అందరి సహకారం,సమిష్టి కృషితో నిరంతరం ఆదివాసీల అభివృద్దికి కృషి చేస్తామని ఐటిడి ఏ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. ఆదివారం స్దానిక తలారిసింగ్ కేంద్రీయాశ్రమోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 38వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పడు విశాఖపట్నం వచ్చినా గిరిజన ప్రాంతం అభివృధ్ది, సంక్షేమం, విద్య, వైద్య రంగాలపైనే ప్రత్యేకంగా తనతో చర్చిస్తారని చెప్పారు. మన్యానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి 35 ఎకరాల భూ సమీకరణ చేసామని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదగా శంఖుస్తాపన జరుతుందన్నారు.కోవిడ్ నేపధ్యంలో విశిష్టమైన సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో 5700 పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ముందగా ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేసిన తరువాత మైదానంలో భర్తీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పధకాలు అందిస్తోందన్నారు. 212 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఒకే గొడుగు కింద ప్రభుత్వ సేవలను అందిస్తున్నారని చెప్పారు. అర్హులైన 33 255 మంది గిరిజనులకు 57546 ఎకరాలకు అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్పారు. గత వారం ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చింతపల్లి , జి.కె. వీధి మండలాల్లో పర్యటించి గిరిజనులతో చర్చించారన్నారు. మన్యంలో నవరత్నాలు అమలు తీరును వివరించారు. 11 మండలాల్లో మనబడి - నాడు నేడు కింద రూ.99.84 కోట్ల వ్యయంతో 367 పాఠశాలలను అభివృధ్ది చేసి మౌలిక సదుపాయలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 35 కోట్లతో 350 అంగన్వాడీ నిర్మాణాలు,రూ.25 కోట్లతో 135 వెల్‌నెస్ సెంటర్లు, రూ.500 కోట్లతో 1000 కిలో మీటర్ల రహదారి నిర్మాణాలు చేపట్టామని మార్చినాటికి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ ఆసరా, వై ఎస్ ఆర్ చేయూత, అమ్మ ఒడి, వై ఎస్ ఆర్ కంటి వెలుగు,పసుపు ప్రాజెక్టు అమలు తీరును వివరించారు. సభాధ్యక్షలు పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించామని, వస్తానని హామీ ఇచ్చాని కరోనా నేపధ్యం లో పరిమితంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహస్తున్నామన్నారు. ఆదివాసీలు గొప్ప దేశ భక్తులని పర్యావరణ సంరక్షకులని అన్నారు.గిరిజన సాంప్రదాయ పండగలు ఇటుకుల పండగ,కొర్రకొత్త పండగల వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందన్నారు. స్వాతంత్య్ర సాధనలో గిరిజనులు, అల్లూరి సీతారామ రాజు నేతృత్వంలో ఎన్నొ పోరాటాలు చేసారని చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో గాం మల్లుదొర, గంటందొర కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై పడిందన్నారు. అయినా ముఖ్యమంత్రి అభివృధ్ది ఫలాలను పేదలకు అందిస్తున్నారన్నారు.
వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గిరిజన రైతులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పంపిణీ చేసారన్నారు. ముఖ్యమంత్రి 50 వేలమందికి లక్ష ఎకరాలకు పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రభుత్వ ఇచ్చిన డి.ఫారం పట్టా భూములో వ్యవసాయం చేయకుండా అక్రమంగా మైనింగ్ జరుగుతోందని దానిని నిరోధించాలని కోరారు. గిరిజన గ్రామాలకు నెట్‌వర్క్ సదుపాయాలు కల్పించాలన్నారు. కోవిడ్ మరణాలు సంభవించకుండా తగిన చర్యలు చేపట్టలన్నారు.
అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాలు పరిరక్షణకు , ఆదివాసీల అభివృధ్దికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జి. ఓ నెం.97ను వై ఎస్ సర్కారు రద్దు చేసిందన్నారు. జి. ఓ.నెం 3పై సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్ వేయడం జరిగిందని చెప్పారు. అరకులోయలో స్కిల్ డవలప్‌మెంట్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1/70 చట్టం, 5వషెడ్యూలు,6వ షెడ్యూలు ప్రకారం గిరిజనుల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా పరిపాలన జరుగుతోందని, అసత్యప్రచారాలు మానాలని చెప్పారు. అరకు నియోజక వర్గంలో రూ.49 కోట్ల 90 లక్షల వ్యయంతో 46రోడ్లు పనులు చేపట్టామన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గిరిజన సాంప్రదాయ నృత్యం అలరించింది.
ఐటిడి ఏ పి. ఓ డా. వేంకటేశ్వర్‌సలిజామల మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల మేరకు కోవిడ్ నేపధ్యంలో పరిమిత జనాభాతో నిర్వహించామన్నారు. అనంతరం ఎన్ ఎస్ టి ఎఫ్ డిసి పధకం కింద 16 బొలేరో వాహనాలను, ఒక ట్రాక్టరును లబ్దిదారులకు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నర్సింగరావు, మార్కెట్ కమిటీ అధ్యక్షలు గాయిత్రీ దేవి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ కోవిడ్ తీవ్రత ను అరికట్టేం దుకు జిల్లాలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, మందులు, మెటీరియల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖ ఉడా చిల్జ్రన్స్ థియేటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా లో నిన్నటి వరకు 17,488 పాజిటివ్ కేసులను గుర్తించారని, అందులో 8287 మంది ని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసారని, 121 మరణాలు సంభవించాయని తెలిపారు. మొత్తం 1,83,394 పరీక్షలు నిర్వహించామన్న మంత్రి ఇప్పటి వరకూ 9080 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, అందులో 302 మంది ఐసీయూలో ఉన్నారని, 926 మంది ఆక్సిజన్ బెడ్ లలో చికిత్స పొందుతు న్నార ని తెలిపారు. ఇంకా 3010 మంది హోం ఐసోలేషన్ లో, 3296 మంది కోవిడ్ కేర్ సెంటర్ లలో, 2748 మంది కోవిడ్ ఆసు పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హోం క్వారంటైన్ లో 15042 మంది ఉన్నారని తెలిపారు.134 వెరీ యాక్టివ్ క్లస్టర్ లు, 279 యాక్టివ్ క్లస్టర్ లు ఉన్నాయని తెలిపారు. ప్రజలు గుంపు లు గా తిరగరాదని, స్వచ్ఛందంగా నియంత్రణ పాటించాలని కోరారు. కెజిహెచ్ కొత్త బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు, పీజీ ల స్టయిఫండ్ చెల్లింపు లు త్వరలో జరుగుతాయని తెలిపారు. నగరంలో అదనంగా 42 పిహెచ్ సి లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 54 పాత అంబులెన్స్ లకు మరమ్మతులు చేయిస్తున్నారని తెలిపారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టుల కు వైద్య సేవలు అందించేందుకు గీతం ఆసుపత్రిలో ప్రత్యేకంగా 20 బెడ్ లను కేటాయించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏ. అదీప్ రాజ్, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, డిసిపి ఐశ్వర్య రస్తోగి, రూరల్ ఎస్పీ కృష్ణా రావు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
పాడేరు ఐటీడిఎ పరిధిలోని ఈనెల 2 వతేదీన పెదబయలు మండ లం జి.చింతలవీధి పరిధిలో జరిగిన బ్లాస్టింగ్ లో మృతిచెందిన బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేసారు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు బాధితులను శుక్రవారం ఉదయం ఐటీడీఏ కు పిలిపించి చెక్కులను అంద జేశారు. మృతుడు మెండిపల్లి మోహనరావు (29)భార్య అప్పలమ్మ కు రూ.లక్ష,మరొక మృతుడు మెండిపల్లి అజయ్ కుమార్(17) ,తల్లిదండ్రులు బూదన్న, జానకమ్మలకు రూ.లక్ష చెక్కును అందజేశారు. ల్యాండ్ మైన్ జరిగిన నేపద్యాన్ని అడిగి తెలుసుకున్నారు.అధైర్య పడకండి ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామానికి రహదారి నిర్మించాలని బాధితులు వినతిపత్రం సమర్పించారు. రహదారి నిర్మాణానికి పి.వో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజకమల్, ఐటీడీఏ పరిపాలనాధికారి కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన ఉదారతను చాటారు. విశాఖలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నెలలు నిండకుండా జన్మించి న ఓ పసిబిడ్డకు బాసటగా నిలిచారు .పూర్తిగా రూపాంతరం చెందని అవయవాలతో తక్కువ బరువుతో ఆ పసిబిడ్డ జన్మించ డంతో వెంటిలేటర్ మీద చికిత్స అనివార్యమైంది.ఈ క్రమంలో ఆసుపత్రి ఖర్చులు లక్ష పైబడి కావడంతో కైలాసపురం ప్రాంతానికి చెందిన ముత్యాల గౌరి శంకరరావు దంపతులు ఎంపీ ని ఆశ్రయిం చారు. తక్షణమే స్పందించిన ఎంవీవీ క్రెడాయ్ సహాయం తో రూ.1లక్ష చెక్ ను లా సన్స్ బేకోలనీ పార్టీ ఆఫీస్ లో అందజేశారు .ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ పీలా కోటేశ్వరరావు ,అధ్యక్షులు బి .శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
2018 బ్యాచ్ ప్రొబేషనర్ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమి స్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్‌లుగా ప్రభుత్వం నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్‌లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నార పురెడ్డి మౌర్య - సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం),పృధ్వీ తేజ్ ఇమ్మడి - సబ్ కలెక్టర్ కడప (కడప),ప్రతిష్ఠ మాంగైన్ - సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ),హిమాన్షూ కౌశిక్ - సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి),అమిలినేని భార్గవ్ తేజ - సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం),విధే ఖారే - సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం) ( పార్వతీపురం ఐటిడిఎ పిఓ గా అదనపు బాధ్యతలు),శ్రీవాస్ అజయ్ కుమార్ - సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు),అనుపమ అంజలి - సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి),సూరజ్ ధనుంజయ్ - సబ్ కలెక్టర్ టెక్కలి (శ్రీకాకుళం),మేదిడ జాహ్నవి - సబ్ కలెక్టర్ మదనపల్లి (చిత్తూరు), కల్పన కుమారి - సబ్ కలెక్టర్ నంద్యాల (కర్నూల్), కేతన గార్గ్ - సబ్ కలెక్టర్ రాజంపేట (కడప) ఉన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసు పత్రిలో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టరు అధికారు లను ఆదేశించారు. గురువారం ఆయన విన్స్ ఆసుపత్రిని సంద ర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్, ఇతర అధికారులు, వైద్యులతో ఆయన సమావేశ మయ్యారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వాటిని మెరుగుప రచడం గూర్చి ఆయన సమీక్షించారు. రానున్న కాలంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశమున్నందున, ముందు జాగ్రత్తగా అందుకు అవసరమైన వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేస్తున్న సేవలు వసతులను మరింత మెరుగు పరచుకోవాలి అన్నారు. ఆసుపత్రిలో గల వసతులను, సేవలను పూర్తి స్థాయిలో వినియో గించుకొనుటకు గాను అవసరమైన సిబ్బందిని నియమిం చుకోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి బెడ్డుకు ఆక్సిజన్ అందే విధంగా పరికరాలను అమర్చాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంటు ఆరోగ్య పరిస్థితిని వెంటనే పరీక్షించి, అందించవలసిన చికిత్సను నిర్దారించాలన్నారు. ఈ సమావేశంలో విమ్స్ డైరెక్టరు సత్యవరప్రసాదు, ప్రత్యేక ఉప కలక్టరు సూర్యకళ, జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.తిరుపతిరావు, డా. చలం, డా. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆయన పేరు నాని...పేరుకు తగ్గట్టుగానే అందరినీ నావాళ్లు అను కుంటాడు... అంతేకాదు కరోనా కష్టకాలంలో నా అనుకునేవా రంద రికీ తనవంతుగా నిత్యవసర సరుకులు అందజేస్తూ అందరితోనూ నాని నా అనే మనవాడిగా సాయమందిస్తూ నాలుగువేళ్లు నోట్లోకి వెళ్లేలా చేస్తున్నాడంటూ మన్ననలు పౌందుతున్నాడు. వివరాలు తెలుసుకుంటే విశాఖ సీతంపేట ప్రాంతానికి చెందిన నాని విద్యుత్ సంస్థలో లైన్ మేన్ గా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి పంజా విసరడంతో చాలామందికి కాయకష్టం చేసుకోవడానికి సైతం పని లేకపోవడంతో...గత నాలుగు నెలలుగా నాని ప్రతినిత్యం 20మం ది వరకూ నిత్యవసర సరుకులు అందిస్తూ వస్తున్నారు. గురువా రం నాని పుట్టినరోజు కావడంతో కొత్తబట్టలు, మిఠాయిలు కొనే డబ్బులతో 30 మంది కుటుంబాలకి నిత్యవసర సరుకులు కొని దానం చేశారు. ఇది చూసిన కుటుంబ సభ్యులు మరో 15 మందికి నిత్యవసర సరుకులు దానం చేశారు. కరోనా సమయంలో తమకు తోచిన సహాయం చేస్తూ నలుగురికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో ఈసేవ చేస్తున్నట్టు నాని చెబుతున్నారు. తనతోపా టువతన స్నేహితులు కూడా తాను చేసే సేవకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. వీటితోపాటు చర్చిలోకూడా తమ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు నాని వివరించారు. కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్న యమయంలో నాని నిశ్వార్ధంగా చేస్తున్న సేవ అందరి ప్రశంసలను అందుకుంటోంది.
విశాఖ మన్యంలోని వనసంరక్షణ సమితి భూములకు అటవీ హ క్కుప త్రాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సి పల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. మంగళవారం చింత పల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వనసం రక్షణ సమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి పేదరికాన్ని నిర్ములిం చాలని సూచించారు. సిరిపురం గ్రామం నుంచి కొండపైకి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తోటలు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. వి ఎస్ ఎస్ లలో సాగుచేసిన కాఫీ తోటలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. అటవీ భూములు, వి ఎస్ ఎస్ లలో సాగుచేసి మరణించిన వారి వారసులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని స్పష్టంచేశారు. సిరిపురం గ్రామంలో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పట్టాలు సిద్ధం చేసారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన రైతులకు సిల్వర్ మొక్కలు, కాఫీ మొక్కలు సరఫరా చేయాలని చెప్పారు. కాఫీ తోటలు ,మిరియాలసాగు పై వస్తున్న పంట దిగుబడి, ఆదాయాన్ని, రైతులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి పంచాయతి కందులగాది వి ఎస్ ఎస్ తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,
గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల, పిసిసి ఎఫ్ ప్రతీప్ కుమార్, విశాఖపట్నం సి ఎఫ్ పి.రామ్మోహనరావు, ఏ పి సిసి ఎఫ్ ప్రత్యేకాధికారి ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఏ కె ఝా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతున్న నేపద్యంలో జిల్లా యంత్రాంగానికి అండగా ఉండి కోవిడ్ రోగులకు సేవలు అందించేందుకు విశ్రాంత వైద్యులు ముందుకు వస్తున్నారు. రేడియాలజిస్ట్ అయిన రిటైర్డ్ వైద్యులు డాక్టర్ బి.గోవిందరాజులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ను కలిసి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయనను అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.మ్.ఏ) కోఆర్డినేటర్ అయిన డాక్టర్ గోవిందరాజులు జిల్లా యంత్రాంగానికి సమన్వయ కర్తగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో జిల్లా యంత్రాంగానికి సహాయం గా ఉండి కరోనా బాధితులకు సేవలు అందించేందుకు డాక్టర్ల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తన ప్రేరణతో మరింత మంది విశ్రాంత వైద్యులు కోవిడ్ సేవలకు వస్తారని ఆయన అభిలషించారు. ఆయన వెంట ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ కె.ఫణి కుమార్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ కలెక్టర్ ను కలిశారు.
జారీ ఉపసంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నాడు ఆయన నగరం లోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రి విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించి డాక్టర్ల తో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నివారణకు రూ. వేయి కోట్లు ఖర్చు చేయడానికి సిధ్ధం గా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత ఉందని, అందుకే పెద్ద ఎత్తున నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ మనోస్థైర్యం దెబ్బతినకుండా అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి పై సమాచారం తెలియడంలేదని వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారని, దీన్ని నివారించడానికి రోగి వివరాలతో బాటు, వారి బంధువుల ఫోన్ నెంబర్ లను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్య వరప్రసాద్, డిఎంహెచ్ఓ తిరుపతి రావు , ఇతర అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.
రైతాంగానికి యూరియా కొరత రానీయబోమని ఉప ముఖ్య మం త్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాస కృష్ణదాస్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతానికి 10,800 టన్నుల యూరియా నిల్వలు అందు బాటులో ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి ఆయన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలసి సోమవారం ఉదయం టెలీకాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలో ఎరువుల నిల్వల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు జిల్లాకు యూరియా నిల్వలు రప్పిస్తున్నట్లు ఆ శాఖ జెడి కె.శ్రీధర్ తెలిపారు. నాలుగు మండలాలను ఒక యూనిట్ గా విభజించి 200 మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయా చోట్ల అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆయా స్లాట్ అలాట్మెంట్ లను వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లాలో ఆగష్టు నెల నాటికి 18000 టన్నుల యూరియా అవసరం ఉందని, ప్రస్తుతానికి 11698 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో మూడు వేల టన్నులు ప్రైవేటు ట్రేడర్స్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ 10 వేల టన్నులే కాకుండా ఈ నెలాఖరుకు మరో 18 వేల టన్నులు అవసరం ఉంటుందని, అవి సరైన సమయంలోనే జిల్లాకు వస్తాయని ఈ మేరకు తమ శాఖ కమిషనర్ నుంచి స్పష్టమైన హామీ లభించిందన్నారు. యూరియా తో పాటు డిఎపి 6400 టన్నులు, ఎంవోపి 2133 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3488 టన్నులు, ఎస్ ఎస్ పి 1659 టన్నుల నిల్వలు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. సీజన్ ఇప్పుడిప్పుడే వేగవంత మవుతున్నదని, రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే ఈ ఏడాది నుంచి యూరియా అమ్మకాలు సాగిస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల 50 బస్తాలకు మించి బుక్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇకపై రైతు భరోసా కేంద్రాలు, హబ్ ల ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని జాయింట్ డైరెక్టర్ వివరించారు. రెండు మూడు రోజులకు ఒకమారు జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు వస్తాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కువ మొత్తంలో యూరియాను వేయడం ద్వారా పంటకు కలిగే నష్టాలను వివరించాలని వాటి వాడకాన్ని నియంత్రించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారని పేర్కొన్నారు. క్రేన్ కుప్పకూలిన సమయంలో కేబిన్‌లో 10 మంది ఉన్నారని తెలిపారు. కేబిన్‌లో ఉన్న పదిమందితోపాటు మరొకరు మృతి చెందారని వివరించారు. మృతుల్లో 10మంది వివరాలను గుర్తించామని, మరొక మృతుడి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్‌ఎస్ఎల్ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందినట్టు సమాచారంం. లోకో షెడ్ లో పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా క్రేన్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే6 వ్యక్తులు మృతి చెందగా తర్వాత తీవ్ర గాయాలతో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ మృతి పట్ల ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి ఉదయం సిబ్బంది క్రేన్ ఎక్కి పనులు చేపడుతుండగా ఒక్కసారిగా క్రేన్ తిరగబడినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల వైఎస్సార్సీపి ఆంధ్రాయూ నివర్శిటీ విద్యార్థి విభాగం నాయకులు బి.కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల విశాఖకు మరిన్ని అంతర్జాతీయ విద్యాసంస్థలు రావడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖ ఏర్పాటు అయిన దగ్గర్నుంచి ఉత్తరాంధ్ర ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెంద డంతో పాటు ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందు తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అందరు మేలు, అన్ని ప్రాంతాల సర్వతోమొఖాభివృద్ధి కోరి సీఎం వైయస్ జగన్ తీసుకునే నిర్ణయానికి తమ వంతు మద్దతు పూర్తిస్థాయిలో ప్రకటిస్తున్నామని కాంతారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ. వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారిని గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రివర్యులకు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం, దేవాలయం పర్యాటకంలో భాగంగా కేంద్ర నిధులనుండి రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా సింహాచలం శ్రీ.వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53.00 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహలాద్ సింగ్ పటేల్ గారికి, కేంద్ర మంత్రి గారికి, ముఖ్య మంత్రివర్యులు శ్రీ.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు విజయ్ సాయి రెడ్డి గారికి విశాఖపట్నం ప్రజల తరుపున మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు కృతఙ్ఞతలు తెలియజేశారు. అనంతరం, అభివృద్ధి పనులపై కేటాయించిన నిధులను ఏఏ సౌకర్యాలు కల్పించాలనే దానిపై సింహాచలం ఈ.ఓ గారితో, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం వారితో మరియు టూరిజం శాఖ ఇంజనీరింగ్ విభాగం వారితో చర్చించారు..