breaking News

2021-01-01 17:55:29

2021-01-01 16:55:58

2020-12-31 10:20:19

2020-12-30 21:45:03

"ఉడుకునెత్తురు" తెరదీమీదకి రాలేనిది అందుకే..

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు  వీరాభిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ట్రెండ్ సెట్టర్ నాగార్జున తో "మజ్ను "చిత్రం నిర్మించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది నాగార్జునను నటుడిగా ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్లింది . అక్కినేని వంశాభిమానులకు ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నటనలో అఖిలభారత విషాద చక్రవర్తిగా పలుమార్లు నిరూపించుకున్నారు అక్కినేని. ఈ చిత్రంలో తన నయనాలతో అద్భుతమైన నటనను ప్రదర్శించి అక్కినేని నట వారసుదుగా తెలుగు ప్రేక్షకులతో ప్రశంసలను అందుకున్నారు అక్కినేని నాగార్జున. డాక్టర్ ANR&DNR కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి .అలాగే ట్రెండ్ సెట్టర్ నాగార్జున ,దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలు వస్తాయని ఆశించారు తెలుగు ప్రేక్షకులు.  దర్శకరత్న దాసరి నారాయణరావు సొంత బ్యానర్ తారక ప్రభు బ్యానర్పై "ఉడుకునెత్తురు" చిత్రాన్ని నిర్మించే ఆలోచన చేశారు దాసరి. గానీ ఆ ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది . కొన్ని కారణాంతరాల వల్ల ఆచరణలో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేకపోయింది. ఆ సినిమా టైటిల్ పేరు చెబితే ఇంకా దాసరి కళ్ల ముందు మెదలాడతారు. ఎంతో మంచి కధా కధనంతొో రూపొందతుందనుకున్న ఈ సినిమా ఆగిపోవడానికి చిత్రసీమ చాలా పెద్ద సినిమా కధలే అల్లింది..

సినిమా డెస్క్

2020-12-28 17:53:09

సాయి ప్రియ రిసార్ట్స్ లో భారీ చోరీ..

విశాఖ నగర శివారులోని సాయి ప్రియ రిసార్ట్స్ లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 53 తులాల బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పి పి ఎం పాలెం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయి ప్రియ రిసార్ట్స్ లో ఓ పెళ్లి శుభకార్యం నిమిత్తం వధూవరులు వారి కుటుంబీకులు బుధవారం సాయంత్రం సాయి ప్రియ రిసార్ట్స్ లో బసచేశారు. నగరంలోని ఒక ఎమ్మార్వో కొడుకుకి అనకాపల్లి మునగపాక మండలం తోటాడ గ్రామం సిరసపల్లి  ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకి సాయి ప్రియ రిసార్ట్స్ లో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల కుటుంబీకులు బుధవారం సాయంత్రం సాయి ప్రియ రిసార్ట్స్ లో బసచేశారు. రాత్రి 12 గంటల వరకు పెళ్లి వారంతా మేల్కొని ఉన్నారు. ఒంటి గంట ప్రాంతంలో నిద్ర లో ఉండగా అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో 301 రూమ్ నెంబర్ లోగల పెళ్లి కుమార్తె కు చెందిన 53 తులాలు బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీకి పాల్పడింది లోకల్ దొంగల పనేనని  పోలీసులు భావిస్తున్నారు.

Visakhapatnam

2020-12-24 20:02:06

2020-12-24 13:38:44

కొడుకు- కోడలు@ 48 వంతాలు..

నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు , వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం" కొడుకు- కోడలు". ఈ చిత్రంలో మంచి కథకు మంచి మాటలు సమకూర్చారు మాటల రచయిత ఆత్రేయ .ఈ చిత్రాన్ని పద్మజ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాత వెంకటేశ్వర్లు నిర్మించారు .పిపుల్లయ్య దర్శకత్వం వహించారు. వీనుల విందైన సంగీతం కేవిమహదేవన్ సమకూర్చారు. ఈ చిత్రంలో జగ్గయ్య, ఎస్వి,రంగారావు ,గుమ్మడి, రాజబాబు ,సత్యనారాయణ, లక్ష్మి ,శాంతకుమారి, సూర్యకాంతం ,రమాప్రభ మొదలగు నటీనటులు నటించారు . 7 కేంద్రాలలో డైరక్టుగా శతదినోత్సవం జరుపుకొని ఘన విజయం సాధించింది .డిసెంబర్ నెలలో 22 వ తారీకు 1972 వ సంవత్సరంలో ఈ చిత్రం విడుదల అయింది. విశాఖపట్నం నవరంగ్ థియేటర్ లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది . నేటితో నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ కు ENS సినిమా పేజీ అభినందనలు తెలియజేస్తుంది .

సినిమా న్యూస్ డెస్క్

2020-12-22 18:15:50

"అక్కినేని " "నందమూరి" ల అనుబంధం

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకున్న హీరోలు ఒకరు అక్కినేని ,మరొకరు నందమూరి .ఈ ఇద్దరు కథానాయకులు తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులకు వీరిద్దరి సినిమాలంటే ఎంతో మక్కువ ఎక్కువ .ఒకరు "ఎన్టీవోడు"గా మరొకరు "నాగ్గాడు" గా తెలుగు ప్రజానీకం హృదయాలలో శాశ్వత ముద్రను వేసుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరు "నటరత్న " , మరొకరు "నటసామ్రాట్" ఒకరు "నందమూరి అందగాడు", మరొకరు "అక్కినేని చక్క నోడు" వీరిద్దరూ కలసి 14 చిత్రాల్లో నటించారు . ప్రపంచ సినీ చరిత్రలోనే సమానస్థాయి కలిగినటువంటి అగ్ర హీరోలు ఒకటీ, రెండు సినిమాలలో నటించడమే గగనం. ఇటువంటి తరుణంలో 14 చిత్రాలలో వీరిరువురూ కలిసి నటించారు. ఇది వీరి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనం . నటనలో నువ్వా ? నేనా ?అనే విధంగా ఎన్టీయార్, ఏఎన్నార్ 14 చిత్రాలలో నటించడం ఎంతో అరుదైన విషయం. మరెంతో అపురూపమైన సంఘటన . వీరు నటించిన చిత్రాల వివరాలను తెలియజేస్తున్నాం . 1950వ సంవత్సరం లో "పల్లెటూరి పిల్ల ", 1950వ సంవత్సరంలో "సంసారం", 1954వ సంవత్సరంలో "పరివర్తన" , 1955వసంవత్సరంలో "మిస్సమ్మ ", 1956వ సంవత్సరంలో "తెనాలి రామకృష్ణ ", 1956వ సంవత్సరంలో "చరణదాసి ", 1957వ సంవత్సరంలో "మాయాబజార్ ", 1958వ సంవత్సరంలో "భూకైలాస్", 1962వ సంవత్సరంలో "గుండమ్మకథ", 1963వ సంవత్సరంలో "శ్రీకృష్ణార్జున యుద్ధం ", 1977వ సంవత్సరంలో "చాణక్య-చంద్రగుప్త", 1978వ సంవత్సరంలో "రామకృష్ణులు", 1981వ సంవత్సరంలో "సత్యం -శివం ",చిత్రాలలో నటించారు . 1954వ సంవత్సరంలో నందమూరి తారకరామారావు హీరోగా నటించిన "రేచుక్క" చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు అతిథి పాత్రను పోషించడం విశేషం . ఈ మహానటుల జీవితంలోఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి . వీరి మధ్య ఉన్న బంధానికి, అనుబంధానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే .

సినెమా డెస్క్

2020-12-16 20:56:12

"పోరాటం" కి 37 సంవత్సరాలు

సూపర్ స్టార్ "కృష్ణ "నటించిన "పోరాటం "చిత్రం S.R. ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మాత ఎస్. రామచంద్రరావు నిర్మించారు . కృష్ణ కు జంటగా సహజనటి "జయసుధ " నటించారు. ఈ చిత్రం కృష్ణకు రెండు 213 వ చిత్రం . దర్శకత్వం: కోడి రామకృష్ణ ,సంగీతం : చక్రవర్తి ఈ చిత్రం విడుదల తేదీ 09-12-1983. ఈ చిత్రంలో కృష్ణ ,జయసుధ , మహేష్ బాబు, శారద మొదలగు వారు నటించారు . విజయవంతమైన ఈ చిత్రం విజయవాడలో శతదినోత్సవం జరుపుకుంది. కధ కధనం మంచిగా ఉండటంతో అప్లట్లో ఈ సినిమా ఎంతో చక్కగా ఆడింది. కుటుంబ కధలను ఆదరించే ప్రేక్షకులు సూపర్ స్టార్ క్రిష్ణ సినిమాలను ఎంతగానో ఆదరించారు.

సినిమా డెస్క్

2020-12-09 16:19:30

సింగర్ సునీతకు మళ్లీ పెళ్లికూతురైంది..

ప్రముఖ గాయని‌ సునీత‌ మళ్లీ పెళ్లి చేసుకుంటుంది..అవును తన వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పెడుతూ, తన రెండో పెళ్లి నిశ్చితార్ధం ఫోటోలను విడుదల చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం కాస్త శుభకార్డులో ఎండ్ అయ్యింది.  డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన పెళ్లిపై వివిధ రకాల ఊహాగానాలు చక్కెర్లు కొడుతూ వచ్చాయి...ఒక సమయంలో సునీత చాలా విషయాలు ఉన్నప్పుడు మీడియాకి నా పెళ్లి గోలెందుకు అంటూ అసహనం వ్యక్తంచేసింది. చివరి రెండో పెళ్లితో ఒక ఇంటికి కోడలవుతుంది...

హైదరాబాద్

2020-12-07 16:54:53

సీతారామ జననం సినిమాకి 76 ఏళ్లు..

ప్రతిభ బ్యానర్ ఫై నిర్మించబడిన పౌరాణిక చిత్రం సీతారామ జననం . ఈ చిత్రం విడుదల తే01-12-1944దీ .నేటితో డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది . హీరోగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి చిత్రం. ఈ చిత్రంలో శ్రీరాముడుగా టైటిల్ పాత్రను పోషించారు అక్కినేని. అక్కినేని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కమలాకొట్నీస్ , రుష్యేంద్రమణి ,గగ్గయ్య ''బలిజేపల్లి ,తీగెల ,లంక సత్యం, పారుపల్లి ,అన్నపూర్ణ 'బాలత్రిపురసుందరి నటించారు .ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు డెబ్బై సంవత్సరాలు ఏకధాటిగా తెలుగు చలనచిత్ర సీమలో నటుడిగా రాణించి, తెలుగువారి కీర్తి ని దశ దిశలా వ్యాపింప చేయడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ చిత్రా సమాచారాన్ని కూడా ఆపాత మధురాలను ఈఎన్ఎస్ లైవ్ పాఠకులకు దగ్గర చేయాలనే సంకల్పంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన చిత్రాల నుంచి అట్టర్ ప్లాప్ అయిన చిత్రాల వరకూ సమాచారాన్ని కూడా త్వరలోనే మంచి విశేషాలుగా మీకు తెలియజేయడానికి ఈఎన్ఎస్ సినిమా జర్నలిస్టులు ప్రత్యేకంగా క్రుషిచేస్తున్నారు.

సినిమా న్యూస్ డెస్క్

2020-12-01 11:52:44

"కాలం మారింది" @ 48 Years

నటభూషణ శోభన్ బాబు , ఊర్వశి శారద అపూర్వంగా నటించిన చిత్రం "కాలం మారింది ". మమత ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం ఈ చిత్రాన్ని నిర్మించారు. కులమతాల కథాంశంతో నిర్మించారు . కన్నడంలో నిర్మించబడిన "కలంమాల్" ఈ చిత్రానికి మాతృక . హైద్రాబాద్ వెంకటేష్ 70M.M. థియేటర్లో వందరోజులు డైరెక్టుగా ప్రదర్శింపబడింది. ఉత్తమ నటుడిగా శోభన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం వారిచే బంగారు నందిని పొందారు . అలాగే ఈ చిత్రం ఉత్తమ కధాచిత్రంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంవారిచెే ఎన్నిక అయ్యింది . ఈ చిత్రం విడుదల తే 01-12-1972 దీ . నేటికి ఈ చిత్రం విడుదల అయి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ పాత మధురాలను అందించే కార్యక్రమంలో భాగంగా ఈఎన్ఎస్ లైవ్ సినిమా విభాగం సినిమా ప్రేమికుల కోసం ఏరికోరి పాత చిత్రాలు, వాటి యొక్క విశిష్టతను తెలియజేస్తోంది.

సినిమా న్యూస్ డెస్క్

2020-12-01 11:49:22

‘దాగుడుమూతల దాంపత్యం’ @ 30

బోగవిల్లి ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో శ్రీ విజయ ప్రసన్న ఫిలింస్ బ్యానర్ పై "దాగుడుమూతల దాంపత్యం" నిర్మాణమై నేటికి 30 ఏళ్లు గడుస్తోంది.  ఈ చిత్రం లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు , నట కిరీటి రాజేంద్రప్రసాద్, ఊర్వశి శారద ,వాణీ విశ్వనాథ్ ,రమ్యకృష్ణ మొదలగు నటీనటులు నటించారు. ఈ చిత్రం విడుదల తేదీ 30-11-1990. నేటితో ఈ చిత్రం విడుదల ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది. సంగీతం M.M.కీరవాణి సమకూర్చారు.  ఈ హాస్య రస భరిత చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. ఎబౌ యావరేజ్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నమోదు కాబడింది. మంచి, కధ, తారాగణంలో నిర్మిత మైన ఈ కుటుంబ కధా చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేటికీ ఈ సినిమా టెలివిజన్ సెట్లో వచ్చినప్పుడు తెలుగు  ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాకి కునుంబ నేపథ్యం వున్న టైటిల్ వుండటం  ఒక కారణం అయితే..ఏఎన్ఆర్, రాజేంద్రప్రసాద్ నటన ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది..

సినిమా న్యూస్ డెస్క్

2020-11-30 13:14:55

పాండురంగ మహత్యం @ 63 వసంతాలు

విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు పుండరీకునిగా నట విశ్వరూపం చూపిన చిత్రం "పాండురంగ మహత్యం " ఈచిత్రం విడుదల తేదీ 28-11-1957 . NTR హీరోగా నటించిన భారీ చిత్రం "చంద్రహారం " ద్వారా దర్శకునిగా పరిచయ అయ్యారు కమలాకర కామేశ్వరరావు. వీరిద్దరి కాంబినేషన్లోనే ద్వితీయ చిత్రం "పెంకి పెళ్ళాం" విడుదల అయ్యింది . ఈ రెండు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి . గానీ నందమూరి సోదరులు కమలాకర కామేశ్వరరావు లోని ప్రతిభను గుర్తించి మూడో చిత్రంగా "పాండురంగ మహత్యం " చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ చిత్రం నుండే కమలాకర కామేశ్వర రావు కి పౌరాణిక బ్రహ్మ గా గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో పుండరీకుని తల్లిదండ్రులుగా రుష్యేంద్రమణి , నాగయ్య సోదరుడు గా పద్మనాభం నటించారు . కొన్ని చిత్రాలలో గయ్యాళి పాత్రలను పోషించిన అంజలీదేవి ఈ చిత్రంలో శృంగార తారగా గా నటించారు . ఈ చిత్రంతోనే బి.సరోజాదేవి వెండితెరపై వెలుగులు వెదజల్లారు. ఘంటసాల గాత్రం, టి.వి.రాజు సంగీతంతో వీనుల విందైన పాటలు సమకూరాయి.ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఘన విజయం సాధించింది .

సినిమా న్యూస్ డెస్క్

2020-11-28 10:10:48