1 ENS Live Breaking News

పౌరులందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం..

రాష్ట్రంలో ప్రతి పౌరునికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  కోవిడ్-19 పై విఎంఆర్డిఎ చిల్ట్రన్స్ ఎరీనాలో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  రాబోయే రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందు వలన ఆసుపత్రుల్లో పడకల సంఖ్య మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  కోవిడ్-19 తో సీరియస్ గా ఉన్న వారి ప్రాణాలను ముందుగా కాపాడడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని వైద్యులను కోరారు.  మరణాల రేటును తగ్గించేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు.  వైద్య సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.   పాజిటివ్ కేసులు తరలించేందుకు ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆంబులెన్స్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 32 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు 7390 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు.   చిన్న చిన్న లక్షణాలు ఉన్న వారికి, ఏ లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ ఉన్నవారిని హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు.  కోవిడ్-19 తీవ్రంగా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.  22 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్-19 సేవలకు ఏర్పాటు చేయడమైనదని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు 8, ప్రైవేట్ ఆసుపత్రులు 14 ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 7 వేల పడకలు సిద్దం చేయనున్నట్లు వెల్లడించారు.  ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరతగా ఉందని, ఈ కొరతను తీర్చడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నుండి వైద్యులతో ఇప్పటికే మాట్లాడడమైనదని, వారు విధులలో చేరేందుకు సుమఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దని, అలా చేయించుకోవాలనుకొనే వారు ప్రైవేట్ ల్యాబ్స్ లో చేయించుకోవాలని, అందులో పరీక్షకు రూ.750/-లని చెప్పారు. జివియంసి పరిధిలోని వార్డుల్లో ప్రత్యేక అధికారులు, వైద్యులను నియమించడమైనదని, జివియంసి (వార్డుల్లో) పరిధిలో ఆంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  గ్రామీణ ప్రాంతంలో ఆంబులెన్స్ లు, 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిజిటల్ ఎక్స్ రే లు వస్తున్నాయని చెప్పారు.  అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి. సత్యవతి మాట్లాడుతూ  పరీక్షలు చేసే కెపాసిటి పెంచాలని తెలిపారు.  నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జివియంసి కమీషనర్ జి. సృజన, తదితరులు మాట్లాడారు.    ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, విఎంఆర్డిఎ అదనపు కమీషనర్ మునజీర్ జిలానీ సమూన్, డి.సి.పి. ఐశ్వర్య రస్తోగి, జిల్లా జాయింట్ కలెక్ట్-3 గోవిందరావు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-07-27 18:06:03

శంఖవరం సచివాలయ ఉద్యోగినికి కరోనా పాజిటివ్...

శంఖవరం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తున్నాయి. సోమవారం గ్రామసచివాలయ ఉద్యోగినికి తాజాగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.  పరీక్ష చేసిన వారం రోజుల తర్వాత రిజల్ట్ రావడంతో ఈ లోపుగా ఎంతమందికి దగ్గరికి  సదరు ఉద్యోగిని విధి నిర్వహణ నిమిత్తం ఉవెళ్ళారో  అని గ్రామస్తులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఇపుడు సదరు ఉద్యోగిని ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తిస్తున్నారు. వెంటనే సచివాలయ ప్రాంతాన్ని శానిటేషన్ చేశారు.  దీనితో సచివాలయంలో ఇద్దరికి కరోనా సోకినట్టు అయ్యింది. అందులో మరొకరు సానిటేషన్ విభాగంలో పనిచేసే వ్యక్తి కావడం విశేషం. దీంతో శంఖవరం గ్రామంలోనే 24 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు, ఫలితాలు ఆలస్యం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది..

2020-07-27 18:00:16

అన్నవరంలో మరో 7గురికి కరోనా పాజిటివ్...

అన్నవరంలో సోమవారం మరో 7గురుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బిసికాలనీలో ఇద్దరికీ, చలమయ్య నగర్ లో ఇద్దరికి,  మరో ఇద్దరు నాయీ బ్రాహ్మణులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. బిసి కాలనీకి చెందిన ఒక వ్రత పురోహితుడు, ఆయన కోడలికి కరోనా సోకింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా మార్చి ప్రత్యేక శానిటేషన్ పనులు చెపడుతున్నట్టు కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర పనులకు తప్పా మిగిలిన పనులకు బయటకు రాకూడదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ జోన్ పరిధిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని సచివాలయ అధికారులు హెచ్చరిస్తున్నారు.

East Godavari

2020-07-27 16:00:43

ఎల్లోమీడియా కధనాలు ప్రజలు నమ్మేపరిస్థితి లేదు..వంశీ

పచ్చమీడియా చూపించే మోసపూరిత కధనాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని విశాఖ మహానగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సీహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మద్దెలపాలెం పార్టీ కార్యాయలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటును ప్రకటించిన దగ్గర నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు పనిగట్టుకొని పచ్చమీడియా పనిచేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరధం పడుతుంటే దానిని ప్రజల్లో తప్పుగా చూపించే ప్రయత్నం చేయడమే టిడిపి, వారి అనుకూల మీడియా పనిచేస్తుందన్నారు. ఎన్నో ప్రక్రుతి వైపరిత్యాలు వచ్చినపుడు నోరు మెదపని భజన మీడియా ఇపుడు కరోనా వైరస్ సమయంలో మ్రుతులను సైతం బూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు బుద్దిచెప్పినా కనీసం తెలుసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

Visakhapatnam

2020-07-26 21:36:33

భయం గుప్పెట్లో శంఖవరం మండలం...

శంఖవరం మండలంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ గ్రామంలో 23 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు మరణించారు. దీంతో పాజిటివ్ కేసులు వచ్చిన చోట రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడ సచివాలయ అధికారులు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ అధికంగా విస్తరిస్తున్నందున అత్యవసర సమయాల్లో తప్పా ఎవరూ బయటకు రాకూడదని శంఖవరం పీహెచ్సీ డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకూ  మండపంలో 4, శ్రుంగవరంలో 8, చామమవరంలో 1 కేసులు నమోదు అయ్యాయన్నారు. బయటకు వచ్చేవారు మాస్కును ఖచ్చితంగా వినియోగించాలని కోరుతున్నారు. అంతేకాకుండా తరచుగా చేతులు, కాళ్లూ సబ్బుతో కడుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని, తరచుగా వేడినీరు కూడా సేవించాలని చెబుతున్నారు. ప్రజలు సహకరించకపోతే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదముందని కూడా డాక్టర్ హెచ్చరిస్తున్నారు.

2020-07-26 18:18:46

కరోనా విపత్తులోనూ తప్పని బయోమెట్రిక్ అటెండెన్సు..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కూడా ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు విధానాన్ని కొనసాగిస్తున్నారు. కత్తిపూడి, బెండపూడి గ్రామసచివాలయాల్లోని సిబ్బందికి కరోనా సోకిన తరువాత కూడా బయోమెట్రిక్ విధాన్ని అమలు చేయడంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాత్రం సాధారణ హాజరు మాత్రమే ఉద్యోగులకు నమోదు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరికి బయోమెట్రిక్ కారణంగా కరోనా ముప్పు వస్తుందోనని జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భయపడుతున్నారు. వివిధజిల్లా శాఖల అధికారుల సమన్వయ లోపమే దీనికి కారణమని చెబుతున్నారు. అధికారుల ఆదేశాలతో తప్పక బయోమెట్రిక్ అటెండెన్సు వేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.

East Godavari

2020-07-26 15:29:53

పరవాడ ఫార్మాసిటీ బాధితులకు చెక్కుల అందజేత..

పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్  29 వ తేదీన జరిగిన హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటన లో మరణించిన మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15.00 లక్షల మొత్తానికి చెక్కు ను  ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి  శనివారం నాడు తన నివాసంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు. అలాగే సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35.00 లక్షల మొత్తానికి సంబంధించి ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి రూ. 10.00 లక్షల చెక్ ను, తండ్రి మహంతి లక్ష్ము నాయుడు కు రూ. 12.50 లక్షల చెక్ ను, తల్లి మహంతి అప్పల నరసింహ కు రూ. 12.50 చెక్ లను కూడా మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

Paravada

2020-07-25 20:55:16

పచ్చమీడియా బ్రమ కల్పించేంతగా విశాఖలేదు..రాజీవ్

పచ్చ పత్రికలు భూకంపాలన్నా, డర్టీయెస్ట్ పొలిటీషియన్ దడపుట్టించాలనుకున్నా, ఎల్లో వైరస్ సునామీలు సృష్టించాలనుకున్నా ప్రజలకు సమాచారం రకరకాల సోర్సెస్ నుంచి అందుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విషప్రచారం నడవదన్నారు. పైగా సముద్రం అంటే కోట్లాదిమందికి ఒక తల్లి, ప్రధాన ఆదాయవనరు అన్నారు. అదో అడ్వాంటేజ్ కూడా. 2004లో సునామీవచ్చి ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది చనిపోయినప్పుడు సముద్రం ఒక్క అడుగైనా ముందుకు వచ్చిందా? అన్నారు. డాక్ యార్డ్ లోని ఒక్క నౌకైనా తల్లకిందులయ్యిందా?. పెట్టని కోటల్లాంటి కొండలు, సముద్రమట్టానికి నగరం ఎత్తుగా ఉంటే సునామీలు ఎలావస్తాయి అన్నారు. ఇప్పటికైనా విశాఖపై విషం చిమ్మే ఎల్లోమీడియాల వస్తవాలను తెలుసుకోవాలని రాజీవ్ సూచించారు.

Visakhapatnam

2020-07-25 20:23:29

మద్యపాన నిషేదానికి ప్రతీఒక్కరూ సహకరించాలి..కలెక్టర్

మద్యం రహిత సమాజ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు, విశాఖ జిల్లా అధికారులు అందరూ దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపేరు. "నషా ముక్త్ భారత్" కి తగిన సహకారాలను అందిస్తామనీ, సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపేరు. మధ్య దుకాణాల రద్దీ నియంత్రించేందుకు కరోనా మహమ్మారి నేపధ్యం లో మొండికేస్తున్న మందు బాబులను నిబంధన ప్రకారమే మద్యం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసేమని అన్నారు.  పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ  పెరుగు తున్నందున తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అన్ని మద్యం షాపు ల దగ్గర ప్రత్యేకంగా బారికేడ్లను నిర్మించి వీలైనంత తొందరగా దుకాణం నుంచి మధు ప్రియులను పంపించే ఏర్పాట్లను చేసేమని అన్నారు. ఈ కౌంటర్ల వ్యవస్థ రాష్ట్రం లోనే మొదటి సారిగా విశాఖ లో అమలు పరిచినట్టు తెలిపేరు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, GVMC, ఎక్సైజ్, డాక్టర్ల బృందంతో,  కరోనా కట్టిడికై,  24/7 జిల్లా యంత్రాంగము కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్య క్రమంలో మద్య విమోచన ప్రచార కర్తలు సురేష్ బేతా,  సైకాలజిస్ట్ డాక్టర్. జయలక్ష్మీ దిట్టకవి, చరిత్ పాల్గొన్నారు.

Visakhapatnam

2020-07-25 20:19:02

కోవిడ్ బాధితుల కోసం మరిన్ని పడకలు సిద్దం చేయాలి

విశాఖపట్నంలో మరిన్ని పడకలు కోవిడ్ బాధితుల కోసం సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యులను ఆదేశించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకొనేందుకు తగిన చర్యలు నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను  ఆదేశించారు.  కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు నిదులు సమస్య లేదని, స్పెషలిస్టులు, వైద్యులు అందరూ సహకరించి కోవిడ్ ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇలాంటి సమయంలో వైద్యులు తమవంతు సహకారం అందించాలని ఐ.ఎం.ఎ., వైజాగ్ చాప్టర్ లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ దవళ భాస్కరరావు, ఐ.ఎం.ఎ., చాప్టర్, వైజాగ్ నుండి కోవిడ్-19 జిల్లా కో ఆర్డినేటర్ డా. బి. గోవిందరాజు, ఐఎంఎ కార్యదర్శి డా. కె. ఫణీందర్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-07-25 19:51:40

ఎండీ జనరల్ మెడిసిన్ లోడా.మౌనికకు గోల్డ్ మెడల్

ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన డా.మౌనికను గోల్డ్ మెడల్ వరిచింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివిసుధాకర్ 2020 సంవత్సరానికి క్లినికల్ న్యూరాలజీలో ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్ టి సుబ్రహ్మణ్యం బంగారు పతకాన్ని ఫైనల్ ఇయర్ ఎండి జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ చింతాడా మౌనికాకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు.  డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం ప్రఖ్యాత వైద్యుడు, జనరల్ మెడిసిన్ ఎంచుకోవడానికి అనేక మంది యువకులను ప్రేరేపించడంలో మార్గదర్శిగా నిలిచారు. దివంగత డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం AMC మరియు KGH కి చేసిన సేవలను మెడిసిన్ హోడ్ డా. ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. డా. జ్ఞానసుందర రాజు, డా.రాధా కృష్ణన్, డా.ఎస్ఎన్ఆర్ నవీన్ , జనరల్ మెడిసిన్ యొక్క ఇతర అధ్యాపకులు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.                

2020-07-24 19:13:15

చిట్టివలస జూట్ కార్మికుల బకాయిలను చెల్లించాల్సిందే..

చిట్టివలస జ్యూట్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యాజమాన్యాన్ని ఆదేశిం చారు.చిట్టివలస జ్యూట్ మిల్లు, యాజమాన్యం, కార్మికులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.  చిట్టివలస జ్యూట్ మిల్లు అగ్రిమెంటు చేసి సంవత్సరకాలం నిన్నటితో పూరైందు వలన మంత్రి సమావేశం నిర్వహించారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు యాజమాన్యం పూర్తిగా చెల్లించాలని, ప్రతికార్మికునికి శాశ్వత, ప్రత్యేక బదిలి, బదిలి, కొత్తగా బదిలి, కార్మీకులకు రూ.27,500/-లు చొప్పున మరియు అప్రంటిసు కార్మికులకు రూ.10,000/-లు చొప్పున ఇస్తానని యజమాన్యం ఒప్పుకున్న ప్రకారం తక్షణమే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్ని వెంటనే చెల్లించాలని జ్యూట్ మిల్లు యజమాని కె.కె. బజోరి యాను మంత్రి ఆదేశించారు.  ఈ సమావేశంలో  యజమాన్యం ప్రతినిధిలు జోషి, రామ్ కుమార్, ఐక్య కార్యాచరణ కమిటి కార్మిక నాయకులు కె.వరహాలరాజు, చిల్ల వెంకటరమణ, జీరు, వెంకటరెడ్డి, వలనకాల ఆదినారాయణరెడ్డి, దల్లి అప్పలరెడ్డి, పడాలరమణ, కొండపు ఈశ్వరరావు, రామ్ ప్తెడియ్య, మద్దెల దేవుళ్లు, నరవ రామరావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-07-24 15:58:03

పోర్ట్ క్యాజువల్ కార్మికులకు న్యాయం చేయండి..ఎంపి

విశాఖపోర్ట్ ట్రస్ట్ లో గత12ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులను ఆదుకొని, సత్వరమే  న్యాయంచేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.శుక్రవారం 347 బ్యాచ్  కాజువల్ కార్మికులకి సంబందించిన పెండింగ్  అంశాలను  పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు, డిప్యూటీ చైర్మన్ హరనాధ్ ల దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. కారుణ్య నియామకాల కింద 12 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన 347 క్యాజువల్ కార్మికులకు నేటికీ సరైన పనిలేకుండా నానా అవస్థలు పడుతున్నారని ఎంపీ తెలియజేశారు. కేంద్రమంత్రి మాoడవీయతోనూ మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చైర్మన్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,,   కార్మిక సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ, గోపి, కృష్ణ , ప్రసాద్ పాల్గొన్నారు..                        

Visakhapatnam

2020-07-24 14:44:01

పెరుగుతున్న కేసులపై అప్రమత్తత అవసరం:కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  మరింత  అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని  జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కంటైన్మెంట్ జోన్స్ పెరుగుతున్నాయని అన్నారు. స్లమ్ ఏరియా లో, కంటైన్మెంట్ జోన్స్ లో ప్రతి ఇంటి నుండి శాంపిల్స్ సేకరించి వేగవంతం చేయాలని వివరించారు. బేల్లుపడ, రత్తకన్న , కండర వీధులలో కరోనా మరింత వేగవంతం  అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పరీక్షలు జరపటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.    సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం.వినోద్ బాబు,  కమీషనర్ రామలక్ష్మి, వైద్య సిబ్బందికి ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

Ichchapuram

2020-07-24 12:59:43