1 ENS Live Breaking News

ఎండీ జనరల్ మెడిసిన్ లోడా.మౌనికకు గోల్డ్ మెడల్

ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన డా.మౌనికను గోల్డ్ మెడల్ వరిచింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివిసుధాకర్ 2020 సంవత్సరానికి క్లినికల్ న్యూరాలజీలో ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్ టి సుబ్రహ్మణ్యం బంగారు పతకాన్ని ఫైనల్ ఇయర్ ఎండి జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ చింతాడా మౌనికాకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు.  డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం ప్రఖ్యాత వైద్యుడు, జనరల్ మెడిసిన్ ఎంచుకోవడానికి అనేక మంది యువకులను ప్రేరేపించడంలో మార్గదర్శిగా నిలిచారు. దివంగత డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం AMC మరియు KGH కి చేసిన సేవలను మెడిసిన్ హోడ్ డా. ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. డా. జ్ఞానసుందర రాజు, డా.రాధా కృష్ణన్, డా.ఎస్ఎన్ఆర్ నవీన్ , జనరల్ మెడిసిన్ యొక్క ఇతర అధ్యాపకులు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.                

2020-07-24 19:13:15

చిట్టివలస జూట్ కార్మికుల బకాయిలను చెల్లించాల్సిందే..

చిట్టివలస జ్యూట్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యాజమాన్యాన్ని ఆదేశిం చారు.చిట్టివలస జ్యూట్ మిల్లు, యాజమాన్యం, కార్మికులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.  చిట్టివలస జ్యూట్ మిల్లు అగ్రిమెంటు చేసి సంవత్సరకాలం నిన్నటితో పూరైందు వలన మంత్రి సమావేశం నిర్వహించారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు యాజమాన్యం పూర్తిగా చెల్లించాలని, ప్రతికార్మికునికి శాశ్వత, ప్రత్యేక బదిలి, బదిలి, కొత్తగా బదిలి, కార్మీకులకు రూ.27,500/-లు చొప్పున మరియు అప్రంటిసు కార్మికులకు రూ.10,000/-లు చొప్పున ఇస్తానని యజమాన్యం ఒప్పుకున్న ప్రకారం తక్షణమే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్ని వెంటనే చెల్లించాలని జ్యూట్ మిల్లు యజమాని కె.కె. బజోరి యాను మంత్రి ఆదేశించారు.  ఈ సమావేశంలో  యజమాన్యం ప్రతినిధిలు జోషి, రామ్ కుమార్, ఐక్య కార్యాచరణ కమిటి కార్మిక నాయకులు కె.వరహాలరాజు, చిల్ల వెంకటరమణ, జీరు, వెంకటరెడ్డి, వలనకాల ఆదినారాయణరెడ్డి, దల్లి అప్పలరెడ్డి, పడాలరమణ, కొండపు ఈశ్వరరావు, రామ్ ప్తెడియ్య, మద్దెల దేవుళ్లు, నరవ రామరావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-07-24 15:58:03

పోర్ట్ క్యాజువల్ కార్మికులకు న్యాయం చేయండి..ఎంపి

విశాఖపోర్ట్ ట్రస్ట్ లో గత12ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులను ఆదుకొని, సత్వరమే  న్యాయంచేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.శుక్రవారం 347 బ్యాచ్  కాజువల్ కార్మికులకి సంబందించిన పెండింగ్  అంశాలను  పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు, డిప్యూటీ చైర్మన్ హరనాధ్ ల దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. కారుణ్య నియామకాల కింద 12 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన 347 క్యాజువల్ కార్మికులకు నేటికీ సరైన పనిలేకుండా నానా అవస్థలు పడుతున్నారని ఎంపీ తెలియజేశారు. కేంద్రమంత్రి మాoడవీయతోనూ మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చైర్మన్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,,   కార్మిక సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ, గోపి, కృష్ణ , ప్రసాద్ పాల్గొన్నారు..                        

Visakhapatnam

2020-07-24 14:44:01

పెరుగుతున్న కేసులపై అప్రమత్తత అవసరం:కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  మరింత  అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని  జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కంటైన్మెంట్ జోన్స్ పెరుగుతున్నాయని అన్నారు. స్లమ్ ఏరియా లో, కంటైన్మెంట్ జోన్స్ లో ప్రతి ఇంటి నుండి శాంపిల్స్ సేకరించి వేగవంతం చేయాలని వివరించారు. బేల్లుపడ, రత్తకన్న , కండర వీధులలో కరోనా మరింత వేగవంతం  అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పరీక్షలు జరపటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.    సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం.వినోద్ బాబు,  కమీషనర్ రామలక్ష్మి, వైద్య సిబ్బందికి ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

Ichchapuram

2020-07-24 12:59:43

కోవిడ్ కంట్రోల్ రూమ్ సేవలు మీకోసమే..జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ 19  జిల్లా కంట్రోల్ రూమ్ (స్పందన హాల్) నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ కోవిడ్ సమస్యలు, పిర్యాధులు పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు. 08942 240605 ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని ఆయన చెప్పా రు. కంట్రోల్ రూమ్ కు అందిన ఫిర్యాదులు,  సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగి హోమ్ ఐసో లేషన్ లో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేకంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ కేంద్రం జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణంలో ఉందని, సమస్యలు ఉన్నవారు 08942 240615 ఫోన్ నంబరుకు తెలియజేయవచ్చని తెలిపారు.

Srikakulam

2020-07-22 23:55:10

జగనన్న పచ్చతోరణం విజయవంతం చేయాలి..కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన “జగనన్న పచ్చ తోరణం” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని హౌసింగ్ లేఔట్ లలో మొక్కలునాటే కార్యక్రమం ఈనెల 30 వ తారీకు లోపల పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ డ్వామా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పెందుర్తి మండలం, గుర్రంపాలెం పంచా యతీ, అక్కిరెడ్డిపాలెం లో పేదల హౌసింగ్ లేఅవుట్ వద్ద 71వ వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అటవీ శాఖ మొక్కలు నాటిన తర్వాత వాటిని పెంచే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని కోరారు. స్థానిక శాసన సభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాట్లాడు తూ ప్రకృతి ని కాపాడవలసిన బాధ్యత అందరిది అన్నారు. ముఖ్యమంత్రి తలపెట్టిన "జగనన్న  పచ్చతోరణం"  పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆహుతులు అందరిచే  ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటుతామని,  చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతామని, వనాలను నరకనివ్వమని, వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరిస్తామని, రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు 71 వ వనమహోత్సవం లో భాగంగా పెందుర్తి నియోజక వర్గం, గుర్రంపాలెం హోసింగ్ లేఔట్ లో అధికారులు అందరూ మొక్కలు నాటారు.  జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొత్తం 30000 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కన్జర్వేటర్ రామ్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్ డి ఓ పి. కిషోర్,  డి ఎఫ్ ఓ లక్ష్మణ్, డి ఎఫ్ ఓ అనంతసాగర్, స్క్వాడ్ డి ఎఫ్ ఓ సూర్యనారాయణ , వుడా డి ఎఫ్ ఓ శాంతి స్వరూప్, డి పి ఓ కృష్ణ కుమారి, డ్వామా ఎ పి డి ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.        

2020-07-22 23:46:03

మహిళా వాలంటీర్లను వేధిస్తే కఠిన చర్యలు..

సచివాలయ మహిళా వాలంటీర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా సచివాలయంలోని సంప్రదించాలని సచివాలయ పోలీసు అధి కారిణి జిఎన్ఎస్ శిరీష అన్నారు. సోమవారం శంఖవరం గ్రామసచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో మహి ళ ల రక్షణ, అంగన్వాడీల పర్యవేక్షణ, మహిళల ఆశ్రమాల సందర్శన స చివాలయం తరపున చేపడతామన్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు మహిళా వాలంటీర్లను వేధిస్తున్నట్టు తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించి అన్నవరం స్టేషన్ కి అప్పగిస్తామన్నారు. ఏ మహిళకు కష్టమొచ్చినా నేరుగా సచివాలయనికి వచ్చి స్పందనలో ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే దిశ కాల్ సెంటర్ కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు. వాలంటీర్లకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ఆమె మీడియాకి వివరించారు.  ప్రతీరోజూ నిర్వహించే స్పందనలో దరఖాస్తు చే సుకుంటే మహిళల సమస్యలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.

2020-07-22 21:56:49

మద్యం వద్దు-కుటుంబం ముద్దు అంటున్న ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచారం  కరపత్రాలను సోమవారం అరకు ఎంపీ గొడ్డేటి.మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లు ఆవిష్కరించారు. అనంతరం వీరు మాట్లాడుతూ  ఏపీ ప్రభుత్వం  మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంపూర్ణ  మద్యపానం నిషేధం దిశగా  ముందుకెళుతుందన్నారు. ఇప్పటికే దశలవారీగా మద్యం షాపులు  సంఖ్య తగ్గించడంతో పాటు, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి  మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచడం శుభపరిణామం అన్నారు.  మద్యం వద్దు - కుటుంబం ముద్దు  అనే నినాదంతో ఏర్పాటుచేసిన ప్రచార  కరపత్రాలను  ఆవిష్కరించిన అనంతరం ఏపీఏఏసీ స్టేట్ ఇంఛార్జి సురేష్ బేత మాట్లాడి ప్రజల్లోకి మద్యపాన నిశేదం అంశాన్ని పూర్తిస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు సుఖంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలనే విషయం ప్రజలు తెలుసుకునేలా ప్రచారాన్ని అన్ని గ్రామాలకు విస్తరించాలని ఈ సందర్భంగా ఎంపీలు సూచించారు.

2020-07-20 21:24:30

శంఖవరంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

శంఖవరంలో మరో 13కరోనాపాజిటివ్ కేసులు నమోదైనట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా..ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లా ుతూ, శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 13 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు ఏ పనిచేసినా తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలమేరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలన్న ఆయన అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఇపుడు పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి మరోసారి కోవిడ్ 19 పరీక్షలు చేయనున్నట్టు డాక్టర్ వివరించారు.             

East Godavari

2020-07-20 13:50:38

ఆకతాయిలు వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయండి...

సచివాలయ మహిళా వాలంటీర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా సచివాలయంలోని సంప్రదించాలని సచివాలయ పోలీసు అధికారిణి జిఎన్ఎస్ శిరీష అన్నారు. సో మవారం శంఖవరం గ్రామసచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో మహిళల రక్షణ, అంగన్వాడీల పర్యవేక్షణ, మహిళల ఆశ్రమాల సందర్శన స చివాలయం తరపున చేపడతామన్నారు. ఇటీవల కొందరు ఆకతాయిలు మహిళా వాలంటీర్లను వేధిస్తున్నట్టు తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తిం చి అన్నవరం స్టేషన్ కి అప్పగిస్తామన్నారు. ఏ మహిళకు కష్టమొచ్చినా నేరుగా సచివాలయనికి వచ్చి స్పందనలో ఫిర్యాదు చేయాలన్నారు. లేదంటే దిశ కాల్ సెం టర్ కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు. వాలంటీర్లకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ఆమె మీడియాకి వివరించారు.  ప్రతీరోజూ నిర్వహించే స్పందనలో దరఖాస్తు చే సుకుంటే మహిళల సమస్యలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.

East Godavari

2020-07-20 06:24:30

జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు..విజెఎఫ్

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన జర్నలిస్టుల( వి జేఫ్ )పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్  అధ్యక్ష.. కార్యద ర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు  తె లిపారు.గురువారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్య వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, సందర్భంగా వీరు  పా త్రి కేయులతో మాట్లాడు తూ కరోనా ను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ మాసంలో జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు, ప్రతి భగ ల  జర్నలిస్ టులకు మీడియా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. ఉపకారవేతనాలకు ఆగస్టు నెలాఖ రులో గా  డా బాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. త్వరలో జర్నలిస్టులకు సంబంధించి ఆ ధార్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నా రు.గతంలో ఆధార్ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ.. వాటికి సంబంధించిన సవరణలు,కొత్తగా  ఆధార్ నమోదు చేసుకోవ డానికి ఈ మేళా ఉపకరిస్తుంది అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తు న్నామన్నారు. కరోనా ను  దృష్టిలో ఉంచుకొనే ఆయన కార్యక్రమములు  నిర్వహణ తేదీలను ఖరారు చేస్తామ న్నారు.ఈ సమావే శంలో విజేఫ్  ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, టీ.నానాజీ,జాయింట్  సెక్రెటరీ దాడి రవి కుమార్.. కోశాధికారి పి ఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి  ఈశ్వర్ రావు ఎమ్ఎస్ అర్ ప్రసాద్ ,వరలక్ష్మి, దివాకర్,దొండ , గిరిబాబు, శేఖర్ మంత్రి, డేవిడ్,మాధవ్ రావు, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.

2020-07-19 17:48:48

చంద్ర‌బాబు కాస్త బుర్రుంటేవాడు..ఎమ్మెల్యే అమ‌ర్నాద్

సింహాచలం దేవస్థానంకు సంబంధించి కేరళలో ఉన్న అనంతపద్మనాభం ట్రస్టుతో పోలుస్తూ చంద్రబాబు  ట్వీట్‌ చేశారు. అసలు అనంతపద్మనాభం ట్రస్టుకు, సిం హాచలం దేవస్థానంకు సంబంధమే లేదని అమర్నాథ్ అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టుకు సంబంధించిన వ్యక్తి బ్రతికి ఉండగానే దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది చంద్ర బాబే అని అమర్ తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టు, పార్టీ చంద్రబాబు చేతికి ఎలా వచ్చిందని అమర్ ప్రశ్నించారు. ఈరోజు చంద్రబాబు నీతులు చెప్పటం ఏంటని అమర్నా థ్ మండిపడ్డారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు కుట్ర కోణం బయటపడిందన్నారు. రాజధానికి భూములు ఇవ్వలేదని అరటితోటలు తగలపెట్టినప్పుడు చంద్రబా బు కుట్ర ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులు ఉద్యమం చేస్తున్నారని తునిలో  రైలు తగలబెట్టి0చి రాజకీయ లబ్ది పొందాలని చూశారన్నారు. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంటే స్మగ్లర్‌లను కాపాడటం కోసం రైతు కూలీలను పొట్టన పెట్టుకొని చంపారు. ఆ ఎర్రచందనం దుంగలు చంద్రబాబు పొలంలోనే దొరికాయని అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు పేరు మీద ఉన్న పొలంలో ఎర్రచందనం దుంగలు దొరికిన విషయం మర్చిపోయారా.. అని అమర్నాథ్ ప్రశ్నించారు.

2020-07-19 17:42:04

వీరవేంకట సత్యదేవ ప్రసవ వేదన తప్పించలేవా..?

అన్నవరంలో ప్రసవ వేదనను తప్పించాలంటూ గర్భిణీలు సత్య దేవుడికి ముక్కోటి మొక్కులు మొక్కతున్నారు. కారణం అన్నవ రంలో గర్భిణిలకు డెలివరీలు చేయడానికి ఆసుపత్రి లేకపోవడమే. దేవస్థానం ఆసుపత్రి ఉన్నా అక్కడ ప్రాధమిక వైద్యం తప్పా మరే మీ అందటం లేదు. దీంతో గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలం టే ఇటు తునిగానీ, అటు శంఖవరంగానీ, లేదంటే కాకినాడ జిజిహె చ్ కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో అన్నవరం ప్రాంతంలో గర్భిణీలు ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివా రి దేవస్థాన ఆసుపత్రిలో అయినా ప్రసవాలకు వీలుగా కనీసం 20 పడకల ఆసుపత్రిగా నైనా మార్పుచేయాలని కోరుతున్నారు. ఈ ప్రాతంలో గర్భిణీల ప్రసవ వేధన అంశం యాంటినెటల్ డే సంద ర్భంగా ఒకేసారి శంఖవరం పీహెచ్సీలో వైద్యపరీక్షల కోసం వచ్చిన గర్భిణిల పరిస్తితికి అద్దం పట్టింది. దీనిపై అధికారులు స్పందించా ల్సివుంది.

Annavaram

2020-07-09 15:32:49

ఈవిఎంలకు భద్రత మరింత కట్టుదిట్టం..కలెక్టర్ వినయ్ చంద్

విశాఖలో ఇవిఎం, వివి ప్యాడ్ ల గొ డౌన్ ను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సందర్శించారు. బుధవారం చినగదిలి లోని ఇవిఎం, వివి ప్యాడ్లను ఉంచిన గొడౌన్ ను ప్రజా ప్రతినిధుల సమక్షములో బుధవారం సందర్శించారు. గొ డౌన్ లో ఉన్న ఎన్నికల సామగ్రిని నియోజక వర్గాల వారీగా ఉంచిన యంత్రాలను ఆయన పరిశీలించారు. విశాఖ రూరల్ తహసిల్థార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని సిప్టుల్లో ఉంటారని సెంట్రీలో ఉన్న గార్డులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్, విశాఖ రూరల్ తహసిల్థార్ నరసింహమూర్తి, వై.యస్.ఆర్. పార్టీ, టి.డి.పి., బి.జె.పి., తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Arilova

2020-07-08 16:07:49

వైఎస్సార్ ఆశయ సాధనకు విశేషం కృషిచేస్తాం...

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని జీవీఎంసీ గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం ఆనందరావు అన్నారు.బుధవారం ఇక్కడ గుర్తింపు యూనియన్ కార్యాలయంలో డాక్టర్ వైయస్ఆర్ జయం తి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదా లు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ రావు మాట్లాడుతూ వైయస్ ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. వారి సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టార న్నారు. విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, విద్య, వైద్యం తో పాటు స్థానిక సంస్థల బలోపేతానికి వైఎస్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. జీవీఎంసీ కి జెఎన్ఎన్ యు ఆర్ఎం పథకం ప్రాజెక్ట్ ల కింద ఒకేసారి 2000 కోట్లు మంజూరు చేసిన ఘనత వైయస్ కే దక్కుతుందన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి లంక భాస్కరరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి వైయస్ ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.గుర్తింపు యూనియన్ గౌరవ సలహాదారు. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ప్రతి ఒక్కరి మనసులోనూ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయంగా మిగిలిపోయారన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సైతం వైయస్సార్ నిరంతరం కృషి చేశారని.ఇళ్ల స్థలం లు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రెల్లి సత్యం కింతాడ శ్రీను, జి రామకృష్ణ, కుమార్, పరమేష్,శ్రీను దుర్గావతి పెద్ద ఎత్తున ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.

Dwaraka Nagar

2020-07-08 13:18:11