1 ENS Live Breaking News

వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం రూ.4.39కోట్లు..

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.439 కోట్లు ఆదాయం వచ్చిందని టిటిడి పేర్కొంది. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 42 వేల825 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇంకా తొమ్మిదిరోజుల పాటు ఉత్తర ద్వార దర్శశనం కల్పించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు  చేసినట్టు వివిరించిన టిటిన విఐపీలకు ప్రత్యేక సమయంలోనే దర్శనాలు కల్పిస్తున్నట్టు తెలియజేసింది. ఈ పదిరోజుల పాటు విఐపీలకు తప్పా వారి లేఖలో వచ్చిన వారికి దర్శనాలు కల్పించడం లేదని పేర్కొంది. అధిక సంఖ్యలో భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలనే సంకల్పంతో చేసిన ఏర్పాట్లకు భక్తులు సహరించాలని టిటిడి పేర్కొంది..

Tirumala

2020-12-26 13:58:27

ప్రయాణీలకులంతా ఐఆర్‌సీటీసీ వైపే చూడాలి..

ఉత్తమ రైలు ప్రయాణం కోసం ప్రయాణీకులకు సమగ్ర సౌలభ్యాన్ని అందించేలా ఈ-టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌ ఉండాలని  రైల్వే శాఖ మంత్రి  పీయూష్‌ గోయల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఐఆర్‌సీటీసీ ఈ-టిక్కెటింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ప్రజల రైలు ప్రయాణ అవసరాలు తీర్చేలా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ ఖరారు చేసుకునే అవకాశాన్ని రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ అందించాలన్నారు.  టిక్కెట్ల బుకింగ్‌, ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజా అనుభవాలను మెరుగుపరిచే అంశానికి 2014 నుంచి ప్రాధాన్యత పెరిగిందన్నారు. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు మొదట ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ వైపే చూసేలా చేయాలన్న రైల్వే శాఖ మంత్రి, వారి అనుభవం స్నేహపూర్వకంగా, సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. 'డిజిటల్‌ ఇండియా'లో భాగంగా, ఎంతోమంది ప్రజలు రైలు టిక్కెట్ల కోసం రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారని, అందువల్ల ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించే ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెబ్‌సైట్‌ పనితీరు మెరుగుదల కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని రైల్వే అధికారులు  గోయల్‌కు వెల్లడించారు.

New Delhi

2020-12-25 20:41:17

సుపరిపాలకు ఈ-సంపద యాప్ దోహదం..

దేశంలో సుపరిపాలనా ప్రక్రియకు ప్రోత్సాహం అందించడంలో గణనీయమైన ముందడుగు పడుతున్నాయని  కేంద్రమంత్రి హర్ దీప్ ఎస్. పూరి అన్నారు. శుక్రవారం డిల్లీలో ఈ సందపద యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వసతుల కేటాయింపు, క్రమబద్ధీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీ వంటి ఎస్టేట్ సంబంధమైన సేవలను అందించడంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకు యాప్ దోహదపడుతుందన్నారు.  దేశవ్యాప్తంగా ఒకే రకమైన సరళతరమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ-సంపద యాప్ ను రూపొందించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు సౌకర్యంగా ఉండేలా తగిన సేవలందించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుందన్నారు. అప్లికేషన్లను అధికారులు ఎప్పటికప్పుడు నేరుగా ట్రాక్ చేసుకునేందుకు ఏక గవాక్ష సదుపాయంగా ఇది పయోగపడుతుందన్నారు. దీనితో వనరులను గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుంటుందని, మానవ ప్రమేయం ఎక్కువగా లేనందున ఇది మరింత పారదర్శకతకు కూడా దోహదపడుతుందని అన్నారు.   మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ, వినియోగదారుల సదుపాయంకోసం అనేక ప్రత్యేక ఆకర్షణలు, సదుపాయాలతో ఈ-సంపద యాప్ రూపొందిందన్నారు. పర్సనలైజ్డ్ డ్యాష్ బోర్డు, సర్వీసు యూసేజ్ ఆర్కివ్, లైసెన్స్ ఫీజు, బకాయిలు వంటి అంశాలపై వాస్తవ పరిస్థితిని తెలియజెప్పే సదుపాయం కలిగి ఉండటం ఈ యాప్ ప్రత్యేకతలని అన్నారు. ఇది వినియోగదారులకు ఎంతో అనువుగా ఉంటుంది, తమకు అందే సేవలను ప్రత్యక్షంగా చూసే సదుపాయం, తమ స్పందనను కూడా తెలియజేసే సదుపాయం కూడా ఉంటుందన్నారు.  ఫిర్యాదులు దాఖలుకు, పత్రాలు సమర్పణకు, వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరు కావడానికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆన్ లైన్ సదుపాయంగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఏ సేవకైనా ఎస్టేట్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఎక్కువసార్లు వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అసరం లేకుండా ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చునని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

New Delhi

2020-12-25 20:32:52

కరోనా వాక్సిన్ మరిన్ని ఫలితాలనివ్వాలి..

దేశీయ కరోనా వాక్సిన్ మంచి ఫలితాలనిచ్చేదిగా తయారు కావాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకింక్షించారు. భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా భారత వైస్ ప్రెసిడెంట్ ఎం. వెంకయ్య నాయుడిని ఈ రోజు హైదరాబాద్‌లో కలిశారు. స్వదేశీ వ్యాక్సిన్ యొక్క స్థితి, భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో అందుబాటులో ఉంచే ప్రణాళికలపై చర్చించారు. ఈ వ్యాక్సిన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఈ స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ యొక్క బిఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైనేషన్ సదుపాయంలో అభివృద్ధి చేసి తయారు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించి కోవాక్సిన్ స్థితిని సమీక్షించారు. దాని తరువాత హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కేంద్రాన్ని వివిధ దేశాల నుండి 70 మంది రాయబారులు, హైకమిషనర్లు సందర్శించారు. ఈ చర్చ సందర్భంగా దేశీయంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీలోప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. అలాగే ఐసిఎంఆర్ భారత్ బయోటెక్ మధ్య సహకారాన్ని ప్రశంసించారు.

New Delhi

2020-12-25 20:21:25

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  శ‌ర‌ద్ అర్వింద్ బాబ్డే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ‌వారిని ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఆల‌య మ‌హ‌ద్వారం వ‌ద్దకు చేరుకున్న  బాబ్డే కి టిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో టిటిడి ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.  శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం  బాబ్డే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, చిత్రప‌టం అందించారు. జిల్లా జ‌డ్జి  ర‌వీంద్ర‌బాబు, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, అర్బ‌న్ ఎస్పీ  ర‌మేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2020-12-25 19:55:01

ప్రజా సమస్యలకు సాంకేతికతోనే పరిష్కారం..

సామాన్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే శాస్త్ర, సాంకేతిక రంగ ప్రయోగాల అంతిమ లక్ష్యం కావాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బాల్యంనుంచే చిన్నారుల్లో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందింప జేయాలని.. ఆయన సూచించారు. ప్రశ్నలకు జవాబులు చెప్పే విధానానికి బదులు.. వారిలో ఉత్సుకతను పెంచి ప్రశ్నలు అడిగే తత్వంతో చిన్నారులను ప్రోత్సహించాల్సిన విధానాలను పెంపొందించుకోవాలని  సూచించారు. ‘ఆత్మనిర్భరత, ప్రపంచ సంక్షేమంలో సైన్స్ పాత్ర’ అనే అంశంపై.. సీఎస్ఐఆర్, విజ్ఞాన భారతితో పాటు పలు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ ముగింపును పురస్కరించుకుని అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. స్వదేశీ తయారీ కరోనా టీకా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందన్న ఆయన, ఈ టీకా తయారీలో అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలను అభినందించారు.  కరోనాకు ముందు భారతదేశంలో లేని పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, కరోనా పరీక్షల కిట్ల తయారీలో భారతదేశం పాత్రను.. గత ఐదారు నెలల్లో ఈ అంశాల్లో సాధించిన ప్రగతిని, వివిధ దేశాలకు ఎగుమతి చేసే స్థితికి చేరుకోవడం.. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో దేశం ముందుకెళ్తున్న తీరును అర్థం చేసుకోవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు. కరోనా టీకా గురించి సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి భయాందోళనలకు అక్కర్లేదని ఆయన సూచించారు. ప్రజల్లో టీకా హేతుబద్ధతపై విశ్వాసం పెరగాలని సూచించారు. సైన్స్ మానవాభివృద్ధికి జీవనరేఖ అని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, శాస్త్రీయ దృష్టికోణాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ దృష్టికోణం ద్వారా శాస్త్రీయ పరిశోధన పద్ధతిపై ఆసక్తి పెరుగుతుందని, అది మానవజీవనాన్ని మరింత సరళీకృతం చేసేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయ రంగంలో భారతదేశానికి ఘనమైన చరిత్ర ఉందని, ఈ రంగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ అనే మనదేశ మూలతత్వాన్ని, సాధించిన ప్రగతిని మిగతావారితో పంచుకోవడమనే సిద్ధాంతాన్ని భారత్ నాటినుంచీ కొనసాగిస్తూ వస్తోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఎన్నో పరిశోధనలు చేసిన భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరైన శ్రీ జగదీశ్ చంద్రబోస్ ఏనాడూ పేటెంట్ హక్కులకోసం ప్రయత్నించలేదన్న ఆయన, ఆ స్ఫూర్తినే నేటికీ కొనసాగిస్తున్న భారత్ ప్రపంచ ఫార్మాసూటికల్ హబ్ గా గుర్తింపు పొందినప్పటికీ, ప్రపంచానికి అవసరమైన మందులను అందించడంలో ఏనాడూ వెనుకంజవేయలేదన్నారు. కరోనా సమయంలోనూ భారతదేశ సేవానిరతిని ప్రపంచం గమనించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశం సాధించిన ప్రగతికి మన పౌరులంతా గర్వపడాలన్న ఉపరాష్ట్రపతి, ఈ ప్రేరణతో ప్రపంచ పరిశోధనల కేంద్రంగా భారత్ ను నిలిపే దిశగా బాల్యంనుంచే చిన్నారుల్లో శాస్త్ర, సాంకేతిక రంగంపై ఆసక్తిని పెంపొందింపజేయాలని, యువత కూడా ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం, ఆసక్తి ఉంటాయన్న ఉపరాష్ట్రపతి, ఆ ఆసక్తికి చిన్నప్పటినుంచే సానబెట్టడం ద్వారా వారిని ప్రోత్సహించాలన్నారు. కొత్త విషయాలను కనుగొనేలా వారికి నిరంతర మార్గదర్శన చేయడంపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధనల రంగంపై భారతదేశం మరింత దృష్టిపెట్టి సుస్థిరాభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందన్న ఉపరాష్ట్రపతి, మన అంతరిక్ష పరిశోధల కార్యక్రమం ద్వారా ఆత్మనిర్భరతను ఎలా సాధించవచ్చో నిరూపించామన్నారు. ఎలక్ట్రానిక్స్, రక్షణ వంటి కీలక రంగాల్లో ఆత్మనిర్భరతను పెంపొందించే దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు, ప్రైవేటు రంగం కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని, మనదేశ యువశక్తి సామర్థ్యానికి పదునుపెట్టి, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఐఐఎస్ఎఫ్ చైర్మన్ డాక్టర్ శేఖర్ మండే, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, భూవిజ్ఞానశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్, విజ్ఞాన భారతి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ జయంత్ సహస్రబుద్ధే, ఐఐఎస్ఎఫ్ చీఫ్ కొ-ఆర్డినేటర్ డాక్టర్ రంజన్ అగర్వాల్‌తోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

New Delhi

2020-12-25 19:42:48

అటల్ కి అమిత్ షా ఘన నివాళులు..

దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.  శుక్రవారం ఢిల్లీలో వాజపేయి స్మారక స్థలి వద్ద ఈరోజు అమిత్ షా పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ,  అటల్ జి ఆలోచనలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి మాకు దేశం కోసం అంకితభావంతో పనిచేదానికి స్ఫూర్తిని ఇస్తాయి" అని పేర్కొన్నారు. " దేశంలో అభివృద్ధి శకం, సుపరిపాలన వాజపేయి తో ప్రారంభం అయ్యాయి. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వాజపేయి దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ అటల్ స్ఫూర్తిగా దేశాభివృద్ధికి పనిచేస్తాము' అని అమిత్ షా పేర్కొన్నారు.  

New Delhi

2020-12-25 19:34:34

బెంగాల్ ను సర్వ నాశనం చేశారు..

పశ్చిమ బెంగాల్‌ను సీఎం మమతా బెనర్జీ తన సొంత సిద్ధాంతాలతో  సర్వ నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. స్వార్థ రాజకీయాల కోసం 70 లక్షల మంది రైతులకు పీఎం- కిసాన్‌ యోజన ఫలాలు అందకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన కింద తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా రూ. 18 వేల కోట్ల నిధులను శుక్రవారం విడుదల చేసిన మోదీ.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్‌లో నిరసనలు వ్యక్తమవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూర్చే పీఎం- కిసాన్‌ పథకాన్ని బెంగాల్‌లో అమలు చేయడం లేదు. అర్హులైన రైతులు ఒక్కొక్కరికి 2 వేల రూపాయల మేర.. మొత్తంగా రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తున్నాం. వాటిని నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫలాలు వారికి చేరకుండా చేస్తోంది. అప్పుడు ఆందోళనలు జరగలేదు. కానీ ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్నారు. దేశమంతా ఈ పథకం వల్ల లబ్ది పొందుతోంది.  కానీ ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే రాజకీయాల కోసం అర్హులైన రైతులకు నష్టం వాటిల్లుతోంది. సీఎం మమత 15 ఏళ్ల క్రితం చేసిన ప్రసంగాన్ని ఓ సారి పరిశీలిస్తే.. ఆమె సిద్ధాంతం బెంగాల్‌ను ఎంతగా నాశనం పట్టించిందో అర్థమవుతుంది. ఈ స్వార్థ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సొంత రాష్ట్రంలో రైతులను పట్టించుకోని వారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరిట ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వారికి మాత్రం మద్దతు పలుకుతున్నారు’’ అని ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కారు తీరును విమర్శించారు. కాగా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, అధికార టీఎంసీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు ఆశక్తిని రేకిత్తించాయి..

New Delhi

2020-12-25 19:31:03

తిరుమలలో వేడుక‌గా స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం..

తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్ర‌వారం స్వర్ణరథోత్సవం వేడుక‌గా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. టిటిడి మ‌హిళా ఉద్యోగుల‌తోపాటు మ‌హిళ‌లు పాల్గొని ర‌థాన్ని లాగారు. ఆల‌య మాడ వీధుల్లో స్వ‌ర్ణ‌ర‌థంపై విహ‌రించిన శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని గ్యాల‌రీల్లో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో మాడ వీధులు మారుమోగాయి.   శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు. డిసెంబ‌రు 26న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం         వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబ‌రు 26న శ‌నివారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్వామి పుష్క‌రిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  డిపి.అనంత‌, డా.నిశ్చిత‌,  కుమార‌గురు, సివిఎస్వో  గోపినాథ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజివో  బాలిరెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-25 19:05:01

ధన్బాద్-అలప్పీల మధ్య ప్రత్యేక రైలు..

 ప్రయాణీకుల అదనపు రద్దీని తొలగించడానికి ధన్బాద్-అలప్పీ ల మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాఠి తెలియజేశారు. శుక్రవారం ఆయన విశాఖలోని రైల్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ,   జనవరి 1 నుంచి అమల్లోకి ప్రత్యేక రైలు సర్వీసులను 03351/03352 ధన్బాద్- అలప్పుజ- ధన్బాద్ మధ్య విశాఖపట్నం ద్వారా నడుపుతున్నామన్నారు.  రైలు నెంబర్ 03351 ధన్బాద్ - అలప్పుజ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ 11.40 గంటలకు ధన్బాద్ నుండి జనవరి 1, 2021 నుండి బయలు దేరుతుంది, ఇది మరుసటి రోజు 08.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.  08.35 గంటలకు బయలుదేరి గమ్యం అలప్పుకి 15.25 గంటలకు చేరుకుంటుంది.                    రైలు నెం .03352 అలప్పుజ- ధన్‌బాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ 06.00 గంటలకు అలప్పుజ నుండి బయలుదేరి 04 జనవరి -2021 నుండి అమల్లోకి వస్తుంది, ఇది మరుసటి రోజు 13.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది మరియు 13.30 గంటలకు బయలు దేరుతుంది, 10.20 గంటలకు గమ్యం ధన్‌బాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు హర్సాగూడ, సంబల్పూర్ రోడ్, బార్హాస్ రోడ్డు, బార్పాలి, బలంగీర్, టిట్లాఘర్, కేసింగా, మునిగుడ, రాయగడ, పార్వతిపురం టౌన్, పార్వతిపురం, బొబ్బిలి, విజయనగరం, కొట్టవళవవ, తీపావాలవ, కోశావళవవ స్టేషన్లలో ఆగుతుందన్నారు. అంతేకాకుండా ఈ  రైళ్లలో సెకెండ్ ఎసి -1, థర్డ్ ఎసి -2, స్లీపర్ క్లాస్ -12, సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కోచ్‌లు -2, ప్యాంట్రీ కార్ -1 ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళు సమయాలకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయించుకోవాలని కోరారు.

Visakhapatnam

2020-12-25 18:58:48

టిటిడికి రూ.2.54 కోట్లు విరాళం..

వైకుంఠ ఏకాద‌శి రోజు తిరుమల తిరుపతి దేవస్థానాని కి రూ.2.54 కోట్లు విరాళంగా అందాయి.  ఈ మేరకు శుక్ర‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు కుమార‌గురు త‌న సొంత ప్రాంత‌మైన త‌మిళ‌నాడు రాష్ట్రం ఊలందూరుపేట‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణం కోసం  ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. అదేవిధంగా, హైద‌రాబాద్‌కు చెందిన  ఇంద్ర‌కుమార్ అనే భ‌క్తుడు టిటిడి విద్యాదాన ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు, ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.54 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. ఈ మేర‌కు దాత‌లు విరాళాల డిడిల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.

Tirumala

2020-12-25 18:31:23

కేరళ మేయర్ గా ఆర్య రాజేంద్రన్..

కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్​గా ఆర్య రాజేంద్రన్(21) బాధ్యతలు చేపట్టనున్నారు. సీపీఎం జిల్లా సచివాలయ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయితే కేరళలో మేయర్​ అయిన అత్యంత పిన్నవయస్కురాలిగా ఆర్య చరిత్ర సృష్టించనున్నారు. ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఎస్​ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం పురపాలక సంస్థ ఎన్నికల్లో ముడవన్​ముగల్​ వార్డు నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి, గెలిచారు ఆర్య. సిపిఎం సిద్ధాంతాల మేరకు యువతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి క్రియాశీలకంగా తీసుకురావాలనే నిర్ణయంతో ఈమెను మేయర్ అభ్యర్ధిగా పార్టీ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్య హాట్ టాపిక్ అయ్యింది. సంచనాలకు కేంద్ర బిందువుగా వున్న కేరళలో సిపిఎం 21ఏళ్ల ఆర్యను నగర మేయర్ గా చేసి రికార్డు స్రుష్టించింది.

Thiruvananthapuram

2020-12-25 16:29:57