1 ENS Live Breaking News

స్పందన విజ్ఞప్తులు ఆన్ లైన్ లో మాత్రమే..

 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్పందన కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఆన్ లైన్ లో తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా వినతులు, ఫిర్యాదులు కాగిత రూపంలో స్వీకరించడం లేదని ఆయన వివరించారు. వినతులు, ఫిర్యాదులు spandanasrikakulam@gmail.com మెయిల్ ఐడికి లేదా 9491222122 వాట్సప్ పంపించ వచ్చని చెప్పారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయం లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేసినందున ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు అనవసరంగా వ్యయప్రయాసలు పడి శ్రీకాకుళం రావద్దని, ఇంటి వద్దనే ఉంటూ కరోనా వ్యాప్తి నివారణలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోనూ ఒకే చోట ఉండ వద్దని సూచిస్తూ వ్యక్తుల మధ్య దూరం పాటించాలని, మాస్కు విధిగా ధరించాలని కోరారు.

2020-06-21 19:11:37

డా.వైఎస్సార్ నేతన్న రైతులకు వరం కావాలి.. సీఎం జగన్

రాష్ట్రంలో పేదల బ్రతుకులు మార్చేందుకు ప్రభుత్వం కృషి  చేస్తుందని  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం వై.యస్.ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి

2020-06-20 22:28:23

కరోనా ప్రభలకుండా పటిష్ట చర్యలు..కలెక్టర్

జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కరోనా నివారణ చర్యలపై మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి

2020-06-20 22:04:04