2018 బ్యాచ్ ప్రొబేషనర్ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమి స్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నార పురెడ్డి మౌర్య - సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం),పృధ్వీ తేజ్ ఇమ్మడి - సబ్ కలెక్టర్ కడప (కడప),ప్రతిష్ఠ మాంగైన్ - సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ),హిమాన్షూ కౌశిక్ - సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి),అమిలినేని భార్గవ్ తేజ - సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం),విధే ఖారే - సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం) ( పార్వతీపురం ఐటిడిఎ పిఓ గా అదనపు బాధ్యతలు),శ్రీవాస్ అజయ్ కుమార్ - సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు),అనుపమ అంజలి - సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి),సూరజ్ ధనుంజయ్ - సబ్ కలెక్టర్ టెక్కలి (శ్రీకాకుళం),మేదిడ జాహ్నవి - సబ్ కలెక్టర్ మదనపల్లి (చిత్తూరు), కల్పన కుమారి - సబ్ కలెక్టర్ నంద్యాల (కర్నూల్), కేతన గార్గ్ - సబ్ కలెక్టర్ రాజంపేట (కడప) ఉన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసు పత్రిలో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టరు అధికారు లను ఆదేశించారు. గురువారం ఆయన విన్స్ ఆసుపత్రిని సంద ర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్, ఇతర అధికారులు, వైద్యులతో ఆయన సమావేశ మయ్యారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వాటిని మెరుగుప రచడం గూర్చి ఆయన సమీక్షించారు. రానున్న కాలంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశమున్నందున, ముందు జాగ్రత్తగా అందుకు అవసరమైన వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేస్తున్న సేవలు వసతులను మరింత మెరుగు పరచుకోవాలి అన్నారు. ఆసుపత్రిలో గల వసతులను, సేవలను పూర్తి స్థాయిలో వినియో గించుకొనుటకు గాను అవసరమైన సిబ్బందిని నియమిం చుకోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి బెడ్డుకు ఆక్సిజన్ అందే విధంగా పరికరాలను అమర్చాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంటు ఆరోగ్య పరిస్థితిని వెంటనే పరీక్షించి, అందించవలసిన చికిత్సను నిర్దారించాలన్నారు. ఈ సమావేశంలో విమ్స్ డైరెక్టరు సత్యవరప్రసాదు, ప్రత్యేక ఉప కలక్టరు సూర్యకళ, జిల్లా ఆరోగ్య శాఖాధికారి డా.తిరుపతిరావు, డా. చలం, డా. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆయన పేరు నాని...పేరుకు తగ్గట్టుగానే అందరినీ నావాళ్లు అను కుంటాడు... అంతేకాదు కరోనా కష్టకాలంలో నా అనుకునేవా రంద రికీ తనవంతుగా నిత్యవసర సరుకులు అందజేస్తూ అందరితోనూ నాని నా అనే మనవాడిగా సాయమందిస్తూ నాలుగువేళ్లు నోట్లోకి వెళ్లేలా చేస్తున్నాడంటూ మన్ననలు పౌందుతున్నాడు. వివరాలు తెలుసుకుంటే విశాఖ సీతంపేట ప్రాంతానికి చెందిన నాని విద్యుత్ సంస్థలో లైన్ మేన్ గా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి పంజా విసరడంతో చాలామందికి కాయకష్టం చేసుకోవడానికి సైతం పని లేకపోవడంతో...గత నాలుగు నెలలుగా నాని ప్రతినిత్యం 20మం ది వరకూ నిత్యవసర సరుకులు అందిస్తూ వస్తున్నారు. గురువా రం నాని పుట్టినరోజు కావడంతో కొత్తబట్టలు, మిఠాయిలు కొనే డబ్బులతో 30 మంది కుటుంబాలకి నిత్యవసర సరుకులు కొని దానం చేశారు. ఇది చూసిన కుటుంబ సభ్యులు మరో 15 మందికి నిత్యవసర సరుకులు దానం చేశారు. కరోనా సమయంలో తమకు తోచిన సహాయం చేస్తూ నలుగురికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో ఈసేవ చేస్తున్నట్టు నాని చెబుతున్నారు. తనతోపా టువతన స్నేహితులు కూడా తాను చేసే సేవకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. వీటితోపాటు చర్చిలోకూడా తమ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు నాని వివరించారు. కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్న యమయంలో నాని నిశ్వార్ధంగా చేస్తున్న సేవ అందరి ప్రశంసలను అందుకుంటోంది.
విశాఖ మన్యంలోని వనసంరక్షణ సమితి భూములకు అటవీ హ క్కుప త్రాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సి పల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. మంగళవారం చింత పల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వనసం రక్షణ సమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి పేదరికాన్ని నిర్ములిం చాలని సూచించారు. సిరిపురం గ్రామం నుంచి కొండపైకి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తోటలు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. వి ఎస్ ఎస్ లలో సాగుచేసిన కాఫీ తోటలకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. అటవీ భూములు, వి ఎస్ ఎస్ లలో సాగుచేసి మరణించిన వారి వారసులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని స్పష్టంచేశారు. సిరిపురం గ్రామంలో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పట్టాలు సిద్ధం చేసారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన రైతులకు సిల్వర్ మొక్కలు, కాఫీ మొక్కలు సరఫరా చేయాలని చెప్పారు. కాఫీ తోటలు ,మిరియాలసాగు పై వస్తున్న పంట దిగుబడి, ఆదాయాన్ని, రైతులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి పంచాయతి కందులగాది వి ఎస్ ఎస్ తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,
గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల, పిసిసి ఎఫ్ ప్రతీప్ కుమార్, విశాఖపట్నం సి ఎఫ్ పి.రామ్మోహనరావు, ఏ పి సిసి ఎఫ్ ప్రత్యేకాధికారి ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఏ కె ఝా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతున్న నేపద్యంలో జిల్లా యంత్రాంగానికి అండగా ఉండి కోవిడ్ రోగులకు సేవలు అందించేందుకు విశ్రాంత వైద్యులు ముందుకు వస్తున్నారు. రేడియాలజిస్ట్ అయిన రిటైర్డ్ వైద్యులు డాక్టర్ బి.గోవిందరాజులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ను కలిసి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయనను అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.మ్.ఏ) కోఆర్డినేటర్ అయిన డాక్టర్ గోవిందరాజులు జిల్లా యంత్రాంగానికి సమన్వయ కర్తగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో జిల్లా యంత్రాంగానికి సహాయం గా ఉండి కరోనా బాధితులకు సేవలు అందించేందుకు డాక్టర్ల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తన ప్రేరణతో మరింత మంది విశ్రాంత వైద్యులు కోవిడ్ సేవలకు వస్తారని ఆయన అభిలషించారు. ఆయన వెంట ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ కె.ఫణి కుమార్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ కలెక్టర్ ను కలిశారు.
జారీ ఉపసంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నాడు ఆయన నగరం లోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రి విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సందర్శించి డాక్టర్ల తో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాధి నివారణకు రూ. వేయి కోట్లు ఖర్చు చేయడానికి సిధ్ధం గా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత ఉందని, అందుకే పెద్ద ఎత్తున నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ మనోస్థైర్యం దెబ్బతినకుండా అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి పై సమాచారం తెలియడంలేదని వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారని, దీన్ని నివారించడానికి రోగి వివరాలతో బాటు, వారి బంధువుల ఫోన్ నెంబర్ లను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్య వరప్రసాద్, డిఎంహెచ్ఓ తిరుపతి రావు , ఇతర అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.
రైతాంగానికి యూరియా కొరత రానీయబోమని ఉప ముఖ్య మం త్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాస కృష్ణదాస్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతానికి 10,800 టన్నుల యూరియా నిల్వలు అందు బాటులో ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి ఆయన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలసి సోమవారం ఉదయం టెలీకాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలో ఎరువుల నిల్వల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు జిల్లాకు యూరియా నిల్వలు రప్పిస్తున్నట్లు ఆ శాఖ జెడి కె.శ్రీధర్ తెలిపారు. నాలుగు మండలాలను ఒక యూనిట్ గా విభజించి 200 మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయా చోట్ల అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆయా స్లాట్ అలాట్మెంట్ లను వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లాలో ఆగష్టు నెల నాటికి 18000 టన్నుల యూరియా అవసరం ఉందని, ప్రస్తుతానికి 11698 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో మూడు వేల టన్నులు ప్రైవేటు ట్రేడర్స్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ 10 వేల టన్నులే కాకుండా ఈ నెలాఖరుకు మరో 18 వేల టన్నులు అవసరం ఉంటుందని, అవి సరైన సమయంలోనే జిల్లాకు వస్తాయని ఈ మేరకు తమ శాఖ కమిషనర్ నుంచి స్పష్టమైన హామీ లభించిందన్నారు. యూరియా తో పాటు డిఎపి 6400 టన్నులు, ఎంవోపి 2133 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3488 టన్నులు, ఎస్ ఎస్ పి 1659 టన్నుల నిల్వలు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. సీజన్ ఇప్పుడిప్పుడే వేగవంత మవుతున్నదని, రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే ఈ ఏడాది నుంచి యూరియా అమ్మకాలు సాగిస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల 50 బస్తాలకు మించి బుక్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇకపై రైతు భరోసా కేంద్రాలు, హబ్ ల ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని జాయింట్ డైరెక్టర్ వివరించారు. రెండు మూడు రోజులకు ఒకమారు జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు వస్తాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కువ మొత్తంలో యూరియాను వేయడం ద్వారా పంటకు కలిగే నష్టాలను వివరించాలని వాటి వాడకాన్ని నియంత్రించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్మెంట్లో మొత్తం మూడు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. మృతుల్లో నలుగురు హెచ్ఎస్ఎల్ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారని పేర్కొన్నారు. క్రేన్ కుప్పకూలిన సమయంలో కేబిన్‌లో 10 మంది ఉన్నారని తెలిపారు. కేబిన్‌లో ఉన్న పదిమందితోపాటు మరొకరు మృతి చెందారని వివరించారు. మృతుల్లో 10మంది వివరాలను గుర్తించామని, మరొక మృతుడి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్ఎస్ఎల్ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్ఎస్ఎల్ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందినట్టు సమాచారంం. లోకో షెడ్ లో పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా క్రేన్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే6 వ్యక్తులు మృతి చెందగా తర్వాత తీవ్ర గాయాలతో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ మృతి పట్ల ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి ఉదయం సిబ్బంది క్రేన్ ఎక్కి పనులు చేపడుతుండగా ఒక్కసారిగా క్రేన్ తిరగబడినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల వైఎస్సార్సీపి ఆంధ్రాయూ నివర్శిటీ విద్యార్థి విభాగం నాయకులు బి.కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల విశాఖకు మరిన్ని అంతర్జాతీయ విద్యాసంస్థలు రావడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖ ఏర్పాటు అయిన దగ్గర్నుంచి ఉత్తరాంధ్ర ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెంద డంతో పాటు ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందు తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అందరు మేలు, అన్ని ప్రాంతాల సర్వతోమొఖాభివృద్ధి కోరి సీఎం వైయస్ జగన్ తీసుకునే నిర్ణయానికి తమ వంతు మద్దతు పూర్తిస్థాయిలో ప్రకటిస్తున్నామని కాంతారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ. వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారిని గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రివర్యులకు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం, దేవాలయం పర్యాటకంలో భాగంగా కేంద్ర నిధులనుండి రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా సింహాచలం శ్రీ.వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53.00 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహలాద్ సింగ్ పటేల్ గారికి, కేంద్ర మంత్రి గారికి, ముఖ్య మంత్రివర్యులు శ్రీ.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు విజయ్ సాయి రెడ్డి గారికి విశాఖపట్నం ప్రజల తరుపున మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు కృతఙ్ఞతలు తెలియజేశారు. అనంతరం, అభివృద్ధి పనులపై కేటాయించిన నిధులను ఏఏ సౌకర్యాలు కల్పించాలనే దానిపై సింహాచలం ఈ.ఓ గారితో, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం వారితో మరియు టూరిజం శాఖ ఇంజనీరింగ్ విభాగం వారితో చర్చించారు..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దయతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచి అదే పార్టీ ని ప్రభుత్వాన్ని విమర్శించటం రఘు రామ కృష్ణ రాజు కు తగదని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు అన్నారు. బుధవారం ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, వైస్సార్ పార్టీ గుర్తు పై ప్రజాస్వామ్య బద్దంగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టిన రఘు రామ కృష్ణ రాజు ఇప్పుడు కొంతమంది స్వార్ధ పూరిత రాజకీయ నాయకుల డైరెక్షన్ లో ప్రజాస్వామ్యా విలువలకు తీట్లు పొడుస్తూ పొంతన లేని మాటలతో పార్టీ ని , ప్రభుత్వాన్ని విమర్శించటం తగదని అన్నారు. ఎక్కడో ఢిల్లీ లో కూర్చొని ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విమర్శిస్తూ పక్క రాష్ట్రలతో మన రాష్ట్రం ను పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటినుంచి ఉన్న స్తానం నుండి ఉన్నత స్థానం కు తీసుకురావటానికి అహర్నిశలు పని చేస్తున్నారని ఇచ్చిన హామీల్లో 90% శాతం పైబడి నెరవేర్చటమే కాకుండా కరోన వంటి మహమ్మరిని ఎదుర్కోవడం లో అనేక రకాలుగా చర్యలు చేపట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. అలాగే విశాఖ పరిపాలన రాజధాని విషయంలో కూడా మీ ఆరోపణలు సరైనవి కావని విశాఖ ను పరిపాలన రాజధాని చేయడానికి అన్నివిధాలా అర్హత ఉన్న నగరమని, అన్ని రవాణా మార్గాలు కనెక్టివిటీ , అర్హత గల నగరమని అలాగే రాష్ట్ర ప్రగతికి ఆర్థికంగా ఆదుకునే నగరం విశాఖ మాత్రమేనని ఆయన అన్నారు. కాబట్టి రఘు రామ కృష్ణ రాజు గారు మీరు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేతనైతే సహకరించండి లేదంటే చెతులు కట్టుకుని కూర్చొండి తప్ప నోటికి వచ్చిన విధముగా మాట్లావద్దని ఈ సందర్భంగా తెలియజేసారు.
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ భారీన పడిన వారికి పూర్తి స్ధాయిలో చికిత్స అందించుటకు ఆసుపత్రులను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ కరోనా లక్షణాలతో ఎవరైనా ఉంటే ఆస్పత్రిలో వచ్చి చేరవచ్చని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో సరిపడా బెడ్స్ లభ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో 121 ఐసియూ బెడ్లు, 1354 ఆక్సిజన్ కలిగిన నాన్ ఐసియు బెడ్ లు ఉన్నాయని, సాధారణ బెడ్లు 3,525 బెడ్లు వెరశి జిల్లాలో ఐదువేల బెడ్లు ఉన్నాయని చెప్పారు. జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో 50 ఐసియు బెడ్లు, ఆక్సిజన్ కలిగిన 8 వందల బెడ్లు ఉండగా, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 5 ఐసియు, ఆక్సిజన్ కలిగిన 5 నాన్ ఐసియు, సాధారణ బెడ్లు 50 వెరశి 105 బెడ్లు., గొలివి ఆసుపత్రిలో 10 ఐసియు, 10 ఆక్సిజన్ బెడ్లు, 40 సాధారణ బెడ్లు వెరశి 60 బెడ్లు., రిమ్స్ ఆస్పత్రిలో 40 ఐసియు, 470 ఆక్సిజన్ కలిగిన నాన్ ఐసియు, 40 సాధారణ బెడ్లు వెరశి 550 బెడ్లు., పివీఎస్ రామ్మోహన్ హాస్పిటల్లో 6 ఐసియు బెడ్లు, 25 సాధారణ బెడ్లు వెరశి 31 బెడ్లు., అమృత ఆస్పత్రిలో 10 ఐసియు బెడ్లు, 4 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 40 సాధారణ బెడ్లు వెరశి 54 బెడ్లు., శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కోవిడ్ కేర్ కేంద్రంలో 150, టి డ్ కో కోవిడ్ కేర్ కేంద్రంలో 2000, సంతబొమ్మాలి కోవిడ్ కేర్ కేంద్రంలో 1000 బెడ్లు, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 90 సాధారణ బెడ్లు వెరశి 100 బెడ్లు., రాజం ఏరియా హాస్పిటల్ లో 10 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 90 సాధారణ బెడ్లు వెరశి 2 వందల బెడ్లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ ఆసుపత్రులలో ఇప్పటివరకు కేవలం 605 కేసులు మాత్రమే చికిత్స పొందుతున్నాయని, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 797 కేసులు ఉండగా, హోమ్ ఐసోలేషన్ లో 1136 కేసులు చికిత్స పొందుతున్నాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సకాలంలో చికిత్స పొందాలని కోరారు. లక్షణాలు ఉన్నప్పటికీ దాచిపెట్టడం వలన ఇంటివద్దనే ఉండిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి వాళ్ళు ఆస్పత్రికి వచ్చి చేరాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇంటింటా జరుగుతున్న సప్త వార ప్రక్రియలో భాగంగా వాస్తవ సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. మంచి చికిత్స పొందాలని, వైద్యులు అందరూ మంచి సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా సోకిందనే వివక్ష అవసరం లేదని, ఎవరికైనా సోక వచ్చని ఆయన చెప్పారు. ఆసుపత్రులు, కోవిడ్ కేంద్రాల్లో వసతులు మరింత మెరుగు పరచుటకు చర్యలు చేపడుతున్నామని, సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా వైద్య పరీక్షలు నిర్వహించుటకు పీపుల్స్ లాబ్ ను ప్రజలు అందించిన విరాళాలతో ఏర్పాటు చేసామని చెప్పారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చందంగా వెళ్ళి పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపారు.
విశాఖలో పసికందుల విక్రయాలు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ నగర సమితి కార్యదర్శి ఎంపైడిరాజు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంతమైన విశాఖ నగరంలో కార్పోరేట్ ఆసుపత్రులకు పసిబిడ్డలను అమ్మే నీచ సంస్క్రుతికి తెరతీయడం దారుణమన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని, ప్రభుత్వం తక్షణమే ఇలాంటి సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తక్షణమే స్పందించి స్రుష్టి టెస్ట్ ట్యూబ్ బేసి కేంద్రాన్ని సీజ్ చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు విశాఖమహానగరంలో తిరిగి పునరావ్రుతం కాకుండా చూడాలన్న ఆయన ఇలాంటి కేంద్రాల నిర్వహణను పూర్తిగా రద్దు చేయాలన్నారు. పిల్లలు లేని వారిని ఆసరగా చేసుకొని జరుగుతున్న ఈ వ్యాపారానికి చరమగీతం పాడకపోతే విశాఖ నగరం ఒక పిల్లల ఎక్స్ పోర్టు జోన్ గా మారిపోవడం ఖాయమని పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు తన ఫిర్యాదు లేఖను వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి పంపినట్టు మీడియాకి వెళ్లడించారు.
విశాఖలోని గాజువాక నియోజకవర్గ అభివృద్దికి పూర్తి సహాయసహకారాలందిస్తానని ,దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు . బిసి రోడ్ టిఎన్ఆర్ కళ్యాణమండపంలో బుధవారం పాత్రకేయుల సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ముందుగా ఇటీవల గుండెపోటుతో మరణించిన వార్తా విలేఖరి ప్రసాద్ కి సంతాపం తెలియజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా అపరిష్కరంగా ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయనీ వాటిలో అతి ముఖ్యమైనవి హౌస్ కమిటి సమస్య ఒకటి , రెండోది స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డుల బదిలీ , మూడోది గంగవరం గ్రామం తరలింపు , నాలుగోది గంగవరం పోర్టు కాలుష్యం , ఐదోది గాజువాక మర్కెట్ కోసం 5 ఎకరాల స్థలం కెటాయింపు , ఆరోది ఆదర్శ గ్రౌండ్ లో స్టేడియం ఏర్పటు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి పరిష్కరించాలని కోరము. సుమారు ఒక గంట పాటు వారిమధ్య జరిగిన భేటిలో నియోజకవర్గ సమస్యల ప్రస్తావనే కాకుండా నియోజక వర్గ అభివృద్దికి చేయవలసిన కార్యక్రమాల ప్రస్తావన కొనసాగిందన్నారు . ప్రభుత్వాలు ఎన్ని మారినా నియోజక వర్గం అభివృద్దికి నోచుకోలేదనీ ఇప్పుడు మీ నాయకత్వంలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరం ఆవుతాయి అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు . ఈ సమస్యలపై సానూకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ది చేద్దామని భరోసా ఇచ్చారని తెలిపారు . ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్ , జిల్లా ప్రధానకార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి , జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి , రాజాన వెంకటరావు , కేబుల్ మూర్తి , వెంపాడ అప్పారావు , దొడ్డి రమణ , ధర్మాల శ్రీను , రెడ్డి జగన్నాథం , మంత్రి శంకర్ నారాయణ , సన్నీ , ఎండి ఇమ్రాన్ , షౌకత్ అలీ , బ్రమ్మయ్య , వేణుబాబు , దానప్పలు , సంపంగి ఈశ్వరరావు , ఉరుకుటి చందు , రంబా నారాయణమూర్తి , చెల్లిబోయిన నాయుడు , భూపతిరాజు శ్రీనివాసురాజు , భూపతిరాజు సుజాత , మంత్రి మంజుల , జుత్తు లక్ష్మీ , చిత్రాడ వెంకటరమణ , బొడ్డా గోవింద్ తదితరులు పాల్గొన్నారు