1 ENS Live Breaking News

సింహాచల దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధిచేస్తాం...

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ. వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారిని గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రివర్యులకు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం, దేవాలయం పర్యాటకంలో భాగంగా కేంద్ర నిధులనుండి రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా సింహాచలం శ్రీ.వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53.00 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహలాద్ సింగ్ పటేల్ గారికి, కేంద్ర మంత్రి గారికి, ముఖ్య మంత్రివర్యులు శ్రీ.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు విజయ్ సాయి రెడ్డి గారికి విశాఖపట్నం ప్రజల తరుపున మంత్రి అవంతి శ్రీనివాస రావు గారు కృతఙ్ఞతలు తెలియజేశారు. అనంతరం, అభివృద్ధి పనులపై కేటాయించిన నిధులను ఏఏ సౌకర్యాలు కల్పించాలనే దానిపై సింహాచలం ఈ.ఓ గారితో, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం వారితో మరియు టూరిజం శాఖ ఇంజనీరింగ్ విభాగం వారితో చర్చించారు..

2020-07-30 14:10:23

రఘురామ క్రిష్ణరాజు మీతీరు మార్చుకోవాల్సిందే...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దయతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచి అదే పార్టీ ని ప్రభుత్వాన్ని విమర్శించటం రఘు రామ కృష్ణ రాజు కు తగదని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు అన్నారు. బుధవారం ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని, వైస్సార్ పార్టీ గుర్తు పై ప్రజాస్వామ్య బద్దంగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టిన రఘు రామ కృష్ణ రాజు ఇప్పుడు కొంతమంది స్వార్ధ పూరిత రాజకీయ నాయకుల డైరెక్షన్ లో ప్రజాస్వామ్యా విలువలకు తీట్లు పొడుస్తూ పొంతన లేని మాటలతో పార్టీ ని , ప్రభుత్వాన్ని విమర్శించటం తగదని అన్నారు. ఎక్కడో ఢిల్లీ లో కూర్చొని ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విమర్శిస్తూ పక్క రాష్ట్రలతో మన రాష్ట్రం ను పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటినుంచి ఉన్న స్తానం నుండి ఉన్నత స్థానం కు తీసుకురావటానికి అహర్నిశలు పని చేస్తున్నారని ఇచ్చిన హామీల్లో 90% శాతం పైబడి నెరవేర్చటమే కాకుండా కరోన వంటి మహమ్మరిని ఎదుర్కోవడం లో అనేక రకాలుగా చర్యలు చేపట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. అలాగే విశాఖ పరిపాలన రాజధాని విషయంలో కూడా మీ ఆరోపణలు సరైనవి కావని విశాఖ ను పరిపాలన రాజధాని చేయడానికి అన్నివిధాలా అర్హత ఉన్న నగరమని, అన్ని రవాణా మార్గాలు కనెక్టివిటీ , అర్హత గల నగరమని అలాగే రాష్ట్ర ప్రగతికి ఆర్థికంగా ఆదుకునే నగరం విశాఖ మాత్రమేనని ఆయన అన్నారు. కాబట్టి రఘు రామ కృష్ణ రాజు గారు మీరు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేతనైతే సహకరించండి లేదంటే చెతులు కట్టుకుని కూర్చొండి తప్ప నోటికి వచ్చిన విధముగా మాట్లావద్దని ఈ సందర్భంగా తెలియజేసారు.

Visakhapatnam

2020-07-29 21:37:29

కోవిడ్ 19 రోగులకు జిల్లాలో బెడ్ల కొరతలేదు..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ భారీన పడిన వారికి పూర్తి స్ధాయిలో చికిత్స అందించుటకు ఆసుపత్రులను సిద్ధం చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు.  ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ కరోనా లక్షణాలతో ఎవరైనా ఉంటే  ఆస్పత్రిలో వచ్చి చేరవచ్చని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో సరిపడా బెడ్స్ లభ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో 121 ఐసియూ బెడ్లు,  1354 ఆక్సిజన్ కలిగిన  నాన్ ఐసియు బెడ్ లు ఉన్నాయని,  సాధారణ బెడ్లు 3,525 బెడ్లు వెరశి  జిల్లాలో ఐదువేల బెడ్లు ఉన్నాయని చెప్పారు. జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో 50  ఐసియు బెడ్లు, ఆక్సిజన్ కలిగిన 8 వందల బెడ్లు ఉండగా, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 5 ఐసియు,  ఆక్సిజన్ కలిగిన 5 నాన్ ఐసియు, సాధారణ బెడ్లు 50 వెరశి 105 బెడ్లు., గొలివి  ఆసుపత్రిలో 10 ఐసియు, 10 ఆక్సిజన్ బెడ్లు, 40 సాధారణ బెడ్లు  వెరశి 60 బెడ్లు.,  రిమ్స్ ఆస్పత్రిలో 40 ఐసియు, 470 ఆక్సిజన్ కలిగిన నాన్ ఐసియు, 40 సాధారణ బెడ్లు వెరశి 550 బెడ్లు.,  పివీఎస్ రామ్మోహన్ హాస్పిటల్లో 6 ఐసియు బెడ్లు, 25 సాధారణ బెడ్లు వెరశి 31 బెడ్లు.,  అమృత ఆస్పత్రిలో 10 ఐసియు బెడ్లు, 4 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 40  సాధారణ బెడ్లు వెరశి 54 బెడ్లు.,  శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కోవిడ్ కేర్ కేంద్రంలో 150, టి డ్ కో కోవిడ్ కేర్ కేంద్రంలో 2000, సంతబొమ్మాలి కోవిడ్ కేర్ కేంద్రంలో 1000 బెడ్లు,  పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 90  సాధారణ బెడ్లు వెరశి 100 బెడ్లు.,  రాజం ఏరియా హాస్పిటల్ లో 10 ఆక్సిజన్ కలిగిన బెడ్లు, 90  సాధారణ బెడ్లు వెరశి 2 వందల బెడ్లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ ఆసుపత్రులలో ఇప్పటివరకు కేవలం 605 కేసులు మాత్రమే చికిత్స పొందుతున్నాయని,  కోవిడ్ కేర్ కేంద్రాల్లో 797 కేసులు ఉండగా, హోమ్ ఐసోలేషన్ లో 1136 కేసులు చికిత్స పొందుతున్నాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సకాలంలో చికిత్స పొందాలని కోరారు. లక్షణాలు ఉన్నప్పటికీ దాచిపెట్టడం వలన ఇంటివద్దనే ఉండిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి వాళ్ళు ఆస్పత్రికి వచ్చి చేరాలని  జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇంటింటా జరుగుతున్న సప్త వార ప్రక్రియలో భాగంగా వాస్తవ సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. మంచి చికిత్స పొందాలని, వైద్యులు అందరూ మంచి సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా సోకిందనే వివక్ష అవసరం లేదని, ఎవరికైనా సోక వచ్చని ఆయన చెప్పారు. ఆసుపత్రులు, కోవిడ్ కేంద్రాల్లో వసతులు మరింత మెరుగు పరచుటకు చర్యలు చేపడుతున్నామని, సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా వైద్య పరీక్షలు నిర్వహించుటకు పీపుల్స్ లాబ్ ను ప్రజలు అందించిన విరాళాలతో ఏర్పాటు చేసామని చెప్పారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చందంగా వెళ్ళి పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. 

Srikakulam

2020-07-29 21:13:36

పిల్లలను విక్రయించే స్రుష్టి నిర్వాహకులను శిక్షించాల్సిందే..

విశాఖలో పసికందుల విక్రయాలు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ నగర సమితి కార్యదర్శి ఎంపైడిరాజు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంతమైన విశాఖ నగరంలో కార్పోరేట్ ఆసుపత్రులకు పసిబిడ్డలను అమ్మే నీచ సంస్క్రుతికి తెరతీయడం దారుణమన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని, ప్రభుత్వం తక్షణమే ఇలాంటి సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తక్షణమే స్పందించి స్రుష్టి టెస్ట్ ట్యూబ్ బేసి కేంద్రాన్ని సీజ్ చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు విశాఖమహానగరంలో తిరిగి పునరావ్రుతం కాకుండా చూడాలన్న ఆయన ఇలాంటి కేంద్రాల నిర్వహణను పూర్తిగా రద్దు చేయాలన్నారు. పిల్లలు లేని వారిని ఆసరగా చేసుకొని జరుగుతున్న ఈ వ్యాపారానికి చరమగీతం పాడకపోతే విశాఖ నగరం ఒక పిల్లల ఎక్స్ పోర్టు జోన్ గా మారిపోవడం ఖాయమని పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు తన ఫిర్యాదు లేఖను వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి పంపినట్టు మీడియాకి వెళ్లడించారు.

Visakhapatnam

2020-07-29 19:49:20

గాజువాక నియోజకవర్గ అభివ్రుద్ధికి సీఎం వైఎస్ జగన్ హామీ

విశాఖలోని గాజువాక  నియోజకవర్గ అభివృద్దికి పూర్తి సహాయసహకారాలందిస్తానని ,దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు . బిసి రోడ్  టిఎన్ఆర్ కళ్యాణమండపంలో బుధవారం పాత్రకేయుల సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ముందుగా ఇటీవల గుండెపోటుతో మరణించిన వార్తా విలేఖరి ప్రసాద్ కి సంతాపం తెలియజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా అపరిష్కరంగా ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయనీ వాటిలో అతి ముఖ్యమైనవి హౌస్ కమిటి సమస్య ఒకటి , రెండోది స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డుల బదిలీ , మూడోది గంగవరం గ్రామం తరలింపు , నాలుగోది  గంగవరం పోర్టు కాలుష్యం , ఐదోది గాజువాక మర్కెట్ కోసం 5 ఎకరాల స్థలం  కెటాయింపు , ఆరోది ఆదర్శ గ్రౌండ్ లో స్టేడియం ఏర్పటు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి పరిష్కరించాలని కోరము. సుమారు ఒక గంట పాటు వారిమధ్య జరిగిన భేటిలో నియోజకవర్గ సమస్యల ప్రస్తావనే కాకుండా నియోజక వర్గ అభివృద్దికి చేయవలసిన కార్యక్రమాల ప్రస్తావన కొనసాగిందన్నారు . ప్రభుత్వాలు ఎన్ని మారినా నియోజక వర్గం అభివృద్దికి  నోచుకోలేదనీ ఇప్పుడు మీ నాయకత్వంలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరం ఆవుతాయి అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు . ఈ సమస్యలపై సానూకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ది చేద్దామని భరోసా ఇచ్చారని తెలిపారు . ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్ , జిల్లా ప్రధానకార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి , జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి , రాజాన వెంకటరావు , కేబుల్ మూర్తి , వెంపాడ అప్పారావు , దొడ్డి రమణ , ధర్మాల శ్రీను , రెడ్డి జగన్నాథం , మంత్రి శంకర్ నారాయణ , సన్నీ , ఎండి ఇమ్రాన్ , షౌకత్ అలీ , బ్రమ్మయ్య , వేణుబాబు , దానప్పలు , సంపంగి ఈశ్వరరావు , ఉరుకుటి చందు , రంబా  నారాయణమూర్తి , చెల్లిబోయిన నాయుడు , భూపతిరాజు శ్రీనివాసురాజు , భూపతిరాజు సుజాత , మంత్రి మంజుల , జుత్తు లక్ష్మీ , చిత్రాడ వెంకటరమణ , బొడ్డా గోవింద్ తదితరులు పాల్గొన్నారు

Gajuwaka

2020-07-29 19:41:17

గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ లు

శ్రీకాకుళం నగర పాలక సంస్ధ పరిధిలో సచివాలయాల్లో కోవిడ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నగరంలో కోవిడ్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి కంటైన్మైంట్ జోన్ల పర్యవేక్షణ, కోవిడ్ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ లు రేయింబవళ్ళు పనిచేస్తాయని పేర్కొంటూ ప్రజలు కరోనా సమాచారాన్ని, పిర్యాధులను, సలహాలను అందించాలని కోరారు. వార్డు సచివాలయంలోని వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శులకు మోబైల్ ఫోన్ నంబర్లను సమకూర్చడం జరిగిందని పేర్కొంటూ వాటి వివరాలు ఈ విధంగా అందజేసారు. బలగ సచివాలయం ఎస్.ఢిల్లేశ్వరావు 9154564569,  ఆదివారం పేట వై.స్వరూప్ కుమార్ 9154564602, బాబాజీ తోట జి.రాంబాబు 9154564584, రిమ్స్ రోడ్ ఎస్.ముసలనాయుడు 9154564591, హడ్కో కాలనీ ఎల్.జ్ఞానేశ్వర్ రావు 9154564618, శాంతినగర్ - రెల్లి వీధి ఎస్.దివ్య కుమారి 9154564600, సానావీధి ఎం.సురేష్ కుమార్  9154564610, డిసిసిబి కాలనీ టీ.తారకేశ్వరి 9154564588,  రైతు బజార్ ఏరియా పి.తులసి 9154564587, పెద్ద రెల్లివీధి వై.మల్లేశ్వరి 9154564573, పుణ్యపు వీధి ఆర్.జగన్నాయకులు నాయుడు  9154564582, గొంటి వీధి వై.సాగర్ కుమార్ 9154564596, ఇప్పిలి వీధి వై.సాగర్ కుమార్ 9154564615,  హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఎస్.భారతి 9154564611, బాకార్ సాహేబ్ పేట కింతలి సాయి తేజ 9154564608, చంపాగల్లీ వీధి టి.పవన్ కుమార్ 9154564585, మండల వీధి ఏ.చంద్రమౌళి 9154564578, మహాలక్ష్మి నగర్ ఎస్.సాయి కిరణ్ 9154564575, అరసవల్లి రోడ్డు సిహెచ్.సుశీల 9154564592, అరసవల్లి వెలమ వీధి రత్న రవితేజ 9154564570, బాదుర్లపేట ఎస్.అపర్ణ 9154564576, సి.బి రోడ్డు గూట్ల పృథ్వీరాజ్ 9154564597, దండి వీధి హారిక కరణం 9154564572,  హెచ్.బి.కాలనీ – టిపిఎం స్కూల్  రోణంకి ప్రశాంతి 9154564613, గూనపాలెం బొత్సా ఝాన్సీ భాయి 9154564617,  కాకి వీధి కె.శ్రీనివాస రావు 9154564595, కంపోస్ట్ కాలనీ పి.శ్రీనివాసరావు 9154564605, మంగువారితోట కళ్యాణి హేమ సుందర్ 9154564583, దమ్మల వీధి దుర్గారావు గేదెల 9154564590, గుడి వీధి చింటూ ప్రభాకర రావు 9154564619, హయతీనగరం టి.గుణ సూర్య సత్య సాగరి 9154564594, చౌదరి సత్యనారాయణ కాలనీ టి.నరసింహ అప్పారావు 9154564593, గుజరాతీపేట ఆత్రేయపురపు రామారావు 9154564566, గుజరాతీపేట గొల్ల వీధి టి.జాన్ ప్రసన్నకుమార్ 9154564606, ఫాజుల్లాబేగ్ పేట చక్కా పద్మావతి 9154564603, పి.ఎన్.కాలనీ కె.మురళీమోహన్ నారాయణరావు 9154564599, మున్సిపల్ ఆఫీస్, ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా తల్లూరి పవన్ కుమార్ 9154564585, సీపన్నాయుడుపేట సీపాన సత్యనారాయణ 9154564571. ఈ ఫోన్ నంబర్లను ప్రజలు సద్వినియోగం చేసుకుని కోవిడ్ లక్షణాలుగాని సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి రుగ్మతలు ఉన్నప్పటికి తెలియజేసి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రాణరక్షణ చర్యలు చేపట్టాలని కమీషనర్ కోరారు.

Srikakulam

2020-07-29 19:08:01

సింహాచల పర్యాటకానికి రూ.53 కోట్లు మంజూరు..మంత్రి

దేవాలయ పర్యాటకం లో భాగంగా  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రూ.53 కోట్లు కేంద్ర నిధులు మంజూరైనట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్ర‌సాద్‌ (నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌) పథకంలో  సింహాచ‌లం  దేవాల‌య అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మొత్తాన్ని మంజూరు చేశారన్నారు.  ఈ నిధులతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.   ఈ నిధుల కొరకు లేఖ రాసిన వెంటనే స్పందించి నిధులను విడుదల చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

2020-07-29 19:03:27

వివాహాలకు మండల స్ధాయిలో అనుమతులు..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో వివాహ వేడుకలకు మండల స్ధాయిలో అనుమతులు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. వివాహాలు నిర్వహించుకనే వారు కనీసం ఐదు రోజులు ముందు సంబంధిత మండల తహశీల్దారుకు, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కు వివరాలు అందించాలని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ అనుమతులకు మించి బంధు మిత్రులను ఆహ్వానించరాదని కలెక్టర్ అన్నారు. అనుమతులు తీసుకున్నప్పటికి కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని, వ్యక్తుల మధ్యదూరం పాటించాలని, చేతులను సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని తరచూ శుభ్రపరచుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Srikakulam

2020-07-29 19:02:02

కోవిడ్ కేర్ సెంటర్ లో నాణ్యమైన భోజన సదుపాయాలు..

కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్లకు  నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు  జాయింట్ కలెక్టర్ – ౩ గోవిందరావు తెలిపారు. బుధవారం నాడు   జాయింట్ కలెక్టరు , ఆర్ డి ఓ, పి.కిశోర్ తో  కలిసి మారికవలసలోని  గిరిజన  బాలికల కళాశాల భవనంలో   ఏర్పాటు చేసిన వంటశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసారు.  ప్రభుత్వ మానసిక వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా.నాగరాజు, డిప్యూటీ తాహశీల్దార్  రవి కుమార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ నరసింహ మూర్తి కోవిడ్ కేర్ సెంటర్ లోని రోగుల ఆరోగ్య పరిస్థితిని, భోజన , వసతి వివరాలను వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు  మాట్లాడుతూ విశాఖనగరంలో కోవిడ్ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో   ఉంచి ,  24గంటలు  వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.  మొత్తం 12 మంది డాక్టర్లు, 6 మంది నర్సులు, వున్నారని , మూడు  భవనాలలో ప్రతి షిప్టులోను 1 డాక్టరు, 1  నర్సు  ఉంటారని తెలిపారు.  ఎవరికైనా  అనారోగ్య పరిస్ధితి తలెత్తితే తక్షణమే  అంబులెన్స్ లో  కోవిడ్ ఆసుపత్రికి  తరలిస్తారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భోజన , వసతి సౌకర్యాలను  పరిశీలించామని తెలిపారు. శ్రీ చైతన్య  కాలేజీ భవనాల లో మూడు బ్లాకులు ఉన్నాయని,  అందులో అబ్దుల్ కలామ్  భవనంలో ఇప్పటి వరకు 379 మంది ఎడ్మిట్ కాగా 164 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారని, 71 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 9 మందిని  కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసామని తెలిపారు. ప్రస్తుతం 135 మంది మహిళా పేషెంట్లు ఉన్నారని ఈ భవనాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారని తెలిపారు.ఈ భవనంలో మొత్తం 390 బెడ్స్ ఉన్నాయని తెలిపారు.  భగీరద బ్లాక్ లో  180 రూమ్ లు , 500 బెడ్స్ ఉన్నాయని, ఇప్పటివరకు 293 మంది ఎడ్మిట్ కాగా, 13 మంది డిశ్చార్జి  అయ్యారని, 20 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 8 మందిని కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు.  ప్రస్తుతం 252 మంది పేషంట్లు ఉన్నారని తెలిపారు.   వాల్మీకి బ్లాక్ లో 160 రూమ్ లు,  480 బెడ్స్ ఉన్నాయని తెలిపారు.  ఇప్పటి వరకు 516 మంది ఎడ్మిట్ కాగా, ఒకరు డిశ్చార్జి  అయ్యారని, 241 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 14 మందిని కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం  260 మంది  పేషంట్లు ఉన్నారని  అందులో  155 మంది పురుషులు, 105 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.  వీరికి  ఉదయం 7గంటలకు రాగి జావ, పాలు ఇస్తున్నారని, ఉదయం 8.30 గంటలకు అల్పాహారంగా ఇడ్లీ, వడ , పూరి, చపాతి, టీ, కాఫీలు ఇస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనంలో రోటి, రైస్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర, పప్పు,  సాంబారు, పెరుగు, అరటిపండు ఇస్తున్నారని తెలిపారు. సాయంత్రం 4గంటలకు  టీ, కాఫీ ఇస్తున్నారని తెలిపారు.  రాత్రి 7.30 గంటలకు  భోజనంలో రోటి, రైస్, గుడ్డు, వెజిటెబుల్ కర్రీ, ఆకుకూర,  పప్పు, సాంబారు, పెరుగు, అరటి పండు ఇస్తున్నారని తెలిపారు.  

Visakhapatnam

2020-07-29 18:59:49

వి ఎస్ ఎస్ భూములకు అటవీ హక్కుపత్రాలు..రంజిత్ భాషా

 గిరిజన రైతులు వనసంరక్షణ సమితీల్లో సాగుచేస్తున్న అటవీ భూములకు అటవీ హక్కుపత్రాలు అందిస్తామని గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా పేర్కొన్నారు. బుధవారం పాడేరు మండలం గుర్రగరువు,మోదాపల్లి గ్రామాల పరిధిలోని వన సంరక్షణ సమితీల్లో సాగుచేసిన కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీతోటల్లో గిరిజన రైతులతో ముచ్చటించారు. ఎన్ని ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు ? గత ఏడాది కాఫీ పంట,మిరియాలు పంటలపై వచ్చిన ఆదాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోదాపల్లి గ్రామంలో కాఫీ రైతులతో సమావేశ మయ్యారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతీ గిరిజన రైతులకు వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున అటవీ హక్కుపత్రాలు మంజూరు చేస్తామన్నారు. అటవీ హక్కుపత్రాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అన్నారు. బ్యాంకుల రుణాలు పొంద వచ్చని చెప్పారు. అటవీ హక్కులు పొందిన గిరిజన రైతులకు 150 రోజులు ఉపాధి పని కల్పిస్తామని, ఉపాధిహామీలో ఆయా భూములను అభివృధ్ది చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులు కాఫీ కల్లాలు, తార్పాలిన్లు మంజూరు చేయాలని కోరారు. తాగునీటి పధకాలను మంజూరు చేయాలన్నారు. మోదాపల్లిలో 49 క్లైములు, గుర్రగరువులో 22 క్లైములు వచ్చాయని రెవెన్యూ అధికారులు వివరించారు. అనంతరం సంగోడి ఎపి ఎఫ్ డిసి కాఫీ తోటలు పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో అటవీశాఖ,రెవెన్యూ అధికారులతో సమావేశమై అటవీ హక్కుపత్రాలు జారీ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల,డి ఎఫ్ ఓ వినోద్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. చినబాబు , కాఫీ ఎడి రాధాకృష్ణ, తాహశీల్దార్ ప్రకాశరావు, సబ్ అసిస్టెంట్ అప్పలనాయుడు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.

Paderu

2020-07-29 18:48:15

కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్..ప్రభుత్వ ఆదేశాలు

బక్రీద్ పండగను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదులు, ఈద్గాలలో చేసుకోవచ్చని జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి ఎం.అన్నపూర్ణమ్మ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆగష్టు 1వ తేదీన బక్రీద్ పండగ ఉందని, బక్రీద్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అనుసరించి నిర్వహించుకోవాలని ఆమె స్పష్టం చేసారు. 65 సం.లు పైబడిన వారు, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, హృద్రోగ సమస్యలు, ఇతర దీర్ఘకాల సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించరాదని ఆమె అన్నారు. మసీదుల వద్ద జరుగు ప్రార్ధనలలో ఒకసారి 50 మంది ముజల్లీ కి మాత్రమే అనుమతించడం జరిగిందని అన్నపూర్ణమ్మ చెప్పరు. వ్యక్తుల మధ్య విధిగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని అన్నారు. మసీదులు, ఈద్గాలను పూర్తిగా శానిటైజర్ తో శుభ్రపరచాలని ఆమె సూచించారు. చరవాణిలలో "ఆరోగ్యసేతు యాప్' ను డౌన్ లోడ్  చేసుకోవాలని అన్నారు. ప్రార్ధనకు ఎవరి తివాచీ వారు తీసుకు రావాలని సూచించారు. మత పెద్దలు, కమిటీ నిర్వహకులు తగు శ్రద్ద తీసుకొని కరోనా మహమ్మారి భారీన పడకుండా మైకు ద్వారా రక్షణాత్మ సూచనలు చేయాలని, మసీదులు, ఈద్గాల వద్ద కరోనాపై అవగాహన కలుగుటకు ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రార్ధనలలో విధిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతికి గ్లోవ్స్ ధరించాలని, చేతులను తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని ఆమె చెప్పారు.  మసీదు, ఈద్గాల పరిసరాలలో ఉమ్మి వేయరాదని ఆమె పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఆచరించే కరచాలనాలు, ఆలింగనాలు చేయరాదని అన్నారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎవరికి వారే రక్షణ చర్యలు చేపట్టాలని, మీరు మీ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండాలని పేర్కొంటూ సురక్షిత జీవనంలో అందరూ భాగస్వామ్యం వహించుటకు ప్రార్ధనలు చేయాలని కోరారు. కరీనాకి నువ్వు ఒక ప్రాణం మాత్రమే, కానీ కుటుంబానికి నువ్వొక అమూల్యమైన మనిషివి - మన భద్రత మనమే తీసుకోవాలి అని ఆమె పిలుపునిచ్చారు.

Srikakulam

2020-07-29 14:59:53

ఆన్ లైన్ లో జాతీయ స్ధాయి సెమినార్లు..బీఆర్ యు విసి

కోవిడ్ 19 మహమ్మారితో విద్యాలయాల పరిస్ధితి, విద్యార్ధుల భవిత ప్రశ్నార్ధకం కాగా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోగల డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళుతోంది. కోవిడ్ 19 మహమ్మారి ఒక వైపు నుండి ప్రజలను కదలనీయని స్ధితిలోకి నెట్టడంతో విద్యార్ధులు తరగతి గదుల్లో బోధనలు కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలో విశ్వవిద్యాలయం జూన్ నెల నుండి ఆన్ లైన్ లో వివిధ సెమినార్లను నిర్వహిస్తూ విద్యార్ధులు, ఆచార్యులు తమ పరిజ్ఞానం పెంపొందించుకోవడం, ఇతరులతో పంచుకోవడం జరిగింది. తాజాగా ఉన్నత పాఠశాల విద్యార్ధుల నుండి పోస్టు గ్రాడ్యుయేట్ స్ధాయి వరకు తమలో నిఘూడంగా దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి విశ్వవిద్యాలయం ఒక మంచి ప్రయత్నం ప్రారంభించింది. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ రిసెర్చ్ డెవలప్ మెంటు కార్పొరేషన్, లారస్ లాబ్ ల సౌజన్యంతో విద్యార్ధుల సృజనాత్మక శక్తులను వెలికితీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగష్టు 8వ తేదీ వరకు విద్యార్ధుల నుండి వివిధ అంశాలపై మోడల్స్, పత్రాలు స్వీకరిస్తుంది. సమర్పంచిన మోడల్స్, పత్రాల్లో అత్యుత్తమ అంశాలను ఎంపిక చేసి బహుమతులను కూడా భారీగా అందజేయుటకు నిర్ణయించింది. మూడు  మొదటి బహుమతులుగా లక్ష రూపాయలు చొప్పున, మూడు ద్వితీయ బహుమతులకు రూ.50 వేలు చొప్పున, మూడు తృతీయ బహుమతులుగా రూ.25 వేలు చొప్పున అందించనున్నారు.         విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పొఫెసర్ కె.రఘుబాబు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విద్యార్ధులకు తరగతులు నిర్వహించే పరిస్ధితి లేదన్నారు. ఈ తరుణంలో విద్యార్ధుల తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయుటకు సెమినార్లను ఉద్దేశించామని చెప్పారు. హైస్కూల్ నుండి పి.జి స్ధాయి విద్యార్ధులు ఇందులో పాల్గొనుటకు అవకాశం కల్పించామని, ప్రతి బృందంలో 5 గురు వరకు విద్యార్ధులు, ఒక మెంటార్ ఉండవచ్చని ఆయన చెప్పారు. ఆగష్టు 8వ తేదీ నాటికి విద్యార్ధులు తమ వ్యాస పత్రాలు, మోడల్స్ సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలు, మోడల్స్ ను ఆగష్టు 9 నుండి 14వ తేదీ మధ్య ఆన్ లైన్ లో విద్యార్ధులు ప్రదర్శించాలని చెప్పారు. వాటిలో  అత్యుత్తమ మోడల్స్ ఎంపిక చేసి ఆగష్టు 15వ తేదీన తుది ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని రఘు పేర్కొన్నారు. దేశం నలుమూలల నుండి విద్యార్ధులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొంటూ ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర గణనీయంగా ఉందని, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి సూచనలు సలహాలు అందించాలని కోరారు. ఆన్ లైన సెమినార్లపై విద్యార్ధులకు, మెంటార్లకు అవసరమగు సమాచారం కోసం ప్రొఫెసర్ కె.రఘుబాబు, 9440114243 లేదా drraghualways@yahoo.co.in కు సంప్రదించవచ్చని చెప్పారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.brau.edu.in ను కూడా సంప్రదించవచ్చని ఆయన వివరించారు.

Srikakulam

2020-07-29 14:56:44

ఎం.ఎస్.ఎం.ఇలు ఉద్యం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలు(ఎం.ఎస్.ఎం.ఇలు) ఉద్యం రిజిస్ట్రేషన్ విధిగా చేయించుకోవాలని  జిల్లా పరిశ్రమల కేంద్రం  జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ  బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్.ఎం.ఇలను తరగతి వారీగా నమోదు చేయు విధానాన్ని సరళీకృతం చేసి  జూలై 1వ తేదీ నుండి ఉద్యం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎం.ఎస్.ఎం.ఇలు ఇప్పటి వరకు ఉద్యోగ్ ఆధార్ మెమోరాండమ్(యు.ఎ.ఎం)లో నమోదు చేసే వారని ఇకపై ఉద్యం రిజిస్ట్రేషన్ లోనే నమోదు చేయాలని సూచించారు. యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి కోటి రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 5 కోట్లు వరకు ఉన్న పరిశ్రమలను సూక్ష్మ తరహా పరిశ్రమలుగాను., యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి 10 కోట్ల రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 50 కోట్లు వరకు ఉన్న  చిన్నతరహా పరిశ్రమలుగాను., యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి 50 కోట్ల రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 250 కోట్లు వరకు ఉన్న మధ్యతరహా పరిశ్రమలుగాను కేంద్ర ప్రభుత్వం విభజించిందని వివరించారు. ఈ విభజన ప్రకారం ఉత్పత్తి ప్రారంభించిన  పరిశ్రమలు, సంబంధించిన పారిశ్రామిక వేత్తలు http://udyamregistration.gov.in లో వివరాలు నమోదు చేసుకొని ఉద్యం రిజిస్టేషన్ ను పొందవచ్చని చెప్పారు. గతంలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు, తీసుకోనివారు, పార్ట్- రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు, తీసుకోనివారు, ఉద్యోగ ఆధార్ తీసుకున్న వారు, తీసుకోనివారుతో సహా ఇంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోని పాత వారు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన వారు అందరూ కూడా తప్పనిసరిగా ఉద్యమం రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన స్పష్టం చేసారు. రిజిస్ట్రేషన్ పొందని ఎం.ఎస్.ఎం.ఇలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏటువంటి సహాయం ఉండదని ఆయన వివరించారు.  ఈ విషయాన్ని ఎం.ఎస్.ఎం.ఇ రంగంలోని వారు వెంటనే ఉద్యం రిజిస్ట్రేషన్ పొందాలని ఆయనసూచించారు.

Srikakulam

2020-07-29 14:53:00

శంఖవరం మండలంలో 47కి చేరిన కరోనా కేసులు..

శంఖవరం మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ ల సంఖ్య 47కి చేరుకుందని పీహెచ్సీ వైద్యాధికారి ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శంఖవరంలో 22, మండపంలో 4, పి.చామవరం1, స్రుంగవరం9, బంగారయ్యపేట1, గిడిజాం1, రౌతులపూడిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. పాజిటివ్  వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు చేయనున్నట్టు చెప్పారు. వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు, తరచుగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు. పాజిటివ్ వచ్చినవారందరికీ హోమ్ ఐసోలేషన్ ద్వారా చికత్స అందిస్తున్నట్టు డాక్టర్ వివరించారు. మరోవైపు కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది..

Sankhavaram

2020-07-29 14:24:13

ఏపీలో మనం అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్నాం..సీఎం

రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజుకు 50వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే అని ముఖ్యమంత్రి అన్నారు. 90శాతం పరీక్షలు కొవిడ్‌ క్లస్టర్లలో చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని,  కొవిడ్‌ వస్తుంది.. పోతుంది.. కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 85శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, డిఎంహెచ్ఓ ఎం.చెంచయ్య, డిఇ ఓ కె.చంద్రకళ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-07-28 20:20:03