1 ENS Live Breaking News

భారత ఆర్ధిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది..

కరోనా మహమ్మారి కారణంగా కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపించిన భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మళ్లీ ప్రగతిబాట పడుతుందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రగతిపథంలో భారత కార్పొరేట్ రంగం మరింత చొరవతీసుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) జాతీయ ఈ-స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెను ప్రభావాన్ని చూపించినప్పటికీ.. భారతదేశం సమిష్టిగా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో కొంతమేర విజయం సాధించిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా  కేంద్రప్రభుత్వంతీవ్రంగాకృషిచేస్తోందన్నారు.  కరోనాను ఎదుర్కోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్  క్రిస్టాలినా జార్జీవా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.  ఐసీఎస్ఐవంటిసంస్థలుఉత్తమకార్పొరేట్పాలనాపద్ధతులనుఅవలంబిస్తూ.. మరింతకృషిచేయాలనిఆయనసూచించారు.ఏ సంస్థ పురోగతైనా.. ఆ సంస్థలో అనుసరించే పద్ధతులపైనే ఆధారపడి ఉంటుందని.. ఆయా సంస్థల్లో పారదర్శకత, సమగ్రత, నిజాయితీ వ్యవస్థను నెలకొల్పడంతోపాటు నైతికతకు పెద్దపీట వేయడంలో కంపెనీ సెక్రటరీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో ముందుకెళ్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కంపెనీ సెక్రటరీల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రొఫెషనల్‌గా ఉండటంతోపాటు చట్టబద్ధంగా కంపెనీలు పనిచేయడంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఇందుకోసం ఉత్తమ పద్ధతులను అవలంబించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. నియమాలను, విలువలు, ప్రమాణాలు పాటించేలా కంపెనీ యాజమాన్యాలకు మార్గదర్శనం చేయాలని.. కంపెనీ సెక్రటరీలకు సూచించారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేసేందుకు జరుగుతున్న విధానపర నిర్ణయాల అమల్లో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ.. ఒక్క వ్యవసాయరంగమే.. ఉత్పత్తితోపాటు సాగు కూడాను పెంచి భారతదేశ ఆహారభద్రతను సునిశ్చితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.భారతదేశంలో యువశక్తికి కొదువలేదని.. కావాల్సిందల్లా ఆ శక్తికి నైపుణ్యాన్ని అందించి ఆత్మనిర్భర భారత నిర్మాణానికి సిద్ధం చేయడంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఏ రంగంలో ఉన్నవారైనా మన పురాణేతిహాసాలను చదివి అందులోని నైతిక విలువలు, మన బాధ్యతలను అవగతం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దీంతోపాటుగా.. వైభవోపేతమైన భారతదేశ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. జాతీయవాదాన్ని అలవర్చుకుని.. ప్రతి అడుగులోనే దేశ శ్రేయస్సును నింపుకుని పనిచేయాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో, ఆ తర్వాత ఆధునిక భారత నిర్మాణం కోసం శ్రమించిన సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానుభావుల గురించి అధ్యయనం చేయాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు. శారీరక దారుఢ్యంతోనే మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందన్న ఉపరాష్ట్రపతి.. కంపెనీ సెక్రటరీలు తీవ్రమైన పని ఒత్తిడిలో పనిచేస్తున్నప్పటికీ.. యోగ, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని సూచించారు.భారత్‌తోపాటు దుబాయ్, అమెరికా, బ్రిటన్, సింగపూర్‌ల్లోనూ ఐసీఎస్ఐ కార్యకలాపాలు ప్రారంభవడాన్ని ఉపరాష్ట్రపతి హృదయపూర్వకంగా అభినందించారు.పర్యావరణ పరిరక్షణ పైనా కంపెనీ సెక్రటరీలు ప్రత్యేక దృష్టి సారించాలని.. తమ దైనందిన కార్యకలాపాల్లో ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తూ.. భాగస్వామ్యపక్షాలందరిలో పర్యావరణ స్పృహను పెంచడంతోపాటు.. వ్యాపార కేంద్రాలు, పరిశ్రమల వద్ద ప్రకృతి పరిరక్షణ జరిగేలా చొరవతీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ,ఐసీఎస్ఐ అధ్యక్షుడు ఆశిష్ గార్గ్, సంస్థ కార్యదర్శి ఆశిష్ మోహన్, సహకార్యదర్శి అంకుర్ యాదవ్‌తోపాటు కంపెనీ సెక్రటరీలు, కంపెనీ సెక్రటరీ పట్టభద్రులు ప్రత్యక్షంగా, దేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాలనుంచి ఆన్‌లైన్ వేదిక ద్వారా పాల్గొన్నారు.

Hyderabad

2021-01-18 14:53:08

2021-01-16 18:48:32

2021-01-08 11:54:29

2021-01-06 10:55:28

గ్యాస్ ప్రాజెక్టు ప్రారంభించిన మోదీ..

కేరళ రాష్ట్రం లోని కొచ్చి-మంగ‌ళూరు మ‌ధ్య 3 వేల కోట్ల వ్యయం తో నిర్మించిన న్యాచుర‌ల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేరళ, కర్నాటక రాష్ట్రాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జరిగిన అభివృద్ధి గురించి తాను మాట్లడనని, కొన్నేళ్లుగా  మాత్రం దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.  కేరళలోని కొచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరు వరకు ఈ గ్యాస్ పైపులైను నిర్మించారు. ఈ కార్యక్రమంలో కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల సిఎంలు, గ‌వ‌ర్న‌ర్‌లు, కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Thiruvananthapuram

2021-01-05 13:08:43

2021-01-04 17:52:30

2021-01-03 12:47:47

పీఐబీ లో ఆంధ్రప్రదేశ్ కి నేటికి దక్కని చోటు..!

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు పీఐబీ వెబ్ సైట్ లో హైదరాబాదుకి స్థానం దక్కింది. ఆ తరువాత పదేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ పీఐబి న్యూస్ వెబ్ సైట్ లో నేటికీ ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదించలేకపోయింది. ఫలితంగా సీఎంఓ వార్తలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసే సమయంలో చేసే పర్యటనలన్నీ న్యూడిల్లీ పీఐబీ పేరుతోనే వస్తున్నాయి. దానికి కారణం కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్వహించే పీఐబీ న్యూస్ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కి చోటు లేకపోవడమే. విభజన హామీల్లో అటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పీఐబిలో చేర్చాల్సి వుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రసమాచారశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మన రాష్ట్రానికి చోటు దక్కలేదు. పీఐబీలో ఆంధ్రప్రదేశ్ కి చోటు దక్కితే రాష్ట్రంలోని ప్రధాన మంత్రిత్వ శాఖల్లోని అంశాలను, అభివ్రుద్ధి కార్యక్రమాలను, జాతీయస్థాయి ప్రాజెక్టులను మనం తెలియజేయకుండానే దేశంలోని అన్ని రాష్ట్రాలు పీఐబి న్యూస్ వెబ్ సైట్ ద్వారా వీక్షించే వీలుంటుంది. గతంలో టిడిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ ని పీఐబీ వెబ్ సైట్ లో ఏర్పాటు చేసి ఏపీ సీఎంఓ దగ్గరే ప్రత్యేక కార్యాలయలయం ఏర్పాటు చేయాలని సూచించినా అది పలించలేదు. ఆ తరువాత కేంద్రం ఔట్ రీచ్ బ్యూరోలను ఏర్పాటు చేసినా..అవి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయి. దీనితో ఏపీ సమాచారశాఖకు, రాష్ట్రప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రాలకు చోటు దక్కడం ద్వారా రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అధికారిక వర్గాలు, కేంద్రప్రభుత్వం చూసే వీలుంటుంది. ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో అధికారికంగా చోటు కల్పించాల్సిన బాధ్యత, దానికోసం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే పోలవరం, గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటి ప్రాజెక్టులను కేంద్ర స్థాయిలో అన్ని రాష్ట్రప్రభుత్వాలకి తెలియజేసే అవకాశం లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న 12 రాష్టాలకు పీఐబీలో చోటు ఉండటాన్ని ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఆశన్నమైంది..!

New Delhi

2021-01-03 09:02:32

2021-01-02 13:15:13

ఇళ్ల నిర్మాణాలకు ఆధునిక టెక్నాలజీ..మోదీ

ప్రపంచంలోని  వివిద దేశాల నుండి ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకుని ఇక్కడి అవసరాలకు పరిస్థితులకు అనుకూలంగా మలచుకోవాలని  ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి విడియో కాన్ఫరెన్సు ద్వారా పిఎంఎవై (అర్బన్) మరియు ఆశా ఇండియా అవార్డులను   అందజేశారు మరియు ప్రధానమంత్రి గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీస్ ఛాలెంజ్ కార్యక్రమంలో వివిధ రాప్ట్రాలలో ఆరు లైట్  హౌస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన గావించారు.  ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సులో పిఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పేద, మధ్య తరగతి వర్గాలకు మన్నికైన, నాణ్యమైన ఇళ్లను తక్కువ ఖర్చుతో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పాధాన్యత ఇస్తుందని తెలిపారు. గృహ నిర్మాణ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని, నగరాలలో నివసించే ప్రజల కోసం లక్షల ఇళ్ళను నిర్మిస్తున్నామని తెలిపారు. వలస కార్మికుల కోసం తప్పనిసరిగా నగరాలలో అందుబాటు ధరలో వసతి సౌకర్యం కల్పించాలని కోరారు.   అవార్డులకు సంబంధించి పిఎంఏవై -అర్బన్ ఇళ్ళనిర్మాణం లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3 వ స్థానం లో నిలిచింది. ప్రాజెక్టు మోనిటరింగ్ టూల్స్ మరియు ఇన్నోవేటివ్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ లకు గాను ఆంధ్రప్రదేశ్  ప్రత్యేక కేటగిరీలో ఎంపిక అయింది. జీవీఎంసీ బెస్ట్ పర్ఫ్మార్మింగ్ మున్సిపల్ కార్పోరేషన్ గా ఎంపికయింది. బెస్ట్ హౌస్ కన్ స్ట్రక్షన్ కేటగిరీలో జిల్లా నుంచి జీవీఎంసీ పరిధిలో గాజువాక 50 వ వార్డు లో నివసించే సత్రబోయిన దుర్గ ఎంపికైనారు. . రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ళస్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 68,677 ఎకరాల భూమి సేకరించి పంపిణీ చేస్తున్నామని, 16,098 ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ కాలనీలను అభివృద్ధి నిర్మిస్తున్నామని తెలిపారు.రూ. 1400 కోట్లతో ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.  పిఎంఏవై (అర్బన్) కింద 20.21 లక్షల ఇళ్ళను రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, అవార్డు గ్రహీత సత్రబోయిన దుర్గ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నుంచి అవార్డు పొందటం జిల్లా కు గర్వకారణమన్నారు. పిఎంఏవై పథకం నుంచి లబ్ధి పొంది, తన పాత పూరి గుడిసె స్థానంలో సొంతంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని గాజువాక కు చెందిన సత్రబోయిన దుర్గ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, హౌసింగ్ పిడి శ్రీనివాస్, యూసిడి పిడి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-01 19:06:16