1 ENS Live Breaking News

అనుకున్నదొక్కటి.. అయ్యింది ఇంకొక్కటి..?! గేట్లు మూసేసిన విమ్స్ సిబ్బంది

డామిట్ కథ అడ్డం తిరిగింది.. మనం ఒకటి అనుకుంటే విమ్స్ ఆసుపత్రి అధికారులు ఇంకోలా చేశారు.. మధురవాడలోని సొంత కార్యాల యం బాగాలేదని కమిషనర్ ని ఒప్పించి మరీ  ఖాళీచేసేయాలనుకుంటే.. ఆదిలోనే విమ్స్ అధికారులు గాలి తీసేశారు... ఆయుష్ ఆర్డీడి కార్యాలయానికి గదులు ఇస్తామని చెప్పారని తట్టాబుట్టా సర్దేసుకొని వెళితే గేట్లు మూసేసి అవమానించారే.. చఛా అందరి ముందు పరువు పోయింది..నేనేదో దర్జాగా విమ్స్ ఆసుపత్రిలో ఆయుష్ ఆర్డీడి కార్యాలయం పెట్టాలనుకుంటే.. మొత్తానికి అంతా బెడిసి కొట్టింది.. విమ్స్ ఆసుపత్రిలో కార్యాలయం ఇప్పిస్తామని చెప్పిన ఓ మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ఆఖరి నిమిషంలో ప్లేటు తిప్పేయడంతో ఏం చేయాలో తెలీక.. విమ్స్ సిబ్బంది గేట్లు మూసేయడంతో ఇన్చార్జి ఆర్డీడి అనుచరగణం.. కార్యాలయం ప్రారంభ వార్తలు బాగా రాసేద్దామని వచ్చిన అనుకూలా మీడియా చిరాకుతో వెనుతిరగాల్సి వచ్చింది..! 

  
నన్ను ఎవరూ ఆపలేరు.. నేను ఖచ్చితంగా విమ్స్ ఆసుపత్రిలోకి  ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని తరలిస్తాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బీరాలు పోయి తట్టబుట్టా సర్దేసుకొని విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్, కార్యాలయ సిబ్బంది చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సామాన్లతో విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లాలని ప్రయత్నం చేయడంతో అక్కడి సిబ్బంది ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఎవరినీ లోనికి పంపవద్దని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో వెంటతెచ్చుకున్న సామాన్లతో తిరిగి మళ్లీ మధురవాడ వెళ్లాల్సి వచ్చింది. మంగళవారం జోన్-1 ఆయుష్ ఆర్డీడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సుష్మ అనే దళిత ఉద్యోగిపే చేయి చేసుకోవడం, కులం పేరుతో దూషించడం, ఆమె దళిత సంఘాల నేతలతో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం మీడియాలో వైరల్ అయ్యింది.

 ప్రభుత్వం ఆయుష్ కార్యాలయం ఏర్పాటుకి సొంత స్థలం ఇచ్చి అక్కడ భవనాలు ఏర్పాటుచేస్తే అక్కడ సిబ్బంది, వైద్యులతో గొడవలు పెట్టుకొని నారా రాద్దాం చేసిన ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి విషయం విమ్స్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఇన్చార్జి ఆర్డీడి ప్రయత్నం బెడిసి కొట్టింది.  ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక, లిఖత పూర్వక లేఖలు లేకుండా తానేమీ చేయలేనని.. అందునా ప్రశాంతంగా ఉన్న విమ్స్ ఆసుపత్రిని గొడవలకి వేదికలు చేయడానికి కాదని సామాన్లు తెచ్చిన సిబ్బందితోనే చెప్పించినట్టు తెలిసింది. అయితే విశాఖలోని మధురవాడ ఆర్డీడి కార్యాలయం తరలింపునకు సంబంధించి కమిషనర్ డి.మంజుల ఉత్తర్వులు ఇచ్చారని ఇన్చార్జి ఆర్డీడి కార్యాలయంలోని మొత్తం సామాన్లు.. కార్యాలయ సిబ్బందితో గొడవలు అనంతరం విమ్స్ ఆసుపత్రికి వెళ్లిపోయారు.  

తొలుత విమ్స్ లో రెండు గదులు కేటాయించడానికి అంగీకరించిన విమ్స్ అధికారులు ఆర్డీడి గొడవలు, పోలీసు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, వైద్యులను తిట్టడం తదితర అంశాలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు విమ్స్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేట్లు మూసేసి సామాన్లను, ఆయుష్ ఆర్డీడి కార్యాలయ సిబ్బందిని వెనక్కి పంపేశారట. గత్యంతరం లేక మళ్లీ అదే మధురవాడలోని ఆర్డీడి కార్యాలయానికి సర్దేసిన సామాన్లతో వెళ్లాల్సి వచ్చింది. విమ్స్ లో రెండు గదుల కేటాయింపునకి ఒక మంత్రితో సిఫారసు చేయడం ద్వారా గదులు కేటాయించారని.. దానికి కూడా ప్రాపర్ ఛానల్ లో అధికారిక లేకలు లేకపోవడంతో విమ్స్ సిబ్బంది, అధికారులు ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. 

ప్రస్తుతం బాదితురాలు ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి ఝాన్సీలక్ష్మీభాయ్ పై కేసు పెట్టడంతో వివరణ ఇవ్వడానికి ఆయుష్ కమిషనర్ వస్తారని పోలీస్ స్టేషన్ లో చెప్పడంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా నిలిపి వేసినట్టు సమాచారం అందుతుంది. అయితే విధి నిర్వహణ సమయంలో క్రింది స్థాయి సిబ్బంది..అందునా దళిన సిబ్బందిపై చేయిచేసుకున్న వ్యవహారంలో తానెందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాంగూల్మం ఇస్తానని ఆయుష్ కమిషనర్ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఆయుష్ కార్యాలయంలోని దళిత ఉద్యోగిపై చేయిచేసుకున్న విషయంలో ఆయుష్ శాఖ ఇన్చార్జి ఆర్డీడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయితే డిపార్ట్ మెంట్ పరువు పోతుందని ఈ కేసును రాజీచేయాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇదే విషయమై ఆయుష్ కమిషనర్ ను, విమ్స్ డైరెక్టర్ ను చరవాణిలో సంప్రదించాలని ప్రయత్నించినా వార అందుబాటులో లేరు..!

Visakhapatnam

2025-02-19 20:15:38

ఆయుష్ లో దళిత ఉద్యోగిపై చేయి చేసుకున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్..!

నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఏం పీకలేరు.. నిన్ను కొట్టినా నా వర్గం మీడియా అంతా నేను చెప్పిందే రాస్తారు.. ఎవరేంచేసినా నేనే ఇక్కడే ఆర్డీడిగా కొనసాగుతాను.. నేను కమిషనరేట్ లో ఎవరికి ఏం చేయాలో అది చేశాను.. నా నెట్వర్క్ వినియోగించి ఇన్చార్జి ఆర్డీడిగా వచ్చానంటే మీకు ఈపాటికే అర్ధం అయిపోవాలి.. ఇంకా నా నెట్వర్క్ సంగతి మీకు తెలీదు.. నేను గీసిన గీత కార్యాలయం సిబ్బంది దగ్గర నుంచి నాకు అనుకూలంగా ఉన్న వైద్యులతో సహా ఎవరూ దాటరు.. నువ్వేం చేసుకుంటావో చేసుకో.. నిన్నుకొట్టిన విషయానికి రుజులేవి.. నువ్వూ నన్ను కొట్టావని కంప్లైంట్ చేస్తాను.. నేను అధికారిని నా మాటే చెల్లుతుంది.. నువ్వు ఆఫ్ట్రాల్ సబార్డినేట్ వి.. నన్నే మీడియాకి ఎక్కిస్తారా.. నాపై వార్తలు రాయిస్తారా.. ఏం నేను రాయించుకోలేనా.. నా చేతులో పేపర్లు లేవా..? విలేఖరులు లేరా.. ఏం చేసుకుంటావో చేసుకో.. ఎవర్ని ఏ పాయింట్ మీద ఇరికించాలో నాకు తెలుసు.. కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుల్లో నాపై కంప్లైంట్ పెట్టినా.. అక్కడంతా నావాళ్లే ఉన్నారు..నేను ఏం చేయాలో నేను చేయగలరు.. ఇదీ ఒక దళిత ఉద్యోగిపై చేయిచేసుకోవడంతోపాట.. కులం పేరుతో దూషించడంతోపాటు క్రిందిస్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నా  ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ తీరు..! 

విశాఖలో ఆయుష్ జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్  ఉద్యోగులపై వేధింపులు పరాకాక్షష్టకు చేరుకొని క్రిందిస్థాయి దళిత ఉద్యోగిపై చేయి చేసుకునే వారకూ వచ్చాయి. మంగళవారం విశాఖలోని మధురవాడ ఆయుష్ ఆర్డీడీ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్డీడి కార్యాలయ  దళిత ఉద్యోగిని సుష్హపై కులందూషణ చేయడంతోపాటు చేయిచేసుకున్నారు. దీనితో ఈ విషయాన్ని సదరు దళిత ఉద్యోగిణి ఆయుష్ కమిషనర్ డి.మంజులకి ఫిర్యాదు చేశారు. ఆ వెనువెంటనే ఇన్చార్జి ఆర్డీడి కూడా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.  అయితే తనపై కమిషనర్ కి ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ దూషించడంతో, అవమానభారం తట్టుకోలేక ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ప్రతినిధులు కూడా ఆమెకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఇన్చార్జి ఆర్డీడి తనపై చేయిచేసుకున్న విషయమై బాధితులు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

సందట్లో సడేమియా అన్నట్టు ఇన్చార్జి ఆర్డీడి ఆయుష్ కార్యాలయాన్ని కూడా ఇదేరోజు విమ్స్ ఆసుపత్రికి ఆఘమేఘాలపై తరలించేశారు. అయితే ఈ విషయాలన్నీ బయటకు తెలియజేస్తున్నారని.. మీడియాలో వార్తలు ఎలా వస్తున్నాయని.. కార్యాలయ సిబ్బందే విషయాలన్నింటినీ మీడియాకి తెలియజేస్తున్నారంటూ కార్యాలయ సిబ్బందిపై ఇన్చార్జి ఆర్డీడి తిట్ల దండం మొదలు పెట్టారు. అయితే తొలుత కార్యాలయంలో సిబ్బందితో సమావేశం పెట్టి మాట్లాడి నట్టుగా మాట్లాడి.. ఉన్నతాధికారికి నమస్కారం కూడా లేచి ఒంగొని చెప్పలేదనే విషయమై గొడవకు దిగిన ఇన్చార్జి ఆర్డీడి గొడవ ముదిరేలా కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే తన అనుకూల మీడియా కార్యాలయం బయట ఉండటం, గొడవ జరిగిన వెంటనే లోనికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఉద్యోగినిపై దాడి జరగడంతో పోలీసు బాధిత ఉద్యోగిని ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నుంచి స్టేట్ మెంట్లు స్వీకరించారు. కావాలనే తనపై ఒక వర్గం మీడియా వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ ఇన్చార్జి ఆర్డీడి ఒంటికాలపై లేచారు. తాను ఎవరికీ సమాధానం చెప్పనని.. ఏం కావాలన్నా కమిషనర్ నే అడుక్కోవాలంటూ కార్యాలయం నోనికి వెళ్లిపోయారు. గొడవ జరిగిన రోజున మధురవాడలోని సొంత స్థలంలో ఉన్న ఆయుష్ కార్యాలయాన్ని తరలించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీబాయ్, దళిత ఉద్యోగిని సుష్మపై చేయిచేసుకున్న విషయమై కమిషనర్ డి.మంజులను ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరగా.. విధి నిర్వహనలో ఉన్న ఉద్యోగులు గొడవలు పడటం నేరమని.. అందునా ఇన్చార్జి ఆర్డీడి క్రింది స్థాయి ఉద్యోగిపై చేయి చేసుకోవడం కూదా తప్పేనని హెచ్చరించామన్నారు.

 అంతేకాకుండా విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడిపై వైద్యులు కూడా పలు ఫిర్యాదులు చేశారని..అన్నింటిపైనా విచారణ చేసి, వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ని వివరణ కోరేందుకు చరవాణిలో ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆయుష్ కార్యాలయంలో జరిగిన గొడవ, ఆందోళనకు దిగిన ఉద్యోగుల వీడియోలు, ఆయోడియో రికార్డింగ్ లు, ఇన్చార్జి ఆర్డీడికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు అనుకూల మీడియా హాడావిడి సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. వీడియోలన్నీ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి క్రిష్ణబాబు, విశాఖజిల్లా కలెక్టర్ ఎం.హరేంధిరప్రసాద్ కు చేరడం ఆయన విచారణ చేస్తామని చెప్పడం విశేషం.

visakhapatnam

2025-02-18 15:20:32

జోన్-1 ఆయుష్ వైద్యులపై ఇన్చార్జి ఆర్డీడి వేధింపుల పర్వం..! దళిత వైద్యులపై కులం పేరుతో దూషణలు

డ్యూటీ టైమ్ లో డిస్పెన్సరీలు మూయించి.. డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ పెట్టాను.. పేపర్ లో వచ్చింది ఏమైనా చేయగలిగారా.. ఆ తప్పు మీరే చేసినట్టుగా సంజాయిషీ లెటర్లు రాయించాను అదీ మీడియాలో వచ్చింది అపుడూ ఏమీ చేయలేకపోయారు కదా.. ఆర్డీడి కార్యాల యాన్ని విమ్స్ లోకి తరలిస్తున్న విషయాన్ని మీడియాకి లీక్ చేశారు.. అయినా కమిషనర్ మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యద ర్శి ఎంటీ క్రిష్ణబాబు ఇద్దరూ ఏమీ చేయలేకపోయారంటే నా రేంజ్ ఏంటో మీకు ఇంకా అర్ధం కాలేదా.. మీరెన్నిసార్లు మీడియాలో రాయించినా నా టీమ్ కమిషనరేట్, సెక్రటేరియట్ లో పనిచేస్తుంది.. నాపై ఈగ కూడా వాలనివ్వరు.. అంతెందుకు రోస్టర్ పాయింట్స్ ని కాదని నేను ఇన్చార్జి ఆర్డీడిగా రాగలిగానంటే నా నెట్వర్క్ ఏ స్థాయంలో ఉందో మీకు ఇంకా అర్ధం కాలేదా..? నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. నేను మోనా ర్కురా లిని.. ఏంటి ఇవేవో సినిమాడైలాగులనుకుంటే.. తప్పులో కాలేసినట్టే.. అక్షరాలా ఆయుష్ లోని జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ వైద్యులను బెదిరించే తీరు..!

ఆయుష్ శాఖలో డబ్బున్నవారిదే రాజ్యం అనడానికి విశాఖ జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ ఇన్చార్జి ఆర్డీడీ పోస్టు ఒక ప్రధాన ఉదాహరణ అయితే దానిని అడ్డం పెట్టుకొని వైద్యులను వేధించే తీరు మరీ విడ్డూరంగా ఉంది. చేసిన తప్పులు ఆధారాలతో సహా మీడియాలో వచ్చేస్తే.. దానిని తట్టుకోలేకపోతున్న ఆర్డీడీ డిస్పెన్సరీ వైద్యులను టార్గెట్ చేశారట. ఆసుపత్రులకు వెళ్లి కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారట. అయిదే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఏమైనా అంటే ఈ విషయం బయటకు రాకపోయేది. ఆ కుల దూషణ జరిగింది దళిత వైద్యులపై దానితో ఈ విషయం కాస్తా గుప్పుమని బయటకు వచ్చేసింది. విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడిగా డా.ఝాన్సీ లక్ష్మీభా య్ విధుల్లో చేరిన దగ్గర నుంచి వైద్యులు, సిబ్బంది నరకం చూస్తున్నామని లబో దిబో మంటున్నారు. 

అదే సమయంలో ఈమె చేస్తున్న వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా మీడియాలో వచ్చినా ఈమెపై కమిషనర్ మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులు సైతం చిన్న చర్య కూడా తీసుకోలేదంటే ఏ స్థాయిలో సదరు ఆర్డీడీ నెట్వర్క్ నడుపుతున్నారో అర్ధమ వుతున్నది. అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చిందే మొదలు అంతా కలక్షన్ పైనే గురిపెట్టారని.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే డ్యూటీ లు సక్రమంగా చేయడం లేదని రిమార్కులు రాస్తానని బెదిరిస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. తాము విధినిర్వహణలో ఉన్నసమ యంలో కావాలని విశాఖలోని జిల్లా పరిషత్ లో డ్యూటీ టైమ్ లో యునానీ డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి రప్పించారని చెబుతున్నారు. ఆ విషయం పేపర్ లో ఆధారాలతో పాటు వచ్చిన తరువాత.. దాని నుంచి తప్పించుకోవడానికి మళ్లీ తమను బెదిరించి క్షమాపన లేఖలు కూడా రాయించా రని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన వైద్యులను కూడా విధినిర్వహణ పేరుతో వేధిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.

 కొత్తగా డ్యూటీలో చేరినపుడు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చే సమయంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10వేలు తీసుకున్నారని.. ఇపుడు మళ్లీ ఎస్ఆర్ లు ఓపెన్ చేయడానికి మరో రూ.5వేలు డిమాండ్ చేస్తున్నారని.. అవి ఇవ్వని కారణంగా విధినిర్వహణలో అలసత్వం అంటూ విశాఖ ఆర్డీడి కార్యాలయానికి రప్పించి మరీ అమ్మనా బూతులు తిట్టడంతోపాటు, కులం పేరుతోనూ, ఆచార వ్యవహారాల పేరుతోనూ దూషిస్తున్నారని ఆవేదన చెంతున్నారు. కాగా కులదూషణ ఎదుర్కొంటున్న వైద్యుల ఫిర్యాదులను కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రరటీలు పట్టించుకోకపోవడంతో వీరంతా లోకాయుక్తాను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. నిజంగా అదే జరిగితే పరిపాలనా పరమైన నిర్లక్ష్యం పేరుతో ఆయుష్ కమిషనర్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. విశాఖ ఇన్చార్జి ఆర్డీడి డా.లక్ష్మీభాయి అడ్డగోలు ఇన్చార్జి అపాయింట్ లో లుక లుకలపై విచారణ చేసినా.. ఇటీవల కాలంలో ఆర్డీడి విధినిర్వహణ సమయంలో జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసిన ఉద్యోగవిరమణ కార్యక్రమంపై విచారణ చేసినా, ఉద్యోగులను కులం పేరుతో దూషిస్తున్న విషయమై విచారణ చేపట్టినా ఆధారాలతో సహా వాస్తవాలు వెలుగుచూసే అవకాశం వుంది. చూడాలి ఇప్పటికైనా కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రరటీలు ఏ విధంగా స్పందిస్తారనేది..?!

visakhapatnam

2025-02-14 16:47:02

అంతా నాయిష్టం- ఆయుష్ ఆర్డీడి కార్యాలయం అడ్డగోలు తరలింపు..?!

ఆయుష్ లో జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి అనుకున్నదే జరగాలి..కమిషనర్ లేదు.. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అసలే లేరు.. ఏదైనా సొంత నిర్ణయం తీసుకొని అమలు చేసేస్తారు.. చేసిన తప్పులన్నీ అధారాలతో సహా కనిపిస్తున్నా.. ఆయుష్ కమిషనరేట్ అధికారులు కనీసం సదరు ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ పై వెంట్రుకవాసి చర్యలు కూడా తీసుకోరు. అదేమంటే కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు నేను ఎంత చెబితే అంత.. అసలు ఆయుష్ నా సలహా లేకుండా ప్రభుత్వ జీఓ కూడా తయారు కాదు.. కమిషనరేట్ లో ఎవరీ ఏమీ రాదు.. అన్నీ నేనే చెప్పాలి  తెలుసా అంటూ సిబ్బంది ముందే పదే పదే మాట్లాడతారు.. ఆ వాయిస్ రికార్డులన్నీ నేరుగా కమిషనర్ కి చేరినా.. ఫలితం శూన్యం.. ఇపుడు అదే దైర్యంలో తన సొంత నిర్ణయాలతో విశాఖలోని మధురవాడలో ఉన్న ఆయుష్ ఆర్డీడి ప్రాంతీయ కార్యాలయాన్ని విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చేయడానికి ప్లాన్ వేశారు ఆర్డీడి. 

ఏ ప్రభుత్వశాఖ అయినా, అధికారులైనా తమకు సొంత కార్యాయాలు, ప్రదేశాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ఆయుష్ శాఖలోని ఇన్చార్జి జోన్-1ఆర్డీడి మాత్రం. తన సొంత తెలివి వివియోగించి ఈ శాఖ సొంత ఆస్తులు వదించుకొని.. పొరుగింటి పుల్లకూర కూర రుచి అన్నట్టుగా విమ్స్ ఆసుపత్రిలో ఆర్డీడి కార్యాలయం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా విమ్స్ డైరెక్టర్ తో కూడా మంతనాలు జరిపేశారట. ఆయుష్ శాఖకు చెందిన ఆసుప్రతి బ్లాక్ విమ్స్ లో సిద్దమవుతుంది. అది పూర్తయ్యేలోగా ఆర్డీడి కార్యాలయాన్ని కూడా అదే విమ్స్ లోకి తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు ఆర్డీడీ. ఇంతకీ ఆయుష్ కమిషనర్ కి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ విషయం చెప్పారా అంటే అదేం అవసరం లేదు. నేను నిర్ణయం తీసుకుంటే చాలు అంటున్నారు. 

రేపే..మాపో ఆయుష్ ఆర్డీడి కార్యాలయాన్ని కూడా అనుకున్నప్రదేశాన్ని తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిని వైద్యులు, కమిషనరేట్ అధికారులు విబేదిస్తున్నా ఎవరి మాట పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, తరలింపు ఇతర ఆసుపత్రుల్లో కార్యాలయాలు పెట్టాలంటే ఆయుష్ కమిషనర్ అనుమతి ఉండాలి. కానీ ఇక్కడి ఇన్చార్జి ఆర్డీడి మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటీవలే యునానీ వైద్యుడి రిటైర్ మెంట్ ఫంక్షన్ కి ఆయుష్ డిస్పెన్సిరీలన్నీ డోర్ లాక్ వేయించి మరీ విశాఖలోని జిల్లా పరిషత్ డాక్టర్ తోపాటు.. ఈమె కూడా చక్కటి సన్మానం చేయించుకున్నారు. అ విషయం మీడియాలో రావడంతో తనపై ఎక్కడ కమిషనర్ కన్నెర్ర చేస్తారోనని ముందుగానే కమిషనరేట్ లోని తన అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకొని వైద్యులను బెదిరించి మరీ క్షమాపణ లేఖలు రాయించారు. అదీ కూడా మీడియాలో వచ్చేసింది.

 అయినా ఈమెపై కమిషనర్ మంజుల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలే ఇన్చార్జి ఆర్డీడి సీటులోకి కూడా రోస్టర్ పాయింట్, సీనియారిటీని పక్కనపెట్టి గత తేడా ఆయుష్ కమిషనర్ ద్వారా ఇన్చార్జి ఆర్డీడి పోస్టు కొట్టేశారని ఇప్పటికీ సీనియర్ వైద్యులు నెత్తీ నేరూ కొట్టుకుంటున్నారు. ఇపుడు అదే ఇన్చార్జి ఆర్డీడి పోస్టుని అడ్డం పెట్టుకొని ఇస్టానుసారం వ్యవహరిస్తున్న ఆయుష్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మధురవాడలోని సొంత కార్యాలయాన్ని విమ్స్ లోనికి తరలించడానికి ఏమైనా అనుమతులు ఇచ్చారానే అనేవిషయం తెలుసుకోవడానికి కమిషనర్ ను సంప్రదించినా ఎలాంటి సమాధానం రాలేదు. చూడాలి తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఇష్టాను సారం వ్యవహరించే జోన్-1 ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో ఆయుష్ కమిషనర్ లేదా.. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..?!

visakhapatnam

2025-02-04 19:39:47

నిన్న ఆసుపత్రులు మూయించి..నేడు వైద్యులతో బలవంతపు లేఖలు రాయించి..?!

కావాలని తప్పు చేయనేల.. చేసిన తప్పు ఆధారాలతో బయటపడి ఈరోజు-ఈఎన్ఎస్ లలో ప్రత్యేక కథనాలు రావడంతో ఎక్కడ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారోనని మరో తప్పుచేయనేల.. ఏం రాసుకుంటారో రాసుకోండి.. ఎవరితో ఏం మాట్లాడాలో మాకు తెలుసునంటూ బీరాలు పోయి.. రాత్రికి రాత్రికి ఎంతో కొంత తీసుకొని వార్తలు రాయడం మానేయమని బేరసారాలు ఆడనేల.. వచ్చిన వైద్యులకి ఫోటోలు తీసి ముందు మీపై వార్తలు రాస్తామని చెప్పడంతో వచ్చిన తేడా డాక్టర్లు లగెత్తనేల.. ఇన్ని వ్యవహారాలు ఆయుష్ లో ఇన్చార్జి ఆర్డీడీ చేస్తున్నా రంటే.. నిజంగా సదరు అధికారిణి చెప్పినట్టుగానే ఆయుష్ కమిషనర్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు.. ఇతర కమిషనరేట్ సిబ్బంది వ్యవహరిస్తారేమో.. ఆధారాలతో సహా రెడ్ హేండెడ్ గా వైద్యులందరినీతో డిస్పెన్సీలన్నీ మూయించేసి.. రోగులు ఇబ్బందులకు కారణమైన జోన్-1 ఆర్డీడిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి మరి..!

ఆయుష్ కమిషనర్.. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలు నా చేతిలోనే ఉన్నారని.. నేను వారికి ఎంత చెబితే అంత అని బీరాలుపోయిన విశాఖజోన్ -1 ఆయుష్ ఆర్డీడీ ఇపుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే  ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనధికారికంగా వైద్యులను రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వైద్యుల విధి నిర్వహణ సమయంలో విశాఖ రప్పించి వారితో సన్మానాలు చేయించుకున్న ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ వ్యవహారం ఈరోజు-ఈఎన్ఎస్ సంయుక్తంగా ఆధారాలతో సహాయ బయట పెట్టింది. దీనితో విధినిర్వహణ సమయంలో ఆసుపత్రులు మూసేసి ఎలా రిటైర్ మెంట్ ఫంక్షన్లు చేసుకుంటారని..ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆయుష్ కమిషనర్ మంజుల ఆదేశాలు జారీ చేయడంతో ఇపుడు చేసిన తప్పుని వైద్యుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు విశాఖలోనీ ఆయుష్ ఆర్డీడి. అదీ ఎలా అంటే తమకు తెలియక యునానీ డాక్టర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి వచ్చేశామని.. మొదటి తప్పుగా భావించి తమను క్షమించాలని.. కార్యక్రమానికి వచ్చిన వైద్యులందరితోనూ ముందస్తుగా లేఖలు రాయించుకుని కార్యాలయానికి తెప్పించుకున్నారు. 

దీనితో సదరు వైద్యులు ఈరోజు-ఈఎన్ఎస్ ని సంప్రదించి. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా తమను బెదిరించి తమతో క్షమాప లేఖలు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వైద్యుల డిస్పెన్సరీలు పేర్లు బయటపెట్టడం ఇష్టం లేక.. కాంక్రీట్ ప్రూఫ్ లు ఈరోజు-ఈఎన్ఎస్ చేతికి చిక్కాయి. అయితే ఈ విషయం కాస్తా బయటకు రావడం, ఆ తరువాత తమకు బాకా కొట్టే మీడియాలో జరిగిన సంఘటన రాకుండా వారికి ముడుపులు ఇవ్వడం అన్నీ చక చకా జరిగిపోయాయని వైద్యులే చెబుతున్నారు. తాము రామన్నా.. బలవంతంగా కార్యక్రమానికి పిలిపించి.. ఒక్కొక్కరి నుంచి రెండువేలు పార్టీకి వసూలు కూడా చేశారని ఇపుడు తీరా.. తామే తప్పు చేసినట్టుగా.. క్షమాణ లేఖలు ఆయుష్ ఆర్డీడికి, కమిషనర్ కి రాయమని చెప్పడం ఏంటని వైద్యులు మండి పడుతున్నారు.  ఒక వేళ తప్పు చేసినట్టు కమిషనర్ ఇపుడు తమపై చర్యలు తీసుకుంటారేమోనని భయంగా కూడా ఉందని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. సదరు ఆర్డీడి వచ్చిన దగ్గర నుంచి చేసే వ్యవహారాలకు తాము మధ్యలో బలైపోతున్నామని వైద్యులు గగ్గోలు పెడుతున్నారు. 

అయితే ఆర్డీడి విషయంలో మీడియాలో వెలుగుచూస్తున్న వాస్తవాలు, ఆమెపై విచారణ కు ఆదేశించిన విషయాలు అమరావతి నుంచే కొందరు తేడా అధికారులు, సిబ్బంది ఆర్డీడికి ఉప్పందించడంతోనే.. ముందస్తుగా క్రమశిక్షణా చర్యలు పడకుండా వైద్యులతో క్షమాపణ లేఖలు రాయిస్తున్నట్టు తెలిసింది. ఆ విధంగా చేస్తే మెమోకానీ, సస్పెన్షన్ గానీ పడకుండా కేవలం వార్నింగ్ సరిపోతుందని అపుడే కమిషనర్ కార్యాలయం నుంచి ఆర్డీడికి సమాచారం వచ్చిందట. అయితే సదరు విషయంపై ఆర్డీడికి భజనలు చేసే కొందరు వైద్యులు శనివారం రాత్రి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధులను సంప్రదించి.. ఇకపై మా ఆర్డీడిపై ఎలాంటి వార్తలూ రాయకుండా ఉండాలంటే ఎంతకావాలని బేరసారాలు కూడా జరపడం విశేషం. 

వాస్తవాలను బయట పెట్టే సమయంలో మీకు నచ్చింది రాసుకోమని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి ఆర్డీడి ఇపుడు ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని పంపించారని.. ముందు మీ ఫోటోలు, వివరాలతో న్యూస్ రాస్టే సరిపోతుందని చెప్పడంతో ఆగమేఘాలపై ఆ వైద్యులు బిచానా సర్దేశారు. ఇదే విషయాన్ని కమిషనర్ మంజుల దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు-ఈఎన్ఎస్  ప్రయత్నం చేసినా అమె అందుబాటులోకి రాలేదు. దీనిని బట్టి చూస్తుంటే ఇన్చార్జి ఆర్డీడిగా ఉన్నప్పుడే ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కేసి.. ఆ తప్పులను డిస్పెన్సీ వైద్యులకు మీదకి నెట్టేసి.. చల్లగా తప్పించుకోవాలని.. తాను చెప్పినట్టే అంతా జరగాలని చూసే ఆర్డీడిలు నిజంగా పదోన్నతిపై రెగ్యులర్ ఆర్డీడిలు అయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఆయుష్ కమిషనర్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలే ఆలోచించుకోవాల్సి వుంది..!

visakhapatnam

2025-02-01 19:36:50

ఇన్చార్జి ఆర్డీడి సన్మానం కోసం డిస్పెన్సిరీలు మూసేసిన ఆయుష్ వైద్యులు

పరిపాలన చేసేవాళ్లు మనోళ్లైతే.. విధినిర్వహణ చేయాల్సిన సమయంలో సన్మానాలు.. సత్కారాలు.. బాకా కొట్టే వైద్యులతో చక్క భజనలు చేయించుకున్నా.. రోగులుకు మందులివ్వాల్సిన సమయంలో డిస్పెన్సిరీలు మూసేసినా ఏం పర్లేదు.. వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడినా ఎవరూ పట్టించుకోరు.. కావాల్సిందల్లా ఒక్కటే అనుకున్న సమాయానికి అందరు వైద్యుల సమక్షంలో ఘనంగా సన్మానం.. దానికి ఆయుష్ కమిషనర్ అనుమతి కూడా.. కట్ చేస్తే.. విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ  యునానీ డాక్టర్ అక్తర్ సుల్తాన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం, పనిలో పనిగా తానా తందానా చెప్పే ఆయుష్ వైద్యులతో జోన్-1 ఇన్చార్జి ఆర్డీడికి ఘనసత్కారం ఇదీ విశాఖలోని ఆయుష్ ఆర్డీడి నిర్వాకం..ఇన్చార్జి ఆర్డీడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కమిషనర్ పేరుతో చేసే ఘనకార్యాలపై ప్రశ్నించే వారే లేరు..?!

ఆయుష్ శాఖలో విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ తనకు నచ్చినట్టుగా.. ప్రభుత్వ నిబంధనలు తొక్కిపెట్టి.. నన్ను అడిగేవారు ఎవరున్నారు అంటూ  ఇష్టారాజ్యంగా ముందుకి సాగుతున్నారు. ఆర్డీడి చేసే అడ్డగోలు వ్యవహారాలకు ఏకంగా ఆయుష్ కమిషనర్ కమిషనర్ డి.మంజుల, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.క్రిష్ణబాబు పేర్లను కూడా ఎడా పెడా వాడేస్తున్నారు. విశాఖలో శుక్రవారం ఆయుష్ శాఖలోని యునానీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ రిటైర్ మెంట్ ఫంక్షన్ ని కూడా వైద్యులంతా డిస్పెన్సరీల్లో ఓపీ చూసే సమయంలో.. అదీ కూడా అధికారికంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరాన్ని తీసుకొని మరీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సన్మాన సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. అదీ కూడా కమిషనర్ తనకు అధికారికంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి జోన్ లోని 85 మంది మెడికల్ ఆఫీసర్లకు కబురు పెట్టించారు. 

అయితే సదరు ఆర్డీడిపై అనుమానం రావడంతో ఈ సన్మాన సత్కార కార్యక్రమానికి సుమారు 50 మంది వరకూ ఆయుష్ వైద్యులు, సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ కార్యక్రమాలు విధినిర్వహణ అయిపోయిన తరువాత సాయంత్రం 4.30 తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా అధిపతుల ఆధ్వర్యంలో చేపడతారు. కానీ ఆయుష్ శాఖలో తనదే రాజ్యమని ఇష్టమొచ్చినట్టుగా పరిపాలన చేస్తున్న ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయి వైద్యులందరినీ రిటైర్ మెంట్ ఫంక్షన్ కి రమ్మని పిలిచారు. ఇక్కడ విశేషం ఏంటంటే డా.అక్తర్ సుల్తానా రిటైర్ మెంట్ కార్యక్రమం వెంటనే అయిపోయింది. ఆ తరువాత ఇన్చార్జి ఆర్డీడికి చక్కభజనలు చేసే కొందరు వైద్యులు, విధులకు సక్రమంగా హాజరు కాని మరికొందరు వైద్యుల ఆధ్వర్యంలో  ఇన్చార్జి ఆర్డీకి సన్మాన, సత్కార కార్యక్రమం ఘనంగా.. మనస్పూర్తిగా పూబొకేలు, దుస్సాలువాలు, పొగడ్తలు పొగిడి మరీ  నిర్వహించారు. 

కష్టపడి డిస్పెన్సరీల్లో ఓపీలు మానేసి.. ఆసుపత్రులు మూసేసి వచ్చారేమో.. మధ్యాహ్నాం భోజనాలు కూడా సత్కారంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పాపం ఇన్చార్జి ఆర్డీడి కూడా కేజిహెచ్ లోని ఓపీ వదిలేసి మరీ వచ్చారంటే విధినిర్వహణలో ఎంతటి అంకిత భావంమో అర్ధం చేసుకోవచ్చు.. ఆపై సన్మానాలు.. సత్కారాలు అంటే ఇంకెంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనీ కూడా లేదు. ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించానికి ఒక్కో ఆయుష్ వైద్యుడు చందా రూ.2వేలన్నమాట. రిటైర్ అయిన వైద్యుడికి చిన్న కానుకైతే.. ఇన్చార్జి ఆర్డీడికి మాత్రం నచ్చిన కానుకలు కూడా ఇచ్చి.. తమ స్వామి భక్తిని చాటుకున్నారు కొందరు వైద్యులు. ఈ సన్మాన, సత్కార కార్యక్రమం మొత్తం ఆర్డీడీ సేవలను పొగడటానికే వైద్యులకు సమయం సాయంత్రం అయిపోయింది. మరి ఉదయం విధులకు  వెళ్లి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సు వేసిన వైద్యులు సాయంత్రం ఔట్ ఎఫ్ఆర్ఎస్ కూడా వేయాలి కదా అనే అనుమానం మీకు రావొచ్చు. దానికి కూడా వైద్యులకు ఇన్చార్జి ఆర్డీడి ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చారండోయ్... అదేమిటంటే వైద్యులతో రివ్యూ మీటింగ్ పెట్టినట్టుగా దానిని చిత్రీకరించారు. 

అలా వైద్యులు విధినిర్వహణ చేసే సమయంలో ఉమ్మడి మూడు జిల్లాల వైద్యులకు సమావేశం పెట్టాలన్నా ముందుగా కమిషనర్ అనుమతి కావాలి. కానీ ఎక్కడా ఇన్చార్జి ఆర్డీడి ఆనుమతి తీసుకోలేదు. పైగా ఈ విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే.. మీకు నచ్చింది రాసుకోండి.. అందులో ఎలాంటి అభ్యంతరమూ లేదు.. ఎందుకంటే మా ఆయుషన్  కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి నేను ఎంత చెబితే అంత.. వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో నాకు తెలుసునని బధులిచ్చారు. ఆ తరువాత ఈరోజు-ఈఎన్ఎస్ ఆయుష్ కమిషనర్ డి. మంజులను అనధికార సన్మాన, సత్కార వ్యవహారం విషయమై ప్రశ్నించగా..తనకు ఎలాంటి సమాచారం లేదని.. అయినా రిటైర్ మంట్ ఫంక్షన్లు విధినిర్వహణ సమయం పూర్తయిన తరువాత గానీ, సెలవు రోజుల్లో గానీ చేసుకోవాలి తప్పా.. డిస్పెన్సిరీలు మూసేసి.. అనధికార కార్యక్రమం చేపట్టడం నేరమని అన్నారు. 

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని చెప్పారు. అదే సమయంలో ఇన్చార్జి ఆర్డీడికి మీరు ఎంత చెబితే అంతా అని అంటున్నారని.. ఇది ఎంత వరకూ వాస్తవమని కూడా ప్రశ్నించగా.. తాము ప్రభుత్వానికి జవాబు దారులమని.. క్రింది స్థాయి అధికారులకు కాదని సమాధానమిచ్చారు. జోన్-1లో జరిగే అన్ని వ్యవహారాలపైనా విచారణ చేపట్టి.. వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఏది ఏమైనా ఒక గ్రూప్-1 స్థాయి అధికారి ఏకంగా అఖితభారత స్థాయి అధికారులు నేను ఎంత చెబితే అంత అని జోన్ లలో ఇష్టాను సారంగా వ్యవహరించడం ఆయుష్ శాఖలో చర్చనీయాంశం అవుతున్నది..!

visakhapatnam

2025-01-31 13:30:04

ఆర్డీడి పోస్టు మాత్రమే ఇష్టం.. డాక్టర్ విధులంటే చాలా కష్టం..?!

నాకు ఇచ్చార్జి ఆర్డీడి పోస్టు వచ్చేసింది.. నాకు అస్సలు ఖాళీ ఉండదు.. కేజిహెచ్ లో ఆయుర్వేద డిస్పెన్సరీ ఓపీ కూడా ఇన్చార్జి ఆర్డీడి అయినా కూడా నేనే చూడాలా.. అంతగా చూడాల్సి వస్తే కమిషనరేట్ లో నాకు తెలిసిన అధికారులను మేనేజ్ చేస్తాను.. ఇక్కడ అంతా నా ఇష్టప్రకారమే జరగాలి.. అవసరం అయితే ఓపీలో కాంపౌండర్ తో డిస్పెన్సరీ నడిపిస్తాను.. కానీ రెగ్యులర్ గా ఆర్డీడి పనులు మాత్రమే చేస్తాను.. ఆయుష్ కమిషనర్ కి నేను ఎంత చెబితే అంత... నా ఇష్టం వచ్చినట్టే జోన్-1లో ఆయుష్ డాక్టర్లు అంతా పనిచేయాలి.. లేదంటే అందరినీ కమిషనరేట్ కి సరెండర్ చేసేస్తాను.. ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. ఆయుష్ కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా వదిలేయడంతో విశాఖలోని ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి వైద్యాధికారులపై చేస్తున్న రుబాబు.. వైద్యాధికారుల ఫిర్యాదులను బుట్టదాఖల వుతుండటంతో ఆర్డీడి ఇష్టాను వ్యవహరిస్తున్న విషయం వైద్యఆరోగ్యశాఖలోని ఆయుష్ లో చర్చనీయాంశం అవుతున్నది.

కేజిహెచ్ లో ఆయుర్వేద డిస్పెన్సరీ ఓపీలో వైద్యులు లేక రోగులు నీరసంగా వెనుతిరుగుతున్నారు. రోగులు వెళ్లే సమయానికి అటెండరో..ఫార్మసిస్టో ఉంటే మాత్రం మందులు ఇస్తారు..వారూ లేకపోతే అక్కడ ఎవరినీ అడిగేందుకు కూడా ఎవరూ ఉండదరు. ఇక్కడి ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వహించాల్సి వుంది. అయితే ఆమెకు ప్రభుత్వం వైద్యాధికారితోపాటు గత కమిషనర్ ఈమెను ఇన్చార్జి ఆర్డీడిగా నియమిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు. దానితో ఆమె పూర్తిస్థాయి ఆర్డీడిగా అవతారం ఎత్తారు. పూర్తిగా డిస్పెన్సరీని గాలికి వదిలేస్తున్నారు. ఎవరైనా వచ్చి అడిగితే డాక్టర్ ఇప్పటి వరకూ ఉన్నారు.. మీరొచ్చే ముందే బయటకు వెళ్లారు అనే డైలాగును మాత్రం అక్కడి సిబ్బంది చెబుతున్నారు. 

కెజిహెచ్ ఓపీకి నిత్యం రావడానికి తెగ ఇబ్బందులు పడిపోతున్న ఆర్డీడి రెగ్యులర్ ఆర్డీడిలా మధురవాడలోని కార్యాలయానికి, మూడు జిల్లాల్లో డిస్పెన్సరీలకు మాత్రం రెగ్యులర్ గా వెళుతున్నారు. అదేమంటే ఇన్చార్జి ఆర్డీడిలు ఎక్కడైనా ఓపీ చూస్తారా.. అలా ఎక్కడైనా రూలుందా.. అయినా నాకు కమిషనరేట్ లో అందరూ తెలుసు.. మొన్నటి వరకూ అక్కడే చేసొచ్చాను. అందుకే నాకు ఇన్చార్జి ఆర్డీడి కూడా ఇచ్చారంటూ ప్రశ్నించినవారందరిపైనా ఒంటికాలపై లేస్తున్నారు. అంతేకాదు జోన్-1 పరిధిలోని ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు అందరినీ టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు వైద్యులు దైర్యం చేసి కమిషనర్ కి ఫిర్యాదులు చేసినా.. అక్కడ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. 

దానితో వైద్యాధికారులు ఫిర్యాదులేమీ కమిషనర్ వరకూ వెళ్లడం లేదుట. అలాగని విశాఖజిల్లాలోని జిల్లా కలెక్టర్ అయినా తెలుసా అంటే.. ఇన్చార్జి ఆర్డీడికి భయపడి ఎవరూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేయడం లేదు. వాస్తవానికి యునానీ, హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు రావాల్సిన ఆర్డీడి పదోన్నతి కాస్తా.. ఆయుర్వేద వైద్యాధికారికి దక్కింది. విశాఖలోని జోన్-1 మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లలోనూ ఆయుర్వేద వైద్యులకు ఇన్చార్జి ఆర్డీడి పోస్టులు దక్కాయి.  విశేషం ఏంటంటే  రోస్టర్ విధానం, ఈమెకంటే సీనియర్లుగా ఉన్న హోమియో, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ల  మాత్రం పదోన్నతి గానీ, ఇన్చార్జి పోస్టు గానీ రాలేదు. ఇన్చార్జి ఆర్డీడి పోస్టు వచ్చిందే తడవుగా ఆయుష్ సదరు అధికారి చేసే హడావిడి ఎక్కువ వైద్యసేవలు, పరిపాలన తక్కువ అన్నట్టుగా మారిపోయింది. 

సీనియర్ మెడికల్ ఆఫీసర్లను కూడా దూషిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మెడికల్ ఆఫీసర్లు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఉద్యోగ సంఘం ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన పోస్టుకి వైద్యాధికారులు సహకరించలేదనే నెపంతో కూడా పేరు పేరునా వైద్యాధికారులందరినీ బెదిరింపులకు గురిచేస్తూ.. కమిషనరేట్ కి సరెండర్ చేసేస్తానంటూ వేధిస్తున్నారి వైద్యాధికారులు వాపోతున్నారు. అంతేకాండా కమిషనరేట్ లోని ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా చేయని పనులకు కూడా తనకు అనుకూలంగా.. కాసులిచ్చి మీడియా పబ్లిసిటీ చేయించుకుంటూ.. తాను చాలా కష్టపడిపోతున్నానని.. ప్యాకేజీ వార్తలు రాయించుకుంటూ చలామణీ అయిపోతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.

 తాము ఎంత కష్టపడినా..డిస్పెన్సరీల్లో ఓపీలు చూస్తున్నా.. ఏదో ఒక కారణంతో దూషిస్తున్నారని వైద్యాధికారులు, క్రింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు-ఈఎన్ఎస్ కి కూడా పలువురు వైద్యులు, సిబ్బంది కూడా ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై సదరు ఆర్డీడిని సంప్రదించగా ఆమె అందుబాటులో లేరు. ఇన్చార్జి ఆర్డీడీ పోస్టు అడ్డంపెట్టుకొని.. రెగ్యులర్ గా చేయాల్సి కెజిహెచ్ లోని డ్యూటీ డాక్టర్ పోస్టు ఎందుకు చేయడంలేదని.. అవసరం లేని వ్యవహారాల్లోకి వెళుతూ, వైద్యాధికారులను వేధిస్తున్న ఆర్డీడిపై విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టిసారించి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం వుంది.

అదేవిధంగా రోస్టర్ విధానంలో పదోన్నతులు కల్పిస్తే.. అడ్డదారలో వచ్చిన ఆర్డీడి పోస్టు విషయంలో లంచాల వ్యవహారం కూడా బయటపడుతుందని వైద్యాధికారులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ఆయుష్ కమిషనర్, జోన్ వన్ లోని ( ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లు జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఏం చేస్తారనేది..?!

visakhapatnam

2025-01-06 18:49:22

వార్డు సచివాలయాలకు స్టేషనరీ నిధులు..! ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై జివిఎంసీ కమిషనర్ స్పందన

మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తన వార్డు అడ్మిన్ ఆర్డిక కష్టాలను తీర్చే విషయంలో ఉదారతను చాటు కున్నారు.. ఇప్పటి వరకూ జోనల్ కమిషనర్లు పట్టించుకోకుండా వదిలేసిన స్టేషనరీ బిల్లులు చెల్లించడానికి ముందుకి వచ్చారు. వార్డు అడ్మి న్ల స్టేషనరీ ఆర్దిక కష్టాలపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనితో వాస్తవ పరిస్థితి తెలుసుకున్న జివిఎంసీ కమిష నర్ వచ్చే తక్కువ జీతాలతో వార్డు కార్యదర్శిలు మోస్తున్న స్టేషనరీ భారాన్ని తగ్గించేందుకు నెలకు రూ.1000 స్టేషనరీకి ఇచ్చేందుకు చర్యలు చే పట్టారు. దానిపై జివిఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయాలకు వర్తించేలా  ఒక సర్క్యులర్ ను జారీ చేశారు..! 

విశాఖతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ లలో వార్డు అడ్మిన్లు సచివాలయాల్లో వార్మడు అడ్మిన్ లు వారి సొంత ఖర్చులు పెట్టి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నా.. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. పైగా ఆమాత్రం ప్రజల కోసం ఖర్చుచేయలేరా అన్నట్టుగా వ్యవహరించేవారు. ప్రభుత్వం ఆదేశించిన పనులను సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక విధులు అప్పగించి పని పూర్తయ్యేవరకూ అదిరించి, బెదిరించి, కనీసం ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను కూడా ఇవ్వకుండా పనులు చేయించే కమిషనర్లు, జోనల్ కమిషనర్లు వీరి ఆర్ధిక ఇబ్బందులను పక్కన పెట్టేసేవారు. ఆఖరికి వార్డుల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయకపోయినా.. సిబ్బందే వారి సొంత ఖర్చులు పెట్టుకొని బాగుచేయించుకుని వాడే పరిస్థితి. 

ఆ కారణంగా ప్రభుత్వం సేవలు అందించడంలో చాలా ఆలస్యం అయ్యేది. ఆ విషయాలను అధికారులకు తెలియజేస్తే.. చూద్దాం.. చేద్దాం అంటూ కాలం నెట్టుకుంటూ వచ్చారు తప్పితే.. సిబ్బంది ఇబ్బందులను జోనల్ కమిషనర్లు, కమిషనర్లు, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్లలేదు. కానీ విశాఖపట్నంలోని జివిఎంసి కమిషనర్ డా.సంపత్ కుమార్ మాత్రం ఒక్క అడుగు ముందుకి వేసి ప్రభుత్వ సేవలకు వార్డు అడ్మిన్ సొంత ఖర్చులు చేయించడం బావ్యం కాదని.. వారికి కనీస ఖర్చులు ఇవ్వాలని వారికి నెలకి రూ.1000 అందించడానికి చర్యలు చేపట్టారు.  ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాలు, ఇబ్బందులను ప్రత్యేక కథనాల రూపంలో అందిస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్.. వీరి పరిస్థితిని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు.

 విశాఖజివిఎంసీ కమిషనర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ఇపుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది.  తమ కష్టాలు అధికారుల దృష్టికి ప్రత్యేక కథనాలుగా తీసుకెళుతున్నందుకు గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులు ఈరోజు-ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. వాస్తవానికి మహా విశాఖ నగరపాలక సంస్థకు డాక్టర్ పి.సంపత్ కుమార్ కమిషనర్ గా వచ్చిన దగ్గర నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. క్లీన్ విశాఖ-గ్రీన్ విశాఖ కార్యక్రమం దగ్గర నుంచి ఉద్యోగుల సంక్షేమం కూడా చూడటంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జివిఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయ కార్యదర్శిలకు కాస్త ఉపసమనం కలగనుంది. అయితే ఇప్పటి వరకూ చేసిన ఖర్చులతోపాటు, పాడైన కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా రిపేర్లు చేయించి, పౌర సేవలకు అవాంతరాలు లేకుండా చూడాలని వార్డు అడ్మిన్లు కోరుతున్నారు. చూడాలి ఈ విషయమై జివిఎంసీ కమిషనర్ ఏ తరహా చర్యలు తీసుకుంటారోననేది..?!

visakhapatnam

2024-12-20 16:00:51

విశాఖ ఏపీటీడీసీలో దొంగలు పడ్డారు..?!

విశాఖలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ లో దొంగలు పడి మొత్తం ప్రభుత్వ రికార్డులతో సహా.. పాత ఏసీలు, ఫర్నిచర్, భవనాలు తొల గించగా వచ్చిన సామాగ్రి మొత్తం దోచుకుపోయారు.. పోయింది ప్రభుత్వ ఆస్తి కదాని అధికారులు కూడా లైట్ తీసుకున్నారు.. విశేషం ఏంటం టే.. పోయిన సామాగ్రితోపాటు వాటి వివరాలు రాసిన రికార్డులను కూడా దొంగలించుకుపోయారట బహుసా పోయింది ఎంతో తెలయ కూడద నో ఏంటో... ఆ విషయమై విశాఖజిల్లాలోని ఏపీటీడీసీ అధికారులు గానీ, రాష్ట్రంలోని ఏపీటీడీసీ ఎండీ కానీ, జిల్లా కలెక్టర్ కానీ అస్సలు నోరు మెదపడం లేదు. కాకపోతే ప్రస్తుతం హరిత రిసార్ట్స్ ను అభివృద్జి చేస్తున్న విషయంలో అధనంగా పెరిగినట్టు చూపించాల నుకున్న ఖర్చుని మాత్రం ఏ విధంగా కాంట్రాక్టర్ కి ఇప్పించాలనే కోణంలో మాత్రం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు అధికారులు. ఒక ప్రక్కనెలకి లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం పోతున్నా.. రుషికొండ,అప్పుఘర్ ప్రాంతంలో పాత భవనాలు తొలగించేసమయంలో వేరుచేసిన సామాగ్రి పోయినా.. ఏ ఒక్క అధికారీ కనీసం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు.. !

ఏపీ పర్యాటక కార్పోరేషన్ భవనాలను రెన్నోవేషన్(మార్పులు, చేర్పులు) చేస్తున్న సమయంలో ఇక్కడ హోటళ్లలో  మంచాలు, బీరువాలు, కుర్చీలు, బెంచీలు, ఏసీలు, పరుపులు, భవనాలు తొలగించగా వచ్చిన తలుపులు, ఇతర శానిటరీ సామాన్లు మొత్తం దొంగలు పడి దోచుకు పోయారట. పాపం.. పోయింది ప్రభుత్వ సొమ్మే కదాని అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని.. తాను చార్జ్ తీసుకున్న సమయంలో జరగలేదని ప్రస్తుత ఆర్డీ కూడా నాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరి స్తున్నారట. ఏపీటీడీసీలో దొంగలు పడి దోచుకుపోయిన పాత ఏసీలు, ఇతర సామాగ్రి విలువ సుమారు రూ.4.50 కోట్ల వరకూ వుంటుందని అంచనా. 

గత ప్రభుత్వం విశాఖలోని అప్పుఘర్, రుషికొండ ప్రాంతాల్లోని హోటళ్లను తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినపుడే ఇక్కడి సామాన్లన్నీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేసేశారట. అలా చెబితే తమపైకి వస్తుందని.. భారీ వస్తు సామాగ్రితోపాటు, ఆ వివరాలు రాసిన రికార్డులు కూడా దొంగలెత్తుకెల్లిపోయారని.. పోయిన వాటిపై పోలీసులకు ఫిర్యాదు ఇస్తే మాత్రం వెనక్కి వస్తాయాని రాష్ట్ర కార్యాలయ అధికారులు, జిల్లా కార్య లయ అధికారులు లైట్ తీసుకొని ఎవరికీ చెప్పడం మానేశారట. కాకపోతే ప్రభుత్వ సొమ్ము పైసా అయినా లెక్కలు ప్రభుత్వానికి చెప్పాలి కనీ సం ఆ విషయంలో కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 

ఎంతసేపూ.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భనాలు పూర్తికాలేదని మాత్రమే తెరమీదకు తీసుకు వస్తున్న ఏపీటీడీసీ రాష్ట్ర కార్యాలయ అధికా రులు.. అసలు మరమ్మతులకు ముందు ఏ హోటల్ లో ఏ సామాగ్రి ఉంది.. వాటిని తొలగించి ఏంచేశారు.. గంపగుత్తగా టెండర్లు వేసి ఆ సొమ్ముని ప్రభుత్వానికి అప్పగించారా..? లేదంటే ఇక్కడ పనిచేసే అధికారులే వాటిని సొంత అవసారాలకు వాడుకున్నారా..? అదీ కాదంటే అవేమీ పనిచేయవని.. వట్టి స్క్రాప్ మాత్రమేనని పనిచేసిన వారికి ఉచితంగా ఇచ్చేశారా అనే విషయాలు కూడా బయటకు రానీయ కుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వ ఆస్తి అయితే దొంగలెత్తుకుపోయినా.. ఆ పేరుతో అధికారులే తీసేసుకున్నా.. లేదంటే వారికి వెన్ను ద న్నుగా ఉండే అధికారుల ఇళ్లకు బాగు చేయించి పంపినా లెక్కలోనికి రావనేది తేలిపోయింది. కోట్లాది రూపాయలతో ప్రస్తుతం ఏపీటూరిజం కార్పోరేషన్ వారి భవనాలను, హోటళ్లను మార్పులు చేర్పులు చేస్తున్నది. 

దీనితో దొరికిందే తడవుగా ఇక్కడ సామాగ్రి మొత్తం ఎవరు మడత పెట్టాశారో గట్టిగానే పెట్టేశారు. ఇంత జరిగినా ఏపీటూరిజం కార్పోరేషన్ ఎండీ, డైనమిక్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సైతం ఈ విషయంపై విచారణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇక్కడ మాయమై పోయిన వస్తువులు ఏమయ్యాయో కనీసం జిల్లా కలెక్టర్ కి కూడా తెలియలేదంటే ఇక్కడ పనిచేసిన అధికారులు వాటిని ఏంచేశారనేది తేలాల్సి ఉంది. నిజంగా అవి ఉంటే ఎక్కడున్నాయి..? అన్నీ ఉన్నాయా..? కొన్ని మాయమయ్యాయా అనేది ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాల్సి వుంది. లేదా..పోయిన కోట్లాది రూపాయల ఆస్తులపై పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి.. ఈ రెండూ నేటివరకూ చేయ లేదంటే తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. చూడాలి ఎండీ ఆమ్రపాలీ ఏం చేస్తారనేది..?!

visakhapatnam

2024-12-11 18:35:59

మెప్మాలో బోగస్‌ రుణాలు మడతెట్టారు..?!

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటుచేసిన మెప్మా ఇప్పుడు అవినీతిపరులకు ఆదాయ వనరుగా మారింది. కంచె చేను మేసిందన్న చందంగా  విధులు నిర్వహహించాల్సిన సిబ్బంది  అక్రమాలకు తెరతీశారు. ధర్మవరం  పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల పేరుతో జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.   లేని పొదుపు సంఘాలను ఉన్నట్లుగా చిత్రీకరించి మాయచేసేస్తున్నారు. ఆన్‌లైన్‌లో గ్రూపులు కనిపించకుండా మొత్తంగా బోగస్‌ రుణాలతో భారీగా దోచేశారు. నకిలీ గ్రూపులతో బ్యాంకును  బురిడీ కొట్టించి రూ. అర కోటి  మేర రుణాలు దోచుకున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. అదే సమయంలో రుణాలు బొక్కేసిన సిబ్బంది తప్పులు కప్పిపుచ్చు కునేందుకు దారులు వెతుకుతున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని, బ్యాంకులకు తామే సొమ్ము చెల్లిస్తామని బ్యాంకు మేనేజర్ ,  పొదుపు మహిళల చుట్టూ తిరుగుతున్నారు. 

-మెప్మా లక్ష్యం 
పట్టణంలోని పేద మధ్యతరగతి మహిళల స్వయం ఉపాధి  ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇస్తుంటారు ఇందులో బ్యాంక్ లింకేజీ లోన్లు అన్ని సంఘాలకు ఇస్తారు వాయిదాల చెల్లింపులు మెరుగైన రికార్డు ఉన్న కొన్ని సంఘాలను గుర్తించి వారికి శ్రీనిధి రుణాలు అందిస్తుంటారు ఏ రుణం తీసుకోవాలన్న సంఘ సభ్యులు సామూహిక తీర్మానం తప్పనిసరి సభ్యుల ప్రతిపాదన ఆర్పీలు, సిఆర్పిలు నివేదిస్తారు.  రుణం కావలసిన సంఘం సభ్యులతో సిఆర్పిలు సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకుంటారు అనంతరం బ్యాంకులకు అందజేస్తారు మొత్తంగా రుణాల మంజూరులో మెప్మా సిఆర్పి, ఆర్పి, బ్యాంక్ అధికారుల పాత్ర కీలకము ఉంటుంది.అయితే ఈ బాగోతం మెప్మా జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేయడం అనుమానాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారంలో వారికీ వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

-బయటపడిందిలా..
బోగస్‌ రుణాలు తీసుకున్న కొన్ని గ్రూపులు సభ్యులను రుణాలు తీసుకున్నట్లు సమాచారం అందడంతో ఒక్కసారిగా హులిక్కి పడ్డారు  . సభ్యులు తీసుకున్న రుణం కంటే మూడింతలు రుణం తీసుకున్నట్లు సదరు బ్యాంకు నుండి ఎస్. ఏం. ఎస్ రావడంతో  ఒకింత ఆందోళనకు గురైన కొందరు సభ్యులు బ్యాంకు మేనజర్ కలిశారు .  మేము తీసుకున్నది సొమ్ము ఒకటే అయితే మాకు ఎస్. ఏం. ఎస్ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నట్లు వచ్చిందని తెలిపారు . దీంతో అప్రమత్తమైన బ్యాంకు మేనజర్ మెప్మా సిబ్బందితో విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి ఈ వ్యవహారంలో మెప్మా అధికారులు మౌనందాల్చగా, కొందరు బ్యాంకు సిబ్బంది సుమారు 5 సంఘాల లీడర్లను  పిలిపించి  సొమ్ము రికవరీ చేసే పనిలో పడ్డారు . ఒక సంఘం సభ్యులు తీసుకున మొత్తం సొమ్ము చెల్లించినట్టు సమాచారం. ఇంకా 4 సంఘాలు సుమారు రూ. 60 లక్షలు చెల్లించాల్సి ఉంది . 

-వాస్తవాలు వెలికితీస్తే మరిన్ని బోగస్‌ రుణాలు..!
మెప్మాలోని కొందరు సిబ్బంది  ఈ రుణ మోసంలో సూత్రధారులుగా వ్యవహరించినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం అమాయక పొదుపు మహిళలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అయితే పొదుపు మహిళల పేరుతో నకిలీ గ్రూపులు సృష్టించి లక్షల రూపాయల నిధులు కాజేసిన వైనంపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి బోగస్‌ రుణాలకు కళ్లెం వేసినట్లు అవుతుందని, అలాగే వారిపై చర్య లు తీసుకుని నగదు రికవరీ చేయాలని పలువురు పొదుపు మహిళలు కోరుతున్నారు.

-గోప్యంగా మెప్మా పిడి విచారణ..?
ధర్మవరం  పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల పేరుతో జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారంపై మెప్మా పిడి విజయలక్ష్మి విచారణలో భాగంగా బుధవారం  మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో గోప్యంగా సమావేశం నిర్వహించారు . పలువురు  పాత్రికేయులు అక్కడికి చేరుకు న్న విషయం తెలిసిన పిడి హుటాహుటిన సమావేశం అర్ధాంతరంగా ముగించి అక్కడ నుండి వెళ్ళి పోయారు.  ఇంత జరుగుతున్నా మెప్మా అధికారులు మాత్రం నోరు మెదకపోవడం పలు  అనుమానాలకు  తావిస్తోంది. ఈరోజు-ఈఎన్ఎస్ ఈ విషయమై విచారణ కోరేందుకు ప్రయ త్నించినా మెప్మా అధికారులు స్పదించకపోవడం విశేషం.

ananthapuram

2024-12-04 18:34:13

కూటమి పాలనలో గత ప్రభుత్వ శేషం..?!

ఆంధ్రప్రదేశ్ లో పరిపాన చేస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా..? అలా అయితే సీఎం చంద్రబాబు మార్కు ఎక్కడ..? సుపరిపాలన ఏది..? ప్రజలకు సేవకు సేవచేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత వరకూ అమలవుతున్నాయి.. నాలుగు నెలలకే ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేక ఎందుకు వచ్చింది.. కాదు కాదు వచ్చేలా ఎవరు చేస్తున్నారు.. ఆ రకమైన పాత పరిపాలననే మళ్లీ ఎందుకు చేపడుతున్నారు..? అసలు కూటమి పరిపాలనలో చంద్రబాబు మార్కు కనిపించకపోవడానికి పరిపాలనలో కోవర్టులుగా వ్యవహరిస్తున్నది ఎవరు..? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆదేశాలు ఎందుకు అమలు కావడంలేదు..? 

విశాఖ ఏపీటీసీడిసీలో కోట్ల రూపాయల అవినీతి ఆధారాలతో సహా బయట పడితే దీని వెనుక ఉన్న గత ప్రభుత్వంలోని   ఆ బుజ్జి కన్న ఐఏఎస్ ని ఎందుకు గుర్తించలేదు.. ఇంకా ఆయన ఆధ్వర్యంలో నడిచే గ్రూప్-1 అధికారులు ఎందుకు తమ ఇష్టాను సారం వహిస్తున్నారు..? ఇది ఒక్క ఏపీటీడీసీలోనే కాదు.. మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోనే పరిస్థితి అలానే ఉంది..ఇదేదో మేము చెబుతున్న మాట కాదు కూటమి ప్రభుత్వానికి కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కొందరు ఐఏఎస్ లు, గ్రూప్-1 అధికారలు, ఏపీటీడీసీ లోని కొందరు అధికారులు తెరవెన చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే కారణమంటూ ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది..!

అవును మీరు చదువుతున్నది నిజమే కూటమి ప్రభుత్వంపై అతి కొద్ది నెలల్లోనే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి ఇంకా పరిపాలనలో గత ప్రభుత్వ శేషం మిగిలిపోవడమే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు. అంతేకాదు బల్లగుద్ది మరీ వాదిస్తున్నాయి. వారి వాదనకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి ప్రభుత్వం పరిపాలన అంశాలు కూడా. అసలు సీఎం చంద్రబాబు పరిపాలన అంటే ఒక విజన్, ఒక టెక్నాలజీ, ఒక సంపద, ఒక ముందు చూపు ఇవన్నీ ఉంటాయని ప్రభుత్వ అధికాకులు సిబ్బంది అనుకోవడం మానేస్తున్నట్టుగానే ఉంది. దానికి ఉదాహరణలుగా చాలా అంశాలనే ఉద్యోగులు అధికారులు నిర్భయంగా సామాజిక మాద్యమాల్లో చర్చకు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతులు, కొత్తగా నియమాకాలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరజైషన్, ప్రభుత్వశాఖల్లో దినసరి కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బంది నియామకం.

 ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఆదాయం పెంచుకునే మార్గాలు చూపించడం ఇవన్నీ సీఎం చంద్రబాబు పరిపాలనలో ఐఏఎస్ అధికారుల నుంచి గ్రూప్-1 అధికారులు ఆ క్రింది మినిస్టీరియల్ స్టాఫ్ వరకూ చూశారు. అయితే గత ప్రభుత్వంలో చాలా మంది ఐఏఎస్, గ్రూప్-1 అధికారులు, కార్పోరేషన్ లో పనిచేసే ఎండీలు, సిఈఓలు, డైరెక్టర్లు,  కాంట్రాక్టర్లు, బినామీల అవతారం ఎత్తారు. ప్రైవేటు సంస్థల తెరవెనుక ఉండా చాలా గట్టిగానే సంపాదించారట. అదే విధానాలు ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని.. అసలెక్కడా చంద్రబాబు మార్కు పరిపాలన కనిపించడం లేదని ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నట్టు చెబుతున్న ఉద్యోగులు.. మరికొందరు ప్రజాప్రతినిధులు..

మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు.. ఆయన ముందుచూపు పరిపాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడైతే దేశంలోనే ఆంధ్రప్రదశ్ నెంబర్-1 గా అవుతుందని అంతా భావించారు. వీళ్లు నిజంగా కన్నెర్ర చేస్తే మొత్తం పరిపాలనే గాడిన పడిపోతుందని అనుకున్నారు కూడా. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పోలీసు శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేయడం, రాష్ట్రంలో అత్యాచారాలు భారీగా పెరిగిపోవడం, నింధితులకు సరైన శిక్షలు పడకపోవడం కూడా చంద్రబాబు పరిపాలనపై ప్రభావం చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అంతేకాకుండా ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, అందునా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతగానో ఆనందించారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరాగానే ఒక శాఖ పని కాకుండా అన్ని శాఖల పనులు సచివాలయ ఉద్యోగులతో చేయించడం,

 రెండవ శనివారం, ఆదివారాల్లోనూ ఉద్యోగులను విధులకు రమ్మని చెప్పడం, పనిచేస్తున్నా మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేస్తామని ఉద్యోగులని బెదిరించడం వంటి అంశాలు కూడా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయట. అంతేకాదు ఇటీవలన జరిగిన బదిలీల్లో కూడా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి కాకుండా గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నవారికి ఆయాశాఖల్లో అధికారులు బదిలీలు అనుకున్న చోటుకి చేశారనే ప్రచారం భారీగా జరిగింది. కడుపు చింపుకుంటే కాళ్లపై పడుతుందని ఈ విషయాన్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు బయటకు చెప్పకపోయినా..వారి నుంచి సిఫారసు లేఖలు తీసుకొని అవి ప్రభుత్వశాఖల్లో చిత్తుకాగితాల్లా పక్కకి వెళ్లిపోవడంతో ఉద్యోగుల వారి సామాజిక మాద్యమాల్లో ఇదే అంశాలన్ని ప్రస్తావించుకోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. 

అంతేకాకుండా ఐఏఎస్ లకి ప్రభుత్వశాఖల కేటాయింపులు, గ్రూప్-1 అధికారులను ఏళ్లకు ఏళ్లు ఒకే చోట ఉంచేయడం, అవినీతి, తేడా వ్యవహారాలు బయటపడిన ఏపీటీడీసీ లాంటి కార్పోరేషన్లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికే పెద్ద హోదాలు కట్టబెట్టడం కూడా ఇపుడు హాట్ టాపిక్ అవుతున్నది. దీనితో కావాలనే కొందరు ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పరిపాలన చేస్తున్నారని.. పనికొచ్చే సర్వేలు, ఉద్యోగులను వేళా పాలా లేకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ ఫీల్డులోనే ఉంచే కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. ఈ సర్వేల కంటే ఒక్కో సచివాలయంలో పది మంది సిబ్బంది ఉన్నందుకు వారందరికీ కంప్యూటర్లు కేటాయించి, అన్ని రకాల సర్వీసులు సచివాలయాల నుంచి జరిగేలా ఆదేశిస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు. 

అన్ని సర్వీసులు ఒకే చోట లభించడంతో ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందుతారని.. అలాకాకుండా సర్వేలు, జియో ట్యాగింగ్లు పేరిట ఇళ్లకు వెళుతుంటే అక్కడ సిబ్బందికి ఎదురయ్యే ఇబ్బందులు, చీత్కారాలతో ప్రభుత్వాన్ని, పరిపాలించే వారిని ఉద్యోగులు తిట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులవద్దే సిబ్బంది చెబుతున్నారు.  విశాఖలో గత ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ.. రుషి కొండ ప్యాలస్ నిర్మించిన ఏపీటీడీసీ అధారులు ఇపుడు అదే స్థాయిలో హరిత మరమ్మత్తుల్లో పెద్ద ఎత్తున అవినీతి చేపడుతున్నా.. దీనిపై సాక్షాత్తూ టూరిజంశాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్ లు ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్రప్రభుత్వం ఇంకా ఈశాఖలో లాంగ్ స్టాండింగ్ కార్పోరేషన్ అధికారులపై చర్యలు తీసుకోకవడంపై మంత్రి కూడా గుర్రుగానే ఉన్నారట. ఇలా ఏ ప్రభుత్వశాఖలో చూసినా సీఎం చంద్రబాబు పారిపాలన కంటే గత ప్రభుత్వ శేషమే అధికంగా కేనిపిస్తుందంటూ.. అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రజా పరిపాలన.. గత ప్రభుత్వ శేషాన్ని తొలగించి అందిస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి..?!

visakhapatnam

2024-11-23 20:24:39

కలెక్టర్ సారూ హరిత యాత్రీ నివాస్ ను పరిశీలించరూ..?

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అంచనాలకు మించి నాణ్యతాలోపంగా జరుగుతున్న హరిత యాత్రీ నివాస్ పనులపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పరిశీలన చేస్తే చాలా విషయాలు వెగులు చూసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇక్క డ రూ.8 కోట్లతో మరమ్మతులు, గదుల్లో ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్లు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కేటా యించిన రూ.8 కోట్లతో ప్రస్తుత యాత్రీ నివాస్ ఉన్న చోట ఆ బవంతిని మొత్తం కూల్చివేసి కొత్తదే నిర్మించవచ్చు. కానీ ప్రభుత్వంలో నిబం ధనలను సొమ్ము చేసుకోవడానికి ఏపీటీడీసి రాష్ట్ర అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై చేస్తున్న పనులపై కనీసం జిల్లా కలెక్టర్ పరిశీలన లేకపోవ డం, అక్కడ జరుగుతున్న పనుల నాణ్యత తెలుసుకోకపోవడం, కాంట్రాక్టర్ ఎందుకు అదనంగా మరో రూ.5 కోట్లు పెంచాలని ఏపీటీడీసీకి లేఖ రాయడం.. దానిని ప్రస్తుతం ఇన్చార్జి ఆర్డీగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ ఇఇ కూడా ఆమోదించి పంపడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. గ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.

 ఫలితంగా ప్రభుత్వానికి ఇప్పటి వరకూ సుమారు రూ.10కోట్లు నష్టం ఏర్పడింది. ప్రస్తుతం పర్యాటకులు అధికంగా వచ్చే సీజన్ కావడంతో ఈ సీజన్ నాటికి కూడా యాత్రీ నివాస్ పూర్తికాకపోవడంపై పంపకాల్లో తేడాలొచ్చాయని సమాచారం అందుతుంది. టెండరు ప్రకారం రూ.8 కోట్లు కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నా.. జిల్లా కార్యాలయం నుంచి రష్ట్ర కార్యాలయం వరకూ కమిషన్లు ఇచ్చిన కారణంగానే ప్రభుత్వ టెండరు కంటే అధికంగా మళ్లీ ప్రభుత్వానికి నివేధించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖలోని అప్పుఘర్ హరిత యాత్రీ నివాస్ లో జరుగుతున్న మరమ్మతు పనులపై విజిలెన్స్ విచారణ చేసినా.. థర్డ్ పార్టీ విచారణ చేపట్టినా ఇక్కడ లోప భూఇష్టంగా జరుగుతున్న పనులు వెలుగు చూసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం  ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్డీ ఈ విషయమై ఇప్పటి వరకూ రాష్ట్ర కార్యాలయానికి గానీ, జిల్లా కలెక్టర్ కి గానీ జరుగుతున్న పనులపై నివేదికలు ఇచ్చినట్టు కనిపించలేదని తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్లు సైతం ఇక్కడ రూ.8 కోట్లతో జరుగుతున్న పనులను చూసి నివ్వెర పోయారు. 

అంతేకాదు.. అదనంగా  మరో రూ.5 కోట్లు కి ఖర్చుపెంచాలని చేసిన ప్రతిపాదనలపైనా కన్నెర్ర చేశారు. ఇంత జరిగినా... ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా అడ్డగోలుగా ఈ విషయం బయటకు రాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్డీ శ్రీనివాస్ పాణిని తిరిగి మాతృశాఖకు పంపేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా నుంచి మరోఅధికారి జిల్లా మేనేజర్ గా రాత్రికి రాత్రే నియమించేశారు. వాస్తవానికి ఇక్కడున్న టూరిజం అధికారులకు ఆర్డీ, లేదా జిల్లా మేనేజర్ ఇన్చార్జి అప్పగిస్తే అసలు ఒకే వ్యక్తికి రూ.40 కోట్లు టెండర్లు ఎలా ఇచ్చారు. ఏం పనులు చేశారు.. నాణ్యత ఎంత..? ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వచ్చింది.. తదితర అంశాలన్నీ లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి అందే అవకాశముంది. 

అవన్నీ బయటకు రాకుండా చేయడానికే టూరిజం శాఖ అధికారులకి, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కాకుండా బయట శాఖల అధికారులను ఇన్చార్జిలుగా నియమించి ఇక్కడ జరుగుతున్న అంశాలన్నీ గంపకింద కప్పెట్టాయని ఏపీటీడీసీ అధికారులు చూస్తున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా ప్రభుత్వానికి తెలియాలంటే ఏపీటీడీసీలో జరుతుగున్న పనులపై జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలన చేసినా... థర్డ్ పార్టీ నిర్మాణ సంస్థలతో లెక్కలు కట్టించినా ఇక్కడి అధికారులు తేడా పనుల వ్యవహారాలన్ని వెలుగు చూసే అవకాశం ఉంది..? మరి జిల్లా కలెక్టర్ వాటిని నిగ్గు తేలుస్తారా.. డిల్లీ సరుకు అసలు రేటు బయట పెడతారా..?!

visakhapatnam

2024-11-20 15:09:37

ఏపీటీడీసీలో ఆర్డీ పోస్టు కోసం కలెక్టర్ ని అవమానించారు..!

ఏపీటీడీసీ అధికారులు విశాఖజిల్లా కలెక్టర్ ని ఘోరంగా అవమానించారు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. సొంతశాఖ అధికారులను కాదని పొరుశాఖ ఇరిగేషన్ లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి ఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఒక జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ ఐఏఎస్ అధికారిని కాదని.. ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్టే అప్పగించి.. కార్పోరేషన్ లో తేడా వ్యవహారాలు ఎక్కడ బయటపడిపోతాయోనని ఆర్ఢర్ నే మార్చేశారు.. అదనపు బిల్లులు ప్రభుత్వానికి లెక్కలు చూపించి బురిడీలను చేయడానికి పక్కా మాష్టర్ ప్లాన్ వేసుకున్నారు..ఇదేకాదు అడ్డగోలుగా వచ్చిన ఒడిసా కాంట్రాక్ట గడువు ముగిసినా.. మళ్లీ వాళ్లకే మెయింటినెన్స్ కాంట్రాక్టు ఇచ్చేలా పథకం కూడా వేశారు.. విశాఖలో ఏపీటీడీసీ ఆర్డీ పోస్టు కోసం ఉన్నఅధికారులను కాదని ఎందుకు క్కశాఖ అధికారులను ఇన్చార్జిలుగా తేవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే పరిపాలనా సౌలభ్యం కోసం తమకి నచ్చిన వాళ్లే నియమిస్తామని.. ఆ విషయంలో జిల్లా కలెక్టర్ అయినా ప్రక్కన పెట్టేస్తామని బీరాలు పోతున్నారు ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు. ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం తెచ్చి ప్రైవేటుకి మెయింటినెన్స్ కాంట్రాక్టు అంత రెండింతలు కట్టబెట్టడానికి ఇదే శాఖలో మాజీ ఎండీ అనుచరగణమే అంతా ఓపక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టు కనిస్తున్నది. కూటమి ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్లే ఈ విషయంలో చేతులెత్తేశారంటే ఏ స్థాయి లాభియింగ్ జరుగుతోంది అర్ధం చేసుకోవచ్చుననే ఆరోపణలున్నాయి.. ఏపీటీడీసీలో అడ్డగోలు వ్యవహారాలపై ఈరోజు-ఈఎన్ఎస్ క్షేత్రస్థాయి పరిశోధన అంశాలు హరికథలు పార్ట్-4గా అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లక్షలు కాదు.. రూ.కోట్లలో నష్టం వచ్చినా పర్లేదు.. అది మన సొమ్ముకాదు.. దానికి పరిపాలనరమైన కారణాలు చూపించవచ్చు..  కానీ మనకి మాత్రం విశాఖజిల్లాలో జరిగే అధికారిక వ్యవహారాల్లో అనుకున్నంత టార్గెట్ మొత్తం పూర్తికావాలి. దానికోసం మనవాళ్లే అక్కడుండాలి.. అలా కాకపోతే అక్కడ ఏం జరిగినా అధికారికంగా అవాంతరాలు, అదనపు ఖర్చులు, మెయింటినెన్సు కాంట్రాక్టు విషయంలో ఎదురువుతాయని ముందుగా ఊహించిన ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు పర్యాటకశాఖకు సంబంధం లేని ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జి ఆర్డీగా నియమించారు. వాస్తవానికి ఇదేశాఖలో ఆర్డీ క్యాడర్ స్తాయి అధికారులు ఉన్నా వారికి ఇన్చార్జిలు ఇవ్వకుండా..జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు రాష్ట్ర ఏపీటీడీసీ అధికారులు. 

ఇక్కడ గతంలో ఇన్చార్జి ఆర్డీగా పనిచేసిన శ్రీనివాసరావు సమయంలో భారీఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. దానితో ఆయనను మాతృశాఖ గణాంక విభాగానికి పంపించేశారు. మళ్లీ ఆ పోస్టులోకి తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి ఈఈ రమణను ఇన్చార్జి ఆర్డీగా ఏపీటీడీసీ నియమించింది. ఈఈ క్యాడర్ కి ఆర్డీ క్యాడర్ కి చాలా వ్యత్యాసం ఉంది. అలాంటి వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ పోస్టు ఎవరికీ కేటాయించకుండా దానిని జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంచుతారు. లేదా కలెక్టర్ కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఇక్కడే ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. జిల్లా కలెక్టర్ ను కాదని.. తమ ఆర్డర్లు మాత్రమే కలెక్టర్ అమలు చేయాలనే హుకుం జారీచేస్తూ.. ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జి ఆర్డీగా బాధ్యతలు అప్పగించింది.

ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జిగా నియమించడం వెనుక రెండు ప్రధాన లాభదాయ వ్యవహారాలు దాగి ఉన్నాయి. స్వతహాగా ఇంజనీర్ అయిన అధికారిని నియమిస్తే.. ఇప్పటికే మరమ్మతు పనులను దగ్గరుండి చేయించవచ్చు. అదే సమయంలో సాంకేతికపరంగా ప్రభుత్వం నుంచి పొందిన టెండర్లు కంటే అధనంగా బిల్లులు పెట్టడానికి కూడా అవకాశం వుంటుంది. మరోవైపు విశాఖలోని బ్లూఫ్లాగ్ బీచ్ మెయింటినెన్స్ వ్యవహారంలో రూ.5లక్షలతో పోయే పనికి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీనెలా రూ.10 లక్షలు ఇచ్చేయొచ్చు. వాస్తవానికి ఇక్కడ కాంట్రాక్టు గత నెలతోనే ముగిసిపోయింది. అలా ముగిసిపోయిన కాంట్రాక్టు స్థానంలో టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్ ను ప్రభుత్వం నియమించాలి. లేదా ప్రభుత్వానికి నష్టం వస్తుందని దానిని సంస్థ ఆధ్వర్యంలోనే నడిపించాలి. 

ఇక్కడే ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు చాలా చక్యంగా వ్యవహరించారు. విశాఖలో ఉన్న ఇన్చార్జి ఆర్డీని వెనక్కి పంపేశారు గనుక.. మళ్లీ ఆ స్థానంలో మరొక అధికారికి ఇన్చార్జి ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కైనా అప్పగించాలి. అలా ఇన్చార్జి ఇవ్వాలంటే అదేశాఖలోని అధికారులకు ఇవ్వాలి.. అలా ఇస్తే.. ఇప్పటి వరకూ జరగని పనులకు బిల్లులు చెల్లించిన ఏపీటీడీసీకి లెక్కలు చూపించాలి. అదే తమకు అనుకూలంగా ఉన్న అధికారిని నియమిస్తే.. నెల నెలా మెయింటినెన్స్ కాంట్రాక్టు గడుపు పెంచుకుంటూ పోవచ్చు. దానిని దృష్టిలో పెట్టుకునే ఏపీటీడీసీకి ఎలాంటి సంబంధం లేని ఇరిగేషన్ ఈఈకి ఆర్డీగా బాధ్యతలు అప్పగించి కలెక్టర్ ను కాదని ఆర్డర్ ఇచ్చేశారు. ఇలా ఆర్డర్ వేయడంతో మాజీ ఎండీ కోటరీ అధికారులే ఈ రకంగా వ్యవహరించారనే చెబుతున్నారు. 

ఒడిసా కాంట్రాక్టర్ కి మెయింటినెన్స్ కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా రూ.5లక్షలు లాసు.. అటు రిసార్ట్ ల మర్మత్తు పనుల వలన మరో రూ.8 కోట్లు లాసు. ఈ వ్యవహారాలన్నింటికీ రికార్డులు చూపించాలంటే రాష్ట్ర కార్యాలయ అధికారులు చెప్పినట్టు చేసే వారే విశాఖలో ఆర్డీగా ఉండాలి. ఇపుడు అదే చేసి కథ నడిపిస్తున్నారు ఏపీటీడీసీ అధికారులు.ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ లో కోట్లాది రూపాయల నష్టం వస్తున్న విషయమై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్ర కార్యాలయ అధికారులు లైట్ తీసుకున్నారు. కార్పోరేషన్ చైర్మన్ బాలజీ తేడా పనులు, అధనపు బిల్లలు విషయమై నివేదికలు, బిల్లులు కావాలని అడిగినా, విచారణ చేయమని ఆదేశించినా.. జరిపిన విచారణ నివేదిక ఎక్కడుందో రాష్ట్ర అధికారులు చెప్పడం లేదు. 

అలాగని జిల్లాకి ముఖ్య, ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయంలో వాస్తవ నివేదిక రాష్ట్రప్రభుత్వానికి పంపలేదు. కానీ ఇన్చార్జి వచ్చిన ఇరిగేషన్ ఈఈ ఆర్డీ క్యాడర్ లో తనకంటే క్యాడర్ ఎక్కువైన అధికారులపై కూడా జులం ప్రదర్శిస్తున్నారట. దీనిని జీర్ణించుకోలేని అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టే దిశగా సమాలోచనలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. కాగా జిల్లా కలెక్టర్ ని, ఇదే శాఖలోని అధికారులను కాదని నన్నే ఇక్కడి తననిఎందుకు పంపారో మీకు అర్ధం కావడం లేదన్నట్టుగా సదరు అధికారి వ్యవహరిస్తున్నతీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్లు తెరవెనుక ఉన్నారని.. తేడా పనులను ప్రశ్నిస్తున్నవారికి వార్నింగ్ హింట్ కూడా ఇస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొట్టి బినామీల పేరుతో మెయింటినెన్స్ కాంట్రాక్టు పనులు, టెండర్ కంటే అత్యధికంగా మరో రూ.5కోట్లు కావాలని బిల్లు పెట్టి చేపడుతున్న వ్యవహారాలపై నిగ్గు తేల్చే విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకనో కినుక వ్యవహిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఈ మొత్తం వ్యహారంలో రాష్ట్ర కార్యాలయంలో మహిళా అధికారిణి చక్రం తిప్పుతున్నట్టు చెతున్నారు. ఈ తేడా వ్యవహారంలో తమ ఆదేశాలు అమలు కాలేదని చేతులెత్తేసినట్టుగా ఇదేశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం రూ.8 కోట్ల నష్టం, మరమ్మతులలో అదనపు ఖర్చుల విషయంలో నేటికీ ఎంక్వైరీ కమిషన్ వేయకపోవడం చూస్తే ఏం జరుగుతుందో  మేం వేరేగా చెప్పాలా..? కానీ చెబుతాం హరికధలు పార్ట్-5 లో బీచ్ మెయింటినెన్స్ లెక్కలు.. వాటి వెను ప్రభుత్వానికి బొక్క పడి కనిపించిన చుక్కల విషయం..?!

visakhapatnam

2024-11-16 16:40:20

ఏపీటీడీసీలో ఒడిసా ఇల్లరికరపు అల్లుడు..!

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ లో ఇల్లరికపు అల్లుడిని రాష్ట్ర ప్రభుత్వం ముప్పుద్దులా పందెంకోడిలా పెంచి పోషిస్తున్నది.. నెల నెలా ఖర్చులకి రూ.5 లక్షలు సరిపోవని మరో రూ.5లక్షలు కలిపి రూ.10లక్షలు లెక్కగట్టి మరీ ఇస్తున్నది.. పనీపాట లేకపోయినా అప్పనగంగా డబ్బులు వచ్చి పడుతున్నాయేయో..బీచ్ నిర్వహణలో దగ్గరుండి చేయించడం మానేసి ప్రభుత్వం ఇచ్చే కాసులతో కదల్లేక.. మెదల్లేక కూర్చుండి పోతున్నాడా ఇల్లిరకపు అల్లుడు.. ఫలితంగా విశాఖలో సర్వాంగం సుందరంగా ప్రభుత్వ అదీనంలో నడిచే బీచ్ లన్నీ ఇపుడు.. చెత్త కంపు కొడుతున్నాయి.. వచ్చే ఆ కొద్దో గొప్పో పర్యాటకులు కనీసం మెయింటినెన్సులు లేని బీచ్ ను చూసి డోక్కుంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.. అసలు ఈరోజు-ఈఎన్ఎస్ మీడియా వారికి పనీపాటా లేదా..?ఇల్లరికపు అల్లుడేంటి..? ఏపీటీడీసీ మెయింటినెన్సు కోసం అప్పనంగా తినడం ఏంటనే కదా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం..  వైఎస్సార్సీపీ హయాంలో ఏపీటీడీసీకి ఇల్లరికానికి వచ్చిన ఒడిస్సాకి చెందిన మెయింటెన్సు కాంట్రాక్టర్ విశాఖలోని బీచ్ ని బ్రష్టు పట్టించాడు.. పేరుకి మెయింటినెన్సు కాంట్రాక్టర్ అయినా ఖర్చులన్నీ ఏపీటీడీసీతోనే పెట్టిస్తున్నాడు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడు. అయినా ఇల్లరికానికి వచ్చిన అల్లుడిని ఎలా చూస్తారో.. అంతకు పది రెట్లు ఏపీటీడీసీ ఈ మెయింటినెన్సు కాంట్రాక్టర్ ని పెంచిపోషిస్తున్నది. ఈ తేడా మెయింటినెన్సు వ్యవహారానికి సంబంధించిన అంశాలను గ్రౌండ్ లెవల్ రిపోర్టు పార్టు-3 గా అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ ఐఏఎస్ అధికారి తన బినామీతో పనులు చేయించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి రాష్ట్రప్రభుత్వం ప్రతీనెలా రూ.5లక్షలతో పోయే పనికి రూ.10లక్షలు చెల్లించాల్సి వస్తున్నది అదీ ఎలాంటి మెయింటినెన్సు చేయకుండానే. అదేంటి మెయింటినెన్సు చేయకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారని మీకు అనుమానం రావొచ్చు. ఆ అధికారి తనకు అనుకూలంగా రాష్ట్ర కార్యాలయం నుంచి విశాఖజిల్లా వరకూ ఓ కోటరీని నిర్మించుకున్నాడు. దీనితో ఆయన చెప్పింది వేదం.. చేయమన్నది బిల్లు.. ఎంత దారుణం అంటే.. ప్రైవేటు కాంట్రాక్టర్ తీసుకున్న మెయింటినెన్స్ కాంట్రాక్టర్ టెర్మ్ అయిపోయినా.. ఇంకా సదరు సంస్థకు ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నారంటే ఆ ఐఏఎస్ అధికారి, తన కోటరీ అధికారులు ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడిచే సమయంలో ఆదాయంతోపాటు చాలా చక్కగా వుండే బీచ్ లన్నీ ఒడిసా కాంట్రాక్టర్ కి మెయింటినెన్సుకి ఇచ్చిన తరువాత బీచ్ లన్నీ చెత్త చెత్తగా తయారయ్యాయి. ఈ విషయాన్నీ మీడియా కోడై కూసినా.. పర్యావరణ ప్రేమికులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా.. ప్రభుత్వం ఈ తేడా పనులపై కనీసం విచారణ కూడా చేపట్టలేదంటే విశాఖ జిల్లా నుంచి అమరావతి వరకూ ఏ స్థాయిలో ఆ అధికారి కాసులతో లాబీయింగ్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.విశాఖజిల్లాలో పనులన్నీ చేయడానికి హరేరామ్ అనే ఉద్యోగి ఉండి కదమొత్తం నడిపించేవాడని చెబుతారు. ఈయనకి తోడుగా ఏపీటీడీసీ సంబంధం లేని అధికారికి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చి ఆయనతో కలిసి కథమొత్తం నడిపించేవారు. దానితో జిల్లా కలెక్టర్ కలుగ చేసుకోవడంతో ఇన్చార్జిగా వచ్చిన ఆర్డీ క్యాడర్ అధికారి శ్రీనివాస్ ని మాతృశాఖకు పంపించేశారు. ఒడిసా కాంట్రాక్టర్ గడువు పూర్తయిపోవడంతో ముందుగానే ఇక్కడ జాయింట్ మేనేజర్ గా పనిచేసిన హరేరామ్ కూడా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోయారు.

కానీ కాంట్రాక్టు గడువు పూర్తయినా.. మళ్లీ టెండర్లు పిలిచి వర్క్ మెయింటినెన్స్ ఇవ్వాల్సిన ఏపీటీడీసీలోని రాష్ట్ర అధికారులు ఒడిసాకి చెందిన కాంట్రాక్టర్ నే పెంచి పోషిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ఉద్యోగులు మెయింటినెన్సులు చేసినపుడే బీచ్ లన్నీ ఎంతో ఆహ్లాద కరంగా ఉండేవి. ఒడిసా సంస్ష చేతిలోకి వెళ్లాక మొత్తం బీచ్ లన్నీ వాటి స్వరూపాన్నే కోల్పోయాయి. పర్యాటకులు వచ్చినా కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకుండా చేసి బీచ్ లన్నింటిని సర్వనాశం చేసేశారు. గడువు దాటిపోయినా.. మళ్లీ ఈయనకే ఇప్పుడిచ్చే రూ.10 లక్షలకు మరో 5 లక్షలు కలిపి రూ.15 లక్షలతో మెయింటినెన్స్ కాంట్రాక్ట అప్పగిం చడానికి(ఖర్చులు పెరిగాయని చెప్పి)ఏపీడీసీలో ఆ ఐఏఎస్ అధికారి అనుచర వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బ్లాఫ్లాగ్ లెసెన్స్ రెవిన్యువల్ సమయంలో కూడా ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిచింది.

లాబర్ నిబంధనలు ప్రక్కనపెట్టి ఉద్యోగులకు కనీసం పీఎఫ్ లు కూడా కట్టకుండా నెల నెలా టంచనుగా రూ.10 లక్షలు బిల్లులు లాగించేస్తున్నారంటే ఈ అధికార బృందానికి ఏపీటీడీసీలో ఎంతమంది సహకరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ధనం కాంట్రాక్టర్ జేబులోకి.. కమిషన్లు ఆ ఐఏఎస్ అధికారివర్గానికి.. నిందలు, పనిష్మింట్లు పనిచేస్తున్నా సిబ్బందికీ దక్కుతున్నాయి. పర్యాటకం ముసుగులో భారీ ఎత్తున జరుతున్న ఈ అవినీతి వ్యవహారంపై పర్యాటక శాఖ మంత్రి కన్నెర్ర 
ప్రయోజనం లేకుండా పోయింది.. కార్పోరేషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆదేశాలు బుట్ట దాఖలయ్యాయి. ఇపుడు మిగిలింది విశాఖ జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగడమే.. ఇప్పటికైనా ఆ ఐఏఎస్ అధికారికి బినామీగా ఉన్న మెయింటెన్స్ కాంట్రాక్టర్ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించినా.. లేదా జిల్లా కలెక్టర్ చొరవ చూపినా ఆశక్తి కర అంశాలు వెలుగులోకి వస్తాయి.

చూడాలి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా..? లేదంటే మీడియాని కాసుల కమిషన్లతో నోరు మూయించినట్టుగా  విశాఖ జిల్లా కలెక్టర్ ను కూడా దారి మళ్లిస్తారా అనేది.. ఏపీటీడీసీ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఎందుకు ప్రైవేటుకి ఇవ్వాల్సి వచ్చింది.. తరువాత ఇదే శాఖలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆ ఐఏఎస్ అధికారి అనుచరగణం ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి అడ్డగోలుగా మొత్తం మడత పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసిందనే విషయాలు..ఏపీటీడీసీ చెప్పే హరికథలు పార్ట్-4లో గ్రౌండ్ లెవల్ రిపోర్టుతో మీ ముందుకి తీసుకు రాబోతున్నాం..?!

visakhapatnam

2024-11-15 16:54:44

మనోడనే రూ.40కోట్ల కాంట్రాక్టులు ఆయనకే ఇచ్చేశారు..?!

వడ్డించేవాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరంతా నిండుతుందన్నట్టు.. కోట్లాది రూపాయల సివిల్ వర్క్స్ లో  వాటాలు అడ్డంగా బొక్కాలనుకున్నా మనోడనే ముద్ర వేసి, నిబంధనలు ప్రక్కన పెట్టి అన్ని కాంట్రాక్టులు ఒకరికే ఇచ్చేయొచ్చు.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఏపీటిడిసి)లో కూడా అదే జరిగింది. రాష్ట్ర కార్యాలయంలో ఓ ముఖ్య అధికారి తన బినామీగా ఒక వ్యక్తిని కాంట్రాక్టర్ గా తెరమీదకు తీసుకు వచ్చి అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. సివిల్ పనులు మాత్రమే కాంట్రాక్టర్ కి అప్పగించి.. ఇతర కమర్సియల్ కొనుగోళ్లు మొత్తం అన్నీ ఢిల్లీ కేంద్రంగా చేపట్టి ఆ అధికారే అంతా దగ్గరుండి చూసుకుంటున్నాడంటే ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో బురిడీ కొట్టించాడో అర్ధం చేసుకోవచ్చు. ఒకరికే కాంట్రాక్టు పనులు అప్పగిస్తే.. ఖర్చులు పెరిగాయని కాంట్రాక్టర్ తో ఆర్ధిక భారమని చెప్పించి కూడా అదనపు ఎస్టిమేషన్లుతో వర్క్ ఆర్డర్ లేకుండా అదనపు నిధులు కొల్లగొట్టవచ్చునని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇపుడు దానిని అమలు చేయడానికి టెండర్ దక్కించుకున్న రేటు కంటే అదనపు ఎస్టిమేషన్లు వేసి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న వైనం ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నది. ఏపీటిడిసిలో మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని కొల్లగొడుతూ హరికథలు చెబుతున్న వ్యవహారంపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు దారావాహికం పార్ట్-2 ద్వారా అంది స్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీ టూరిజం కార్పోరేషన్(ఏపీటిడిసి) కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది.. కాదు కాదు ఇదేశాఖలో పనిచేసిన ఒక ముఖ్య అధికారికి బినామీగా ఉన్న కాంట్రాక్టర్ ద్వారా అడ్డదారిలో ఆదాయం వస్తున్నది. ప్రజా ధనం కొల్లగొట్టి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. ప్రభుత్వ నిబంధనలను ప్రక్కన పెట్టి టార్గెట్ పెట్టుకున్న మొత్తం ప్రభుత్వం నుంచి రాబట్టడానికి అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు ఏపీటిడిసిలోని అధికారులు. స్వయంగా పర్యాటకశాఖ మంత్రే ఈ తేడా కాంట్రాక్టు పనులపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. కార్పోరేషన్ చైర్మన్ వాస్తవాలు బయటకు తీస్తామని హెచ్చరించినా.. అవేమీ ఏపీటీడిసిలోని అధికారులను ఏమీ చేయలేకపోతున్నాయి. పైగా బినామీగా పెట్టిన కాంట్రాక్టర్ కే ఏకంగా రూ.40 కోట్ల పనులు అప్పగించి మరీ పనులను సా..గదీస్తున్నారు. 

ఈ క్రమంలో పర్యాటకుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే సుమారు రూ.10కోట్ల ఆదాయం పోయినా.. ప్రభుత్వాన్ని నమ్మించ గలుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలైన ఈ తేడా పనుల బాగోతం బయటకు రాకుండా మీడియాకి కూడా లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చారని సమాచారం అందుతుంది. లేకపోతే కోట్లాది రూపాయాల టెండర్ పనులను అడ్డగోలుగా పెంచేసి మరో ఐదుకోట్లు ప్రభుత్వం నుంచి లాగేయలని చూస్తున్నా.. ఏ ఒక్కరూ ఈ విషయంలో కన్నెత్తి కూడా చూడటం లేదు.. అలా చూడకుండా చేసినందుకు అయిన ఖర్చు మీడియా వాటాగా రూ.25 లక్షలకు పైగా ఖర్చుచేశారట. ఒక్క మీడియాకే రూ. 25 లక్షలు ఖర్చు చేస్తే.. ఇందులో తేడా వ్యవహారాలను వెనుకేసుకు వచ్చే అధికారులకు ఏ స్థాయిలో వాటాలు ముట్టిఉంటాయో వేరేగా చెప్పాల్సిన పనిలేదు.

ఏపీటిడిసిలో విశాఖలోని హరిత యాత్రీ నివాస్ అప్పుఘర్, హరిత హిల్ రిసార్ట్ అనంతగిరి, హరిత వ్యాలీ రిసార్ట్ అరకు, హరిత హిల్ రిసార్ట్ మయూరిలలో మరమ్మతు పనులకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కు రూ.40కోట్ల పనులు అప్పగించేశారు అధికారులు. ఇందులో కేవలం సివిల్ పనులు మాత్రమే కాంట్రాక్టర్ ఆ ముఖ్య అధికారికి బినామీగా ఉన్న కాంట్రాక్టర్ చేపడుతుండగా.. హోటల్స్ లో కొనుగోలు చేసే పరుపులు, ఇతర ఫర్నిచర్, టివిలు అన్నీ ఢిల్లీలోని ఓ కంపెనీతో సంబంధం పెట్టుకొని.. అన్నీ అధిక ధరలకు కోట్ చేయించారట. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ పూర్తయితే తప్పా ఏ వస్తువుకి ఎంత రేటు పెట్టి కొన్నారన్న విషయం బయటకు రాదు. ఈ పనులన్నీ ఇదేశాఖలోని అధికారులను పెట్టి చేయిస్తే వాస్తవాలు బయటకి వచ్చేస్తాయని గుర్తించిన ఆ రాష్ట్ర అధికారి ఇరిగేషన్ లో పనిచేస్తున్న ఈఈని ఏపీటీడిసికి అధికారిగా డిప్యూటేషన్ పై తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. ఈయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వ టెండర్ల ఖర్చుకంటే అధనంగా ఖర్చులు అయ్యాయని చెప్పి ఎక్సట్రా ఎస్టిమేషన్లు వర్క్ ఆర్డర్ లేకుండా పంపి మరీ ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొడుతున్నారు కాంట్రాక్టర్లు.. ఇంత జరుగుతున్నా.. విశాఖజిల్లా, అల్లూరి జిల్లా 
కలెక్టర్లు ఈ తేడా పనులపై కన్నెత్తి చూడటం లేదు.

ఉమ్మడి విశాఖజిల్లాలో ఏపీటిడిసి హోటళ్లు మరమ్మతులు చేపట్టే సమయంలోనే ఇక్కడ పనులను సా..దీసి చేపట్టినందుకు నగరంలోని కొన్ని ప్రైవేటు హోటళ్ల నుంచి ముడుపులు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఏపీటిడిసి వసతి లేకపోతే పర్యాటకులు ప్రైవేటు హోటళ్లను ఆశ్రయిస్తారు. అలా ప్రైవేటు హోటళ్లలో ఆతిథ్యం పొందినవారు మళ్లీ ఏపీటిడిసి హోటళ్లకు రావాలంటే అది కల. అత్యంత తక్కువ మొత్తంలోనే దొరికే ఏపీటిడిసి రిసార్ట్ లు హోటళ్ల లో ఆతిథ్యాన్ని ప్రైవేటు హోటళ్లకు మరమ్మతుల ముసుగులో దారిమళ్లించడానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు తీసుకున్నారట. ఈ నేపథ్యంలో ఏపీటీడిసికి రావాల్సిన సుమారు రూ.10కోట్లు ప్రైవేటు హోటళ్లు కొట్టేశాయి. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న ఒక్క అప్పుఘర్ హరిత యాత్రీ నివాస్ ద్వారానే నెలకి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.80లక్షలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది. తద్వారా ప్రభుత్వం నష్టాన్ని భరించి.. ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తున్నది. 

ఏపీటిడిసి హోటళ్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడానికే మరమ్మతులు చేపట్టి.. దాని ద్వారా కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టడానికే ఆ రాష్ట్ర అధికారి మాస్టర్ ప్లాన్ వేశారని చెబుతున్నారు. వర్క్ ఆర్డర్, టెండర్ లేకుండా అదనపు ఎస్టిమేషన్లు పంపిన విషయంలోనూ నిధులు రాబడుతున్న విషయంలో విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఏపీటిడిసీలో అక్రమాలను తన బినామీ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తున్న ఆ రాష్ట్ర అధికారి బాగోతాలను వరుస కథనాల రూపంలో ఈరోజు-ఈఎన్ఎస్ బయట పెట్టడానికి తన నెట్వర్క్ ను విశాఖపట్నం నుంచి అమరావతి వరకూ యాక్టివేట్ చేసింది. ఈ అక్రమాలు బయట పడకుండా ఉండేందుకు ఏ మీడియాకి ఎంతెంత ఖర్చు చేశారు ఎవరి ద్వారా  ఆ వివరాలను కూడా రానున్న కథనాల్లోబయట పెట్టనున్నాం. అంతేకాకుండా ఏపీటీడిసిలోని అధికారులను ప్రక్కనపెట్టి ఇతర శాఖల నుంచి అధికారులను ఇక్కడికి తీసుకొచ్చిన విషయంలో ఎవరు కీలక పాత్రపోషించారో కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేపడితే బయటకు వచ్చే అవకాశాలున్నాయి..!

visakhapatnam

2024-11-14 15:11:49